వార్త ముఖ్యాంశాలు
- యలమంచిలి : ఏటికొప్పాక గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏటికొప్పాకలో రాజకీయ సందడి మొదలైంది.
- రెండో వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు శెన్నంశెట్టి రామనాయుడు తొలి నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల బరిలోకి అడుగుపెట్టారు.
- రెండో వార్డు ప్రజల ఆశీస్సులు, ఆదరణతో నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.
యలమంచిలి : ఏటికొప్పాక గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏటికొప్పాకలో రాజకీయ సందడి మొదలైంది. రెండో వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు శెన్నంశెట్టి రామనాయుడు తొలి నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల బరిలోకి అడుగుపెట్టారు. రెండో వార్డు ప్రజల ఆశీస్సులు, ఆదరణతో నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. వైఎస్సార్సీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అన్నం వెంకటరావుకు మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతలపాటి రాజబాబు పాల్గొని అభ్యర్థులకు తన మద్దతు ప్రకటించారు. నామినేషన్ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని అభ్యర్థులకు సంఘీభావం తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థులకు ప్రజల ఆశీస్సులు కోరారు. దీంతో ఏటికొప్పాకలో పంచాయతీ ఎన్నికల సందడి మరింత ఊపందుకుంది.
వార్తా మూలాలు
- Punnami Reportingపత్రిక / వెబ్సైట్