వార్త ముఖ్యాంశాలు
- అనకాపల్లి రూరల్ పోలీసుల వాహన తనిఖీల్లో రెండు కిలోల గంజాయి పట్టుబడింది.
- గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయడంతో పాటు, అక్రమ రవాణాకు ఉపయోగించిన స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- ఈ ఘటన మండలంలోని సంపతిపురం జంక్షన్ వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది.
అనకాపల్లి రూరల్ పోలీసుల వాహన తనిఖీల్లో రెండు కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయడంతో పాటు, అక్రమ రవాణాకు ఉపయోగించిన స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మండలంలోని సంపతిపురం జంక్షన్ వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది.
అనకాపల్లి రూరల్ ఎస్‌ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంపతిపురం జంక్షన్ వద్ద పోలీసులు సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా,అనుమానాస్పదంగా వస్తున్న ఏపీ 40 ఎల్‌డబ్ల్యూ 8558 నంబరు గల స్కూటీని ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో రెండు కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. విచారణలో నిందితుడిని చేపల ఉప్పాడ ప్రాంతానికి చెందిన దాసరి మధుసూదన్‌గా గుర్తించారు.ఒడిశా రాష్ట్రంలోని పాడువ సంత నుంచి గంజాయిని కొనుగోలు చేసి చేపల ఉప్పాడకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఏజెంట్‌గా ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్నట్లు, గంజాయిని కొనుగోలు చేసి వినియోగించడంతో పాటు ఇతరులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై గతంలోనూ గంజాయి కేసు ఉన్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు.
నిందితుడి నుంచి రెండు కిలోల గంజాయితో పాటు, రవాణాకు ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ రవికుమార్ వెల్లడించారు.