Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

భారీ వర్షాలతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ కొత్తగూడెం రీజియన్‌లో 22 వేల టన్నుల ఉత్పత్తికి అంతరాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భారీ వర్షాలతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ కొత్తగూడెం రీజియన్‌లో 22 వేల టన్నుల ఉత్పత్తికి అంతరాయం
Oplus_16908288

కొత్తగూడెం / ఖమ్మం

రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపాయి. గురువారం ఒక్కరోజే కొత్తగూడెం రీజియన్‌లో సుమారు 22 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు ఏరియాల్లోని పలు గనుల్లో వర్షపు నీరు చేరడంతో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా మణుగూరు ఓపెన్‌కాస్ట్-4 గనిలో భారీగా వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయినట్లు సమాచారం. నీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరింత ఉత్పత్తికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సింగరేణి వ్యాప్తంగా మొత్తం 12 ఏరియాల్లో కలిపి సుమారు 58 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు తెలుస్తోంది. వర్షాల ప్రభావంతో గనుల్లో భద్రతా చర్యలకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు.

భారీ వర్షాలతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ కొత్తగూడెం రీజియన్‌లో 22 వేల టన్నుల ఉత్పత్తికి అంతరాయం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *