Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

చేయూత పింఛన్ దరఖాస్తుల పరిశీలనకు గడువు పొడిగింపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
చేయూత పింఛన్ దరఖాస్తుల పరిశీలనకు గడువు పొడిగింపు

వార్త ముఖ్యాంశాలు

  • తిరుమలాయపాలెం: 25 నుంచి 30 వరకు పొడిగిస్తూ సేర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ ఆదే, సెప్టెంబర్ 25: చేయూత పింఛన్ దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం మరింత సమయం కల్పించింది.
  • దరఖాస్తుల పరిశీలనకు విధించిన గడువును ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు పొడిగిస్తూ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సేర్ఫ్) సీఈవో దివ్య దేవరాజన్ ఆదేశాలు జారీ చేశారు.
  • ఇప్పటివరకు అందిన చేయూత పింఛన్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

తిరుమలాయపాలెం:
25 నుంచి 30 వరకు పొడిగిస్తూ సేర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ ఆదే, సెప్టెంబర్ 25: చేయూత పింఛన్ దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం మరింత సమయం కల్పించింది. దరఖాస్తుల పరిశీలనకు విధించిన గడువును ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు పొడిగిస్తూ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సేర్ఫ్) సీఈవో దివ్య దేవరాజన్ ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటివరకు అందిన చేయూత పింఛన్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత అధికారులు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించనున్నారు.

గడువు పొడిగింపుతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలనకు అవకాశం లభించడంతో అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అధికారులు దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసి నిర్ణీత గడువులో ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *