Tuesday, 10 March 2026

Blog

సిద్ధిపేట

దుబ్బాక మున్సిపాలిటీ 13వ వార్డులో బీజేపీ అభ్యర్థి మోత్కుపల్లి ప్రతిభ–కరుణాకర్‌కు ప్రజల నుంచి విశేష స్పందన

దుబ్బాక 13వ వార్డులో బీజేపీ అభ్యర్థి మోత్కుపల్లి ప్రతిభ–కరుణాకర్‌కు ప్రజల నుంచి విశేష స్పందన దుబ్బాక /పున్మమి ప్రతినిధి /ఫిబ్రవరి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా దుబ్బాక మున్సిపాలిటీ నుండి 13వ వార్డు అభ్యర్థిగా మోత్కుపల్లి ప్రతిభ కరుణాకర్ పోటీ చేస్తున్నారు ఈ 11వ తేదీన మున్సిపాలిటీ ఎన్నికల్లో కమలం పువ్వుపై తనకు అధిక మెజారిటీతో ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు 13వ వార్డు ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. ప్రతి వీధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, వీధి దీపాలు, పారిశుధ్య పనులు పక్కాగా నిర్వహిస్తాం. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తాం అని హామీ ఇచ్చారు అదేవిధంగా మన వార్డులో యువకులకు చదువుకునే విధంగా గ్రంథాలయం మరియు మన వార్డు ఆడబిడ్డల పెళ్ళికి 10,116 రూ”సహకారం వార్డులో చెత్తకుండీలను ఏర్పాటు చేయడం మురికి కాలువలను రోజువారి శుభ్రత చేయించేలా చూడటం కొత్త డ్రైనేజీ కాలువలను నిర్మించడం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజలకు అందివ్వడం ప్రజల ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ ని ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు తన బాధ్యతగా చేస్తానని మాట ఇచ్చారు ప్రజలు తమపై నమ్మకం ఉంచి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నారు

హెల్త్ టిప్స్

బిర్యానీ ఆకు – చిన్న ఆకు, పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు

బిర్యానీ ఆకు వంటలకు సువాసన కోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకులో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. దగ్గు, జలుబు, శ్వాస సమస్యలలో ఉపశమనం ఇస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. బిర్యానీ ఆకుతో చేసిన కషాయం శరీరాన్ని శుభ్రపరిచి డిటాక్స్ చేయడంలో ఉపయోగపడుతుంది. రోజూ పరిమితంగా వంటల్లో వాడితే దీర్ఘకాల ఆరోగ్య లాభాలు పొందవచ్చు.

హెల్త్ టిప్స్

రాగిజావ – సంపూర్ణ పోషకాహారం, సంప్రదాయ ఆరోగ్య రహసం

రాగిజావ మన పూర్వీకుల నుంచి వచ్చిన ఒక అద్భుతమైన ఆరోగ్య పానీయం. ఇది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ అనుకూలమైన ఆహారం. రాగిలో క్యాల్షియం, ఐరన్, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఎముకలు బలపడతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా శక్తిని అందిస్తుంది. మధుమేహం ఉన్నవారికి కూడా ఇది చాలా సురక్షితమైన ఆహారం. జీర్ణక్రియను మెరుగుపరచి బరువు నియంత్రణలో సహాయపడుతుంది. రోజూ ఉదయం రాగిజావ తాగితే శరీరం తేలికగా ఉండి, రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.

హెల్త్ టిప్స్

నేరేడు పండు – మధుమేహానికి సహజ రక్షణ

నేరేడు పండు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన కాలానుగుణ ఫలం. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఇది ఒక సహజ ఔషధంలా పనిచేస్తుంది. నేరేడు పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. జీర్ణవ్యవస్థను బలోపేతం చేసి ఆకలిని నియంత్రిస్తాయి. చర్మ సమస్యలు తగ్గి చర్మం మెరుస్తుంది. నేరేడు పండు మాత్రమే కాకుండా దాని గింజల పొడిని కూడా ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది దీర్ఘకాలంగా తీసుకుంటే మధుమేహ నియంత్రణలో మంచి ఫలితాలు ఇస్తుంది.

హెల్త్ టిప్స్

గోటుకోల (సరస్వతి ఆకు) – మెదడు శక్తిని పెంచే ఔషధ మొక్క

గోటుకోల లేదా సరస్వతి ఆకు అనేది ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఔషధ మొక్క. ఈ ఆకును సేవించడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరిగి, చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయి. గోటుకోల ఆకులు మెదడులో రక్తప్రసరణను మెరుగుపరచి నాడీ వ్యవస్థను బలపరుస్తాయి. థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యతకు సహాయపడతాయి. చర్మ సమస్యలు, గాయాలు త్వరగా మానేందుకు ఉపయోగపడతాయి. ఈ ఆకును చట్నీగా, కూరగా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. రోజూ కొద్దిగా తీసుకుంటే దీర్ఘకాలంలో మంచి ఆరోగ్య ఫలితాలు కనిపిస్తాయి.

హెల్త్ టిప్స్

పనస పండు గింజలు – వృథా చేయకండి, ఆరోగ్యాన్ని పొందండి

పనస పండు గింజలను చాలామంది వంటలో ఉపయోగించకుండా పారేస్తుంటారు. కానీ నిజానికి ఈ గింజలు పోషకాల గని లాంటివి. పనస గింజల్లో విటమిన్ A, విటమిన్ C, ఫైబర్, ప్రోటీన్ వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. జీర్ణవ్యవస్థను బలోపేతం చేసి కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. శరీరానికి కావాల్సిన శక్తిని అందించి అలసటను తగ్గిస్తాయి. రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇవి చాలా మంచివి. ఎముకలు బలపడేందుకు, కండరాల ఆరోగ్యానికి పనస గింజలు ఉపయోగపడతాయి. వీటిని ఉడికించి లేదా వేపి తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. పిల్లలు నుంచి వృద్ధుల వరకు అందరూ వీటిని ఆహారంలో చేర్చుకోవచ్చు.

హెల్త్ టిప్స్

రోజూ కేవలం 3 వెల్లుల్లి రెబ్బలు తింటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

వెల్లుల్లి అనేది మన వంటగదిలో ఉండే సాధారణ పదార్థమే అయినప్పటికీ, దాని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అసాధారణమైనవి. ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లి ఒక శక్తివంతమైన సహజ ఔషధం. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను నమిలి తినడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే గుణకరం రక్తనాళాలను శుభ్రం చేసి, గుండెకు సరైన రక్తప్రసరణ కలగజేస్తుంది. దీని వల్ల హృదయ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. తరచూ జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి వెల్లుల్లి చాలా ఉపశమనం ఇస్తుంది. జీర్ణక్రియ బాగా పనిచేయడంతో గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గిపోతాయి. రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది.

కడప

కడప రిమ్స్ లో ఏసీబీ దాడులు….

కడప రిమ్స్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులను పట్టుకున్నారు. సదరం సర్టిఫికేట్ మంజూరుకు లంచం అడిగినట్లు ఫిర్యాదు అందడంతో వాళ్లని దాడులు చేశారు. ఈ సందర్భంగా 30,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో సదరం వింగ్ సూపర్డెంట్ మరియు, జూనియర్ అసిస్టెంట్ ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

ఎన్ సి సి ఫస్ట్ ఆఫీసరుగా పదోన్నతి పొందిన గుండాల నరేంద్రబాబు

వృత్తి రీత్యా వీరు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయులుగా మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్, వెంగళరావు నగర్ నెల్లూరు నందు పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో 28 సంవత్సరాల ఏడు మాసాలు పూర్తి చేసుకున్నారు. 09 ఆగస్టు 2012 నుంచి 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి నెల్లూరు నందు కేర్ టేకర్ ఆఫీసర్ గా 27 అక్టోబర్ 2013 వరకు సేవలందించారు. 28 అక్టోబర్ 2013 నుంచి థర్డ్ ఆఫీసర్ హోదాలో 01 డిసెంబర్ 2021 వరకు విశేషసేవలందించారు. 02 డిసెంబర్ 2021 నుంచి సెకండ్ ఆఫీసర్ హోదాలో తన వంతు సామాజిక బాధ్యతగా సమాజాన్ని చైతన్య పరిచే పలు ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు చేపట్టి,పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు నాటి పెంచి పెద్దచేశారు.పునీత్సాగర్ అభియాన్, స్వచ్ఛతాహి సేవ, స్వచ్ఛభారత్ అభియాన్, స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర, జాతీయ ఓటర్ల దినోత్సవం, జాతీయ బాలిక దినోత్సవం, జాతీయ యువజన దినోత్సవం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, ప్రపంచ నదుల దినోత్సవం, అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం, ఇండియన్ కోస్ట్ గార్డ్ డే, వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే, గాంధీ జయంతి, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి, జాతీయా ఏకతా దివస్, కార్గిల్ విజయ్ దివస్, ఎన్సిసి డే, ఇండియన్ నేవీ డే, ఏక్ గంట ఏక్ దిన్ శ్రమదాన్ కార్యక్రమం, వరల్డ్ ఎయిడ్స్ డే ర్యాలీ, వరల్డ్ క్యాన్సర్ డే ర్యాలీ, ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో సైనికులకు సంఘీభావం తెలుపుతూ నిర్వహించిన ర్యాలీ, ఆపరేషన్ సింధూర్ అవగాహన సదస్సు, వందేమాతరం జాతీయ గేయం రచించబడి 150 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమం, యాంటీ టొబాకో డే, యాంటీ డ్రగ్స్ డే, రహదారి భద్రత వారోత్సవాల ర్యాలీ, ఫిట్ ఇండియా 3 కి.మీ.రన్, సాయిధర్ దళాల పతాక దినోత్సవ నిధి విరాళాల సేకరణ, డిజాస్టర్ మేనేజ్మెంట్, కేరళ లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో 77,000 ప్రజల నుంచి విరాళాలు సేకరించి కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు గారి ద్వారా డిడి రూపంలో పంపించారు. నిత్యం ప్రజలను చైతన్య పరుస్తూ తన విశిష్ట సేవలు ద్వారా జిల్లా అధికారుల ప్రజల మన్ననలు పొందిన గుండాల నరేంద్రబాబు ఎన్సిసి క్యాడేట్లలో దేశభక్తి సేవా భావం క్రమశిక్షణ జాతీయ సమైక్యత పోరాటపటిమ, సహకార గుణం నాయకత్వ లక్షణాలు, శ్రమ విలువ మొదలైన లక్షణాలను ఎన్సిసి అధికారిగా చక్కటి శిక్షణనిస్తూ వారిని భావి భారత సైనికులుగా తీర్చిదిద్దుతున్నారు. పలు సందర్భాలలో జిల్లా ప్రముఖులతో జిల్లాఉన్నతాధికారులతో నరేంద్రబాబు చేస్తున్న పలు సామాజిక సేవా కార్యక్రమాలలో తన వంతు భాగస్వాములై విశిష్ట సేవలు అందజేసి అధికారుల అనధికారుల మన్ననలు పొందారు. ఎన్సిసి ఆఫీసరుగా వీరు అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల ఎన్సిసి డైరెక్టరేట్ స్థాయిలో ఎన్సిసి బెస్ట్ ఆఫీసర్ అవార్డును 2024 -25 సంవత్సరానికి గాను హైదరాబాదులోని ప్యారీసన్ డిఫెన్స్ గ్రౌండ్ నందు నిర్వహించబడిన ఎన్సిసి దినోత్సవ వేడుకల్లో ఎన్ సి సి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమడోర్ వి. మధుసూదన్ రెడ్డి గారి నుంచి 24 నవంబర్ 2024న అందుకోవడం వీరి విశిష్ట సేవలకు నిదర్శనం. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా ప్రస్తుతం సెకండ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న గుండాల నరేంద్ర బాబు 08 నవంబర్ 2025 నుంచి ఫస్ట్ ఆఫీసర్ గా పదోన్నతి పొందారని 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి, నెల్లూరు లెఫ్టనెంట్ కమాండర్ గణేష్ గొదన్గవే కమాండింగ్ ఆఫీసర్ నేడు ఉత్తర్వులు జారీ చేశారని నరేంద్ర బాబు ఓ ప్రకటనలో తెలియజేశారు. తెలుగు ఉపాధ్యాయినిగా విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని తెలుగు భాష ఎడల అభిమానాన్ని అభిరుచిని ఆసక్తిని అనురక్తిని పెంపొందిస్తూ వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతూ విద్యాశాఖ అధికారుల తల్లిదండ్రుల విద్యార్థుల మన్ననలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో వీరు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని 2022లో సెప్టెంబర్ 5వ తేదీన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విజయవాడలో అందుకున్నారు. అంతేకాకుండా గణతంత్ర దినోత్సవ పురస్కారాలను అప్పటి జిల్లా కలెక్టర్లు 2011లో కే. రామ్ గోపాల్ ఐఏఎస్,,2020లో ఎం.వి. శేషగిరి బాబు ఐఏఎస్, 2024 లో ఎం.హరి నారాయణన్ ఐఏఎస్ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గుండాల నరేంద్రబాబు విభిన్న రంగాలలో అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ప్రస్తుత జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా గణతంత్ర దినోత్సవ పురస్కారాన్ని అందజేసి అభినందించారు. నేడు పదోన్నతి పొందిన ఉత్తర్వులు అందిన సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి సి. మంజులవాణి, ఉపాధ్యాయులు, ఎన్సిసి లెఫ్ట్నెంట్ కమాండర్ గణేష్ గొదంగవే, ఇతర ఎన్సిసి అధికారులు నరేంద్రబాబుకు అభినందనలు తెలియజేశారు.

పల్నాడు

ఆయన మరణించి వెయ్యేళ్లు అయినా ఇప్పటికీ ఆ శరీరం భద్రపరిచి ఉంది*

రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరు (భూతపురి)లో జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. ఆయన జీవిత కాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు. వేంకటేశ్వరుడి పరమభక్తుడు తిరుమల నంబి వారు రామానుజాచార్యులకు మేనమామ. విశిష్టాద్వైతాన్ని, ఆళ్వారుల వైభవాన్ని, భక్తి మార్గాలను మేనల్లుడికి పరిచయం చేసింది ఆయనే. భక్తి, పాండిత్యం, సంస్కరణ తత్వం కలిగిన తల్లి కాంతిమతి నుంచి రామానుజాచార్యులు అభ్యుదయ భావాలను అలవరచుకున్నారు. అందుకే ఆయన మూఢాచారాలను వ్యతిరేకించేవారు. ఆత్మప్రబోధంతో కొన్నిసార్లు గురువులకు కూడా కనువిప్పు కలిగించారు. ఒకసారి ఆయన గురువు గోష్ఠిపూర్ణ ‘ఓమ్‌ నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి, ‘దీన్ని గోప్యంగా ఉంచాలి! ఎన్నడూ, ఎవరికీ చెప్పకు’ అన్నారు. కానీ ఆ మహామంత్ర జపంతో లభించే ఆధ్యాత్మిక ఫలం కొద్దిమందికే పరిమితం కాకూడదు అనుకున్నారు రామానుజులు. మర్నాడు స్థానికులందరినీ సౌమ్యనారాయణ ఆలయం వద్దకు ఆహ్వానించి, అష్టాక్షరీ మంత్రాన్ని వినిపించారు. గురువు ఉపదేశించిన విజ్ఞానాన్ని దాపరికం లేకుండా ప్రకటించారు. అందుకు గోష్ఠిపూర్ణులు ఆగ్రహించి, ఫలితంగా నరకానికి వెళతావంటూ మందలించారు. దానికి రామానుజులు ‘గురువర్యా! ఇదిగో, ఇంతమంది ఆధ్యాత్మికోన్నతి సాధించారు. నేనిక నరకానికి వెళ్లినా చింతలేదు’ అన్నారు వినయంగా. గురువు పశ్చాత్తాపంతో రామానుజులను ఆలింగనం చేసుకుని, ‘నువ్వు నాకు శిష్యుడివి కాదు, గురువువి!’ అన్నారు. సమాజంలో రావాల్సిన సంస్కరణలు తొలుత మతాలు, ఆలయాల నుంచే ఆరంభం కావాలని రామానుజులు ఆకాంక్షించారు. అందుకే ఆలయాల్లోని అస్తవ్యస్త పరిస్థితులను, అక్రమాలను సరిదిద్దారు. ఆధ్యాత్మికత పేరుతో జరుగుతున్న ఆగడాలను అరికట్టారు. తన నిర్వహణలోని శ్రీరంగనాథ దేవాలయం నుంచే సంస్కరణలు ఆరంభించారు. మూఢాచారాలకు స్వస్తి పలికారు. కుల వివక్ష లేకుండా భగవంతుణ్ణి దర్శించుకునేలా, పెరుమాళ్ల ఉత్సవంలో అందరూ పాల్గొనేలా విధి విధానాలను సవరించారు. ఏడు ప్రాకారాలతో నిర్మితమైన శ్రీరంగనాథ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకలున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం. సామాన్య శకం 11 – 12 శతాబ్ధాల మధ్య రామానుజాచార్యులు శ్రీరంగంలో శరీరాన్ని విడిచి పెట్టారు. అప్పటి నుంచి ప్రత్యేక లేపనాలను అద్ది ఆయన శరీరాన్ని భద్రపరుస్తున్నారు. శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా, అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు. పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ఏటా రెండు సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల వారి శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లు, గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయంటారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.