Friday, 24 April 2026

Blog

అన్నమయ్య

చిట్వేల్‌లో తెలుగుదేశం పార్టీ 44వ వసంతాల వేడుకలకు సర్వం సిద్ధం

తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, చిట్వేల్ మండల వ్యాప్తంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ బలోపేతానికి, సిద్ధాంతాల ప్రచారానికి ఈ వేడుకలను ఒక వేదికగా మార్చుకోవాలని చిట్వేల్ మండల పార్టీ అధ్యక్షుడు కాకర్ల నాగార్జున నాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం (మార్చి 29) ఉదయం నుండి మండలంలోని వివిధ గ్రామాల్లో పసుపు పండుగ వాతావరణం నెలకొననుంది. నాగార్జున నాయుడు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వేడుకల వివరాలు ఇలా ఉన్నాయి: ఉదయం 7:30 గంటలకు: నాగవరం గ్రామంలో ప్రారంభం. ఉదయం 8:00 గంటలకు నేతివారిపల్లిలో వేడుకలు. ఉదయం 8:15 గంటలకు పెద్దూరు గ్రామంలో జెండా ఆవిష్కరణ.ఉదయం 8:30 గంటలకు జెట్టివారిపల్లిలో ఉత్సాహంగా వేడుకలు.ఉదయం 9:00 గంటలకు చిట్వేల్ లోని ఎన్టీఆర్ నగర్‌లో ప్రధాన వేడుకలు మరియు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా నాగార్జున నాయుడు మాట్లాడుతూ.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు 44వ ఏట అడుగుపెట్టడం గర్వకారణమన్నారు. మండలంలోని ప్రతి కార్యకర్త, నాయకుడు ఈ చారిత్రాత్మక వేడుకల్లో చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ జెండాను గ్రామగ్రామానా ఎగురవేసి, మన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.వేడుకల నేపథ్యంలో మండలంలోని ప్రధాన కూడళ్లు పసుపు తోరణాలు, పార్టీ ఫ్లెక్సీలతో ముస్తాబయ్యాయి. ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి కార్యక్రమంతో చిట్వేల్ మండలం పసుపుమయం కానుంది.

కడప

గోపవరంలో ఉచిత పశు వైద్య శిబిరం!

గోపవరంలో ఉచిత పశు వైద్య శిబిరం! ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామములో శనివారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. AMC అధ్యక్షురాలు వద్ది సురేఖ, కార్యదర్శి రత్నరాజు మాజీ MPP నంద్యాల రాఘవ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పశు వైద్యశాల డాక్టర్లు, సిబ్బంది మూగ జీవాలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులను పంపిణీ చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మార్కాపురం ప్రమాదం విషాదం – చిన్నయ్య మృతదేహం స్వగ్రామానికి చేరిక

కలిగిరి, మార్చి (పున్నమి ప్రతినిధి) మార్కాపురం సమీపంలో జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఆత్మకూరు చిన్నయ్య మృతదేహం కలిగిరి మండలం నాగసముద్రం గ్రామానికి చేరడంతో విషాద వాతావరణం నెలకొంది. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, కుమార్తెలు, స్థానికులు బోరున విలపించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు నివాళులు అర్పించారు. కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తక్షణ ఆర్థిక సాయం అందించారు. కుటుంబానికి అండగా ఉంటామని, పిల్లల చదువు, భవిష్యత్తుకు సహాయం చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ముఖ్యమంత్రి పర్యటనకు సిద్ధం – వింజమూరులో ఏర్పాట్లు పరిశీలన

వింజమూరు, మార్చి (పున్నమి ప్రతినిధి) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు. హెలిప్యాడ్, చెరువు, చిల్డ్రన్ పార్క్, సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1న జరిగే కార్యక్రమంలో పాతూరు చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌గా అభివృద్ధి చేయాలని ప్రధానంగా కోరనున్నట్లు తెలిపారు. వింజమూరు మున్సిపాలిటీ, డ్రైనేజీలు, డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్లతో పట్టణాభివృద్ధి లక్ష్యమన్నారు. నాయకులు, అధికారులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

కడప

ప్రొద్దుటూరులో పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి కార్యక్రమం

ప్రొద్దుటూరులో శనివారం మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పుట్టపర్తి సాహితీ పీఠం ప్రధాన కార్య దర్శి జింక సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఆయన విగ్రహం వద్ద పలువురు సాహితీవేత్తలు అభిమానులు సమావేశం అయ్యారు. సాహితీ లోకానికి ఆయన చేసిన రచనలు, సేవలను కొనియాడారు. 1 టౌన్ సీఐ కొండారెడ్డి మాట్లాడుతూ.. పుట్టపర్తి శివతాండవం కావ్యంలో శివుని తాండవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు.

E-పేపర్

వివాదాస్పదంగా మారిన మాల్ గ్రామపంచాయతీ

పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జి: 9640204826 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం మాల్ గ్రామపంచాయతీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ పార్టీకి చెందిన మొదటి వార్డు మెంబర్ స్వాతి తన వార్డులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పనులు చేపడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, తన కళ్లకు గంతలు కట్టుకుని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన స్వాతి, ప్రజాప్రతినిధిగా కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. “వార్డు మెంబర్‌గా ఉన్న నన్ను కనీసం కొబ్బరికాయ కొట్టడానికి కూడా పిలవడం లేదు. నా వార్డులో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది” అంటూ మీడియా ముందు వాపోయారు. అభివృద్ధి పనులపై సమాచారం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంటూ, వెంటనే గ్రామపంచాయతీ కార్యదర్శి స్పందించి వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

E-పేపర్ News తెలంగాణ మహబూబాబాద్

తిరుమలపురం వ్యవహారం హాట్ టాపిక్ ఖజానా ఖాళీ

మహబూబాబాద్ జిల్లా. కురవి మండలం తిరుమలపురంలో నిధుల గల్లంతు? గ్రామపంచాయతీపై తీవ్ర ఆరోపణలు.. చెక్కుల వరదలో గ్రామ ఖజానా ఖాళీ? నెలలోనే 26 డ్రాయింగ్స్ సంచలనం. పదవుల దుర్వినియోగం ఆరోపణలు..?… కుటుంబ ఖాతాల్లోకి లక్షల రూపాయలు!. అభివృద్ధి నిలిచిపోయినా ఖర్చులు పెరుగుతూనే… తిరుమలపురం వ్యవహారం హాట్ టాపిక్…

తూర్పు గోదావరి

రాజమహేంద్రవరం మార్గాన్ని గ్రౌండ్స్ లొ

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూ.గో.జిల్లా రాజమహేంద్రవరం మార్గాన్ని గ్రౌండ్స్ లొ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ దంపతులచే అంగరంగ వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణం మహోత్సవం. మార్గాన్ని గ్రౌండ్స్ లో అభిమానులు, కార్యకర్తలు, ప్రముఖులు హాజరు. END

E-పేపర్

రాజమహేంద్రవరం తిలక్ రోడ్డు లొ గల సాయిబాబా మందిరం వద్ద సీతారామ కళ్యాణం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూ.గో.జిల్లా రాజమహేంద్రవరం తిలక్ రోడ్డు లొ సాయిబాబా మందిరం వద్ద సీతారామ కళ్యాణం సందర్భంగా భారీ అన్న సమారాధన. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చే అన్నదానం ప్రారంభం.. End

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గడప గడపకు బీఎస్పీ – ఉదయగిరి నియోజకవర్గంలో విస్తృత ప్రచారం

ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని కలిగిరి, జలదంకి మండలాల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో “గడప గడపకు బీఎస్పీ” కార్యక్రమం నిర్వహించారు. పలువురు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పార్టీ సిద్ధాంతాలు, మహాపురుషుల త్యాగాలు, సామాజిక న్యాయం కోసం బీఎస్పీ చేస్తున్న కృషిని ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్రాకుటూరు పుష్పాంజలి, సాదు శ్రీనివాసులు, నారాయణ, చన్నకృష్ణ, తిరుపాలు, మారుతి, వెంకటేశ్వర్లు, వెంకట రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.