Friday, 24 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మార్కాపురం సమీపంలో ఘోర బస్సు ప్రమాదం… నాయుడుపల్లిలో విషాదం, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

మార్కాపురం సమీపంలో ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గొల్లపల్లి వెంకటేశ్వర్లు గారి మృతదేహం స్వగ్రామమైన నాయుడుపల్లికి చేరుకోవడంతో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు గ్రామంలో హృదయ విదారక వాతావరణాన్ని సృష్టించాయి. మృతుడికి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ దుర్ఘటన పట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలుస్తామని, ప్రభుత్వం తరఫున కూడా అన్ని విధాలుగా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదం మరోసారి రోడ్డు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతుండగా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

తిరుపతి

వైభవంగా ప్రాణయోగ ఆశ్రమంలో శ్రీరామనవమి వేడుకలు

“ఓం నమో శ్రీరామ ఓం” శ్రీరామ జపంతో 1000 మంది భక్తులు పున్నమి ప్రతినిధి,రామచంద్రపురం రామచంద్రపురం మండలంలోని కొత్త కండ్రిగ సమీపం లో ఉన్న ప్రాణ యోగ ఆశ్రమంలో ఆశ్రమం వ్యవస్థా పకులు కైలాస్ గురూజీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పురస్కరించుకుని భక్తులు భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రాణ యోగ ఆశ్రమం లో 1000 మంది రామ భక్తులతో” ఓం నమో శ్రీ రామ ఓం” శ్రీరామ జపంతో ఏకధాటిగా చేతులు కలిపి కైలాస్ గురూజీ రామ జపం పట్టించారు. ఈ కార్యక్రమం మూడు రోజులపాటు భక్తి శ్రద్ధలతో రామ జపం నిర్వహిస్తున్నట్టు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. శ్రీరామ భక్తులందరికీ నిత్య అన్నదాన వితరణ చేశారు.

తిరుపతి

వైభవంగా ప్రాణయోగ ఆశ్రమంలో శ్రీరామనవమి వేడుకలు

“ఓం నమో శ్రీరామ ఓం” శ్రీరామ జపంతో 1000 మంది భక్తులు పున్నమి ప్రతినిధి,రామచంద్రపురం రామచంద్రపురం మండలంలోని కొత్త కండ్రిగ సమీపం లో ఉన్న ప్రాణ యోగ ఆశ్రమంలో ఆశ్రమం వ్యవస్థా పకులు కైలాస్ గురూజీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పురస్కరించుకుని భక్తులు భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రాణ యోగ ఆశ్రమం లో 1000 మంది రామ భక్తులతో” ఓం నమో శ్రీ రామ ఓం” శ్రీరామ జపంతో ఏకధాటిగా చేతులు కలిపి కైలాస్ గురూజీ రామ జపం పట్టించారు. ఈ కార్యక్రమం మూడు రోజులపాటు భక్తి శ్రద్ధలతో రామ జపం నిర్వహిస్తున్నట్టు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. శ్రీరామ భక్తులందరికీ నిత్య అన్నదాన వితరణ చేశారు.

తిరుపతి

వైభవంగా ప్రాణయోగ ఆశ్రమంలో శ్రీరామనవమి వేడుకలు

“ఓం నమో శ్రీరామ ఓం” శ్రీరామ జపంతో 1000 మంది భక్తులు పున్నమి ప్రతినిధి,రామచంద్రపురం రామచంద్రపురం మండలంలోని కొత్త కండ్రిగ సమీపం లో ఉన్న ప్రాణ యోగ ఆశ్రమంలో ఆశ్రమం వ్యవస్థా పకులు కైలాస్ గురూజీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పురస్కరించుకుని భక్తులు భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రాణ యోగ ఆశ్రమం లో 1000 మంది రామ భక్తులతో” ఓం నమో శ్రీ రామ ఓం” శ్రీరామ జపంతో ఏకధాటిగా చేతులు కలిపి కైలాస్ గురూజీ రామ జపం పట్టించారు. ఈ కార్యక్రమం మూడు రోజులపాటు భక్తి శ్రద్ధలతో రామ జపం నిర్వహిస్తున్నట్టు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. శ్రీరామ భక్తులందరికీ నిత్య అన్నదాన వితరణ చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాల. ఉదయగిరి (ఉర్దూ గర్ల్స్)

ఈరోజు పాఠశాలలో పనిచేసే టీచర్”” శ్రీమతి. షేక్. నస్రీన్ మేడం గారు”” పాఠశాల చిన్నారులకు 9 కుర్చీలు బహుకరించారు ఇందులో భాగంగా విద్యార్థులు ఆనందాన్ని వెలబుచ్చారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ. షేక్. కరీం గారు మాట్లాడుతూ ::: విద్యార్థులకు కుర్చీలు బహుకరించిన “”శ్రీమతి. షేక్. నస్రీన్ మేడం”” గారికి పాఠశాల తరఫున, పాఠశాల విద్యా కమిటీ తరఫున, విద్యార్థులు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తదుపరి ఈ పాఠశాలలో ::: విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు సమకూరుస్తున్నామని, పాఠశాల మధ్యాహ్నం భోజనం కూడా ఇంటిని మరిపించేలా తయారు చేయిస్తూ మిడ్ డే మీల్స్ వర్కర్లు చక్కగా రుచి కరమైన ఆహారాన్ని అందిస్తున్నారని, అదేవిధంగా పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఇంటి వాతావరణాన్ని మహిమరిపించేలా పాఠశాల ఆయా గారు తీర్చిదిద్దుతున్నారని, దీనికి అనుగుణంగా పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామని”” అన్ని రంగాల్లో విద్యార్థుల జ్ఞాన, మానసిక రంగాలలో, అభివృద్ధి చెందే విధంగా ప్రత్యేక యాక్టివిటీస్ రూపకల్పన చేస్తూ, అవగాహన కల్పిస్తూ విద్యార్థులను అగ్రగామిగా ఉంచుతున్నామని, ఈ పాఠశాలను మండలంలోని అత్యుత్తమ పాఠశాలగా తీర్చిదిద్దుతామని, విద్యార్థులకు, విద్యార్థులు తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

E-పేపర్

హిందూ సమ్మేళనం – కొంగర కలాన్, ఆదిబట్ల, ఎలిమినేడు

హిందూ సమ్మేళనం – కొంగర కలాన్, ఆదిబట్ల, ఎలిమినేడు. పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ 28 మార్చ్ 2026 దేశానికి ఆత్మ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి మరియు హిందూ సమాజం. నేటి కాలమాన పరిస్థితుల్లో ఎదురవుతున్న అనేక సవాళ్ళను ఎదుర్కొనేందుకు హిందువుల ఐక్యత అవసరము. హిందూ సమాజం పట్ల గౌరవభావం, ఏకాత్మత భావన, స్వధర్మం పట్ల అంకితభావం, సేవాగుణం వంటి వాటిని వికసింపజేసేందుకు మీ అందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనము ఏర్పాటు చేయడంమైనది. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో మనమంతా కుటుంబ సమేతంగా పాల్గొనాలని సాదరంగా ఆహ్వానిస్తున్నాము ముఖ్య అతిథులు:- డా . రావినూతల శశిధర్ వీ. హెచ్.పీ జాతీయ అధికార ప్రతినిధి మదన్ గుప్తా ప్రముఖ జాతీయవాది, చరిత్ర పరిశోధకులు శ్రీ నవత జర్నలిస్ట్, R VOICE – ఫౌండర్ తేదీ: 29/03/2026, ఆదివారం. స్థలం: కొంగర కలాన్ బస్ స్టాప్ సమయం: సాయంత్రం 6:30 నిమిషాలకు రండి కదలిరండి! హిందువులంతా సిద్ధం అవ్వండి!!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గురుకుల ఉపాధ్యాయుల పదవీవిరమణ వయస్సు పెంపుపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు

గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయుల పదవీవిరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని మంత్రుల ఉపసంఘం సిఫారసు చేయడం పట్ల నెల్లూరు జిల్లా నోబెల్ టీచర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎన్‌డీఏ ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లేఖను అందజేయాలని కోరారు. ఎమ్మెల్యే దీనికి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నాటకం తిరుమలయ్య, ప్రధాన కార్యదర్శి చెన్నయ్యతో పాటు ఎం. సుబ్బారావు, ఎస్. బంగారయ్య పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చెన్నై అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ పెరుగు దంపతులకు అవార్డులు

చెన్నై అంబత్తూరు లోని జపనీస్ కవి పేరుతో పాతికేళ్లుగా డాక్టర్ సేతు కుమనన్ వ్యవస్థాపకులుగా నడుపుతున్న మహిళా కళాశాల, ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఎథిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో మారుతున్న కొత్త ఆవిష్కరణల ప్రపంచంలో యువత మేధస్సు కొత్త దిశానిర్దేశం అంశంతో అంతర్జాతీయ సదస్సు, కవితా సమ్మేళనం జరిగింది.అతిథుల జ్యోతి ప్రజ్వలనం, తమిళ రాష్ట్ర గీతం తో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ డా సేతు కుమనన్ తమ కళాశాల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యువ విద్యార్థినిలను ప్రభావితం చేయగలదని ఆశించారు. ఈ సందర్భంగా డాక్టర్ సేతు కుమనన్ సదస్సు కార్యనిర్వాహకులు డాక్టర్ జర్నైల్ సింగ్ ఆనంద్, డాక్టర్ పెరుగు రామకృష్ణ లను సోక ఇకేదా స్మారక మెగా సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. డాక్టర్ జర్నైల్ సింగ్ ఆనంద్ తమ సంస్థ తరఫున అంతర్జాతీయ కవి పెరుగు రామకృష్ణ ను రోల్ ఆఫ్ హానర్ తో కవయిత్రి పెరుగు సుజనారామం ను అంబాసిడర్ ఆఫ్ ఎటర్నిటీ అవార్డుతో సత్కరించారు. ముగింపు సదస్సు లో చెన్నై హైకోర్టు న్యాయవాది, ద్విభాషా కవి వానవిల్ రవి నెల్లూరు దిగ్గజ కవి రామకృష్ణ ను మహాకవి భారతి అవార్డు తో ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా విచ్చేసిన ప్రముఖ కవులు, రచయితలు అభినందించారు..!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర గ్రంథ ఆవిష్కరణ

1996 మార్చ్ 17-18 తేదీలలో నెల్లూరు వి ఆర్ కళాశాలలో రెండు రోజుల పాటు మల్లంపల్లి సోమశేఖర శర్మ సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ సంస్థ నిర్వహించిన నెల్లూరు జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర అంశం మీద పలువురు ఆహ్వానిత అధ్యాపకులు చేసిన పత్రసమర్పణ విషయాలు 30 ఏళ్ల తర్వాత గ్రంథ రూపంలో వెలుగులోకివచ్చి ఈ రోజు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు ద్వారా ఆవిష్కరణ జరిగింది. యువతలో జాతీయ భావనలు పూర్తిగా కనుమరుగవుతున్న నేపథ్యంలో జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర పుస్తకం ఆవిష్కరణ చేయడం ఒక మహద్భాగ్యం గా భావిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ చెప్పారు. నేటి తరం యువతకు స్వాతంత్ర్య పోరాటంలో త్యాగాలు చేసిన వారి గురించి విస్తృతంగా చర్చ జరగాలని వారు తెలుసుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్ గిద్దలూరు వేంకటేశ్వర రావు, కాంజీవరం రాధాకృష్ణ అప్పట్లో సదస్సు నిర్వహించారు. ఆ సదస్సుకు హాజరైన డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి సలహా మేరకు ఈ సదస్సు వివరాలు గ్రంథ రూపంలో వస్తేనే విజయవంత మయ్యినట్లు అని చేసిన సూచన మేరకు ఇది 480 పేజి ల బృహత్ గ్రంథం అయింది. అనివార్య కారణాల రీత్యా ఆలస్యం అయినా భవిష్యత్ తరాలకు జిల్లా స్వాతంత్య్ర చరిత్ర తెలిసేలా వెలువరించమని కాంజీవరం రాధాకృష్ణ పుస్తక సమీక్ష లో వివరించారు. సుమారు 84 మంది రాసిన పలు అంశాల వ్యాసాలు ఇందులో ఉన్నాయని రాధాకృష్ణ అన్నారు. నెల్లూరు జిల్లా కు చెందిన కొందరు వదాన్యులు ఈ గ్రంథ ప్రచురణలకు సహకరించారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. గ్రంథ సంపాదక బృందంలో ఒకరైన డాక్టర్ లెనిన్ ధనిశెట్టి ఈ పుస్తకం వెలువరించేందుకు ఇద్దరు అధ్యాపకులు పడిన శ్రమ ఫలించిందని అన్నారు. అనంతరం విచ్చేసిన గ్రంథంలోని వ్యాస రచయితలు బొగ్గవరపు రాధాకృష్ణ మూర్తి, డా గంగి శెట్టి శివకుమార్, రంగారావు, కార్యక్రమ సమన్వయ కర్తలు డాక్టర్ పెరుగు రామకృష్ణ, డాక్టర్ లెనిన్లకు ఉపకులపతి గ్రంథ ప్రతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర విద్యా సంస్థల చైర్మన్ రవీంద్ర రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, గూడూరు పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు..!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కళారత్న పురస్కార గ్రహీతకు అరసం అభినందన సత్కారం

శ్రీ పరాభవ ఉగాది సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు ద్వారా సాహిత్య విభాగంలో ప్రతిష్టాత్మక కళారత్న పురస్కారం అందుకున్న నెల్లూరు ఆడిటర్ సుప్రసిద్ధ తెలుగు కవి చిన్ని నారాయణ రావును ఆదివారం ఉదయం వారి నివాసంలో నెల్లూరు జిల్లా అభ్యుదయ రచయితల సంఘం తరఫున అభినందన పూర్వక సత్కారం చేసి శుభాకాంక్షలు తెలిపారు. తిక్కన నడయాడిన నేల మీద సాహిత్యంలో ఎవరు ఏ గౌరవం తెచ్చినా గత ఐదు దశాబ్దాలుగా అభినందించడం ఆనవాయితీగా చేస్తున్నట్లు అరసం నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షులు, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ అన్నారు. అరసం జిల్లా అధ్యక్షులు , సాహిత్య అకాడమీ బాలసాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ సాహిత్య రంగం లో అత్యున్నత అవార్డు పొందిన నారాయణ రావు చేసిన కృషి గొప్పదన్నారు.అరసం జిల్లా కార్యదర్శి అవ్వారు శ్రీధర్ బాబు కవిత్వం రాయడమే కాకుండా సాటి కవులకు పురస్కార ప్రదానం చేయడం అరుదైన విషయం అంటూ ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు. మే నెలలో తన తాజా కవితా సంపుటి వెలువరించనున్నట్లు అవార్డు గ్రహీత చిన్ని నారాయణ అన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.