Friday, 24 April 2026

Blog

తిరుపతి

లోకేష్‌తో బొజ్జల సుధీర్ రెడ్డి భేటీ-అమరావతి తీర్మానంపై హర్షం

శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా అసెంబ్లీలో ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక తీర్మానాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వాగతించారు. ఈ సందర్భంగా అమరావతిలో మంత్రి లోకేష్‌ను కలిసి అభినందనలు తెలిపారు. రాజధాని అంశాలతో పాటు పార్టీ సంస్థాగత విషయాలపై చర్చించారు. రేపు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో మంత్రికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు.

తిరుపతి

బకాయిదారులపై శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఉక్కుపాదం.. కొళాయి కనెక్షన్ల కట్!

శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్):శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో దీర్ఘకాలంగా కొళాయి పన్నులు చెల్లించకుండా జాప్యం చేస్తున్న వారిపై పురపాలక అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పలు దఫాలుగా నోటీసులు ఇచ్చినా స్పందించని పక్షంలో, పురపాలక సంఘం ఆదేశాల మేరకు పట్టణంలోని పలు ప్రాంతాలలో ఇళ్ల కొళాయి కనెక్షన్లను బుధవారం తొలగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఇంచార్జి), మునిసిపల్ రెవిన్యూ ఆఫీసర్, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్లు (I & II), అసిస్టెంట్ మునిసిపల్ ఇంజనీర్, వార్డ్ ఆమెనిటీ సెక్రటరీలతో కూడిన బృందం పాల్గొంది. పన్నులు చెల్లించని వారిపై భవిష్యత్తులో కూడా ఇటువంటి చర్యలు కొనసాగుతాయని, వెంటనే బకాయిలు చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలని అధికారులు సూచించారు.

తిరుపతి

సేవా దృక్పథం అభినందనీయం-కొత్తపేటలో చలివేంద్రం ప్రారంభించిన సీఐ

శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి కొత్తపేట సీతాలమ్మ భక్త బృందం సామాజిక బాధ్యతగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని సీఐ తిమ్మయ్య కొనియాడారు. బుధవారం సీతాలమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి, ప్రజలకు పండ్లను పంపిణీ చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పాలమంగళం రవి, నాదముని, వెంకటసుబ్బయ్య, మహేష్ రావు, వెంకటాద్రి నాయుడు, బాల గురవయ్య, మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఘనంగా పులి మస్తాన్ 10వ వర్ధంతి..అంబేడ్కర్ కూడలి వద్ద అన్నదాన కార్యక్రమం

శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో దళిత నాయకులు పులి మస్తాన్ 10వ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు పులి శ్రీకాంత్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు పాల్గొని మస్తాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు, బాటసారులకు భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయకుమార్ నాయుడు, శ్రీకాళహస్తీశ్వర పాలకమండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జనామాల గురవయ్య మాట్లాడుతూ.. సమాజ సేవలో మస్తాన్ గారు అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షులు చందమామల కోటయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మునిచందు, ప్రముఖ న్యాయవాదులు ప్రభాకర్ రెడ్డి, గణేష్, కొప్పల సుబ్రహ్మణ్యం, నాయకులు దారా పాండు, గుండాల బాబు, శంకర్ ఆర్ఎంపీ, అల్లం మణి, లాలు బాయ్ తదితరులు పాల్గొని ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

తిరుపతి

స్టెప్స్’ ఆధ్వర్యంలో హెచ్ఐవి బాధితులకు పౌష్టికాహారం పంపిణీ

శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలోని స్టెప్స్ స్వచ్ఛంద సంస్థ సామాజిక బాధ్యతను చాటుకుంది. ఎయిడ్స్ బాధితులకు భరోసా కల్పిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో వారికి అవసరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందజేశారు. డాక్టర్ ప్రమీలమ్మ మాట్లాడుతూ.. వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడాలని, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని సూచించారు. గర్భస్థ శిశువులకు వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది మరియు స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొని బాధితులకు మనోధైర్యాన్ని ఇచ్చారు.

తిరుపతి

అమరావతి శాశ్వత రాజధాని తీర్మానానికి హర్షం – రైతుల త్యాగానికి న్యాయం

శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాష్ట్ర రాజధానిగా ఎంపికైన అమరావతి నిర్మాణం కోసం భూములు సమర్పించిన రైతుల త్యాగానికి ‘అమరావతి’ ప్రతీకగా నిలుస్తుందని తంగేళ్ళపాలెం పీఏసీఎస్ ఛైర్మన్ బీమాల భాస్కర్, తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం. ఉమేష్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరువాత రాజధాని విషయంలో కొనసాగుతున్న అనిశ్చితికి తెరదిస్తూ, అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా అసెంబ్లీలో తీసుకున్న చారిత్రాత్మక తీర్మానాన్ని వారు స్వాగతించారు. ఈ నిర్ణయంతో రైతుల ఆశలు నెరవేరాయని, వారి త్యాగానికి సరైన గుర్తింపు లభించిందని అభిప్రాయపడ్డారు. గతంలో రాజధాని అంశంపై జరిగిన వివాదాలు ప్రజల్లో అనుమానాలను రేకెత్తించినప్పటికీ, తాజా నిర్ణయం ఆ అనిశ్చితిని పూర్తిగా తొలగించిందన్నారు. అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని, ఇకపై ప్రతి ఆంధ్రుడు గర్వంగా తమ రాజధాని అమరావతి అని చెప్పగలడని తెలిపారు. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నగరానికి మళ్లీ కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తాయని, రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలకమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి. దశరథాచారి, వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, గిరిజన సలహా మండలి సభ్యులు యం. సుబ్బయ్య, వజ్రం కిషోర్, కోట చంద్రశేఖర్, గంగనపల్లి రమేష్, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

వృద్ధురాలి ఇల్లు సమస్యపై వినుత కోటా స్పందన – అనుమతులు ఇవ్వకపోతే ఆందోళన హెచ్చరిక”

శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్–ఊరందూరు ఆర్చ్ సమీపంలో నివసిస్తున్న గుణభూషనమ్మ (80) గృహ సమస్యపై వినుత కోటా స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. గత 70 సంవత్సరాలుగా నివాసముంటున్న తమ ఇల్లు దెబ్బతినడంతో మరమ్మతులు చేసి రేకుల షెడ్ ఏర్పాటు చేసుకోవడానికి మునిసిపల్ కమిషనర్‌ను పలుమార్లు సంప్రదించినప్పటికీ ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదని గుణభూషనమ్మ వాపోయారు. కార్యాలయంలో అవమానకరంగా ప్రవర్తించడంతో పాటు ఇల్లు కూల్చివేస్తామని బెదిరింపులు కూడా చేస్తున్నారని తెలిపారు. ఈ అంశంపై స్పందించిన వినుత కోటా, చట్టపరమైన అనుమతులు లేకుండా ఎవరూ బలవంతంగా ఇల్లు కూల్చే అధికారం లేదని స్పష్టం చేశారు. “అప్రూవల్ ఇవ్వవద్దు” అనే ఆదేశాలు ఉన్నాయని మునిసిపల్ సిబ్బంది చెప్పడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. గుణభూషనమ్మ మనవడు కావలి శివకుమార్ జనసేన పార్టీకి చెందినవాడని, రాజకీయ కారణాలతో కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అవసరమైన పత్రాలు సమర్పించినప్పటికీ అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమని విమర్శించారు. మునిసిపల్ కమిషనర్‌పై ప్రజల నుండి అవినీతి, ఇబ్బందుల ఆరోపణలు తరచూ వస్తున్నాయని, ఈ విషయంపై ఇప్పటికే పలు వినతులు అందినట్లు తెలిపారు. సమస్యను ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లతో జనసేన మద్దతుదారులను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని హెచ్చరించిన ఆమె, గుణభూషనమ్మకు తక్షణమే అనుమతి ఇవ్వకపోతే మునిసిపల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో శనీశ్వరస్వామికి విశేష పూజలు-తైలాభిషేకంతో మొక్కులు తీర్చుకున్న భక్తులు

శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో శనివారం పురస్కరించుకుని శనీశ్వర భగవానునికి విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వారాంతం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం భక్తులు ప్రత్యేకంగా తైలాభిషేకాలు సమర్పించి, నువ్వుల నూనెతో దీపారాధనలు చేశారు. శని దోష నివారణ కోసం, గ్రహ పీడలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధించాలని భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగించాలి – సుప్రీంకోర్టు తీర్పుపై బీఎస్పీ ఆగ్రహం

నెల్లూరు జిల్లాలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఎస్పీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మరియు వైఎస్ఆర్సీపీ పార్టీలు వెంటనే రివిజన్ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు బి. శ్రీరామ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అమరావతి

బ్రహ్మకుమారి సంస్థ – ఆధ్యాత్మిక సేవలో విశిష్ట స్థానం:పద్మ సిస్టర్

బ్రహ్మకుమారీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక సంస్థ. 1936లో దాదా లేఖరాజ్ (ప్రజాపిత బ్రహ్మ) స్థాపించిన ఈ సంస్థ, రాజయోగ ధ్యానం ద్వారా మనశ్శాంతి, ఆత్మజ్ఞానం, నైతిక విలువలను పెంపొందించడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే, మహిళలకు నాయకత్వ స్థానం కల్పించడం. స్త్రీ శక్తిని ప్రోత్సహిస్తూ సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలోని 100కి పైగా దేశాలలో వేలాది కేంద్రాలతో బ్రహ్మకుమారీస్ విస్తరించింది. ఉచితంగా ధ్యాన శిక్షణలు, ఆధ్యాత్మిక తరగతులు, సదస్సులు నిర్వహిస్తూ ప్రతి వర్గానికి చేరువవుతోంది. ఒత్తిడి తగ్గించడం, మనసును ప్రశాంతంగా ఉంచడం, సానుకూల ఆలోచనలను పెంపొందించడం వంటి అంశాల్లో ఈ సంస్థ ప్రత్యేక మార్గదర్శకత్వాన్ని అందిస్తోంది. “మనసును శాంతంగా ఉంచితే జీవితం సుఖంగా ఉంటుంది” అనే సందేశంతో బ్రహ్మకుమారీస్ లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తోంది అని పద్మ సిస్టర్ తెలిపారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.