Friday, 24 April 2026

Blog

కడప

కడప జిల్లా గోపవరం గ్రామంలో అన్న ఇక్కడ తెలుగుదేశం పార్టీ 44 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు…..

గోపవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో Ex ఎంపీపీ నంద్యాల రాఘవ రెడ్డి గారు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ లక్ష్మణ్ గారు బచ్చలు వీర ప్రతాప్ గారు ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,డిష్ భాష,నరసింహులు సుబ్బారావు, వార్డు మెంబర్ లక్ష్మీదేవి క్రాంతి,సురేష్,డీలర్ భాస్కర్,గంగులు ట్యాంకర్ శీను, బాబయ్య గాలిపోతుల సుదర్శన్,ఎక్స్ ఎం పి టి సి సుబ్బరాయుడు, ఇడిమడక జగదీష్,రాయపాటి బాలు, నల్లం సుబ్బా,రాయపాటి సుబ్బ,ఆది, నగరపు వెంకట రామ,అంజి,శివ, రహీం,శనివారం సురేష్,హరి, రాముడు సిద్దు, గగ్గుటూరి,సిద్దు, చిరంజీవి సుబ్బలక్ష్మి,గంగమ్మ,నాగార్జున,హరి, బాలయ్య, శేఖర్, రాజేష్,ఇంకా అనేకమంది పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు పాల్గొనడం జరిగింది…

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు నియోజకవర్గ గ్రంథాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ మేకపాటి శాంతి కుమారి శనివారం ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు, ఏఎస్పేట, సంగం, అనంతసాగరం, ఆత్మకూరు గ్రంథాలయాలను సందర్శించారు. స్థానిక నాయకులతో కలిసి గ్రంథాలయాల నిర్వహణ, పుస్తకాల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. పాఠకులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకుని, విద్యార్థులు ఎక్కువగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో మౌలిక వసతులు మెరుగుపరుస్తామని వెల్లడించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీద రవిచంద్ర, చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కొమ్మి లక్ష్మీనాయుడు పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరణ చేసి నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు గౌ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు, మర్రిపాడు మండల కేంద్రంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల టీడీపీ అధ్యక్షులు దేవరాల గంగాధర్ యాదవ్ మరియు ఆత్మకూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆరికట్ల జనార్ధన్ నాయుడు ఆధ్వర్యంలో జరిపారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, టీడీపీ స్థాపకుడు నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేతలు మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు స్థాపించబడిన టీడీపీ పార్టీ రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయడం, మిఠాయిల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చిట్టమూరు మండలంలో బీఎస్పీకి భారీ ఊపు… పల్లంపర్తి సర్పంచ్ దీనబంధు సహా 100 మంది పార్టీలో చేరిక

ఈరోజు, అనగా 29-03-2026న చిట్టమూరు మండలం పల్లంపర్తి గ్రామంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ దీనబంధు ఆధ్వర్యంలో సుమారు 100 మంది, అలాగే 4 రెడ్డి కుటుంబాలకు చెందిన సభ్యులు బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరారు. పార్టీ నాయకుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో, కొత్తగా చేరిన సభ్యులు బీఎస్పీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు వారిని ఆహ్వానించి, పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ భారీ చేరికతో చిట్టమూరు మండలంలో బీఎస్పీకి మరింత బలం చేకూరిందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Blog E-పేపర్ News తెలంగాణ మహబూబాబాద్

సేవా నిబద్ధతకు ప్రశంసలు

*బాధితురాలి వద్దకు వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన మరిపెడ పోలీసులు – సేవా నిబద్ధతకు ప్రశంసలు* మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఇటుకలగడ్డ తండాలో జరిగిన ఒక ఘటనలో మరిపెడ పోలీసులు చూపిన సేవా నిబద్ధత స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది. బాధితురాలికి తక్షణ సహాయం అందిస్తూ, ఆమె వద్దకే వెళ్లి ఫిర్యాదు స్వీకరించడం ద్వారా పోలీసులు తమ బాధ్యతాయుత వైఖరిని చాటుకున్నారు.నిన్నటి రోజు బాధితురాలు మిర్చి ఏరడానికి వెళ్లిన సమయంలో అదే తండాకు చెందిన భూక్య బాలు అనే వ్యక్తి ఆమెను వెంబడించి బెదిరించి అత్యాచారం చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఈ సమయంలో బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో సదరు వ్యక్తి అక్కడి నుండి పారిపోయినట్లు తెలుస్తోంది.ఘటన అనంతరం బాధితురాలు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. విషయం తెలుసుకున్న మరిపెడ పోలీసులు ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి, బాధితురాలి వద్దకే వెళ్లి ఆమె ఫిర్యాదును స్వీకరించి ఆసుపత్రిలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఎఫ్‌ఐఆర్ కాపీని అక్కడికక్కడే బాధితురాలికి అందజేశారు.మహిళల భద్రత, ప్రజల రక్షణ విషయంలో మరిపెడ పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, బాధితులకు న్యాయం చేయడంలో ముందుంటున్నారని స్థానికులు అభినందిస్తున్నారు. పోలీసుల ఈ సేవా దృక్పథం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతూ, సమాజంలో నేరాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారనే సందేశాన్ని ఇస్తోంది.ప్రస్తుతం నిందితుడిని పట్టుకునేందుకు మరిపెడ పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.* భూక్య రాము నాయక్, పున్నమి రిపోర్టర్ డోర్నకల్ నియోజకవర్గం ,మరిపెడ*

Blog E-పేపర్ News తెలంగాణ మహబూబాబాద్

చికెన్ ప్రియులకు భారీ ఊరట 🐔🐓

కొండెక్కిన కోడి ధరలు కూల్… చికెన్ ప్రియులకు ఊరట! భారీగా తగ్గిన ధరలు – మార్కెట్లో చురుకైన అమ్మకాలు ఇటీవలి కాలంలో ఆకాశాన్నంటిన కోడి మాంసం ధరలు చివరకు తగ్గుముఖం పట్టాయి. ఒకప్పుడు కిలోకు రూ.360 నుంచి రూ.400 వరకు పలికిన బ్రాయిలర్ చికెన్ ధరలు ఇప్పుడు గణనీయంగా తగ్గి, ప్రస్తుతం మార్కెట్లో సుమారు రూ.270కి లభిస్తున్నాయి. ఈ పరిణామం చికెన్ ప్రియులకు పెద్ద ఊరటనిచ్చింది. గత కొన్ని వారాలుగా పెరిగిన వేసవి ఉష్ణోగ్రతలు కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావం చూపించాయి. అధిక వేడి కారణంగా కోళ్లు చనిపోవడం, దాణా ఖర్చులు పెరగడం వల్ల పౌల్ట్రీ యజమానులు ధరలను పెంచాల్సి వచ్చింది. అదే సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు పెరగడంతో చికెన్‌కు భారీ డిమాండ్ ఏర్పడి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీంతో వినియోగదారులు చికెన్ కొనడంలో వెనుకడుగు వేసి, చాలా మంది సీ ఫుడ్ వైపు మొగ్గు చూపారు. కానీ, పరిస్థితులు క్రమంగా మారడంతో గతవారం నుంచే ధరలు తగ్గడం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో స్కిన్‌లెస్ చికెన్ ధర సుమారు రూ.270గా కొనసాగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం ప్రాంతంలో మాత్రం రూ.300 నుంచి రూ.350 మధ్యలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులు, కోళ్ల లభ్యత, పెంపకం పరిస్థితులు వంటి అంశాలపై ఆధారపడి చికెన్ ధరలు మారుతుంటాయని వ్యాపారులు చెబుతున్నారు. వచ్చే రోజుల్లో ధరలు మరింత స్థిరపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు🙏

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అక్కంపేటలో తెలుగుదేశం పార్టీ44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా 29 మార్చి (పున్నమి ప్రతినిధి ) .మనుబోలు మండలంలోని అక్కంపేటగ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామమంతా పసుపు జెండాలతో కళకళలాడగా, పొన్నూరు రామకృష్ణయ్య, షేక్ అమీర్ భాష, ఇనుమడుగు పెంచల్ రెడ్డి తదితర నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘనంగా ఘటించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

E-పేపర్

వేడుకలపై బీ ఆలర్ట్‌.. • ఎక్సైజ్‌ నిఘా బృందాలతో తనిఖీలు

పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్: 29 మార్చి 2026 *వేడుకలపై బీ ఆలర్ట్‌..* • ఎక్సైజ్‌ నిఘా బృందాలతో తనిఖీలు.. • డిఫెన్స్, నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌, విదేశీ మద్యం, గంజాయి,డ్రగ్స్‌పై పోకస్‌ • అనుమతి లేని ఈవెంట్‌ పార్టీలపై కూడ నిఘా. ఫంక్షన్ హాల్స్, బ్యాంక్వెట్ హాల్స్, రిసార్ట్స్, ఫార్మ్ హౌస్ లలో జరిగే వేడుకల్లో డిఫెన్స్,నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ (ఇతర రాష్ట్రాల మద్యం),విదేశీ మద్యం, గంజాయి,డ్రగ్స్‌ వినియోగంపై అనువణువున తనిఖీలు చేపట్టడానికి సన్నాహాలు. ఎక్సైజ్‌శాఖ నుంచి ఎస్ టి ఎఫ్ ( స్టేట్‌ టాస్క్‌ ఫోర్స్) రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్, డి టి ఎఫ్ ( సరూర్ నగర్ జిల్లా టాస్క్‌ ఫోర్స్), హయత్ నగర్ ఎక్సైజ్‌, పెద్ద అంబర్ పేట్ ఎక్సైజ్‌ టీమ్‌లు నిరంతర తనిఖీలు నిర్వహిస్తారు. ప్రధానంగా ఈ టీమ్‌లు జరుపుకునే వేడుకల్లో మద్యం వినియోగం అనుమతి (Event permit ) తో పాటు తెలంగాణ మద్యం మినహా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న మద్యం, డిఫెన్స్, విదేశీ మద్యం, గంజాయి,డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు, కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కోంటున్నారు. వేడుకల్లో ఎక్సైజ్‌ టీమ్‌లు వినియోగించే మద్యంపై టెక్నాలజీ యాప్‌లతో తనిఖీలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. హాల్ ఓనర్స్ /రిసార్ట్ ఓనర్స్ Event permit లేకుండ events జరపడం మరియు డిఫెన్స్ లేక ఇతర రాష్ట్రాల మద్యం లేక విదేశీ మద్యం ఈవెంట్స్ లో వాడకుండ చూసుకోవడం వారి భాద్యత. ఉల్లంఘనలు జరిగిన ఆ ఫంక్షన్ హాల్ ను black list చేసి event permit ఇకముందు ఇవ్వడం జరగదు . కనుక జాగ్రత్తగా భాద్యతగా ఉండవలిసిందిగా కోరడమైనది.

అన్నమయ్య

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం నాగవరం గ్రామంలో ఘనంగా నిర్వహణ

తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలం నాగవరం గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ శ్రీ కె.కె. చౌదరి గారికి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ మాచినేని విశ్వేశ్వర్ నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా మండల కమిటీ నాయకులు, గ్రామ కమిటీ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ రాష్ట్ర సంస్కృతిక విభాగ అధ్యక్షులు శ్రీ పంతగాని నరసింహ ప్రసాద్ గారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.