Friday, 24 April 2026

Blog

ఖమ్మం

రావినూతల గ్రామంలో శ్రీ రక్ష ఆరోగ్య యాత్రకు గ్రామస్థుల అనూహ్య స్పందన

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లాలోని ప్రముఖ వైద్యశాల శ్రీ రక్ష హాస్పిటల్ డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రారంభమైన శ్రీ రక్ష ఆరోగ్య యాత్ర శనివారం బోనకల్ మండలం రావినూతల గ్రామంలో నిర్వహించబడింది. గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రావినూతల గ్రామ సర్పంచ్ భూక్య భద్రం నాయక్, ఉప సర్పంచ్ దొండపాటి సత్యనారాయణ, అలాగే దొండపాటి నాగేశ్వరరావు, మైనేని నారాయణ, వట్టికుండ కృష్ణ, జోనిబొయిన గురువయ్య, చేబ్రోలు మల్లికార్జున రావు, షేక్ జానీ, గుగులోతు నరేష్, తాళ్లూరి సురేష్, బోయినపల్లి గోపాల్, చేబ్రోలు చిన్న మల్లికార్జున రావు, బీపీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ రక్ష ఆరోగ్య యాత్ర బృందం గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, గ్రామస్తులు అధిక సంఖ్య లో హాజరై ఈ యాత్ర ని జయ ప్రదం చేసారు.

తిరుపతి

తిరుచానూరులో బీజేపీ ప్రశిక్షణ తరగతుల విస్తృతస్థాయి సమావేశం విజయవంతం.

తిరుపతి,మార్చి 28 పున్నమి ప్రతినిధి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026 కార్యక్రమం భాగంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తిరుచానూరు మండలంలో ఆదివారం విస్తృతస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం పార్టీ శక్తివంతీకరణ, కేడర్ అభివృద్ధి మరియు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై దృష్టి సారించింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నరేష్, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి నాగోతు ప్రసాద్ మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.మండల అధ్యక్షులు సుభకర్ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న ప్రశిక్షణ తరగతులను విజయవంతం చేయడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించబడిందని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా పార్టీ కార్యకర్తలకు నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవలో నైపుణ్యాలు, మరియు ఎన్నికల వ్యూహాలపై అవగాహన కల్పించబడుతుందని పేర్కొన్నారు.అదనంగా, పార్టీ విస్తరణ కోసం యువతను ఆకర్షించడం, మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, సామాజిక మాధ్యమాల వినియోగాన్ని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా చర్చించారు. స్థానిక సమస్యల పరిష్కారంలో పార్టీ ముందుండాలని, ప్రజలతో నిత్యం మమేకమై పనిచేయాలని నాయకులు సూచించారు.సమావేశం అనంతరం అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుభకర్, చైతన్య రెడ్డి, నాగరాజు రెడ్డి, పరాశరేశ్వర ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు శంకర్ రెడ్డి, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు పుష్పరెడ్డి, ప్రసాద్, సీనియర్ నాయకులు రూపేష్ బాబు, భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సమావేశం ద్వారా తిరుచానూరు మండలంలో బీజేపీ కార్యకలాపాలకు కొత్త ఉత్సాహం వచ్చిందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మార్కాపురం ఘోర ప్రమాదం – బాధితులకు ఎమ్మెల్యే కాకర్ల పరామర్శ, ఆర్థిక సహాయం

మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఉదయగిరి నియోజకవర్గాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ఒక్కసారిగా జరిగిన ఈ దుర్ఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది. ఈ ఘటనతో పలు గ్రామాల్లో దుఃఖ వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడి మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ఆసుపత్రిని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ, వారికి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. అదేవిధంగా, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి గాయపడిన వ్యక్తికి రూ.10,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబాల పట్ల తన హృదయపూర్వక సానుభూతిని వ్యక్తం చేస్తూ, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. క్షతగాత్రులు: కంచుపాటి అయ్యన్న (యర్రబోట్లపల్లి, కొండాపురం మండలం), డబ్బుగుంట కిరణ్ కుమార్ (దాసరిపల్లి, ఉదయగిరి మండలం), తుపాకుల రత్నమ్మ (వెంకటంపేట, దుత్తలూరు మండలం), చంబేటి మనోజ్ కుమార్, మేఘన, సుజాత (మోటు చింతలపాలెం, వింజమూరు మండలం), కోసినపోగు జయప్రకాష్ (అయ్యవారిపల్లి, ఉదయగిరి మండలం), కె. చందన, కె. చందు, డి. సురేంద్ర, సి.హెచ్. ఆమోష్ (నల్లగొండ్ల గ్రామం, వింజమూరు మండలం) గాయపడి చికిత్స పొందుతున్నారు. మృతులు: ఈ ప్రమాదంలో ఆత్మకూరి చిన్నయ్య (బొమ్మరాజు చెరువు, కలిగిరి మండలం), ముత్తంగి వెంకటేశ్వర్లు (దాసరిపల్లి, ఉదయగిరి మండలం), నరసింగు ప్రభావతి, నరసింగు చైత్ర (తూర్పు యర్రబెల్లి, కొండాపురం మండలం) మృతి చెందారు. ఈ ఆకస్మిక ప్రమాదం కారణంగా మృతుల కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. తల్లిదండ్రులు, భార్యాభర్తలు, పిల్లలు తమ ఆప్తులను కోల్పోయి కన్నీటి పర్యంతమవుతున్నారు. గ్రామాల్లో విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘటన మరోసారి రోడ్డు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతూ, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

ఖమ్మం

.ఖమ్మంలో వినూత్న ప్రయోగం … గట్టయ్య సెంటర్ చౌదరి హోటల్‌లో ఇనుప డ్రమ్ములతో నూతన పోయిలు :

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్‌లో గల శ్రీ కృష్ణ చౌదరి హోటల్ యజమాని నల్లమల్ల రంజిత్ ఒక వినూత్న ప్రయోగంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ కొరత, పెరిగిన ఖర్చులు… ఇవి సాధారణ హోటళ్లను ఇబ్బందుల్లోకి నెడుతున్నా, రంజిత్ మాత్రం దానికి ఒక తెలివైన మార్గం కనుగొన్నారు. ఇనుప డ్రమ్ములను జాగ్రత్తగా మోడిఫై చేసి వాటిని శక్తివంతమైన పోయిలు గా మార్చి, కట్టెలను ఉపయోగిస్తూ తన హోటల్ కస్టమర్లకు నిరంతరంగా రుచికరమైన వంటకాలు అందిస్తున్నారు. వంట సువాసనలు గాలి తాకిడిలో తేలుతూ చౌదరి హోటల్ వైపు నకి కస్టమర్లను లాక్కొచ్చేలా మారింది. ఈ వినూత్న ఆలోచన గురించి మాట్లాడిన నల్ల మల్ల రంజిత్, “గ్యాస్ సమస్య వచ్చినప్పటి నుండి ఇలా ట్రై చేశాం… చాలా బాగా పనిచేస్తోంది. ఖర్చు తగ్గింది, వంట వేగం పెరిగింది, రుచి మాత్రం మరింత బావుంది” అని పున్నమి జిల్లా ఇంచార్జి పువ్వాడ నాగేంద్ర కుమార్ కి తెలిపారు. రంజిత్ సరికొత్త ఆలోచనను చూసి, పరిసర ప్రాంతాల హోటల్ యజమాన్లు కూడ

మార్కాపురం సమీపంలో ఘోర బస్సు ప్రమాదం… నాయుడుపల్లిలో విషాదం, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

మార్కాపురం సమీపంలో ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గొల్లపల్లి వెంకటేశ్వర్లు గారి మృతదేహం స్వగ్రామమైన నాయుడుపల్లికి చేరుకోవడంతో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు గ్రామంలో హృదయ విదారక వాతావరణాన్ని సృష్టించాయి. మృతుడికి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ దుర్ఘటన పట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలుస్తామని, ప్రభుత్వం తరఫున కూడా అన్ని విధాలుగా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదం మరోసారి రోడ్డు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతుండగా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరులో ముఖ్యమంత్రి పర్యటనకు సన్నాహక సమావేశం

దుత్తలూరు: ఏప్రిల్ ఒకటవ తారీఖున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి ఆదేశాలతో ఈరోజు మండలంలో కూటమి నాయకులు విస్తృత స్థాయిలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఈరోజు దుత్తలూరు కేంద్రంలో జరిగింది. ఈ సమావేశంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ముఖ్యంగా సభా ప్రాంగణం ఏర్పాట్లు, భద్రతా చర్యలు, పార్కింగ్ సౌకర్యాలు, ప్రజల సమీకరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే మండలంలోని ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన మండల అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో మండల టీడీపీ కన్వినర్ ఉండేలా గురువారెడ్డి గారు,వెంగళరెడ్డి గారూ, మాజి ఎంపీపీ రవీంద్ర బాబు గారూ,నందిపాడు సొసైటీ చైర్మన్ మండవ మధు గారూ, సీనియర్ నాయకులు గురువయ్య నాయుడు, మరియు మండల నాయకులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మార్కాపురం సమీపంలో ఘోర బస్సు ప్రమాదం… నాయుడుపల్లిలో విషాదం, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

మార్కాపురం సమీపంలో ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గొల్లపల్లి వెంకటేశ్వర్లు గారి మృతదేహం స్వగ్రామమైన నాయుడుపల్లికి చేరుకోవడంతో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు గ్రామంలో హృదయ విదారక వాతావరణాన్ని సృష్టించాయి. మృతుడికి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ దుర్ఘటన పట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలుస్తామని, ప్రభుత్వం తరఫున కూడా అన్ని విధాలుగా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదం మరోసారి రోడ్డు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతుండగా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

తిరుపతి

వైభవంగా ప్రాణయోగ ఆశ్రమంలో శ్రీరామనవమి వేడుకలు

“ఓం నమో శ్రీరామ ఓం” శ్రీరామ జపంతో 1000 మంది భక్తులు పున్నమి ప్రతినిధి,రామచంద్రపురం రామచంద్రపురం మండలంలోని కొత్త కండ్రిగ సమీపం లో ఉన్న ప్రాణ యోగ ఆశ్రమంలో ఆశ్రమం వ్యవస్థా పకులు కైలాస్ గురూజీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పురస్కరించుకుని భక్తులు భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రాణ యోగ ఆశ్రమం లో 1000 మంది రామ భక్తులతో” ఓం నమో శ్రీ రామ ఓం” శ్రీరామ జపంతో ఏకధాటిగా చేతులు కలిపి కైలాస్ గురూజీ రామ జపం పట్టించారు. ఈ కార్యక్రమం మూడు రోజులపాటు భక్తి శ్రద్ధలతో రామ జపం నిర్వహిస్తున్నట్టు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. శ్రీరామ భక్తులందరికీ నిత్య అన్నదాన వితరణ చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.