Friday, 24 April 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వరుని నిత్యాన్నదానానికి రూ. 51,111 విరాళం

శ్రీకాళహస్తి, మార్చి 27, (పున్నమి టెంపుల్ న్యూస్): ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో కొనసాగుతున్న నిత్యాన్నదాన పథకానికి భక్తుల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం బెంగళూరుకు చెందిన ప్రముఖ భక్తుడు చిక్కాల యోగేశ్వరరావు స్వామివారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ. 51,111/-లను విరాళంగా అందజేశారు. విరాళానికి సంబంధించిన నగదును ఆలయ సహాయ ప్రజాసంబంధాల అధికారి (APRO) రవికి దాత అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు దాతకు స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేద పండితులు ఆయనకు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను, శేష వస్త్రాన్ని అందజేశారు. నిత్యాన్నదాన పథకానికి ఉదారంగా విరాళం అందించినందుకు గాను దేవస్థాన అధికారులు చిక్కాల యోగేశ్వరరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భక్తుల సహకారంతోనే వేలాది మందికి నిత్యం అన్నప్రసాద వితరణ జరుగుతోందని వారు పేర్కొన్నారు.

తిరుపతి

భక్తిశ్రద్ధలతో కుంభాభిషేక మహోత్సవం.. అన్నదానంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్.సి.వి.

ఏర్పేడు, మార్చి 27 (పున్నమి న్యూస్): ఏర్పేడు మండలం, పాపా నాయుడు పేట గ్రామంలో వెలసిన శ్రీరాముల వారి ఆలయ కుంభాభిషేక మహోత్సవం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్.సి.వి. నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి విచ్చేసిన ఎస్.సి.వి. నాయుడుకు ఆలయ నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి విశేష పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పండితులు ఆయనకు శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు.పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని భక్తులకు ప్రసాదాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గోగినేని భాస్కర్ నాయుడు, మాజీ కౌన్సిలర్ అంజూరు సుధాకర్, కయ్యూరి శివ, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

తిరుపతి

నేడు శ్రీకాళహస్తిలో బీజేపీ ప్రతిష్టాత్మక ‘ప్రశిక్షణ’ కార్యక్రమం

శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): భారతీయ జనతా పార్టీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ప్రశిక్షణ’ (శిక్షణా తరగతుల) కార్యక్రమం నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని NVS కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి రూరల్, పట్టణ, తొట్టంబేడు మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరుకావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ కోలా ఆనంద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ.. బీజేపీలో ప్రశిక్షణ కార్యక్రమానికి ఎంతో విశిష్టత ఉందని, పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు ఇందులో అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి కార్యకర్తలు తప్పనిసరిగా నిర్ణీత సమయానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. పార్టీ బలోపేతానికి ఈ శిక్షణా తరగతులు కీలకమని, నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో పాల్గొని పార్టీని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలు కూడా పాల్గొననున్నారు.

తిరుపతి

భక్తిశ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు-కోదండ రాముని సేవలో బియ్యపు ఆకర్ష్

శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): రేణిగుంట మండలం, గుత్తివారిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆకర్ష్ రెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన సీతారాముల వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఆయనకు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ రెడ్డి, ధనంజయ రెడ్డి, గ్రామ సర్పంచ్ మంజుల, ముని రెడ్డి, సుబ్రహ్మణ్యం మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం అంతా భక్తుల రామనామ స్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

తిరుపతి

ప్రతి ఇంటా సీతారాముల కృపాకటాక్షాలు కలగాలి-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకాంక్ష

శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): ధర్మానికి ప్రతిరూపం, ఆదర్శవంతమైన జీవనానికి నిదర్శనం ఆ దాశరథి జన్మించిన పవిత్ర దినం శ్రీరామ నవమి అని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కొనియాడారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీతారాముల కళ్యాణ మహోత్సవ వేళ, ఆ దైవ కృపాకటాక్షాలు మనందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. “రాముని పాలనలో ప్రజలందరూ ఏ విధంగా అయితే సుఖశాంతులతో విరాజిల్లారో, అదే విధంగా మన శ్రీకాళహస్తి నియోజకవర్గం కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆయన ఆకాంక్షించారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి ఇంటా సుఖసంతోషాలు, వెలుగులు నిండాలని ఆ శ్రీరామచంద్రుని వేడుకుంటున్నట్లు సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. పండగ పూట ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకోవాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే ఈ సందేశం నియోజకవర్గ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది.

తిరుపతి

సేవానిరతికి దక్కిన గౌరవం-గుడిమల్లం ఈవోకు ముందస్తు వీడ్కోలు.

ఏర్పేడు, మార్చి 27 (పున్నమి న్యూస్): ఏర్పేడు మండలంలోని చారిత్రాత్మక గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారి (ఈవో) రామచంద్ర రెడ్డి పదవీ విరమణను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ముందస్తు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఘనంగా వీడ్కోలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బుగ్గ మఠం ఈవో మరియు అసిస్టెంట్ కమిషనర్ (AC) డి. వెంకటేశ్వర్లు, రామచంద్ర రెడ్డిని దుశ్శాలువతో కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. స్వామివారి సేవలో ఆయన చూపిన నిబద్ధతను ఈ సందర్భంగా కొనియాడారు. సన్మాన గ్రహీత రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. తన సేవా కాలంలో గుడిమల్లం దేవస్థాన సిబ్బంది మరియు భక్తులు అందించిన సహకారం మరువలేనిదని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతి ఒక్కరికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో కనులపండువగా సీతారాముల కల్యాణం

శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని నగర వీధిలో వెలసిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ పట్టాభిరామ స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ వేద పండితులు స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణ వేడుక సాగింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. అలాగే, ఆలయ కార్యనిర్వహణాధికారి (EO) వెంకటేశ్వర్లు దంపతులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ – విశాలాక్షి దంపతులు, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, డీఈఓ కృష్ణారెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది ఈ వేడుకలో పాల్గొన్నారు. భక్తులందరికీ కల్యాణం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. ఆలయ పరిసరాలన్నీ ‘జై శ్రీరామ్’ స్మరణతో మారుమోగాయి.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల్ మండల్ లింగంపల్లి గ్రామంలో పేకాటరాయుల్ల అరెస్ట్

పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : 27 మార్చి 2026 రంగారెడ్డి జిల్లా, మంచల్ మండలం, లింగంపల్లి గ్రామంలోని జి.ఆర్. ఫామ్ హౌస్‌లో కొందరు వ్యక్తులు అక్రమంగా పేకాట ఆడుతూ పట్టుబడ్డ పేకాట రాయులు కేసు వివరాలు ఏమనగా, 27.03.2026న రాత్రి 7:30 గంటలకు మంచల్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ వి. నాగేశ్వరరావు నుండి ఒక నివేదిక అందింది. ఆ నివేదికలో ఆయన, 27.03.2026న సుమారు 4:00 గంటలకు రంగారెడ్డి జిల్లా, మంచల్ మండలం, లింగంపల్లి గ్రామంలోని జి.ఆర్. ఫామ్ హౌస్‌లో కొందరు వ్యక్తులు అక్రమంగా పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం అందిందని పేర్కొన్నారు. ఈ సమాచారం వెంటనే నాకు తెలియజేయబడింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారికి తెలియజేసి, ఆ జూదం కార్యకలాపంపై దాడి చేయడానికి ముందస్తు అనుమతి పొందడం జరిగింది. ఆ వెంటనే, ఇద్దరు మధ్యవర్తులను ఏర్పాటు చేసి, సుమారు 17:00 గంటలకు, ఆయన కె. రాజు పిసి 7716, కె. సాయి రామ్ పిసి 7761, బి. నవీన్ కుమార్ పిసి 12983 సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి బయలుదేరారు. ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత, డబ్బు పందెం కాస్తూ “త్రీ కార్డ్స్” ఆడుతున్న 18 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో, వారు ఈ క్రింది విధంగా వారి గుర్తింపులను వెల్లడించారు: గురజాల ప్రవీణ్ కుమార్ s/o నర్సింహగౌడ్, వయస్సు: 31 సంవత్సరాలు, 2) కొండపాక ప్రదీప్ కుమార్ s/o దయానంద్ చారి, వయస్సు: 44 సంవత్సరాలు, 3) మణికొండ మల్లికార్మున్ s/o లేట్ శివాజీ, 36 ఏళ్ల శివాజీ, వయస్సు: లేట్ కిషన్, వయస్సు: 35 సంవత్సరాలు, 5) ఉప్పు కిషోర్ s/o లక్ష్మయ్య, వయస్సు: 31 సం.లు, 6) అంతటి లింగ స్వామి s/o పొన్నయ్య, వయస్సు: 39 సంవత్సరాలు, 7) ఉప్పు పవన్ s/o వీరయ్య, వయస్సు: 32 yrs, 8) బండారి బాలయ్య/మల్లేష్రాజు @) 32 ఏళ్లు 9) చెరుకు శివుడు s/o లేట్ సత్తయ్య, వయస్సు: 36 సంవత్సరాలు, 10) మోతుకు సిద్ధార్థ s/o లేట్ కమలాకర్, వయస్సు: 45 సంవత్సరాలు, 11) జువ్వగాని శ్రీహరి s/o మల్లయ్య, వయస్సు: 37 సంవత్సరాలు, 12) బద్దూరి సాయి కృష్ణ, 3 సం.3) అశోక్ 3) అశోక్ కుమార్ 3) s/o కృష్ణ, వయస్సు: 43 సంవత్సరాలు, 14) తండా బాల కృష్ణ గౌడ్ s/o లేట్ సత్యనారాయణ, వయస్సు: 44 సంవత్సరాలు, 15) పత్ర కిశోరా చారి s/o వెంకటేశ్వర్లు లేట్, వయస్సు: 36 సంవత్సరాలు, 16) సపావత్ ఈశ్వర్ నాయక్ S/o తావు నాయక్, వయస్సు; 36 సం., 17) లకనకునిబి రాజేశ్వర్ (తండ్రి యాదగిరి, వయస్సు: 45 సం.), 18) మదుగోని మధు @ మధుసూదన్ (తండ్రి భిక్షపతి, వయస్సు: 34 సం.), నిందితులు స్వచ్ఛందంగా తమ నేరాన్ని అంగీకరించారు. మధ్యవర్తుల సమక్షంలో వారి నేర అంగీకార-స్వాధీన పంచనామాను నమోదు చేశారు. విచారణ పూర్తి చేసిన అనంతరం, నేరం జరిగిన ప్రదేశంలో వారి వద్ద నుండి పంచనామా కింద, పంచ్ సంతకాలు చేసి కింది ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు: స్వాధీనం చేసుకున్న వస్తువులు 04 పేకాట సెట్లు (17), మొబైల్ ఫోన్లు, వాకీ టోకీ సెట్లు-02 మరియు 3), రూ. 2,28,000/- నికర నగదు. నిందితులను, స్వాధీనం చేసుకున్న ఆస్తులతో పాటు, తదుపరి చర్యల కోసం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

కడప

ప్రొద్దుటూరు ట్రాఫిక్ నియంత్రణపై సమీక్ష

ప్రొద్దుటూరు పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలపై శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో MLA వరదరాజుల రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ASP విభుకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, సీఐలు కొండారెడ్డి, వంశీనాథ్, రామాంజనేయులు, రాజగోపాల్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

E-పేపర్

ఔరుపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం*

*ఔరుపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం* ఫ్యూచర్ సీటీ కమిషనరేట్ – పరిధిలో తేదీ: 27 మార్చి 2026. పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ : మాడ్గుల్ మండలం ఔరుపల్లి గ్రామం సమీపంలోని ఎండిపోయిన కాలువలో సుమారు 50 ఏళ్ల వ్యక్తి మృతదేహం గుర్తించారు. మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో, కొన్ని రోజుల క్రితమే మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు మాడ్గుల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ వేణుగోపాల్ తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.