Friday, 24 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో ‘నారాయణ నేత్రజ్యోతి – దంత సురక్ష’ వైద్య శిబిరం – ఉచిత కళ్లద్దాల పంపిణీ

నెల్లూరు సిటీలోని సీఆర్పీ డొంకలో నిర్వహించిన ‘నారాయణ నేత్రజ్యోతి – దంత సురక్ష’ వైద్య శిబిరాన్ని తన సతీమణి రమాదేవితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అవసరమైన 12మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా రెండేళ్లలో 48 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని వైద్య బృందం లక్ష్యంగా పెట్టుకుంది. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి నారాయణ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో ఉచిత శస్త్రచికిత్సలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజలు మంచి స్పందన తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

రాచర్ల గొల్లపల్లిలో సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా /మార్చి /పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

తిరుపతి

శ్రీ శక్తి పీఠం, వైభవంగా శ్రీరామనవమి వేడుకలు పుత్రకామేష్టి యాగం, సీతారాముల కల్యాణం

పున్నమి ప్రతినిధి 28 మార్చి 2026 రామచంద్రపురం శ్రీ శక్తి పీఠం, రాయలచెరువు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులు, శ్రీ శక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు, నడిచే దైవంగా భక్తులు కొలిచే జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో, మంత్ర మహేశ్వరి, శ్రీ శక్తి పీఠాధీశ్వరి శ్రీ శ్రీ శ్రీ రమ్యానందభారతీ మహాస్వామిని వారి ప్రత్యక్ష సన్నిధిలో రాయలచెరువు శ్రీ శక్తి పీఠంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించబడినవి. ఈ శుభసందర్భంగా పీఠ ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. వివాహిత దంపతులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాగంలో ఆహుతులు సమర్పించారు. యాగానంతరం హోమాగ్నిలో తయారుచేయబడిన పాయసాన్నం పవిత్ర ప్రసాదంగా దంపతులందరికీ అందజేయబడింది. ప్రముఖ సాహితీవేత్త శ్రీమతి అనంతలక్ష్మి గారి నేతృత్వంలో బృందం సమర్పించిన “రమణీ రామాయణం” రూపక ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తిరస భరితమైన ఈ ప్రదర్శన భక్తులందరి మనస్సులను రంజింపజేసింది. అనంతరం శ్రీ సీతారాముల కల్యాణం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడింది. అనంతరం శ్రీ తారా దేవి జయంతి సందర్భంగా ప్రత్యేక అభిషేక హోమములు వేదమంత్రోచ్చారణల మధ్య జరుపబడినవి. ఈ కార్యక్రమాలలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి, మాతాజీ వారి ఆశీర్వాదాలు పొందారు. కార్యక్రమ సమాప్తి అనంతరం పీఠ నిర్వాహకులు వచ్చిన సమస్త భక్తులకు వివిధ రకాల అన్నప్రసాదాలు అందించారు.

రాజన్న సిరిసిల్ల

50 వేల ఉద్యోగాలు కేసీఆర్ హయాంలోవే – బీఆర్‌ఎస్ నేత మెంగని మనోహర్

రాజన్న సిరిసిల్ల జిల్లా /మార్చి /పున్నమి ప్రతినిధి అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చింది కేవలం 16,978 ప్రభుత్వ ఉద్యోగాలేనని ఒప్పుకుందని, మిగతా ఉద్యోగాలు బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చినవేనని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెంగని మనోహర్ పేర్కొన్నారు. ప్రభుత్వం 2 ఏళ్లలో 67 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, గెలిచిన తర్వాత జాబ్ క్యాలెండర్ పేరుతో కాలయాపన చేసి ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. నోటిఫికేషన్లు ఇస్తే అశోక్ నగర్, దిల్‌సుఖ్‌నగర్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరుద్యోగులు, విద్యార్థులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలన్నారు. నిరుద్యోగ యువతను, విద్యార్థులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని విమర్శించారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటుందని, తెలంగాణకు కే .చంద్రశేఖర రావు గారి నాయకత్వమే అవసరమని ఆయన పేర్కొన్నారు.

కడప

ప్రొద్దుటూరులో భారీ అగ్ని ప్రమాదం

పొద్దుటూరులోని స్థానిక గీతాశ్రమం వీధిలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆశ్రమానికి చెందిన ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయి. పక్కనున్న హోటల్కు కూడా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. చెక్క దంతెలతో నిర్మించిన ఇల్లు, వస్తువులు పూర్తిగా కాలిపోయాయని ఫైర్ ఆఫీసర్ బసివిరెడ్డి తెలిపారు. స్థానిక ASP విభుకృష్ణ అక్కడికి వచ్చి పరిశీలించారు. Uploaded Video:

రాజన్న సిరిసిల్ల

నామాపూర్‌లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

ముస్తా బాద్ మార్చి పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో ఈరోజు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మెరుగు రాజా గౌడ్, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామంలోని వివిధ కుల సంఘాల నాయకులు మరియు గ్రామ ప్రజల సమిష్టి సహకారంతో ఈ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తి శ్రద్ధలతో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఈ వేడుకను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలోని పురవీధులు రామనామ స్వరాలతో మారుమోగాయి. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు మరియు అన్నప్రసాద వితరణను ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు.

మహబూబ్ నగర్

ఇన్సర్వీస్ ఉపాధ్యాయులందరికీ త్వరలో టెట్ నుండి ఉపశమనం లభించబోతుంది, రికగైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు, మరియు తెలంగాణ గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు

*ఇన్సర్వీస్ ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇప్పించి వారిలో ఉన్న అభద్రతాభావానికి త్వరలో ముగింపు పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర గౌరవాధ్యక్షులు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా:: తేదీ 27/03/2026* *రాష్ట్రంలో దాదాపుగా 50వేల మంది పైచిలుకు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు గతంలో ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్,రాష్ట్ర ,శాఖ మరియు అన్ని జిల్లా శాఖల నుంచి విజ్ఞప్తి మేరకు గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి కి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారికి మెయిల్ పంపి తమ లెటర్ హెడ్ నుంచి విజ్ఞాపన చేయడం జరిగింది. అందులో భాగంగా వారు ఈరోజు స్థానిక క్యాంపు కార్యాలయంలో కలిసి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి గుర్తుచేస్తూ రాష్ట్రంలోని ఇన్సర్వీస్ ఉపాధ్యాయులందరికీ 2010 డీఎస్సీ కన్న ముందు నియామకమైన ఉపాధ్యాయులందరికీ టెట్ నుండి మినహాయింపు ఇప్పించి పార్లమెంటులో చట్ట సవరణ చేస్తూ అమెండ్మెంట్ చేయించి రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరిలో నెలకొన్న అభద్రత భావాన్ని త్వరలో ముగింపు పలికించాల్సిందిగా రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్,తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మురళీకృష్ణ గారు కలిసి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది త్వరలో పార్లమెంటు ప్రస్తుత సెషన్ లోనే ఈ సమస్యకు స్వస్తి పలుకుతామని ఆమె హామీ ఇవ్వడం జరిగిందని వారు తెలియజేశారు, వారు ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యురాలికి తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం పక్షాన రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర, జిల్లా శాఖల పక్షాన ధన్యవాదాలు తెలిపారు*

ఖమ్మం

భక్తి శ్రద్ధల మధ్య శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం – కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ దంపతులు

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం నగరంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. నగరంలోని 21వ డివిజన్ పార్శి బంధం వద్ద శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని శ్రీ సీతారాముల వారి దివ్య కళ్యాణాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ గల్లా సత్యనారాయణ, శ్రీమతి శరణ్య దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వారు శ్రీ సీతారాముల వారి ఆశీర్వాదాలు తీసుకుని, ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సాంస్కృతిక విలువలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా నాయకులు పిల్లలమర్రి వెంకట్, డీకొండ శ్యామ్ సుందర్ పాల్గొని ఉత్సవాలకు సహకరించారు. అలాగే శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తుల రద్దీతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది. భజనలు, మంగళహారతులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చివరగా అన్నదానం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

E-పేపర్ News తెలంగాణ మహబూబాబాద్

శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన: భుక్య రాము-ప్రమీల దంపతులు💐

శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు 🙏🙇‍♂️🚩🚩 ధర్మానికి, సుపరిపాలనకు ప్రతీకగా నిలిచిన ఆదర్శ పురుషుడు, కర్తవ్య పరాయణుడు శ్రీరాముడు.ఆయన అవతరించిన ఈ పుణ్యదినం, ఆయన దివ్య కల్యాణం జరిగిన పవిత్రమైన రోజు. శ్రీరాముడు అంటేనే ప్రజారంజక పాలన – రామరాజ్యం.అలాంటి రామరాజ్యాన్ని స్థాపించుకోవడం మన అందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ శ్రీరామచంద్రమూర్తి సుగుణాలను ఆచరిస్తూఆదర్శ జీవితం గడపాలని ఆకాంక్షిస్తూ… మీకు, మీ కుటుంబ సభ్యులకుశ్రీరాముడి కృపాకటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ… 🌼 శ్రీరామనవమి శుభాకాంక్షలు 🌼

Others

జీవిత యొక్క ఆనందం కప్పులో కాదు???

చిన్నప్పటి స్నేహితులు మళ్లీ కలిసినప్పుడు జీవితంలో ఏదో లోటు ఉందని అందరూ భావించారు. మంచి ఉద్యోగాలు, భారీ జీతాలు ఉన్నప్పటికీ మనసుకు ప్రశాంతత లేకపోవడం వారిని ఆలోచనలో ముంచింది. తమ పాత గురువును కలిసినప్పుడు ఆయన చెప్పిన చిన్న ఉదాహరణ వారిని మార్గనిర్దేశం చేసింది. జీవితం ఒక టీ అయితే, డబ్బు, హోదా, స్థానం అన్నీ కప్పుల్లాంటివని ఆయన వివరించారు. మనం కప్పుపైనే దృష్టి పెట్టి టీని ఆస్వాదించడం మరిచిపోతున్నామని చెప్పారు. ఇతరులతో పోల్చుకుంటూ జీవితం గడపడం వల్ల అసంతృప్తి పెరుగుతుందని సూచించారు. మనకు ఉన్నదాన్ని సంతోషంగా స్వీకరించి, మనసుతో జీవితం ఆస్వాదిస్తేనే నిజమైన ఆనందం పొందగలమని ఈ కథ స్పష్టం చేస్తుంది. 🌿

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.