News
ఎసిబికి చిక్కిన ఎస్సై తీగల అశోక్ – నిర్మల్ జిల్లా “మామడ పోలీస్ స్టేషన్” లో లంచంతో పట్టుబడ్డ ఎస్సై – కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ.40,000 లంచం డిమాండ్ – చివరకు రూ.20,000 లంచానికి కుదిరిన ఒప్పందం – లంచాల అధికారి కరీంనగర్ ఎసిబి కోర్టుకు తరలింపు – ( చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్, సెల్ నం: 9948133539 ) గతంలో జగిత్యాల జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ లతో పాటు “బుగ్గారం ఎస్సై” గా పని చేసి అనేక ఆరోపణలతో బదిలీ పై వెళ్ళిన తీగల అశోక్ నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ లో గురువారం రూ.20,000 లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. గతంలోనే జగిత్యాల జిల్లాలో ఎస్సై “తీగల అశోక్ పై” అనేక ఆరోపణలతో పిర్యాదులు వస్తే…. అప్పటి ఉన్నతాధికారులు ఆయన నుండి అవినీతికి పాల్పడి ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. అప్పుడే జగిత్యాల జిల్లా ఉన్నతాధికారులు “ఎస్సై తీగల అశోక్” పై తగు చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇంతటి అవినీతికి పాల్పడే వాడు కాదని జగిత్యాల జిల్లా ప్రజలు గుసగుసలు ఆడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా ఎసిబి అధికారులు “ఎస్సై తీగల అశోక్ పై” వచ్చిన అప్పటి పిర్యాదులన్నీ కూడా లేవనెత్తుతే…. అప్పటి పోలీస్ ఉన్నతాధికారుల యొక్క “అవినీతి – అక్రమాల బాగోతం”, విధి నిర్వహణలో ఉన్నతాధికారుల యొక్క “అధికార దుర్వినియోగం” అంతా కూడా బయటపడే అవకాశం ఉందని జగిత్యాల జిల్లా ప్రజానీకం కోరుతోంది. ఎసిబి ఉన్నతాధికారులు ట్విట్టర్ వేదికగా గురువారం ( 26-03-2026 న ) జారీ చేసిన ప్రకటన ఆధారంగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తీగల అశోక్ ఫిర్యాదుదారుడిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయకుండా ఉండేందుకు అధికారిక లబ్ధి చేకూర్చే నిమిత్తం రూ. 40,000/- #లంచం డిమాండ్ చేశారు. అందులో రూ.20,000 కు ఒప్పందం కుదుర్చుకున్నారు. పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న ఎస్ఐ క్వార్టర్స్‌లో లంచంను తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా గురువారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎసిబి అధికారులు మాట్లాడుతూ…. ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించవచ్చును. “ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును అని తెలంగాణ రాష్ట్ర ఎసిబి అధికారులు ట్విట్టర్ వేదికగా తెలిపారు. Telangana ACB OFFICIAL’S Contact Numbers: తెలంగాణ రాష్ట్ర ఎసిబి అధికారుల సెల్ నంబర్లూ… WhatsApp: 9440446106 Toll Free: 1064 Head Quarters: 040-23251501 Hyderabad Range-I: 9440446109 Hyderabad Range-II: 9440446134 Ranga Reddy: 9440446140 Mahabub Nagar: 9491305609 Nalgonda: 7382625525 Warangal: 9440446146 Karimnagar: 9440446166 Nizamabad: 9440446149 Medak: 9440446149 Adilabad: 9440446166 Khammam: 9440446146 ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ఈ నంబర్లకు ఫోన్ చేసి పిర్యాదు చేయవచ్చునని ఎసిబి అధికారులు తెలిపారు.