Friday, 24 April 2026

Blog

E-పేపర్

ఔరుపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం*

*ఔరుపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం* ఫ్యూచర్ సీటీ కమిషనరేట్ – పరిధిలో తేదీ: 27 మార్చి 2026. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : మాడ్గుల్ మండలం ఔరుపల్లి గ్రామం సమీపంలోని ఎండిపోయిన కాలువలో సుమారు 50 ఏళ్ల వ్యక్తి మృతదేహం గుర్తించారు. మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో, కొన్ని రోజుల క్రితమే మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు మాడ్గుల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ వేణుగోపాల్ తెలిపారు.

తిరుపతి

శ్రీకోదండరామునికి చెవిరెడ్డి సారె సమర్పణ – ఆలయంకు వెళ్లిన చెవిరెడ్డి లక్ష్మీ, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి – సాదర స్వాగతం పలికిన నెన్నూరు గ్రామస్తులు

పున్నమి ప్రతినిధి రామచంద్రాపురం మండలం రామచంద్రాపురం మండలం నెన్నూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామస్వామి, శ్రీకృష్ణస్వామి, శ్రీ మహాగణపతి ఆలయాల కుంభాభిషేక మహోత్సవంకు చెవిరెడ్డి కుటుంబీకులు హాజరయ్యారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి శుక్రవారం చెవిరెడ్డి లక్ష్మీ, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిలు పట్టు వస్త్రాలు తీసుకువచ్చి సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న చెవిరెడ్డి కుటుంబీకులకు గ్రామస్తులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేయించారు. చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి తన తల్లి చెవిరెడ్డి లక్ష్మీతో కలసి ఆలయంలో నూతనంగా ప్రతిష్టచేసియున్న శ్రీసీతాసమేత కోదండ రాముల వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ ఆలయ వైశిష్ట్యాన్ని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోదండ రామస్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా 27 మార్చి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని కోదండ రామాపురం శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సాయికుమార్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి క్షీర పంచామృత అభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక ఆర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దువ్వూరు శ్రీనివాసుల రెడ్డి, యోగనాధ్ రెడ్డి, లక్ష్మీ సౌమ్య దంపతులు ఉభయ దాతలుగా సేవలందించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

E-పేపర్

యాచారం మండలం నాజిక్ సింగారం లో మద్యం పట్టివేత

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 27 మార్చి 2026 యాచారం పోలీస్ స్టేషన్ ఏరియాలో గల నాజిక్ సింగారం గ్రామం లో జపాల రాజీవన్ S/o పర్వతాలు, వయస్సు: 51 సంవత్సరాలు, వృత్తి: కిరాణా వ్యాపారం, కులం: BC- కుమ్మరి, R/o ఇంటి నెంబర్: 3-52, నాజిక్ సింగారం గ్రామం, యాచారం మండలం, R.R జిల్లా అను వ్యక్తి తన కిరాణా షాపు నందు అక్రమంగా మధ్యం అమ్ముతున్నట్లు సమాచారం రావటం తో అక్కడ వెళ్ళి సోదా చేసి, అతడు అక్రమంగా అమ్ముతున్న 55 బాటిల్ ల మధ్యo ను స్వాదీన పర్చుకుని, అతడిని విచారించగా! అతడు గత కొన్ని రోజుల నుండి యాచారం లోని స్వాగత్ వైన్స్ నుండి అధికమొత్తంలో మధ్యం ను కొని, వాటిని తాను నిర్వహించే కిరాణా షాపులో అమ్ముతున్నట్లు తెలిపినాడు. అందువలన అక్రమంగా మధ్యం అమ్ముతున్న జపాల రాజీవన్ మరియు అధికమొత్తంలో మధ్యం అమ్మిన స్వాగత్ వైన్స్, యాచారం పైన తగు చర్య నిమిత్తం యాచారం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయటం జరిగినది. ప్రజల ప్రాణాలపై వ్యాపారం చేసిన మద్యం మాఫియాకు యాచారం మండలంలో గట్టి దెబ్బ – ఇక కఠిన చర్యలు తప్పవు!” “అక్రమ మద్యం దందా పై – యాచారం మండలంలో అధికారుల మెరుపు చర్యలు

Others

జైపూర్‌లో విదేశీ మహిళకు అసహజ అనుభవం

భారత్‌లో పర్యటనకు వచ్చిన ఓ విదేశీ మహిళకు రాజస్థాన్‌లో అనుకోని, అసౌకర్యకర పరిస్థితి ఎదురైంది. జైపూర్‌లోని జల్ మహల్ సందర్శనకు వెళ్లిన ఆమెను కొంతమంది స్థానిక యువకులు చుట్టుముట్టి సెల్ఫీల కోసం అతిగా ప్రవర్తించారు. మొదట సాధారణంగా కనిపించిన ఈ సంఘటన, కొంతమంది యువకులు ఆమె భుజాలపై చేతులు వేయడం, అనుచితంగా తాకడం వంటి చర్యలతో అసభ్యకరంగా మారింది. దీనితో ఆ మహిళ తీవ్ర అసౌకర్యానికి గురై అక్కడినుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించినప్పటికీ, వారు ఆమెను వదలకుండా మరింతగా ఇబ్బంది పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను దివ్య గండోత్ర ఠండన్ సోషల్ మీడియా వేదికలో పంచుకోగా, అది వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, ఇలాంటి ప్రవర్తన వల్ల దేశ ప్రతిష్టకు నష్టం కలుగుతుందని, పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అభిప్రాయపడ్డారు. 👉 విదేశీ పర్యాటకుల పట్ల గౌరవం, రక్షణ కల్పించడం అత్యవసరం అని పలువురు పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఘనంగా మైఫోర్స్ మహేష్ జన్మదిన వేడుకలు – రక్తదానం, వృక్షార్చన, అన్నదాన కార్యక్రమాలతో సేవా శ్రద్ధ

ఘనంగా మైఫోర్స్ మహేష్ జన్మదిన వేడుకలు – రక్తదానం, వృక్షార్చన, అన్నదాన కార్యక్రమాలతో సేవా శ జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఏపీఐఐసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ జన్మదిన వేడుకలు సామాజిక సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు. స్థానిక అన్నమయ్య జనసేన పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరంతో ప్రారంభమైన ఈ వేడుకలు కేక్ కటింగ్‌తో సందడిగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా సిద్ధమ్మగారి పల్లిలోని ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో “పవన్ అన్న వృక్ష రక్షణ” పేరుతో చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్జ న్మదినం అయిన సెప్టెంబర్ 2 వరకు కొనసాగుతుందని, మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు, పీలేరు, రాయచోటి నియోజకవర్గాల్లో సుమారు 5000 మొక్కలు నాటడమే లక్ష్యమని మహేష్ తెలిపారు. అలాగే కురపర్తి మరియు చైతన్య అనాధాశ్రమాల్లో పిల్లలు, వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. మంజునాథ స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. చిత్తూరు బస్టాండ్ మరియు నీరుగుట్టువారిపల్లి ప్రాంతాల్లో కూడా కేక్ కటింగ్, బాణాసంచా పేల్చడం, అన్నదాన కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, మహిళా నాయకులు శోభ, జయ భవ్య, సీనియర్ నాయకులు సందీప్ రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొని మహేష్ జన్మదిన వేడుకలను సేవామూర్తిగా నిర్వహించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

13 బాధిత కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున సహాయం – కొరికాన రవికుమార్

13 బాధిత కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున సహాయం – కొరికాన రవికుమార్ ముందడుగు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదాల్లో మరణించిన 13 మంది బాధితుల కుటుంబాలకు శ్రీకాకుళం జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ కొరికాన రవికుమార్ తన “కొరికాన ఫౌండేషన్” ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. జనసేన సభ్యత్వ గడువు ముగిసిన తరువాత ప్రమాదాలకు గురైన ఈ బాధిత కుటుంబాలకు బీమా అందని పరిస్థితుల్లో సహాయం చేయాలని రవికుమార్ ముందుకు రావడం విశేషం. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎచ్చెర్లలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారి చేతుల మీదుగా చెక్కులను బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, నరసన్నపేట, ఆమదాలవలస, శ్రీకాకుళం, టెక్కలి నియోజకవర్గాలకు చెందిన బాధితుల కుటుంబాలకు ఈ సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీలు, పీవోసీలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పడారుపల్లిలో జాతర వాతావరణంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

పడారుపల్లిలో జాతర వాతావరణంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం నెల్లూరు రూరల్ నియోజకవర్గం 23వ డివిజన్‌లోని పడారుపల్లిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం జాతరను తలపించేలా ఘనంగా జరిగింది. వేలాదిమంది ప్రజల సమక్షంలో రూ.27 కోట్ల వ్యయంతో చేపట్టిన 240 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకత ఏమిటంటే – ఈ కార్యక్రమాల్లో కూటమి నేతలు ముఖ్య అతిథులుగా ఉండగా, ప్రజలే స్వయంగా ప్రారంభకులుగా నిలిచారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. నగర మేయర్ దేవరకొండ సుజాత, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, జనసేన నగర అధ్యక్షుడు దుగిశెట్టి సుజయ్ బాబు తదితరులు హాజరయ్యారు. అదేవిధంగా బీజేపీ నాయకులు మండ్ల ఈశ్వరయ్య, జనసేన నాయకులు సుందరరామి రెడ్డి, షేక్ అలియా కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్లస్టర్ ఇంఛార్జులు, కో-క్లస్టర్ ఇంఛార్జులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి, పల్లాల కొండారెడ్డి

ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పల్లాల కొండారెడ్డి గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, సుభిక్షం నెలకొనాలని ఆకాంక్షించారు. ధర్మం, నిజాయితీ, న్యాయం అనే విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు. శ్రీరామనవమి పర్వదినం ప్రజలందరికీ సుఖశాంతులు, ఐశ్వర్యం తీసుకురావాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా వ్యాప్తంగా నాకా బంది: 1502 వాహనాల తనిఖీ – 52 కేసులు నమోదు, ₹1.41 లక్షల జరిమానా

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా జిల్లా ఎస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక నాకా బంది కార్యక్రమం నిర్వహించారు. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలపై కట్టడి చేయడం, రౌడీయిజం, దొంగతనాలు, గంజాయి వినియోగం వంటి నేరాలను అరికట్టడం కోసం ఈ చర్యలు చేపట్టారు. మార్చి 26, 2026 రాత్రి 8.30 గంటల నుంచి 10.00 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హైవేలు, ప్రవేశ–నిష్క్రమణ ప్రాంతాల్లో 210 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బృందాలు నాకా బంది నిర్వహించాయి. అనుమానితుల ఇళ్లు, షాపులు మరియు క్రైమ్ ప్రోన్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ తనిఖీల్లో మొత్తం 1502 వాహనాలను పరిశీలించగా, ఓపెన్ డ్రింకింగ్‌కు సంబంధించిన 19 కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు 33 కేసులు నమోదు చేశారు. అదనంగా 3 వాహనాలను సీజ్ చేసి, మోటార్ వెహికల్ యాక్ట్ కింద 39 కేసులు నమోదు చేసి మొత్తం ₹1,41,540 జరిమానా విధించారు. రౌడీ షీటర్లు మరియు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా మరింత పెంచాలని ఎస్.పి. ఆదేశించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పట్టణ ప్రాంతాల్లో రౌడీయిజం, దౌర్జన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రోన్ కెమెరాల ద్వారా క్రైమ్ ప్రోన్ ప్రాంతాల్లో పర్యవేక్షణ కొనసాగిస్తూ, గంజాయి వినియోగం, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, దొంగతనాలు వంటి నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంతర్జిల్లా పోలీసుల సమన్వయంతో సమాచారం మార్పిడి చేస్తూ, జిల్లా సరిహద్దుల్లో పటిష్టమైన తనిఖీలు ఏర్పాటు చేసి అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. ప్రజలు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల సమాచారం ఉన్నా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100/112 లేదా కంట్రోల్ రూమ్ నెంబర్ 9392903143కు తెలియజేయాలని పోలీసులు కోరారు. ప్రజల సహకారంతోనే పూర్తి స్థాయి నేర నియంత్రణ సాధ్యమని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలు నెలకొల్పడం, ప్రజలు భయభ్రాంతులు లేకుండా జీవించేందుకు భద్రత కల్పించడం పోలీసుల ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.