Wednesday, 15 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

⚠️ అత్యవసర ప్రజా ప్రకటన ⚠️

⚠️ అత్యవసర ప్రజా ప్రకటన ⚠️ (మోన్తా తుఫాన్ కారణంగా జారీ చేయబడినది) 📢 వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, సముద్రం తీవ్రంగా ఉధృతంగా మారే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజల ప్రాణ భద్రత నిమిత్తం ఈ క్రింది ఆదేశాలు జారీ చేయబడుతున్నాయి 👇 1️⃣ 26 తేది నుంచి 28 తేదీ వరకు ముత్యాలమ్మపాలెం మరియు తిక్కవానిపాలెం బీచ్ ప్రాంతాలకు అనుమతి పూర్తిగా నిషేధం. 👉 ప్రజలు సముద్రతీర ప్రాంతాలకు వెళ్ళకూడదు. 👉 పోలీసులు, రెవెన్యూ మరియు స్థానిక అధికారులు అక్కడ నిరంతరం గస్తీ నిర్వహిస్తారు. 2️⃣ రేపటి నుండి బీచ్‌లు పూర్తిగా మూసివేయబడతాయి. 👉 మరిన్ని ఆదేశాలు వచ్చే వరకు బీచ్ ప్రాంతాలకు ఎవరూ వెళ్లకూడదు. 3️⃣ చేపల వేట పూర్తిగా నిలిపివేయబడతాయి. ⚠️ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను తప్పక పాటించండి. ప్రజల భద్రతకే ఇది చేపడుతున్న తాత్కాలిక చర్య.

కాకినాడ

ఘనంగా కామ్రేడ్ వంకా వర్ధంతి

రమణయ్యపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, కామ్రేడ్ వంకా సత్యనారాయణ ఏడో వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ వంకా పెద్ద మనుమడు డా అడ్డాల, జానకి రమ, సత్య సాహితీ చే మహిళలకు దుప్పట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ కమ్యూనిజం భావజాలంతో మన భారతదేశంలో తొలిగా ఏర్పడ్డ రాజకీయ పార్టీ భారతీయ కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. మహిళలకు సామాజిక సమానత్వం, భూసంస్కరణలు, అట్టడుగు కులాలకు సామాజిక న్యాయం అనే అంశాలపై పోరాడిన కమ్యూనిస్టు పార్టీలో పెనుగొండ శాసనసభ్యుడిగా మూడుసార్లు పనిచేసిన వంకా సత్యనారాయణ తన 19వ ఏట పార్టీలో చేరారన్నారు.93వ ఏట కాలం చేశారన్నారు. కమ్యూనిస్టు పార్టీలో చేరిన నాటి నుండి తుది శ్వాస విడిచే వరకు పార్టీ అభ్యున్నతికి విశేష కృషి చేశారన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన కృషి చేశారన్నారు.ఆయన చూపిన బాట లొ పయనిస్తూ ఆయన మనుమడు డా అడ్డాల సత్యనారాయణ నిరంతరం ప్రజా సేవలో ఉండటం అభినంద నీయమని అన్నారు. ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ “వంక సత్యనారాయణ పెద్ద మనవడునైన తాను ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానన్నారు.అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, అడబాల రత్న ప్రసాద్, బుద్ధరాజు సత్యనారాయణ రాజు,ఎస్.శ్రీ నగేష్, మంచెం సుబ్రహ్మణ్యేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

మొంథా తుపాను పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి*

*మొంథా తుపాను పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి* * తుపాన్ కాకినాడ పరిసరాల్లో తీరం తాకే అవకాశం ఉంది * ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తూ అప్రమత్తం చేయండి * ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు రైతులకి ముందస్తు సమాచారం ఇవ్వండి * తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ తో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాకినాడ జిల్లాలో సముద్ర తీరం ఉన్న తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ నియోజక వర్గాలతోపాటు తాళ్ళరేవు మండలంపైనా తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తుపానుపై ప్రజలను అప్రమత్తం చేయండి. జిల్లావ్యాప్తంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోండి. తుపాను షెల్టర్లలో ఆహారం, ఔషధాలు, పాలు లాంటివన్నీ సమకూర్చి ఉంచండి. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా అన్ని విభాగాలను సిద్ధం చేయాలని సూచించారు. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పోలీస్, అగ్నిమాపక శాఖలతోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఉప్పాడ సమీపంలో తీరం కోతకు గురయ్యే ప్రాంతంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మత్స్యకారులను అప్రమత్తం చేయండి” అని స్పష్టం చేశారు. ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఆరా తీశారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేరువగా నీటి నిల్వలు పెరుగుతున్నాయని, నీటిని వదిలేటప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ తెలిపారు. వరద ముంపు పరిస్థితి వస్తే నీటిపారుదల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని, పిఠాపురం, పెద్దాపురం నియోజక వర్గాల రైతులు, ప్రజలకి సమాచారం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. మొంథా తుపాను ప్రభావం కాకినాడ జిల్లాపై ఉంటుందని తెలిసిన క్రమంలో కాకినాడ వెళ్ళేందుకు ఉప ముఖ్యమంత్రివర్యులు సిద్ధంకాగా, ఈ పరిస్థితుల్లో వద్దని సహాయక చర్యల సన్నద్ధతలో యంత్రాంగం నిమగ్నమై ఉంటుందని, ఇప్పుడు జిల్లా పర్యటన వద్దని జిల్లా కలెక్టర్ సున్నితంగా సూచించారు….

విశాఖపట్నం

భారీ వర్షాలు పొంచి ఉన్నాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

భారీ వర్షాలు పొంచి ఉన్నాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. * సహాయక చర్యలకు జీవీఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. విశాఖపట్నం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావం రాబోయే కొన్ని రోజుల్లో విశాఖపట్నం తీరప్రాంతాలను తాకే అవకాశం ఉన్నందున, నగరంలో భారీ వర్షాలు పొంచి ఉన్నకారణంగా నగర పౌరులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సహాయక చర్యలు దిశగా జీవీఎంసీలో 24 గంటలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదని గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. భారీ వర్షాలు పొంచి ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా కొండవాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం 24 గంటల కంట్రోల్ రూమ్ ను ఏర్పాటుచేసి మూడు షిఫ్టులలో 25వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు సహాయక చర్యలకు ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేసి అందుబాటులో ఉంచామన్నారు. అలాగే అన్ని జోనల్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్ లను, సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. కావున విశాఖ నగరంలో గల కొండవాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం, గాలివాన సమయంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు, ప్రకటనల బోర్డులు క్రింద, శిధిలావస్థలోనున్న పాత భవనాలలో ప్రజలు ఉండరాదన్నారు. వర్షాలు సమయంలో ఎటువంటి ప్రమాదాలు నగర పరిధిలో జరిగినట్లయితే ప్రజలు కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 0891-2507225 లేదా జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్ టోల్ ఫ్రీ 1800-425-0009 నంబర్ కు సమాచారం అందించాలన్నారు. అత్యవసర సేవలకు సంబంధించి జీవీఎంసీ కంట్రోల్ రూమ్ 24 గంటలూ సిద్ధంగా ఉంటుందన్నారు. కావున ప్రజలు, వ్యాపారస్తులు కాలువలలో వ్యర్ధాలు పార వేయకుండా వర్షపు నీరు సునాయాసంగా పారేలా చూసుకోవాలన్నారు. అనధికారిక ప్రకటనలు, సామాజిక మాధ్యమాలలో వచ్చే తప్పుడు సమాచారం నమ్మకుండా అధికారిక ప్రకటనలనే విశ్వసించాలన్నారు. “పౌరుల భద్రతే ప్రాధాన్యంగా వర్షాలు తీవ్రతను బట్టి రక్షణ చర్యలను మరింత బలోపేతం చేస్తామని కమిషనర్ తెలిపారు.

విశాఖపట్నం

దూసుకువస్తున్న మంతా తుఫాన్* *ఆంధ్రప్రదేశ్ కి తప్పని ముప్పు*

*దూసుకువస్తున్న మంతా తుఫాన్* *ఆంధ్రప్రదేశ్ కి తప్పని ముప్పు* *ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఏదో ఒకచోట తీరం దాటే అవకాశం* *ఆంధ్రప్రదేశ్ కి రెడ్ అలెర్ట్* *అక్టోబర్ 26,27,28,29, తేదీల్లో చాలా కీలకమైన రోజులు* *28 అర్ధరాత్రి, లేదా 29 తెల్లవారుజామున సమయం లో ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటనున్న మంతా* *ఈ సంవత్సరం వచ్చే అన్ని తుఫానులలో బలమైన తుఫాన్ ఇదే* *విశాఖపట్నం-తిరుపతి వరకు దీన్ని ప్రభావం,తీవ్రమైన వర్షాలు తెలంగాణ, హైదరాబాద్ భారీ వర్షాలు.* *సముద్రం కోస్తాబాగాల్లో ఉన్నట్లు వంటి మత్యకారులను అప్రమత్తం చేయాలి ఎవ్వరు కూడా సముద్రవేటకి వెళ్ళారాదు* *దిగువున వున్నా లోతట్టు ప్రాంత లంక ప్రజలను అప్రమత్తం చేయాలి.కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి* *బలమైన గాలులు గంటకు 70-100 కిలోమీటర్లు* *ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న స్కూల్స్, కాలేజీ, 28,29 తేదీల్లో సెలవు ప్రకటించవలసిందిగా వాతావరణ శాఖ అధికారులు సూచన* *దూర ప్రయాణ చేసేవాళ్ళు చెప్పిన డేట్స్ లో ప్రయాణాలు ఆపుకోవాలి* *మధ్య కోస్తాఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం, దివిసీమ అన్ని బాగాల్లో, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తీవ్రమైన వర్షాలు

విశాఖపట్నం

ఇంటర్ డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్*

*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ , ZPH స్కూల్ గ్రౌండ్ , గోపాలపట్నం* లో *(SGF)స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆంద్రప్రదేశ్* వారి ఆధ్వర్యంలో జరుగు *ఇంటర్ డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్* ను *13 జిల్లాల నుంచి అండర్ 14,17, 19 విభాగాలు బాల బాలికల క్రీడాకారులు పాల్గొన్నారు*, ఈ కార్యక్రమాన్ని *ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులు నుండి గౌరవ వందనం స్వీకరించి , క్రీడా పోటీలను ప్రారంభించిన* ప్రభుత్వ విప్ *గణబాబు* ఈ సందర్భంగా *గణబాబు* మాట్లాడుతూ *క్రీడాకారులు క్రీడాలో రాణించి* *జాతీయస్థాయిలో ప్రతిభ కనబరుస్తూ ప్రాంతానికి , రాష్ట్రానికి పేరుప్రత్యేకతలు తీసుకురావాలని తెలియజేశారు*. ఈ కార్యక్రమంలో *DEO ప్రేమ్ కుమార్ dy DEO గారు APTTA వైస్ ప్రెసిడెంట్ aptta ys president DR DVSY శర్మ గారు , SGF)స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆంద్రప్రదేశ్ సభ్యులు , స్కూల్ HM , సిబ్బంది , 13 జిల్లాల క్రీడాకారులు మొదలగున్నవారు పాల్గొన్నారు*.

విశాఖపట్నం

మొంథా’ తుఫాన్ సమీపిస్తోంది… అందరూ అప్రమత్తంగా ఉండాలి

విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి ‘మొంథా’ తుఫాన్ సమీపిస్తోంది… అందరూ అప్రమత్తంగా ఉండాలి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, తీరప్రాంత ప్రజలు అధికారులు ఇచ్చే సూచనలను కచ్చితంగా పాటించాలన్నారు – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు. అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మార్గదర్శకాలను అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు పిలుపునిచ్చారు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో నిరంతరం అందుబాటులో ఉండి, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు పిలుపునిచ్చారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామ వద్ద ఆర్టీసీ బస్సులో పొగలు.. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది

విజయవాడ నుంచి కోదాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు నందిగామ హైవే సమీపంలో శనివారం సాయంత్రం ఆగిపోయింది. బస్సు ఇంజిన్‌లో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికు ల్లో భయాందోళన నెలకొంది. ఈ విషయం గమనించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును రహదారి పక్కన నిలిపి, అందులో ఉన్న 15 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. అనంతరం ఆ ప్రయాణికులను మరో బస్సులో కోదాడకు తరలించారు. ఇంజిన్‌లో ఆయిల్ లీక్ అవ్వడం వల్ల పొగలు వ్యాపించాయని డ్రైవర్ తెలిపారు. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్ చాకచక్యం తో పెద్ద ప్రమాదం తప్పింది.

E-పేపర్

ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు అండగా చంద్రన్న ఫౌండేషన్

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9133469506 ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు అండగా చంద్రన్న ఫౌండేషన్* …. *ఖానాపూర్ గ్రామ పెద్దలకు, యువకులకు నమస్కారం*….. *చంద్రన్న ఫౌండేషన్ ఆద్వర్యం లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సిమెంట్ బ్యాగుల పంపిణీ* … సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు మన గ్రామ బస్ స్టాపు దగ్గరికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు వస్తున్నారు … డొంకని చంద్రన్న సేవా ఫౌండేషన్ ఆద్వర్యం లో మన ఖానాపూర్ గ్రామ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఒక్కోక్కరికి 20 సిమెంట్ బ్యాగులను పంపిణీ చేస్తున్నందుకు చంద్రన్న వారసులుగా మేము సంతోషిస్తున్నామని . మన గ్రామానికి సోమవారం రోజున ఉదయం 10 : 30 నిమిషాలకు బస్ స్టాపు ( చిల్ల) దగ్గర కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రానున్నారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా చేయడం ఎంతో సంతోషమని . కావునా ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, యువకులు, ప్రతి ఒక్కరు పేరు పేరున మన గ్రామ బస్ స్టాపు (చిల్ల) దగ్గర కు రావాల్సింది గా కోరుకుంటున్నాను . ఫౌండేషన్ ద్వారా మరికొద్ది రోజుల్లో వాటర్ ఫిల్టర్ కు కూడా భూమి పూజా కార్యక్రమం జరుగుతుంది . ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా నాన్న గారి కోరిక మేరకు సేవా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎవరు అన్యతగా భావించొద్దు … ఇట్లు …. డొంకని చంద్రన్న సేవా ఫౌండేషన్ ఛైర్మెన్ గోపి గౌడ్ , శ్రీనివాస్ గౌడ్

విశాఖపట్నం

ఘనంగా గ్యార్మీ షరీఫ్ వేడుకలు.

ఘనంగా గ్యార్మీ షరీఫ్ వేడుకలు. *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* …ఆంధ్రాయూనివర్సిటీ ఔట్ గేట్ సమీపంలో సందాని ఇస్లామిక్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాజరత్ మహబూబ్ సుభాని, గౌస్ పాక్ వారి గ్యార్మీ షరీఫ్ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ మేరకు మధ్యాహ్నం అసర్ నమాజ్ అనంతరం ఖురాన్ ఖాని, సాయంత్రం సమీప పరిసర ప్రాంతాల్లో గౌస్ పాక్ వారి సందల్ సందాని ఇస్లామిక్ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు జరిగింది. నరై తక్బీర్ అల్లాహు అక్బర్, గౌస్ క దామాన్ నహి చోడేంగే అంటూ గౌస్ అజం వారిని ప్రశంసిస్తూ వారి భక్తిని చాటుకున్నారు. అనంతరం రాత్రి గౌస్ పాక్ నిషాని వద్ద సలాతు సలాం, ఫాతేహ, సర్కార్ గౌస్ పాక్ వారి జెండా ఆవిష్కరణ జరిగింది. పెద్ద ఎత్తున (తబ్ రుఖ్), ప్రసాద వితరణ, ఆమ్ దావత్ జరిగింది. నగర పరిసర ప్రాంతంల నుండి పెద్ద ఎత్తున ముస్లిం లు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.