Saturday, 7 March 2026

Blog

తిరుపతి

శివయ్యకు శ్రీనివాసుని పట్టువస్త్రాలు సమర్పణ

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 17: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పర్వదినం సందర్భంగా, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్లకు మంగళవారం నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి విచ్చేసి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలసి శ్రీ స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. మహాశివరాత్రి వేళ తిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో కూడిన ఈ పట్టువస్త్రాల సమర్పణ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూర్చిందని ఆ ఆదిదంపతుల కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నానాని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ఆలయ పాలక మండలి చైర్మన్, సభ్యులు, కూటమి నాయకులు పాల్గొని స్వామివార్లను సేవించుకున్నారు.

తిరుపతి

ప్రకృతి వ్యవసాయంతో ఆహారా విషతుల్యతను అరికడదాం.. మాజీ ఏమ్మెల్యే యస్.స్సీ.వి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 17: శ్రీకాళహస్తిలో భూ అమృత్ రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఏఎస్ అధికారి ఏపీఎస్ సిడిఎల్ చైర్మన్ అండ్ డైరెక్టర్ శివశంకర్, రాష్ట్ర అటవీ శాఖ సలహాదారు అంకారావు, మాజీ శాసనసభ్యులు ఎస్ సీ వి నాయుడు హాజరయ్యారు. గ్రామీణ శాస్త్రవేత్తలు చంద్రశేఖర్ నాయుడు, హరిబాబు నాయుడు బృందం ఆధ్వర్యంలో భూ పరిరక్షణ, ప్రకృతి వ్యవసాయం, ఔషధ మొక్కల పై అవగాహన సమావేశం జరిపారు. ఈ సందర్బంగా ఎస్ సి వి నాయుడు మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని ప్రకృతి సంపద ఏ ఒక్కరి సొంతం కాదనేది పరమేశ్వరుడు తెలియజేశారని వివరించారు. ప్రకృతి వ్యవసాయంతో విషతుల్యం కానీ ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవాలని బావి తరాలకు ప్రకృతి సంపదలు అందించాలన్నారు. అనంతరం రాష్ట్ర అటవీశాఖ సలహాదారు అంకారావు మాట్లాడుతూ….రాష్ట్ర ప్రభుత్వం మహోన్నత లక్ష్యంతో చేపట్టిన గ్రీన్ ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రకృతిలో వివిధ రకాల మొక్కల ఆవశ్యకత, వాటిలో ఉన్న ఔషధ గుణాలను వివరించారు. ప్రతి ఇంటిలో లోపల తులసి వెలుపల వేపచెట్టు ఉండాలని, ఊరిలో రావి చెట్టు, ఊరి వెలుపల మరి చెట్టు ఉండాలన్నారు. పంచభూతాలను కలుషితం చేస్తే సమాజం నష్టపోతుందని, ప్రకృతిని కాపాడుకుంటూ మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకుంటూ సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నారు. కలుపు మొక్క వయ్యారి బొమ్మ ఎలా నివారించాలో వివరించారు. గ్రామీణ పరిశోధకులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఐఏఎస్ అధికారి తిరుపతి ఏపీఎస్ డిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ.. సుస్థిర అభివృద్ధి అంటే ప్రకృతి సంపద భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని సంపదంటే ఆరోగ్యమేని ఆ ఆరోగ్యం కాపాడుకోవాలంటే కలుషితం లేని ఆహారం కావాలంటే భూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ప్రకృతి వ్యవసాయాన్ని చేసేలా రైతుల లో మార్పు కోసం ప్రయత్నించాలన్నారు. గ్రామీణ శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేయాలని అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొని ప్రకృతి వ్యవసాయంపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను గ్రామీణ శాస్త్రవేత్తల బృందం, ఎస్ సి వి దిలీప్, స్థానిక రైతు నాయకులు ఘనంగా సత్కరించారు.

తిరుపతి

ముక్కంటికి కాణిపాకం వినాయకుని ‘పట్టు’ కానుక

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 17: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం నాడు చిత్తూరు జిల్లాలోని ప్రముఖ క్షేత్రం, స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి కాణిపాకం దేవస్థానం తరఫున శ్రీకాళహస్తీశ్వరునికి, జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మంగళవారం నాడు కాణిపాకం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె. పెంచల కిషోర్, ఆలయ అర్చకులతో కలసి పట్టు వస్త్రాలను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు. వారికి శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఈ పట్టు వస్త్రాలను స్వామి, అమ్మవార్లకు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో కాణిపాకం నుండి పట్టు వస్త్రాలు సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు విశేష వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ దివ్య వేడుకను వీక్షించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మహాశివరాత్రి పర్వదినం ముగిసినా, బ్రహ్మోత్సవాల సంబరాలు శ్రీకాళహస్తి మాడ వీధుల్లో ఇంకా మిన్నంటుతున్నాయి. విద్యుత్ దీపాల అలంకరణలు, పుష్పవనాలుగా మారిన ఆలయ ప్రాంగణాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతున్నాయి.

తిరుపతి

జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 17: శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవ రోజున సన్నిధి వీధి శివయ్య గోపురం దగ్గర గల రామ మందిర ప్రాంగణం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జంగమ కుల కమిటీ సభ్యులు మరియు జంగమ కులస్తులు గత 10 సంవత్సరములుగా పాల్గొని ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతున్నదని వారు తెలిపారు.

తిరుపతి

శ్రీ కాళహస్తిలో వాహన సేవల వైభవం- నందిపై ముక్కంటి, కామధేనువుపై జ్ఞానప్రసూనాంబ భక్తులకు దర్శనం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 17: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నాడు ఉదయం స్వామివారు తన ప్రియ వాహనమైన అధికార నంది పై, అమ్మవారు కామధేను వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ శ్రీ స్వామి, అమ్మవార్లు ఆలయం నుండి బయటకు వచ్చి నాలుగు మాడ వీధులలో ఊరేగారు. వెండి అధికార నంది వాహనంపై కొలువుదీరిన పరమశివుని శోభను చూసి భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అదేవిధంగా, సకల కోరికలు తీర్చే కామధేను వాహనంపై జ్ఞానప్రసూనాంబికా దేవి రాజసంగా దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పట్టణమంతా శివనామస్మరణతో మారుమోగుతోంది. వాహన సేవలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. దారిపొడవునా భక్తులు కర్పూర నీరాజనాలు అర్పించి, స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. దేవస్థానం అధికారులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

తిరుపతి

రెవెన్యూ సమరం-తొట్టంబేడులో నిరసన గళం

తొట్టంబేడు, పున్నమి న్యూస్, ఫిబ్రవరి 17: తొట్టంబేడు మండల రెవెన్యూ యంత్రాంగం నిరసన బాట పట్టింది. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ (Revenue JAC) రాష్ట్రవ్యాప్త పిలుపుతో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల ఉప తహసీల్దారు, మండల సర్వేయర్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్సాహంగా సాగింది. మండల పరిధిలోని గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సచివాలయ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ సహాయకులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. వారి ప్రధాన డిమాండ్లు: పనిభారం తగ్గించాలి: రెవెన్యూ శాఖపై ఉన్న విపరీతమైన పని ఒత్తిడిని తగ్గించి, సిబ్బంది కొరతను తీర్చాలి. ఆర్థిక బకాయిల విడుదల- దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ లు, జీతాల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగ భద్రత- క్షేత్రస్థాయి ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించడంతో పాటు, అర్హులైన వారికి పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయడం. ఈ సందర్భంగా కార్యాచరణ కమిటీ నాయకులు మాట్లాడుతూ…. రాత్రింబవళ్లు ప్రజల సేవలో తరిస్తున్న రెవెన్యూ సిబ్బంది సమస్యలను ప్రభుత్వం విస్మరించడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. జె.ఎ.సి (JAC) పిలుపు మేరకు తమ పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల రెవెన్యూ సిబ్బంది పాల్గొని సంఘీభావం తెలిపారు.

తిరుపతి

నారద పుష్కరిణిలో జలక్రీడలాడిన ఆదిదంపతులు-కన్నులపండువగా తెప్పోత్సవం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 17: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రంగురంగుల విద్యుత్ దీపాలతో, సుమమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై ఆదిదంపతులు కొలువుదీరి భక్తులకు కనువిందు చేశారు. జలక్రీడల మహోత్సవంలో భాగంగా స్వామి, అమ్మవార్లు తెప్పపై విహరిస్తుండగా, భక్తులు భక్తిపారవశ్యంతో శివనామ స్మరణ చేశారు. విద్యుత్ కాంతుల నడుమ జలాలపై స్వామివారి ఊరేగింపు అపురూప ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చింది. ఈ వేడుకను వీక్షించేందుకు నారద పుష్కరిణిలో భక్తులు పోటెత్తారు. తెప్పోత్సవానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. క్యూలైన్లు, రక్షణ చర్యలు మరియు తాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ దంపతులు, పాలక మండలి సబ్యులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

నారాయణపేట

కున్సి గ్రామంలో ఘనంగా మాజీ ముఖ్యమంతి kcr జన్మదిన వేడుకలు

కృష్ణ మండలంలోని కున్సి గ్రామం లో BRS పార్టీ అధినేత తెలంగాణ ఉద్యమ నాయకుడు తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు , అనంతరం కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు, నూరేళ్లు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు, అనంతరం రాబోయే రోజుల్లో తెలంగాణకు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ మ్యాకలి సురేష్, శరన్ గౌడ డి రామచంద్ర మాస్టర్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ యూత్ లీడర్ యం భీమ్, వెంకట్ రెడ్డి సిద్ధం మారుతి కీరలింగప్ప మాస్టర్, శరణప్ప బీరప్ప నాగప్ప పరమేష్ రాజు శివప్ప బసప్ప తదితరులు పార్టీ ముఖ్య నాయకులు అందరూ పాల్గొ ని ఘనంగా వహించారు.

పల్నాడు

అదుపుతప్పి కాలువలో పడ్డ బైక్.. బాలిక మృతి*

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మిట్ట గూడుపాడు జాతీయ రహదారి వద్ద సోమవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి కాలువలో పడటంతో 13 ఏళ్ల బాలిక మూన్సీ అక్కడికక్కడే మృతి చెందింది. గురజాల మండలం సమాధానంపేటకు చెందిన భోజావత్ శ్రీను నాయక్ తన కుమార్తెను కస్తూరి పాఠశాలకు తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బైక్ ఆమె మీద పడటంతో మరణించింది. ఈ ప్రమాదంలో శ్రీను నాయక్ గాయాలపాలయ్యాడు.

పల్నాడు

హోంగార్డుని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

*పల్నాడు జిల్లా..* *కోటప్పకొండలో మద్యం అమ్మిన హోంగార్డు కోటిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు..* *మద్యం దుకాణం ఏర్పాటు చేసి విక్రయించడంలో మరో కానిస్టేబుల్ ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం..* *కోటప్పకొండలో మద్యం అమ్మకాలు చేపట్టినవారిలో ఎంతమంది పోలీసులు ప్రమేయం ఉందొ అనే కోణంలో విచారిస్తున్న ఉన్నతాధికారులు..*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.