Tuesday, 5 May 2026

Blog

విశాఖపట్నం

మెగా డీఎస్సీ 2025 లో 52 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు*

*ఏయూ తెలుగు విభాగం ఆల్ టైం రికార్డ్* ,*మెగా డీఎస్సీ 2025 లో 52 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు* *నూతన టీచర్లకు ఆచార్య *జెర్రా అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం* *విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి* ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు విభాగం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ 2025లో ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 52 మంది ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు దక్కించుకున్నారు.. శనివారం ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా తాజాగా కొలువులు పొందిన 52 మందిని తెలుగు విభాగం శాఖ అధ్యక్షులు ఆచార్య జెర్రా అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎ నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ 100 ఏళ్ల పండుగ జరుపుకుంటున్న ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న వారంతా ఎంతో ధన్యజీవులు అన్నారు.. యూనివర్సిటీ ప్రారంభించేటప్పుడు తొలుత ఆర్ట్స్ గ్రూపులతోనే ప్రారంభించారన్నారు.. ఆ తర్వాత దశల వారీగా ఏయుని ఎంతోమంది అభివృద్ధి చేశారన్నారు.. నేడు ప్రపంచంలోనే ఆంధ్ర విశ్వ కళాపరిషత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచిందన్నారు.. సభకు అధ్యక్షత వహించిన తెలుగు శాఖ అధ్యక్షులు.. కార్యక్రమం నిర్వాహకులు ఆచార్య జెర్రా అప్పారావు మాట్లాడుతూ ఎంతో మందిని ఈ సమాజానికి అందించిన ఘనత ఏయూకే దక్కుతుందన్నారు.. తన హయాంలో ఏకకాలంలో ఒకే డీఎస్సీలో 52 మంది టీచర్ ఉద్యోగాలు సాధించడం తనకు చిరస్థాయిగా మధురానుభూతిని మిగిలిస్తుందన్నారు.. నూతనంగా కొలువులు పొందిన టీచర్లు అందర్నీ తాను సత్కరించడంతో పాటు భవిష్యత్ తరాలకు మార్గదర్శకత్వం చేయాలని సూచించానన్నారు… ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని అంతకు మించిన గౌరవం లభించేది అన్నారు కాబట్టి ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరు సమాజానికి ఉపయోగపడే రీతిలో విద్యార్థులను తీర్చిదిద్దాలని అప్పారావు కోరారు….. గౌరవ ఆచార్యులు పర్వతనేని సుబ్బారావు.. బహు గ్రంథకర్త.. లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు గ్రహీత.. గౌరవాచార్యులు వెలమల సిమ్మన్న.. బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ సత్యనారాయణ లు మాట్లాడుతూ తెలుగు విభాగానికి వెలుగులు నింపిన ఘనత ఆచార్య అప్పారావు కే దక్కుతుందన్నారు.. దేశానికి ఎంతోమంది ప్రముఖులు అందించిన ఘనత ఏయు చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు.. ఈ కార్యక్రమంలో పద్మాలయ యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ ఆచార్య మధుజ్యోతి. .. ఏయ్ సీనియర్ ఆచార్యులు గజ్జ యోహాను బాబు.. అంబేద్కర్ యూనివర్సిటీ అధ్యాపకురాలు అన్నం రెడ్డి ఈశ్వరమ్మ..మరో అధ్యాపకురాలు ప్రవీణ.. పలువురు పరిశోధక విద్యార్థులు.. పూర్వ విద్యార్థులు పాల్గొని సందడి చేశారు.. ఏయూ పరిశోధక విద్యార్థి జాతీయ జర్నలిస్టులు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు

విశాఖపట్నం

వైసీపీ దక్షణ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్* మత్స్య కారులకు సహాయం

*చెరలో ఉన్న మత్స్యకారులపై కూటమి నిర్లక్ష్యం*.. *తొమ్మిది కుటుంబాలకు అండగనిలిచిన వాసుపల్లి* *బాధిత కుటుంబాలకి రూ. 45,000 లు, రైస్ బ్యాగ్లు అందజేత* *చెర నుండి విడుదలయ్యే వరకు అండగా ఉంటాం*! *వైసీపీ దక్షణ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్* *విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి * బంగ్లాదేశ్ లో చిక్కుకుపోయిన నెల్లిమర్ల కు చెందిన 9 మంది మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ.5లక్షలు నష్టపరిహారం ఇచ్చి దైర్యం, భరోసా కల్పించాలని మాజీ ఎమ్మెల్యే, దక్షణ వైసీపీ సమన్వయ కర్త వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఆశీలమెట్ట కార్యాలయంలో 9 మత్స్యకార బాధిత కుటుంబాలకు వాసుపల్లి గణేష్ కుమార్ సొంత నిధులతో ఒక్కో కుటుంబానికి రూ.5000లు చొప్పున రూ.45,000లు అందించడంతో పాటు 25 కేజీల రైస్ బ్యాగ్ ను ఇచ్చి దాతృత్వం చాటుకున్నారు. సాధక బాధలు తెలిసిన తోటి మత్స్యకారుడిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్ననన్నారు. మిత్ర దేశంలో బందీగా ఉన్నవారిని విడిపించడానికి చంద్రబాబుకి మా మత్స్యకారులంటే నిర్లక్ష్యమా? చేతకాని తనమా? అని వాసుపల్లి సూటిగా ప్రశ్నించారు. వైసీపీ హయంలో శత్రుదేశంలో బంధిగా ఉన్న 20మంది మత్స్యకారులను పాకిస్తాను చెర నుండి విడిపించి ఫ్లైట్ లో తీసుకుని వచ్చి.. తీసుకువచ్చి ఒక్కో కుటుంబానికి రూ.5లక్షలు తక్షణ సాయం అందించిన మత్స్యకార పక్షపాతి జగన్ మోహన్ రెడ్డి అని వాసుపల్లి గుర్తుచేశారు. కనీసం నెల్లిమర్ల జనసేన ఎంఎల్ఏ నిస్సిగ్గుగా మాటాడటం సరికాదన్నారు. జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అసలు మత్స్యకారులు ఇంత కష్టంలో ఉంటే కనీసం నోరుమెదపక పోవడం సిగ్గుచేటు అన్నారు. కూటమి లో ఉన్న భాగస్వామ్యం గా ఉన్న బీజేపీ కేంద్ర మంత్రికి చంద్రబాబు ఒక ఫోన్ చేస్తే సమస్య కదిలిఉండేది. కనీసం వారిపై కదలిక లేకపోవడం చంద్రబాబు మత్స్యకారులపై చిన్న చూపుకి నిదర్శనం అన్నారు. 950 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉన్న మనకీ ఎందుకింత దౌర్భాగ్యమన్నారు. బోర్డర్ దాటకుండా అలెర్ట్ చేసే అడ్వాన్స్ టెక్నాలజీ మనదేశంలోని మాత్రమే లేకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైన మత్స్యకారులకు మౌలిక వసతులతో పాటు ఇటువంటివి పునరావృతం కాకుండా కేంద్రం వారికి అండగా నిలవాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ద్వారా 9మంది మత్స్యకార కుటుంబాలకి న్యాయం జరిగేలా వైసీపీ అండగా ఉంటుందని వాసుపల్లి స్పష్టం చేశారు. చెర నుండి విడుధలయ్యే వరకు వారికి రేషన్ కూడా అందిస్తాననని వాసుపల్లి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏరినమ్మ గుడి చైర్మన్ లండ రమణ, జిల్లా జనరల్ సెక్రటరీ గంగళ్ల రామరాజు, జిల్లా సెక్రటరీ బొడ్డు ఆనంద్, బర్రి కొండలరావు, 37 వార్డ్ ప్రెసిడెంట్ ఆకుల యెషు, జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ గుంటూ ఆనంద్, చోడిపిళ్లి శివ, వాసుపల్లి ధనరాజు, జిల్లా వాలంటరీ విభాగం వైస్ ప్రెసిడెంట్ దూడ అప్పారావు, జిల్లా బీసీ సెల్ సెక్రటరీ దూడ తాతారావు, చేపల నూకరాజు(బుడ్డి ),వేణు, కంటుముచ్చు సాగర్,చేపల ప్రసాద్,చేపల సతీష్,30 వ వార్డ్ మహిళా ప్రెసిడెంట్ సూరని రాము,దూడ అప్పలరాజు, 38 వ వార్డ్ ప్రెసిడెంట్ గురజాపు రవి,39వ వార్డ్ ప్రెసిడెంట్ ముజీబ్ ఖాన్,స్టేట్ మేధావుల విభాగం సెక్రెటరీ ఈతలపాక విజయ్, చేపల రాజు,సారిపిల్లి అరుణ,చింతకాయల వాసు జిల్లా సౌత్ మత్స్యకారులు నాయకులు పాల్గొన్నారు

విశాఖపట్నం

సిఐటియు అఖిలభారత మహాసభలు విజయవంతం చేయండి*

*సిఐటియు అఖిలభారత మహాసభలు విజయవంతం చేయండి* *సిఐటియు బీచ్ వాక్* *విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి * సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) అఖిలభారత మహాసభలు 2025 డిసెంబరు 31 నుండి 2026 జనవరి 4 వరకు విశాఖలో జరుగుతున్న 18వ అఖిలభారత మహాసభలు విజయవంతం చేయాలని విశాఖ జిల్లా సిఐటియు పూర్వ కార్యదర్శి ఎ.అజశర్మ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 6.30 గంటలకు రామకృష్ణబీచ్ ఖాళీమాతా టెంపుల నుండి వైఎంసిఎ వరకు బీచ్వాక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు.. ఈ బీచ్వాక్ నుద్దేశించి అజశర్మ పాల్గొని మాట్లాడుతూ ఐక్యత పోరాటం నినాదంతో ఏర్పడిన సిఐటియు దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులను, కార్మిక సంఘాలను ఐక్యం చేసి పోరాటాలు చేపట్టిందన్నారు. దేశంలో కార్మికవర్గ సమస్యలపై నిఖరంగా పోరాడి అనేక విజయాలు సాధించి భారతదేశంలోనే అతిపెద్ద సంఘంగా ఏర్పడిందన్నారు. సిబటియు ఏర్పడి 55 ఏళ్ళ తరువాత ఆంధ్రరాష్ట్రంలో అఖిలభారత మహాసభలు జరుగుతున్నాయన్నారు. విశాఖలో, ఆంధ్రరాష్ట్రంలో కార్మికుల సమస్యలపై ఉద్యమిస్తుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్, డిసిఐ, షిప్యార్డు, బిహెచ్పివి వంటి అనేక ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కట్టబెట్టే ప్రయత్నాలు అడ్డుకున్న ఏకైక సంఘం సిఐటియు అని అన్నారు. అసంఘటితరంగ కార్మికులు, స్కీం వర్కర్లు వంటి సమస్యలపైన, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు నాయకత్వం వహించడమే కాకుండా దేశంలో ఉండే కార్మిక సంఘాలను, మేధావులను, మధ్యతరగతి, ఎన్జిఓ సంఘాలను సైతం ఐక్యవేదికపై తెచ్చి పోరాడుతోందన్నారు. ఎన్నోపోరాటాలు, త్యాగాలు చేసిన సిఐటియు నాయకత్వం విశాఖపట్నానికి రావడం, ఇక్కడ 5రోజులు పాటు మహాసభలు జరపడం విశాఖ కార్మికవర్గానికి ఒకవరం. ఈ మహాసభలను విశాఖ కార్మికవర్గం, ప్రజానీకం సహాయ, సహాకారాలు అందించి విజయవంతం చేయాలని, 2026 జనవరి 4న విశాఖలో వేలాదిమందితో జరిగే ప్రదర్శన, బహిరంగసభలలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ఎం. శ్రీనివాస్, ఆర్.కె.ఎస్.వి.కుమార్, నాయకులు కె.ఎం.కుమార్ మంగళం, ఎం.జగ్గునాయుడు, కె. లోకనాధం, బి.జగన్, జె. అయోధ్యరామ్, పి.వెంకటరావు, ఎం.సుబ్బారావు, అరుణ్, శ్రీనివాస్, కె.చంద్రశేఖర్, బి. వెంకటరావు నమ్మి రమణ, మాధవి, పద్మ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

విద్యాశాఖాధికారి (DEO), అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (APC) సమీక్ష

*విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి* విద్యాశాఖాధికారి (DEO), అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (APC), సమగ్ర శిక్షా విభాగంలోని సెక్టోరియల్ ఆఫీసర్లు, మండల విద్యాశాఖాధికారులు (MEOలు), క్లస్టర్ ప్రధానోపాధ్యాయులతో కలిసి విశాఖపట్నం జిల్లా స్పెషల్ ఆఫీసర్ & KGBV సెక్రటరీ శ్రీ డి. దేవానంద రెడ్డి గారు శనివారం (13-12-2025) వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో Foundational Literacy and Numeracy (FLN) కార్యక్రమంలో భాగంగా అమలవుతున్న 75 రోజుల యాక్షన్ ప్లాన్, 6వ నుండి 9వ తరగతి విద్యార్థుల కోసం సమ్మరీ వీడియోల వినియోగం, అలాగే 10వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుపై సమీక్ష నిర్వహించి, పలు కీలక సూచనలు చేశారు. విశాఖపట్నం జిల్లాలోని 506 ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న 1వ నుండి 5వ తరగతి వరకు 25,170 మంది విద్యార్థులకు FLNపై బేస్‌లైన్ టెస్ట్ నిర్వహించగా, వారి అభ్యాస స్థాయిని ఆధారంగా తీసుకుని విద్యార్థులను Sky, Mountain, Stream అనే మూడు విభాగాలుగా వర్గీకరించినట్లు తెలిపారు. అలాగే జిల్లాలోని ప్రతి మూడు ప్రాథమిక పాఠశాలలకు ఒక అడాప్షన్ ఆఫీసర్‌ను నియమించి, ఆయా అధికారులు ప్రతి 20 రోజులకు ఒకసారి మొత్తం మూడు సార్లు పాఠశాలలను సందర్శించి 75 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు విధానాన్ని పర్యవేక్షించాలని సూచించారు. అదేవిధంగా ప్రతి 20 రోజులకు ఒకసారి మొత్తం మూడు సార్లు 20 మార్కులకు డిక్టేషన్ టెస్ట్ నిర్వహించి, విద్యార్థులందరూ మార్చి 2026లో నిర్వహించనున్న ఎండ్‌లైన్ టెస్ట్‌లో FLN లక్ష్యాలను సాధించే విధంగా సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఇంకా మండల స్థాయిలోని హైస్కూళ్లను MEO–I మరియు MEO–IIలకు విభజించి కేటాయించి, 6వ నుండి 9వ తరగతి విద్యార్థులకు సమ్మరీ వీడియోల ప్రదర్శనను సమర్థవంతంగా అమలు చేసే బాధ్యతను MEOలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలోని 10,520 మంది 10వ తరగతి విద్యార్థుల కోసం అమలులో ఉన్న 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా, ప్రతి రోజు సాయంత్రం పరీక్షలు నిర్వహించి, మరుసటి రోజు మధ్యాహ్నం లోగా మూల్యాంకనం పూర్తి చేసి, విద్యార్థుల మార్కుల వివరాలను తప్పనిసరిగా LEAP యాప్‌లో నమోదు చేసే బాధ్యతను సంబంధిత MEOలు స్వీకరించాలని శ్రీ డి. దేవానంద రెడ్డి గారు ఆదేశించారు.

విశాఖపట్నం

రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు మార్కెటింగ్ కమిటి చైర్మన్లు కృషి చేయాలి…డైరెక్టర్ విజయ సునీత.

రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు మార్కెటింగ్ కమిటి చైర్మన్లు కృషి చేయాలి…డైరెక్టర్ విజయ సునీత. *విశాఖ పట్నం డిసెంబర్ 13పున్నమి ప్రతినిధి * ఆరుగాలం కష్టించి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు మార్కెటింగ్ కమిటీల చైర్మన్లు కృషి చేయాలని ఆ శాఖ డైరెక్టర్ ఎం.విజయ సునీత (ఐఎఎస్) కోరారు. విశాఖపట్నం రీజియన్ పరిధిలోని 9 జిల్లాల మార్కెటింగ్ కమిటీ చైర్మన్లకు ఆమె ఆధ్వర్యంలో నగరంలో శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మార్కెట్ కమిటీల చైర్మన్ల విధి విధానాలను కూలంకుషంగా వివరించారు. రైతులు పండించే పంటలను తక్కువ ధరకు అమ్ము కోకుండా వారికి అందుబాటులో ఉన్న మార్కెట్ కమిటీ గోదాములలో నిలువ చేసుకొని వారికి గిట్టుబాటు ధర వచ్చినపుడు అమ్ముకొనే విదంగా సౌకర్యాలు కల్పించడంలో ఆయా మార్కెట్ కమిటీల చైర్మన్లు కృషి చేయాలన్నారు. మార్కెట్ కమిటీల ప్రయోజనాలు రైతులకు తెలియ చెయ్యాలన్నారు. మార్కెట్ కమిటీ అధికారులు మార్కెట్ ఛైర్మెన్ లు కలిసి రైతులకు ప్రయోజనం చేకూరేలా పనిచేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ పీ.సుధాకర్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ కిరణ్, 4 జిల్లాల జిల్లా వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ సెక్రెటరీలు, మార్కెటింగ్ శాఖ సిబ్బంది, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ ( Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపులు * జీవీఎంసీ పరిధిలో 336 ఆక్రమణల తొలగింపు .

నగరంలో ఆపరేషన్స్ లంగ్స్ ( Operation LUNGS) 2.0 లో ఆక్రమణల తొలగింపులు * జీవీఎంసీ పరిధిలో 336 ఆక్రమణల తొలగింపు . – జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ . ప్రభాకర్ రావు *విశాఖపట్నం డిసెంబర్ 13పున్నమి ప్రతినిధి* మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో అన్ని జోన్ల లో ఆపరేషన్ లంగ్స్ 2.0 లో భాగంగా 336 ఆక్రమణలను తొలగించడం జరిగిందని జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ . ప్రభాకర్ రావు శనివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు సురక్షితంగా ఫుట్ పాతులపై నడక సాగించేందుకు, రోడ్లు, జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా సురక్షిత రవాణా కోసమై జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ (Operation Lungs) 2.0 లో భాగంగా అన్ని జోన్లలో రోడ్లపై జంక్షన్లలో ఆక్రమణలు తొలగించడమైనదని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు. ప్రజా సౌకర్యార్థమై ఆక్రమణల తొలగింపు కొనసాగిస్తూ ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం జరిగినదని, ఇప్పటికే నగరంలో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా రక్షణ చర్యల దిశగా ఆపరేషన్ లంగ్స్ పనిచేస్తుందన్నారు. మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRS కార్యక్రమంలో ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులులో ఎక్కువగా రోడ్లు, పుట్ పాత్ ఆక్రమణలు మరియు రోడ్ల కిరువైపుల వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల రోడ్లకు అండంకు ఏర్పడడం, తరచుగా ప్రజల రాకపోకలకు, వాహనాల రవాణాకు ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని, ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి తక్షణ చర్యలు చేపట్టే ఆవశ్యకత దృష్ట్యా జి.వి.యం.సి లో గల 8 జోన్ల పరిధిలో గల ప్రధాన రహదారులలో, జంక్షన్లలో ఉన్న ఆక్రమణలు గుర్తించి వాటిని వెంటనే పోలీసు వారి సహకారము తో తొలగించడమైనదని సిసిపి తెలిపారు. తొలగించిన ఆక్రమణలను ఈ క్రింద పొందుపరచడమైనది. 1వ జోన్ లోని వార్డు నెంబర్ 1 లో అంబేద్కర్ విగ్రహం నుండి తగరపువలస వైయస్సార్ ఎకరం వరకు 15 ఆక్రమణలు, జోన్ 2 లో 5 , 7 వార్డులలో-మారికవలస జంక్షన్ నుండి బోయపాలెం రోడ్డు వరకు, చంద్రంపాలెం నుండి హైస్కూల్ వరకు 40 ఆక్రమణలు, 3వ జోన్ 18 వార్డు పరిధిలో సమతా కాలేజీ సర్కిల్, ఏఎస్ రాజా కాలేజీ సర్కిల్ 23 ఆక్రమణలు, 4 వ జోన్ 31 వార్డు పరిధిలోని లీలామహల్ జంక్షన్ నుండి సౌత్ జైలు రోడ్డు వరకు 31 ఆక్రమణలు, 5వ జోన్ లో 54, 55, 56 ,57 వార్డుల పరిధిలోని కంచరపాలెం నుండి ఎన్ఏడి జంక్షన్ వరకు 80 ఆక్రమణలు, 6వ జోన్ 65, 66, 71, 72, 75, 76 వార్డుల పరిధిలోని శ్రీనగర్ నుండి దుర్గా నగర్ రోడ్డు, బీసీ రోడ్డు జంక్షన్ నుండి గంగవరం పోర్టు రోడ్డు వరకు 70 ఆక్రమణలను, 7వ జోన్ 82, 83 వార్డుల పరిధిలో నెహ్రూ చౌక్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు 12 ఆక్రమణలు, 8వ జోన్ 97 వార్డు పరిధిలోని సుజాతనగర్ 80 ఫీట్ రోడ్డు నుండి ఎలక్ట్రికల్ ఆఫీస్ వరకు 30 ఆక్రమణలను తొలగించడం జరిగిందని ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా జోన్ల కమిషనర్లు ,సహాయక ప్రణాళిక అధికారులు, ప్రణాళిక విభాగం సిబ్బంది, సచివాలయం సిబ్బంది , పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పెందుర్తి నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక

*విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి* పెందుర్తి నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పెందుర్తి నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కార దిశగా చర్యలు చేపట్టే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ కార్యక్రమం) ఈ రోజు పెందుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం APOILFED చైర్మన్, విశాఖ జిల్లా పార్లమెంటు అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ గండి బాబ్జీ గారి అధ్యక్షతన నిర్వహించబడింది. గ్రీవెన్స్ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై, త్రాగునీరు, రోడ్లు, విద్యుత్, ఉపాధి, పింఛన్లు, భూ సమస్యలు తదితర ప్రజా సమస్యలను గౌరవనీయులు శ్రీ గండి బాబ్జీ గారి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలను సవివరంగా స్వీకరించిన శ్రీ గండి బాబ్జీ గారు, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పంపించి త్వరితగతిన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజలకు అండగా నిలుస్తున్న తెలుగుదేశం పార్టీ కట్టుబాటును ఈ కార్యక్రమం మరోసారి స్పష్టం చేసిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

విశాఖపట్నం

రిటైల్ మరియు వినోద కేంద్రంగా సెలెస్ట్ మాల్

రిటైల్ మరియు వినోద కేంద్రంగా సెలెస్ట్ మాల్ *విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి * పారిశ్రామిక ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందిన గాజువాక ప్రాంతంలో రిటైల్ మరియు వినోద కేంద్రాలకు కేంద్ర బిందువు గా నిలిచినా సెలెస్ట్ ఇప్పుడు మరింత అభివృద్ధి లో మరింత ముందుకు వెళుతోందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సెలస్ట్ మాల్ లో ఫ్యాషన్ వరల్డ్ వస్త్ర షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక శాసన అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలతో సభ్యులు పల్లా శ్రీనివాసరావు భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు లతో పాటు సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, కంకటాల అధినేత మాలిక్ లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో అతిధులు మాట్లాడుతూ అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధిలో దూసుకుపోతున్న సెలెస్ట్ నాలుగు అంతస్తులతో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మాల్ రిటైల్ మరియు వినోద, భోజన,, విద్య కేంద్రాలకు కేంద్ర బిందువుగా మారింది అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీ తో పాటు అన్ని వాణిజ్య, విద్య వ్యాపార జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ లను వినియోగదారులకు ఓకే చోట అందిస్తున్న సెలెస్ట్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినండిస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో సెలెస్ట్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఘనంగా అమ్మవారి రథయాత్ర ★ అంబికా బాగ్ నుంచి ప్రారంభమైన యాత్ర ★ పాల్గొన్న ఎమ్మెల్యే, ఈవో, ఉత్సవ కమిటీ సభ్యులు, ట్రస్టీలు

ఘనంగా అమ్మవారి రథయాత్ర ★ అంబికా బాగ్ నుంచి ప్రారంభమైన యాత్ర ★ పాల్గొన్న ఎమ్మెల్యే, ఈవో, ఉత్సవ కమిటీ సభ్యులు, ట్రస్టీలు *విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి* శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల సందర్భంగా శనివారం సాయంత్రం అంబికా బాగ్ రామాలయం నుంచి అమ్మవారి రథయాత్ర శోభాయమానంగా ప్రారంభమైంది. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఆలయ ఈవో శోభారాణి, ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్ కందుల నాగరాజు ఈ యాత్రను ఘనంగా ప్రారంభించారు. మేళ తాళాలతో, పండితుల వేద మంత్రాలతో వైభవంగా ఈ యాత్ర కొనసాగింది. అంబికా బాగ్ ఆలయం నుంచి జగదాంబ జంక్షన్ మీదుగా అలాగే చౌట్రీ నుంచి పూర్ణ మార్కెట్ దాటుకొని కొత్త రోడ్డు మీదుగా రథయాత్ర అమ్మవారి ఆలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి రథయాత్ర చాలా వైభవంగా జరిగిందని చెప్పారు. మార్గశిర మాసోత్సవాల సందర్భంగా ప్రతి ఏడాది ఈ యాత్ర ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ యాత్రలో ట్రస్టీలు, ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ ఈవో తో పాటు అధికారులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్, ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఈ యాత్రకు అటు ప్రజల నుంచి ఇటు భక్తుల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అమ్మవారి రథయాత్ర శోభాయమానంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈసారి నిర్వహిస్తున్న అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు ఊహించని దానికంటే భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని వెల్లడించారు. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శోభారాణి, ఈఈ రమణ,వి.ఏ నాయుడు ,వెంకటలక్ష్మి, విజయలక్ష్మి, భద్రరావు, రామ్ కుమార్, కేదార్ లక్ష్మి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

పెడన MLA కాగితకృష్ణ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బంటుమిల్లి మండలం పెద్ద తుమ్మిడి గ్రామానికి చెందిన బొల్లా రాము ఇటీవల అనారోగ్యంతో హాస్పటల్లో చికిత్స పొందుతూ మరణించగా,ఆయన హాస్పటల్ ఖర్చు నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన 61,000 విలువ గల చెక్కును ఆయన భార్య అయిన బొల్లా రమాదేవి కి తమ ఇంటి వద్ద అందించిన బంటుమిల్లి టిడిపి పార్టీ అధ్యక్షులు కూనపురెడ్డి వీరబాబు , DC చైర్మన్ బొర్రా కాశీ మరియు పెద్ద తుమ్మిడి గ్రామ పార్టీ అధ్యక్షులు బొల్లా శీను.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.