Tuesday, 5 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అటల్–మోదీ యాత్రను విజయవంతం చేయండి

. బీజేపీ నేత డాక్టర్ ఏలూరి పిలుపు. కాట్రేనికోన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతున్న “అటల్ – మోదీ సుపరిపాలన యాత్ర” ఈ నెల 15వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న బస్సు యాత్ర కార్యక్రమానికి ప్రజలు, ఎన్డీఏ కూటమి(బీజేపీ, టీడీపీ, జనసేన) నేతలు, కార్యకర్తలు, హింధూ బంధువులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పూర్తి చేసుకున్న బస్సు యాత్ర ద్వారా పీవీఎన్ మాధవ్ గారు.. అటల్ మోదీ సుపరిపాలనను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారని తెలిపారు. ఒంగోలులో జరుగనున్న ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలన్నారు. మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజపేయీ గారి సుపరిపాలన దృక్పథాన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందన్నారు. అటల్ – మోదీ ప్రభుత్వాల సంకల్పాలు, ప్రజలకు అందించిన విజయాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని తెలిపారు. అటల్ – మోదీ పాలనలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, గ్రామీణ రోడ్ల నిర్మాణంతో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగయ్యాయని చెప్పారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, భారత్‌మాల, సాగర్‌మాల వంటి పథకాల ద్వారా రవాణా వ్యవస్థ బలోపేతం అయ్యిందన్నారు. అలాగే డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా పరిశ్రమలకు ఊతమిచ్చి, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని వివరించారు. వ్యవసాయ రంగంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం ద్వారా రైతులకు భరోసా కల్పించామని, సామాజిక రంగంలో ఆయుష్మాన్ భారత్, ఉజ్వల, జల జీవన్ మిషన్ వంటి పథకాలతో కోట్లాది మంది పేదల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారని తెలిపారు. దేశ రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇచ్చి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించాయని తెలిపారు. అభివృద్ధి ప్రతీకగా నిలిచే ఈ అటల్ – మోదీ సుపరిపాలన యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రజల మద్దతుతో దేశాన్ని మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈ యాత్ర కొనసాగుతోందని ఏపి బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

నారాయణపేట

కున్సి గ్రామంలో కాంగ్రెస్ నాయకుల జోరు ప్రచారం

క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నల్లె శ్రీనివాసులు ,కత్తెర గుర్తుకు ఓటు వేయాలని గడప గడపకి ప్రచారం చేయడం జరిగింది ,గ్రామం లో పలు వార్డు వార్డు తిరుగుతూ ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేసిన పథకాల గురించి వివరిస్తూ ,కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది . ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి నల్లె శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ముందుంటానని , ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తానని ఆయన అన్నారు. ప్రచారం లో పార్టీ కార్యకర్తలు, నలే వెంకటేష్, ఖందొడ్ది నారాయణ, బాడీయల్ శరణ్ బస్వ, ప్రభు గౌడ , ఉల్ల సోము,పల్లె సురేష్, చంద్రశేఖర్, బడియల్ నర్సప్ప,వార్డు మెంబర్ సభ్యులు పాల్గొనడం జరిగింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వైద్య రంగంలో శర్మ సేవలు మహోన్నతం

డా.ఏ.ఎన్.కే. శర్మ వారి జన్మదిన సందర్భంగా ఫ్రెండ్లీ క్లబ్ సభ్యులకు ఆశీస్సులు. కాట్రేనికోన ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. ఏ.ఎన్.కే శర్మ 80వ జన్మ దిన సందర్భంగా, డా. శర్మ స్వగృహంలో ఫ్రెండ్లీ క్లబ్ సభ్యులు దుశ్శాలువాతో సన్మానించి వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆశీస్సులు పొందిన వారిలో ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి, అధ్యక్షుడు గ్రంధి నానాజీ, ఆకొండి ఉమా మహేష్ శర్మ, వేదుల శ్రీనివాస్, తాతపూడి కృష్ణ, ఆణివిళ్ళ బాలా శ్రీనివాసు, ఆణివిళ్ళ ఫణికాంత్ శర్మ తదితరులు ఉన్నారు

కామారెడ్డి

వసతులతో వికసిత గ్రామం!’గిద్ద

కామారెడ్డి 13 డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) : వసతులతో వికసిత గ్రామం!’ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ, “గెలిచిన నూతన పాలకవర్గానికి హృదయపూర్వక అభినందనలు. సర్పంచ్ సరిత, శ్రీనివాస్‌గార్లు గ్రామస్థుల అభివృ ద్ధికి మొదటి అంకితభావం చూపాలి. గిద్ద రాధాయి పల్లి గ్రామానికి అన్ని వసతులు – రోడ్లు, నీరు, విద్య, ఆరోగ్యం, ఉపాధి – అందించే ప్రజాపాలన జరగాలి. పంచాయతీ స్థాయిలోనే ప్రజల సమస్య లకు శాశ్వత పరిష్కారాలు కనుక్కోవాలి” అని పిలుపునిచ్చారు. ఆయన మాటలు గ్రామవాసుల్లో కొత్త ఆశలను నింపాయి.ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక మండల అధ్యక్షుడు, పార్టీ నాయ కులు, గ్రామ పెద్దలు అందరూ హాజరయ్యారు. సర్పంచ్ సరిత స్పందిస్తూ, “ఎమ్మెల్యే ఆశీస్సులతో మా పాలకవర్గం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తుంది. ప్రతి ఇంటికీ వసతులు అందించే మా మొదటి లక్ష్యం” అని తెలిపారు.

నారాయణపేట

ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న మక్తల్ మాజీ ఎం ఎల్ ఏ

క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో నేడు మక్తల్ నియోజక వర్గ మాజీ ఎంఎల్ఏ చిట్టెం రామోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం లో పాల్గొనడం జరిగింది. బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎం సురేష్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మక్తల్ మాజీ ఎంఎల్ఏ రమోహన్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ గెలుపు దిశగా పని చేయాలని పార్టీ కార్యకర్తలకు,నాయకులకు దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ అభ్యర్థి ఎం సురేష్ మాట్లాడుతూ గ్రామ సేవ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని , ఎలాంటి సమస్య వచ్చిన మీ ముందు ఉంటాను ,గ్రామ అభివృద్ధి కై పాటుపడుతను, యూత్ కు సపోర్ట్ గా ఉంటాను ,నన్ను నమ్మి ఓటు వేసి చూడండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా అనడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్షీర లింగప్ప రామ్ చందర్ వెంకట్ రెడ్డి బీరప్ప శరణప్ప మారుతి దుకాణం రామచందర్ సిద్ధం వార్డు సభ్యులు , మహిళలలు పాల్గొనడం జరిగింది.

కామారెడ్డి

గొల్లపల్లి గెలుపు రంగం.. రెడ్డి మల్లేష్ 5వ వార్డు సభ్యుడు!

కామారెడ్డి 13 డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రెడ్డి మల్లేష్ గురువారం జరిగిన ఎన్నికల్లో 5వ వార్డు సభ్యునిగా ఘన విజయం సాధించారు. గట్టి పోటీ ని ఎదుర్కొని గెలిచిన ఈ నాయకుడిని మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు శాలువాతో ఘనంగా సత్కరించారు.రెడ్డి మల్లేష్ మాట్లాడు తూ, “5వ వార్డు ప్రజలు నన్ను గెలిపించినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను! వారికి ఏ కష్టం వచ్చినా పార్టీ పెద్దలతో మాట్లాడి పరిష్కరిస్తాను. వార్డులో నెలకొన్న అన్ని సమస్యలకు త్వరగా పరిష్కారం కల్పిస్తాను” అని హామీ ఇచ్చారు.పార్టీ సోలిడారిటీతో గెలిచిన ఈ విజయం, టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని మేల్కొల్పింది.

కామారెడ్డి

గొల్లపల్లి గ్రామానికి రెండవ సర్పంచ్‌గా కిషన్ యాదవ్..

– ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఘన సన్మానం! కామారెడ్డి, 13 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, గొల్లపల్లి గ్రామంలో జరిగిన స్థానిక సర్పంచ్‌ సమావేశంలో గొల్లపల్లి గ్రామానికి రెండవ సర్పంచ్‌గా అటికల కిషన్ యాదవ్ గెలుపొందారు. ఈ అవకాశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆయన ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ, గొల్లపల్లి ప్రజలు కిషన్ యాదవ్‌ను ఎన్నుకున్నం దుకు సంతోషం వ్యక్తం చేశారు.గ్రామాన్ని సర్వాంగ సుందరంగా మార్చాలి. ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధి సాధించి, దీన్ని మున్సిపాలిటీగా తీర్చిది ద్దాలి అని పిలుపునిచ్చారు.అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా కిషన్ యాదవ్‌కు, వార్డు సభ్యుల కు సన్మానం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మర్రి మధు, వార్డు మెంబర్లు గొల్ల రాజ మణి, అటికెల లక్ష్మి, సీనియర్ నాయకులు జీర్ల మహేష్, ఎస్.రాజు, వి.రాజనార్సు, కెకె.బాలరాజ్, అటికెల శ్రీకాంత్, అటికెల మధు, కె.రవి, జోగు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

కృష్ణ సీత బౌతికకాయనికి నివాళి అర్పించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు

కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలో పార్టీ నాయకులు కృష్ణ నరసింహారావు భార్య సీత బౌతికకాయనికి మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పార్టీ నాయకులతో కలసి హాజరై ఆమె బౌతికకాయనికి పూలమాల వేసి నివాళి అర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా మల్లెల సీతమ్మ నియామకం – ఎమ్మెల్యే తాతయ్య అభినందనలు

జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా జగ్గయ్యపేట పట్టణం విలియం పేటకు చెందిన మల్లెల సీతమ్మ (W/O మల్లెల కొండయ్య) ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) జగ్గయ్యపేట పట్టణంలోని తన నివాసంలో మల్లెల సీతమ్మ ను కుటుంబ సభ్యులు మరియు వార్డు సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లెల సీతమ్మ ను అభినందించి, ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ నకిరకంటి వెంకట్, ఏలూరు గోపాలరావు,గుత్తికొండ శ్రీనివాసరావు, కర్ల జోజి, మారేపల్లి భాష, గింజపల్లి కృష్ణ, మల్లెల సురేష్, అడపా సత్యం, మారేపల్లి క్రీస్తు రాజు, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

రాష్ట్ర గిరిజన సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసిన టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి బుక్కే మనోహర్ నాయక్

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడును టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి బుక్కే మనోహర్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి గిరిజనుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గిరిజనుల అభ్యున్నతికి అవసరమైన పలు ముఖ్య అంశాలను ఆయన ముఖ్యమంత్రికి వినిపించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో అరకు కాఫీ, జిసిసి ఉత్పత్తులకు ప్రత్యేక అమ్మక కేంద్రాలు ఏర్పాటు చేయాలని, దాంతో గిరిజన నిరుద్యోగ యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని సూచించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో బాలురు, బాలికల కోసం కొత్త భవనాల నిర్మాణం అత్యవసరమని తెలిపారు. ప్రస్తుతం అనేక వసతి గృహాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. తద్వారా గిరిజన ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి గిరిజనుల కోసం ప్రత్యేకమైన కొత్త ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలని, ఆ ఫ్యాక్టరీలు ప్రారంభమైతే వేలాది గిరిజన యువతకు ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రికి వివరించారు. గిరిజన సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సమగ్ర చర్యలు తీసుకోవాలని బుక్కే మనోహర్ నాయక్ సమర్పించిన నివేదికలో తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.