Sunday, 3 May 2026

Blog

తిరుపతి

తిరుపతి జిల్లాలో విలీనం.. మా మారుమూల మండలాల దశ మారేనా

– ప్రజాప్రతినిధులు చొరవ చూపకుంటే వెనుకబాటు తప్పదు – ‘కోడూరు’ను రెవెన్యూ డివిజన్ చేయకుంటే ఉద్యమం పునరావృతం – ‘చిట్వేలి జేఏసీ’ నేత ఇంతియాజ్ అహ్మద్ విశ్లేషణాత్మక హెచ్చరిక చిట్వేలు, జనవరి 06: పున్నమి ప్రతినిధి తిరుపతి జిల్లాలో విలీనమైన చిట్వేలి, పెనగలూరు వంటి మారుమూల మండలాలు ఇకనైనా అభివృద్ధి పథంలో పయనిస్తాయా? లేక ఆధ్యాత్మిక రాజధాని అనే మహాసముద్రంలో మా ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందా? అని చిట్వేలి మండల జేఏసీ సభ్యులు, సామాజిక కార్యకర్త గాడి ఇంతియాజ్ అహ్మద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గ భౌగోళిక మార్పులు, అభివృద్ధి అవకాశాలు మరియు ప్రజాప్రతినిధుల బాధ్యతపై ఆయన విశ్లేషణాత్మక ప్రకటన విడుదల చేశారు. చరిత్రలో పౌరుషం.. అభివృద్ధిలో శూన్యం! చరిత్ర పుట్టినప్పటి నుండి కడప జిల్లాలో భాగమైన మా ప్రాంతం, పేరుకు పౌరుషాల గడ్డ అనిపించుకున్నా అభివృద్ధిలో మాత్రం ఎప్పుడూ వెనుకబడే ఉందని ఇంతియాజ్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి రాజకీయ స్వలాభాల కోసం రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చడంపై ఆయన మండిపడ్డారు. “అన్ని విధాల అర్హతలు ఉండి, ప్రభుత్వ భూములు మెండుగా ఉన్న మదనపల్లి లేదా రాజంపేటను జిల్లా కేంద్రాలుగా చేసి ఉంటే బాగుండేది. కానీ రాజు చేతిలో కలం ఉన్నప్పుడు నిమిత్తమాత్రులమైన ప్రజలు చేసేదేమీ లేకపోయింది” అని వ్యాఖ్యానించారు. తిరుపతి జిల్లాలో చేరడంపై మిశ్రమ స్పందన రాజంపేట జిల్లా కేంద్రం కోసం ఎంతో ఆశగా పోరాటాలు చేశామని, తీరా ఇప్పుడు తిరుపతి జిల్లాలో విలీనం కావడం ఒక విచిత్రమైన పరిస్థితి అని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి జిల్లాలో చేరడం వల్ల, అక్కడ ఉన్న టీటీడీ నిధులు, పెద్ద పెద్ద విద్యాసంస్థలు, కర్మాగారాలు మరియు అత్యాధునిక ప్రభుత్వ ఆసుపత్రులలో మా ప్రాంత యువతకు స్థానిక రిజర్వేషన్లు లభిస్తాయని ఆశలు చిగురించాయని తెలిపారు. అయితే, ఇప్పటికే అభివృద్ధి చెందిన తిరుపతి నగరం ముందు, మా చిట్వేలి, పెనగలూరు మండలాలకు తగిన న్యాయం జరుగుతుందా? లేదా అనేది అనుమానంగా ఉందని పేర్కొన్నారు. వనరులు మెండు.. ఉపాధి ఎక్కడ? రైల్వే కోడూరు నియోజకవర్గంలో ప్రకృతి ప్రసాదించిన సంపద అపారమని ఇంతియాజ్ గుర్తు చేశారు. ఏటా సుమారు రూ. 700 కోట్లకు పైగా వ్యాపారం సాగే పండ్ల తోటలు, మార్కెట్ యార్డులు మన దగ్గర ఉన్నాయి.మంగంపేట బైరటీస్ నిక్షేపాలు మరియు ఎర్రచందనం వంటి సహజ వనరులు మన సొంతం. “ప్రజాప్రతినిధులు చొరవ చూపి, పండ్ల ద్వారా తయారయ్యే జ్యూస్ ఫ్యాక్టరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అప్పుడే జీవనోపాధి కోసం ఎడారి దేశాలకు (గల్ఫ్) వలస వెళ్తున్న నిరుపేదలకు ఇక్కడే ఉపాధి లభిస్తుంది” అని ఆయన సూచించారు. అంతిమ డిమాండ్: రెవెన్యూ డివిజన్ రైల్వే కోడూరును తక్షణమే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఐదు మండలాలకు కలిపి డివిజన్ కేంద్రం లేకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. నూతన జిల్లాల ఏర్పాటులో నాలుగు మండలాలు ఉన్న నియోజకవర్గాలను కూడా డివిజన్లుగా మార్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. “ప్రజాప్రతినిధులు ప్రజల మనోభావాలను గుర్తించి, వారి పక్షాన నిలబడాలి. అప్పుడే వారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. లేనిపక్షంలో ఉద్యమాలు పునరావృతం కాక తప్పదు” అని ఇంతియాజ్ అహ్మద్ స్పష్టం చేశారు.

వనపర్తి

మదనాపూర్ హైస్కూల్ తరగతి గదిలో హిందీ అభ్యసన సామర్ధ్యాలను పరిశీలిస్తున్న జిల్లా ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎంఎన్ విజయకుమార్

*జిల్లాస్థాయి అకాడమిక్ ఇన్స్పెక్షన్ టీం మదనాపూర్ హై స్కూల్ ని సందర్శించి తరగతి గది అభ్యసన ప్రక్రియను పరిశీలిస్తున్న దృశ్యం* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా 06/01/2026* *ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మధునాపూర్ జిల్లా స్థాయి అకాడమిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు హిందీ ఎంఎన్ విజయ కుమార్ సందర్శించి ఏడవ తరగతి ఇంగ్లీష్ తెలుగు మీడియం తరగతి గది పరిశీలన అభ్యసన ప్రక్రియ విద్యార్థుల నోటు పుస్తకాలు, వార్షిక ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక తరగతి ప్రణాళిక టీ ఎల్ఎం తదితర అంశాలను పరిశీలిస్తూ సూచనలు ఇస్తున్న టీం సభ్యులు, విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరై ఉపాధ్యాయులు చెబుతున్న హిందీ పాఠ్యాంశాలని అవగాహన చేసుకుని మంచి ఫలితాలు పొందాలని టీం సభ్యులు విద్యార్థులను ద్వేషించి మాట్లాడారు*

వనపర్తి

మదనాపూర్ హైస్కూల్ తరగతి గదిలో హిందీ అభ్యసన సామర్ధ్యాలను పరిశీలిస్తున్న జిల్లా ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎంఎన్ విజయకుమార్

*జిల్లాస్థాయి అకాడమిక్ ఇన్స్పెక్షన్ టీం మదనాపూర్ హై స్కూల్ ని సందర్శించి తరగతి గది అభ్యసన ప్రక్రియను పరిశీలిస్తున్న దృశ్యం* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా 06/01/2026* *ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మధునాపూర్ జిల్లా స్థాయి అకాడమిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు హిందీ ఎంఎన్ విజయ కుమార్ సందర్శించి ఏడవ తరగతి ఇంగ్లీష్ తెలుగు మీడియం తరగతి గది పరిశీలన అభ్యసన ప్రక్రియ విద్యార్థుల నోటు పుస్తకాలు, వార్షిక ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక తరగతి ప్రణాళిక టీ ఎల్ఎం తదితర అంశాలను పరిశీలిస్తూ సూచనలు ఇస్తున్న టీం సభ్యులు, విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరై ఉపాధ్యాయులు చెబుతున్న హిందీ పాఠ్యాంశాలని అవగాహన చేసుకుని మంచి ఫలితాలు పొందాలని టీం సభ్యులు విద్యార్థులను ద్వేషించి మాట్లాడారు*

వనపర్తి

మదనాపూర్ హైస్కూల్ తరగతి గదిలో హిందీ అభ్యసన సామర్ధ్యాలను పరిశీలిస్తున్న జిల్లా ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎంఎన్ విజయకుమార్

*జిల్లాస్థాయి అకాడమిక్ ఇన్స్పెక్షన్ టీం మదనాపూర్ హై స్కూల్ ని సందర్శించి తరగతి గది అభ్యసన ప్రక్రియను పరిశీలిస్తున్న దృశ్యం* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా 06/01/2026* *ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మధునాపూర్ జిల్లా స్థాయి అకాడమిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు హిందీ ఎంఎన్ విజయ కుమార్ సందర్శించి ఏడవ తరగతి ఇంగ్లీష్ తెలుగు మీడియం తరగతి గది పరిశీలన అభ్యసన ప్రక్రియ విద్యార్థుల నోటు పుస్తకాలు, వార్షిక ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక తరగతి ప్రణాళిక టీ ఎల్ఎం తదితర అంశాలను పరిశీలిస్తూ సూచనలు ఇస్తున్న టీం సభ్యులు, విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరై ఉపాధ్యాయులు చెబుతున్న హిందీ పాఠ్యాంశాలని అవగాహన చేసుకుని మంచి ఫలితాలు పొందాలని టీం సభ్యులు విద్యార్థులను ద్వేషించి మాట్లాడారు*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శుభోదయం 🌅

పనులు బాగా జరిగితే అందుకు సంబంధించిన క్రెడిట్‌ను ఇతరులతో పంచుకునే వారు, పనులు సరిగా జరగకపోతే బాధ్యతను తమపై తీసుకునే వారే మంచి నాయకులు. — సైమన్ సినెక్ పున్నమి తెలుగు డైలీ

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పిడూరు పాలెంలో కరంటోళ్ల జన బాట

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)మనుబోలు మండలం పిడూరు పాలెం గ్రామంలో ఈరోజు కరంటోళ్ల జన బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఈ అనిల్ కుమార్, జేఈఈ రాంబాబు ఆధ్వర్యంలో లైన్ ఇన్స్పెక్టర్ శేషయ్య, లైన్మెన్ రమేష్, కిషోర్, జేఎల్ఎంలు, షిఫ్ట్ ఆపరేటర్లు పాల్గొన్నారు. గ్రామంలోని 11 కెవి, ఎల్‌టీ లైన్లు మరియు ట్రాన్స్‌ఫార్మర్లను తనిఖీ చేసి, లోపాల నివారణతో పాటు భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. విద్యుత్ సరఫరా నాణ్యత మెరుగుపడేలా చర్యలు చేపట్టామని తెలిపారు.

అన్నమయ్య

పదవ తరగతి విద్యార్థులకు ‘స్టడీ మెటీరియల్’ వరం

– పరీక్షల్లో అత్యధిక మార్కులే లక్ష్యంగా ఎస్టీయూ రూపకల్పన – రాజుగుంట సర్పంచ్ గుత్తి నరసింహ ఆర్థిక సహకారంతో ఉచిత పంపిణీ చిట్వేలు, జనవరి 05: పున్నమి ప్రతినిధి రాబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా చిట్వేలు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. **రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రూపొందించిన ఈ మెటీరియల్‌ను రాజుగుంట సర్పంచ్ గుత్తి నరసింహ ఆర్థిక సహకారంతో సోమవారం విద్యార్థులకు అందజేశారు. -నిష్ణాతులైన ఉపాధ్యాయులతో రూపకల్పన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందంచే తయారు చేయబడిన ఈ మెటీరియల్, పబ్లిక్ పరీక్షల్లో కీలకమైన ప్రశ్నలు మరియు సులభంగా అర్థం చేసుకునే పద్ధతులతో రూపొందించబడింది. మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థులకు కూడా వీటిని అందజేశారు. -చదువే భవిష్యత్తుకు పునాది: దాత గుత్తి నరసింహ ఈ సందర్భంగా పుస్తక దాత, సర్పంచ్ గుత్తి నరసింహ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నతంగా చదువుకొని సమాజంలో రాణించాలని ఆకాంక్షించారు. పదవ తరగతి ఫలితాల్లో చిట్వేలు మండలానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఎస్టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి కందల హరినాథ్ మాట్లాడుతూ.. ఈ మెటీరియల్ చదవడం ద్వారా విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి అధిక మార్కులు సాధించవచ్చని తెలిపారు. -ఉపయోగించుకోవాలని ఉపాధ్యాయుల పిలుపు చిట్వేలు జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు మాట్లాడుతూ.. విద్యార్థి దశలో పదవ తరగతి ఒక మలుపు వంటిదని, దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకొని అగ్రస్థానంలో నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు కామాటం వెంకటేశ్వర్లు, అమర్నాథ్ (పోల్లోపల్లి హెచ్ఎం), సూర్యనారాయణ, కేజీబీవీ ఎస్ఓ తులసి, భాస్కర్ రెడ్డి, శివ నారాయణ గౌడ్ మరియు ఇతర ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

అన్నమయ్య

మండల పార్టీ బలోపేతమే లక్ష్యం: రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ కే.కే. చౌదరి

– మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులకు దిశానిర్దేశం – మంగళగిరిలో ఘనంగా 07వ బ్యాచ్ శిక్షణా తరగతులు చిట్వేలు, జనవరి 5 పున్నమి ప్రతినిధి పార్టీకి వెన్నెముకగా నిలిచే మండల స్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. సోమవారం జరిగిన 07వ బ్యాచ్ నూతన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల శిక్షణా కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణ పరిశ్రమల (ఖాదీ బోర్డు) చైర్మన్ కే.కే. చౌదరి ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. -అధ్యక్షుల విధులు – విధానాలపై అవగాహన “మండల పార్టీ అధ్యక్షుల విధులు – విధానాలు” అనే అంశంపై కే.కే. చౌదరి నాయకులకు సమగ్రంగా అవగాహన కల్పించారు. మండల స్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి, కార్యకర్తలను ఎలా సమన్వయం చేసుకోవాలి అనే విషయాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. -ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఈ సందర్భంగా కే.కే. చౌదరి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో మండల స్థాయి నాయకుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని ఆయన సూచించారు.కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను గ్రామస్థాయిలో చర్చకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. -నాయకుల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం ఈ శిక్షణా తరగతులు తమలో కొత్త ఉత్సాహాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని నింపాయని శిక్షణ పొందిన నాయకులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు కార్యాచరణకు ఈ తరగతులు ఒక దిశానిర్దేశంలా ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు సీనియర్ నేతలు పాల్గొన్నారు.

అన్నమయ్య

అర్హులైన రైతులకే పట్టాదార్ పాస్ పుస్తకాలు అందాలి – ఇన్చార్జి మంత్రి సవితకు ఆరుముగం విశ్వనాథ్ వినతి ​

తప్పుడు ఆన్‌లైన్ రికార్డులు, రెవెన్యూ వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించి అక్రమదారులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయవద్దని మాజీ రాష్ట్ర టీడీపీ పార్టీ పరిశీలకుడు ఆరుముగం విశ్వనాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఇన్చార్జి మంత్రి సవితను కలిసి వినతి పత్రం అందజేశారు. ​వినతి పత్రంలోని ముఖ్యాంశాలు: ​సమగ్ర విచారణ: తప్పుడు ఆన్‌లైన్ ఎంట్రీలు ఉన్న భూములపై రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన తర్వాతే పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ​తహసీల్దార్లకు ఆదేశాలు: వివాదాల్లో ఉన్న భూములకు, రెవెన్యూ కోర్టు పరిధిలో ఉన్న భూములకు పాస్ పుస్తకాలు మంజూరు చేయవద్దని మండల తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ​కబ్జాదారులకు అడ్డుకట్ట: భూకబ్జాదారులు తప్పుడు పత్రాలతో పాస్ పుస్తకాలు పొందకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ​నిజమైన హక్కుదారులకు రక్షణ: తరతరాలుగా సాగు చేసుకుంటున్న నిజమైన హక్కుదారులకు మాత్రమే పాస్ పుస్తకాలు అందేలా చూడాలని కోరారు. ​భూ రికార్డుల విషయంలో జరుగుతున్న అక్రమాల వల్ల అసలైన రైతులు నష్టపోతున్నారని, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆరుముగం విశ్వనాథ్ పేర్కొన్నారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన మంత్రి సవిత, తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తామని హామీ ఇచ్చారు.

వరంగల్

వరంగల్: రాత్రి రోడ్డుపై పడిపోయిన మహిళ.. ఆసుపత్రిలో చేర్చిన SI

వరంగల్ పరిధి లోని మండి బజారులో రాత్రి గౌసియా బేగం అనే మహిళ తన మూడేళ్ల కూతురితో కలిసి వెళుతుండగా ఒకసారిగా బీపీ తగ్గి స్పృహ తప్పి పడిపోవడంతో అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న ఇంతే జార్ గంజ్ ఎస్సై వెంకటేశ్వర్లు గమనించి వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.