Sunday, 3 May 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

TNC కళాశాల కోవూరు లో ఆటల పోటీలు

ప్రభుత్వ జూనియర్ కళాశాల కోవూరు లో కళాశాల వార్షికోత్సవ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు ఆటలపోటీలు ప్రారంభించడం జరిగింది.అందులో భాగంగా విద్యార్ధినుల షటిల్ ఆటలు ప్రారంభం *ప్రిన్సిపాల్ శ్రీ S.A. సికిందర్ గారి* పర్యవేక్షణ, తిలకిస్తున్న కళాశాల అధ్యాపక, అధపకేతర సిబ్బంది. ➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ఆంధ్రప్రదేశ్

అమ్మా నాన్నల ప్రేమాలయం వృద్ధాశ్రమంలో కపలవాయి విజయకుమార్ 72వ జన్మదిన వేడుకలు

(పున్నమి ప్రతినిధి) నరసరావుపేట టౌన్, జనవరి 06: స్థానిక చిలకలూరిపేట రోడ్డులోని అమ్మా నాన్నల ప్రేమాలయం వృద్ధాశ్రమంలో యస్.యస్.&యన్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ బులియన్ మర్చంట్స్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కపలవాయి విజయకుమార్ గారి 72వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ది టౌన్ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ–మహేష్ బాబు యువశక్తి పట్టణ అధ్యక్షులు ఫారూఖ్ బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విజయకుమార్ కేక్ కట్ చేసి వృద్ధులకు మిఠాయిలు పంచారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కృష్ణ–మహేష్ బాబు అభిమానులు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

యారాడ మార్గంలో మరో ఆటో ప్రమాదం.. ప్రయాణికుల్లో భయాందోళన

గాజువాక–యారాడ జనవరి (పున్నమి ప్రతినిధి) గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో మరోసారి ఆటో ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ లోడుతో వెళ్తున్న ఆటోకు అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పిల్లర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇటీవల ఇదే మార్గంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తా పడిన ఘటన మరవకముందే మరో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. కొండ ప్రాంతమైన యారాడ మార్గంలో వరుస ప్రమాదాలతో ఆటో ప్రయాణాలు అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రహదారి భద్రత, వాహనాల తనిఖీలపై అధికారుల నిర్లక్ష్యం ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

విశాఖపట్నం

సంక్రాంతి పండుగకే కళంకంగా మారిన కోళ్ల పందాలు విశాఖలో మళ్లీ తెరపైకి వచ్చిన నిషేధిత జూదం

విశాఖపట్నం, జనవరి (పున్నమి ప్రతినిధి): సంక్రాంతి పండుగ అనగానే సంస్కృతి, సంప్రదాయం, కుటుంబ ఆనందం గుర్తుకు రావాలి. కానీ విశాఖపట్నం నగర శివార్లలో, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రతి ఏటా ఈ పండుగ పేరు చెప్పుకుని నిషేధిత కోళ్ల పందాలు మళ్లీ రెచ్చిపోతున్నాయి. పోలీసు నిషేధాలు, కోర్టు ఆదేశాలు కాగితాలకే పరిమితమవుతున్నాయా అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. లక్షల నుంచి కోట్ల వరకు బెట్టింగ్‌లు సాగుతున్న ఈ కోళ్ల పందాల వెనుక వ్యవస్థీకృత జూద మాఫియా పని చేస్తోంది. ముందస్తు ఏర్పాట్లు, ప్రత్యేక బ్లేడ్ కోళ్లు, బయట ప్రాంతాల నుంచి తెచ్చిన పందెం నిర్వాహకులు… అన్నీ పండుగకు ముందే సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల రాజకీయ అండదండలున్నాయన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. పందాల వల్ల యువత వ్యసనాలకు బానిసలవుతుండగా, కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. రక్తపాతం, గొడవలు, హత్యల వరకూ వెళ్లిన సంఘటనలు గతంలో ఎన్నో ఉన్నప్పటికీ, పాలక యంత్రాంగం ప్రతి ఏటా అదే నిర్లక్ష్యాన్ని చూపుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంక్రాంతి పండుగ పేరుతో చట్ట విరుద్ధమైన కోళ్ల పందాలకు శాశ్వతంగా చెక్ పెట్టే చర్యలు ఎప్పుడు చేపడతారన్నదే విశాఖ ప్రజల ప్రశ్న. సంప్రదాయ పండుగను జూద పండుగగా మార్చే ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకోకపోతే, భవిష్యత్తు తరాలకు మిగిలేది నాశనమేనని సామాజిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

నెల్లూరు అపోలో హాస్పిటల్‌లో అరుదైన వైద్య చికిత్స – రోగి ప్రాణాలు రక్షణ

(పున్నమి ప్రతినిధి) నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్‌లో అరుదైన వైద్య చికిత్స విజయవంతంగా నిర్వహించారు. కావలి పట్టణానికి చెందిన 37 ఏళ్ల నాగరాజు నోటిలో నుంచి తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రికి రావడంతో వైద్యులు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో రంధ్రం ఏర్పడినట్లు గుర్తించారు. మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన బ్రాంకిల్ ఆట్రీ ఎంబోలైజేషన్ విధానంతో చికిత్స చేసి రక్తస్రావాన్ని పూర్తిగా నియంత్రించారు. ఈ చికిత్స నెల్లూరులో తొలిసారిగా నిర్వహించామని డాక్టర్ భక్తవత్సల రెడ్డి, డాక్టర్ శ్రావణి రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించారు.

కామారెడ్డి

గొల్లపల్లి పాఠశాలలో సర్పంచ్‌లు పిల్లలతో కలిసి మధ్యాహ్నాహారం..

రైతులకు యూరియా బుకింగ్ ఆన్‌లైన్ సహాయం! కామారెడ్డి, 06 జనవరి,( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, గొల్లపల్లి పిల్లల భవిష్యత్తు మా చేతుల్లో అంటున్నా సర్పంచ్ కిషన్ యాదవ్ సంకల్పంతో మంగళవారం గొల్లపల్లి ప్రథమిక పాఠశాలలో అద్భుతమైన కార్యక్రమం జరిగింది. స్థానిక పాలకులు, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు కలిసి పిల్లల మధ్యాహ్నాహారాన్ని పరిశీలించి,వారితో పాటు తిన్నారు. అంతేకాకుం డా, రైతులకు యూరియా ఆన్‌లైన్ బుకింగ్‌లో సహాయం చేసి, వ్యవసాయ ఎరువుల వివరాలు తెలియజేశారు. గ్రామ పెద్దలు, రైతుల పాల్గొన్న ఈ కార్యక్రమం విజయవంతమైంది.మధ్యాహ్నం పాఠ శాలలో జరిగిన ఈ పరిశీలన సర్పంచ్ కిషన్ యాద వ్ నేతృత్వంలో జరిగింది. ఉపసర్పంచ్ మధుసూ దన్, 5వ వార్డు సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, 6వ వార్డు మల్లేష్, రాజేశ్వర్, గొల్ల నవీన్‌లతో పాటు హెచ్ఎం రాజు కుమార్ కలిసి పిల్లల మధ్యాహ్నాహారం త యారీ నుంచి పంపిణీ వరకు పరిశీలించారు.ఫుడ్ ఎలా పెడుతున్నారు? పిల్లలకు రుచి, పోషకాలు సరిపోతున్నాయా?అని వారు అడిగి తెలుసుకు న్నారు. తర్వాత, పిల్లలతో కలిసి మధ్యాహ్నాహారం తిని, వారి సంతోషాన్ని పంచుకున్నారు.పిల్లల మధ్యాహ్నాహారం పరిశీలనకు ప్రత్యేకంగా గ్రామ పాలకులు రాణించారు.పిల్లల ఆరోగ్యం, చదువు మా మొదటి ప్రాధాన్యత.ఈ పద్ధతి గ్రామంలో అమలు చేస్తూ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తామని సర్పంచ్ కిషన్ యాదవ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు సంతోషంగా పాల కులను కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్

జగదేవి పేట పీహెచ్‌సీలో ఆశా డే సమావేశం – క్యాన్సర్ అవగాహన కార్యక్రమం

(పున్నమి ప్రతినిధి) ఇందుకూరుపేట మండలం జగదేవి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 06.01.2026న ఆశా డే సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ బ్రహ్మేశ్వర్ నాయుడు, డాక్టర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టారు. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు నుంచి వచ్చిన డాక్టర్ హరిప్రియ (ఎండి – రేడియేషన్ ఆంకాలజీ) రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, కారణాలు, నివారణపై అవగాహన కల్పించారు. ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. ప్రతి నెల స్వీయ పరీక్షలు, 40 ఏళ్లు దాటిన మహిళలు మామోగ్రఫీ చేయించుకోవాలని సూచించారు. క్యాన్సర్ లక్షణాలు కనిపించిన వారిని వెంటనే ఆసుపత్రికి పంపించాలని ఆశా వాలంటీర్లకు సూచించారు. ఈ సమావేశంలో వైద్య సిబ్బంది, ఆశా వాలంటీర్లు పాల్గొన్నారు.

కామారెడ్డి తెలంగాణ

రెడ్డిపేట తండా జిల్లా పరిషత్ పాఠశాలలో ఘన సన్మాన సమ్మేళనం 

 కామారెడ్డి,6 జనవరి, ( పున్నమి ప్రతినిధి )    :  కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం స్కూల్ తాండ గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ పాలకవర్గానికి ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, స్కూల్ అభివృద్ధికి అంగీకారం తెలిపారు.స్కూల్ తండా సర్పంచ్ సలావత్ బుచ్చిరెడ్డి, ఉపసర్పంచ్ గంగావత్ రమేష్, జగదాంబ తండ సర్పంచ్ భూక్యా లతా, బాయనంద ఉపసర్పంచ్ గంగావత్ పూర్ణరాజు, నాయక్‌ బట్టు తండా సర్పంచ్ బట్టు బికినీ, ఉపసర్పంచ్ రాతుల కిషోర్‌లకు ప్రత్యేక సన్మానం.వార్డు సభ్యులు రాతుల సవిత, రంజిత్, గంగావత్ సేవ్య, గంగావత్ సంతోష్, సలావత్ లలిత, నరేష్, సలవత్ తిరుపతి లకు ఘన సత్కా రం పొందారు. పాఠశాలకు ఎల్లవేళలా అభివృద్ధి కొరకు సహకారం ఉండాలని కోరారు.ఉపాధ్యా యులు, భవిష్యత్ సహకారం కోరారు. గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రైతులకు భూ చట్ట భద్రత కల్పించడమే తన లక్ష్యం అని ఎమ్మెల్యే తెలిపారు

రైతులకు భూ చట్ట భద్రత కల్పించడమే తన లక్ష్యం అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు ఆర్ల పడియ గ్రామoలో నిర్వహించిన పట్టాదారు పాస్ బుక్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గోని వివరించారు గత ప్రభుత్వం జారీ చేసిన పట్టా దారు పాస్ బుక్ పుస్తకాలు చెల్లని నోట్లతో సమానము అని తమ ప్రభుత్వం జారీ చేస్తున్న పట్టాదారు పాస్ బుక్ పుస్తకాలు రిజర్వు బ్యాంకు జారీ చేసే కరెన్స్ నోట్ల వలె చట్ట భద్ద విలువ, భద్రత కలిగినవి అని అన్నారు

తిరుపతి

రైతు హక్కులకు భరోసా: ‘మీ భూమి–మీ హక్కు’లో అరవ శ్రీధర్

ఓబులవారిపల్లి మండలం వెంకటేశాపురంలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు. అర్హులైన రైతులకు రాజ్యముద్రతో కూడిన పట్టాదార్ పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. గత పాలనలో రైతు హక్కులను నిర్లక్ష్యం చేశారని విమర్శించిన అరవ శ్రీధర్, ప్రస్తుత ప్రభుత్వం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఫిర్యాదు చేసిన నెలలోపే పరిష్కారం అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.