Sunday, 3 May 2026

Blog

కడప

ఉపముఖ్యమంత్రిని కలిసిన పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కలిసి ప్రొద్దుటూరు కు సంబంధించిన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని విన్నవించారు ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి తగినన్ని నిధులు అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు కు సంబంధించిన టీడీపీ నేతలు పాల్గొన్నారు

కామారెడ్డి

రామారెడ్డి పీహెచ్సీలో హెచ్ఐవి, ఎయిడ్స్‌, టిబి, హెపటైటిస్‌పై అవగాహన

కామారెడ్డి, 6 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, సంపూర్ణ సురక్ష కేంద్రం ఆధ్వర్యంలో రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్ఐవి/ఎయిడ్స్, టిబి, ఎస్టీఐ, హెపటైటిస్ బి, సి, 1097 సేవలు, సిఫిలిస్ తదితర వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించా రు.ఈ సందర్భంగా ఇప్పటివరకు కొనసాగుతున్న ఐసీటీసీ సేవలతో పాటు, కొత్తగా ప్రారంభించిన సంపూర్ణ సురక్ష కేంద్రం ద్వారా హెచ్ఐవి సేవలతో పాటు పైన పేర్కొన్న అన్ని వ్యాధులకు సంబంధిం చిన పరీక్షలను పూర్తిగా ఉచితంగా అందిస్తామని అధికారులు తెలిపారు. అవసరమయ్యే వారికి రెండు సంవత్సరాల పాటు నిరంతర ఫాలోఅప్ చేస్తూ పరీక్షలు, చికిత్సలు, మందులు, కౌన్సెలింగ్, ఇతర అవసరమైన వైద్య సేవలు అందజేస్తామని వివరించారు.రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వ హించిన సదస్సు లో, ప్రస్తుత సేవలు, కొత్తగా అందుబాటులోకి వస్తున్న సేవల గురించి ప్రజలకు వివరించారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రజలు ఈ ఉచిత సేవలను వినియోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్లు భీమన్న, జార్జ్, సూపర్వైజర్ జానకి, ఐసీటీసీ కౌన్సిలర్ నాగరాజు, సంపూర్ణ సురక్ష కేంద్రం మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, ఎస్‌ఎస్‌కే ORW, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖపట్నం

గాజువాక అభివృద్ధికి రోడ్‌మ్యాప్ వీఎంఆర్డీఏలో జివిఎంసీ పనులపై పల్లా సమీక్ష

విశాఖపట్నం జనవరి (పున్నమి ప్రతినిధి) గాజువాకను సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు జివిఎంసీ పరిధిలో చేపట్టనున్న కీలక పనులపై వీఎంఆర్డీఏ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ప్రధాన రహదారుల విస్తరణ, డ్రైనేజీ అభివృద్ధి, అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్, జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్స్, సర్వీస్ రోడ్ల నిర్మాణాలపై సమీక్షించారు. 15వ ఆర్థిక సంఘ నిధులు, జివిఎంసీ ఫండ్స్, హామ్ విధానంలో చేపట్టే పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని పల్లా అధికారులను ఆదేశించారు. కణితి గెడ్డ అభివృద్ధి ప్రాజెక్ట్‌ను వేగవంతం చేసి వరదల నివారణకు శాశ్వత పరిష్కారం అందించాలన్నారు. అలాగే ప్లేగ్రౌండ్లు, పార్కులు, గాజువాక జోనల్ ఆఫీస్ భవన నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని సూచించారు. గాజువాక అభివృద్ధిలో జాప్యం ఉండదని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పల్లా స్పష్టం చేశారు.

తిరుపతి

నేతివారిపల్లెలో కలకలం రేపిన ఆత్మహత్య

చిట్వేలు మండలం నేతివారిపల్లె గ్రామంలో వివాహిత చిందం దివ్య (28) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రాజపల్లె గ్రామానికి చెందిన దివ్య, హైదరాబాదులో ఒక ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్‌గా పనిచేస్తుండేది. ఐదేళ్ల క్రితం చిట్వేలు మండలం నేతివారిపల్లెకు చెందిన పసల సాయి పవన్‌ను ప్రేమ వివాహం చేసుకొని మూడేళ్ల కుమారుడిని పొందింది. భర్త పవన్ మద్యపానం, ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి సుమారు నాలుగు లక్షల రూపాయల అప్పులు చేసినట్లు సమాచారం. మద్యం మానుతానని పలుమార్లు హామీ ఇచ్చినా మార్పు లేకపోవడంతో మనస్తాపం చెందిన దివ్య ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రంగారెడ్డి

రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రంగారెడ్డి జిల్లా శాఖ క్యాలెండర్ ఆవిష్కరణ

రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రంగారెడ్డి జిల్లా ధూంధాం గా క్యాలెండర్ ఆవిష్కరణ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా/06/01/2026 2026 రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రంగారెడ్డి జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ధూమ్ ధామ్ గా నిర్వహించడం జరిగింది భాషా పండితుల ఆత్మబంధువు ప్రముఖ సంఘ సేవకులు శ్రీ నక్క శ్రీనివాస్ యాదవ్ గారు లాంఛనంగా ఆవిష్కరించగా కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కే గోపాల్ జి అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి పంబ వెంకటస్వామి సమన్వయం చేయగా సంఘ రాష్ట్ర అధ్యక్షులు శానమోని నరసింహులు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు వీరేందర్ గౌడ్ సంయుక్త కార్యదర్శులు అమీర్ పాష జానకి రామ్ రాష్ట్ర సాహితి కార్యదర్శి కవి రచయిత నందిగామ కిషోర్ జిల్లా సలహాదారులు పరమేష్ జిల్లా గౌరవ అధ్యక్షులు ప్రముఖ పధ్య కవి భవాని జగదీశ్వర్ రెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ బాలస్వామి లక్ష్మయ్య ఇబ్రహీంపట్నం డివిజన్ అధ్యక్షులు జగన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు అనంతరం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయా ప్రముఖులు ప్రసంగించారు లక్ష్మయ్య గారు వందన సమర్పణ చేశారు

అనకాపల్లి

ఏటికొప్పాకలో రైతులకు భూమి పాస్‌పుస్తకాల పంపిణీ..!

జనవరి 6అనకాపల్లి జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ : ఏటికొప్పాక గ్రామంలో భూమి పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలమంచిలి మండలం ఎంపీపీ రాజన్న శేషు గారు హాజరై అర్హులైన రైతులకు పాస్‌పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి భజంత్రీల లక్ష్మీ గారి కుమారుడు శ్రీను, మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, ఎంపీటీసీ అచ్చం నాయుడు, వైస్ సర్పంచ్ కర్రీ సమాచారం, వార్డ్ మెంబర్స్ నాయుడు మాస్టారు, శ్రీను పాల్గొన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పాస్‌పుస్తకాలు అందుకున్న రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

గూడూరు

టోర్నమెంట్ విజేతగా నిలిచిన ఎస్కేఆర్ డిగ్రీ కళాశాల

ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో విక్రమ సింహపురి యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ మెన్ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఫైనల్ కి చేరుకున్న గూడూరు ఎస్కేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, సూళ్లూరుపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. మొదటగా బ్యాటింగ్ చేసిన ఎస్కేఆర్ కళాశాల నిర్ణీత 15 ఓవర్లకు 201 పరుగులు సాధించి అనంతరం 130 పరుగులకే సూళ్లూరుపేట కాలేజీని ఆల్ అవుట్ చేసి విజేతగా నిలిచి టోర్నమెంట్ విన్నెర్స్ కప్ గెలుచుకుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. నారాయణరాజు, యూనివర్సిటీ తరపున వచ్చిన అబ్జర్వర్ ఎం. రవీంద్ర బాబు, సూళ్లూరుపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ శ్రీమతి అమ్మాజీ, ఎస్ కే ఆర్ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విజేతలయిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

అగ్ని ప్రమాద బాధితులకు దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు తూర్పు గోదావరి జిల్లా: ఎవరు కష్టం లో ఉన్న వెంటనే సహాయం అందించే ఏ యస్.ఓ జోడాల వెంకటేశ్వరావు మిత్ర బృందం,పోలవరం మండలం లోని కార్మల్ పురం గ్రామం లోని అభిమల్ల సత్యనారాయణ గారి ఇల్లు అగ్నిప్రమాదం వలన పూర్తిగా కాలిపోయింది అని సమాచారం తెలుసుకున్న వెంటనే చలించిన హృద యాలతో ట్రస్ట్ సభ్యులు అగ్ని ప్రమాద బాధిత కుటుంబము దగ్గరకు వెళ్లి వారికి బీరువా, ఫోల్డిన్ పరుపు మంచం, సీలింగ్ ఫ్యాన్,26 కేజీ ల బియ్యం బస్తా ఇచ్చారు,ఆర్ధిక సహాయం అందించిన దాతలు మిత్రులు వెంకట్రావు,డాక్టర్అన్నపూర్ణ, వ్యవసాయ సహాయకులు సురేష్, ఏపీఎన్జీవో నాయకుడు కుమార్,రవి శంకర్,రాధాకృష్ణ,రామలక్ష్మి రామకృష్ణ ,మనిధర్ ఆదిలక్ష్మి,మద్దాలి హనుమంతరావు హరీష్,రామ్మోహన్ యమున, వారణాశిరవికృష్ణ, వెంకటలక్ష్మిలు ఉన్నారు ఏ.యస్.ఓ జోడాల వెంకటేశ్వరరావు మాట్లాడుతు సమాజంలో ఎవరు కష్టం లో ఉన్న తమను సంప్రదిస్తే తక్షణమే సహాయం అందిస్తామని తెలియజేసారు. ఆర్ధిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేసారు ఈ కార్యక్రమం లో ఏ.ఎస్.ఓ జోడాల వెంకటేశ్వరావు, దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ టీమ్ సభ్యులు ప్రత్తిపాటి నాగరాజు, సాధనాల కిషోర్, రాంతేజ, డాన్, గౌతమ్ లు పాల్గొన్నారు.. Uploaded Video:

కామారెడ్డి

కామారెడ్డి మున్సిపల్ ఓటరు జాబితాల్లో ‘గడ్డకట్టిన తప్పులు’!

BJP ధర్నాతో హడలిపడ్డ అధికారులు.. 9న సమావేశం వాగ్దానం! కామారెడ్డి, జనవరి 6, (పున్నమి ప్రతినిధి) : ఒకే ఇంట్లో పదులాది ఓట్లు.. గ్రామీణ ఓటర్లు పట్టణ జాబితాల్లో! మున్సిపల్ వార్డు ఓటరు జాబితాల్లో పెద్ద లోపాలు తేలడంతో భారతీయ జనతా పార్టీ (BJP) కామారెడ్డి పట్టణ శాఖ మున్సి పల్ కార్యాలయం ముందు గట్టి ధర్నా చేపట్టింది. కామారెడ్డి శాసనసభ్యుడు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమం పట్ట ణవాసుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఓటరు జాబితాల్లో ఈ తప్పులు.. పట్టణవాసులు కోపంతో మండిపడ్డారు! గ్రామీణ ఓటర్లు పట్టణ జాబితాల్లో! పట్టణ వార్డుల్లో గ్రామీణ ప్రాంతాల ఓటర్లు చేర్చబడ్డారు.ఒకే ఇంటి మీద పదుల ఓట్లు! ఒకే అడ్రస్‌పై 20-30 ఓట్లు నమోదు!ఇష్టానుసారం వార్డులు మార్చారా? గత వార్డు ప్రకారం కాకుండా రాండమ్‌గా జాబితాలు ప్రచురించారు.సమస్యలు చెప్పే అవకాశం లేదు! రాజకీయ పార్టీల సమావేశం లో కూడా మాట్లాడే సమయం ఇవ్వలేదు. కామారె డ్డి పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్, BJP స్టేట్ కౌన్సిలర్ విపుల్ జైన్లు మాట్లాడుతూ, “ఓటరు జాబితాలు పూర్తిగా తప్పులతో నిండిపోయాయి! నిన్న రాజకీయ పార్టీల సమావేశంలో సమస్యలు చెప్పే అవకాశం ఇవ్వకపోవడంతో ఈ ధర్నా చేయా ల్సి వచ్చింది” అని ఆరోపించారు. వీరు నిన్నే లిఖి త పిర్యాదులు ఇచ్చినా స్పందన లేకపోవడాన్ని ఎత్తిచూపారు.అధికారుల వాగ్దానం 9న సమా వేశం.. అభ్యంతరాలు చెప్పండి! ధర్నా స్థాయి లేకుండా అధికారులు అన్ని పిర్యాదులు పరిష్క రిస్తామని, పూర్తి ఓటరు జాబితా ఏర్పాటు చేసి 9 తేదీన రాజకీయ పార్టీలతో సమావేశం పెడతామని వాగ్దానం చేశారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్కడ చెప్పొచ్చు” అని చెప్పడంతో BJP నేతలు ధర్నా విరమించారు. అయితే, తప్పులు సరిచేయ కపోతే BJP ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం రావడ మే కాదని హెచ్చరించారు.ఈ ఘటన పట్టణ వాసు ల్లో పెద్ద అల్లరు సృష్టించింది. ఎన్నికల ముందు ఓటరు జాబితాలు పరిపూర్ణంగా ఉండాలని ప్రజ లు డిమాండ్ చేస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

TNC కళాశాల కోవూరు లో ఆటల పోటీలు

ప్రభుత్వ జూనియర్ కళాశాల కోవూరు లో కళాశాల వార్షికోత్సవ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు ఆటలపోటీలు ప్రారంభించడం జరిగింది.అందులో భాగంగా విద్యార్ధినుల షటిల్ ఆటలు ప్రారంభం *ప్రిన్సిపాల్ శ్రీ S.A. సికిందర్ గారి* పర్యవేక్షణ, తిలకిస్తున్న కళాశాల అధ్యాపక, అధపకేతర సిబ్బంది. ➖➖➖➖➖➖➖➖➖➖➖➖

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.