యూరియా కోసం రైతుల తిప్పలు
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముద్దంపురు గ్రామంలో ఉదయం 3 గంటల నుండి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు యూరియా కోసం టోకెన్లు ఇస్తామని అధికారులు తెలపడంతో తెల్లవారుజామునే ఎముకలు కొరికే చలిలో క్యూ లైన్ లో వేచి చూస్తున్న రైతులు
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముద్దంపురు గ్రామంలో ఉదయం 3 గంటల నుండి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు యూరియా కోసం టోకెన్లు ఇస్తామని అధికారులు తెలపడంతో తెల్లవారుజామునే ఎముకలు కొరికే చలిలో క్యూ లైన్ లో వేచి చూస్తున్న రైతులు
నందిగామ పట్టణంలో గత 125 సంవత్సరాలుగా అనాదిగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడుతున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఈ ఏడాది మరింత వైభవంగా సాగాయి. నందిగామ ముక్కోటి మహా మండపంలో నిర్వహించిన 126వ వైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మున్సిపల్ చైర్‌పర్సన్ మండల కృష్ణకుమారి, వార్డు కౌన్సిలర్లు, కూటమి నేతలతో కలిసి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. శతాబ్ద కాలంగా దివి రత్నమాచార్యుల వారి కుటుంబం ఈ పవిత్ర మహోత్సవాలను నిర్విఘ్నంగా నిర్వహిస్తూ రావడం విశేషం. ఈ ఉత్సవాలు లింక్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించు కోవడం నందిగామ పట్టణానికి, అలాగే ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న కుటుంబానికి గర్వకారణంగా నిలిచింది. కళలు, సంస్కృతి, ఆచారాలు, వైభవాలకు నిలయమైన ముక్కోటి మహా మండపంలో భక్తి సంగీతం, వేదపఠనం, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. పలువురు మహానుభావులు తమ కళా ప్రదర్శనలతో వేదికను ఆధ్యాత్మిక శోభతో నింపారు. నందిగామకు క్షేత్ర బిందువుగా నిలుస్తున్న ముక్కోటి మహా మండపం, ఈ మహోత్సవాల ద్వారా పట్టణానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తోందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఉన్న 63 పుణ్యక్షేత్రాల విశేషాలను వివరిస్తూ కెవిఆర్ కళాశాల తెలుగు విశ్రాంత ఉపాధ్యాయులు రవి ప్రసాద్ రచించిన ‘దివ్య క్షేత్రాలు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు, కూటమి నేతలు, కళాకారులు, భక్తులు, ప్రజలందరికీ ఆమె పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నందిగామలో కొనసాగుతున్న ఈ శతాబ్దాల సంప్రదాయం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు.
కుమ్మర సంఘం రంగారెడ్డి జిల్లా యూత్ తరఫున క్యామ మల్లేష్ అన్న కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆడాల గణేష్ పున్నమి ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు గౌరవ శ్రీ రామ మల్లేష్ అన్న కి జన్మదిన శుభాకాంక్షలు నా ప్రియమైన లీడర్ క్యామ మల్లేష్ అన్న కి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇట్లు మీ ఆడాల గణేష్ కుమ్మర సంఘం రంగారెడ్డి జిల్లా యూత్ తరఫున శుభాకాంక్షలు
వీరులపాడు మండలంపల్లంపల్లి గ్రామంలో సోమవారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లంపల్లి రెవిన్యూ పరిధిలోని 45 మంది రైతులకు ప్రభుత్వ రాజ్యముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను అధికారులు, కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులుకల్పించడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు, రైతులు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ పట్టాదారు పాసు పుస్తకాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ప్రభుత్వ రాజ్యముద్రతో జారీ చేసిన పాసు పుస్తకాల ద్వారా రైతులకు బ్యాంకు రుణాలు, వ్యవసాయ పెట్టుబడులు సులభంగా లభిస్తాయని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ, రైతుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, స్థానిక కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు అందుకున్న రైతులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్‌టిఆర్ జిల్లా నందిగామ నుండి రామన్నపేటకు వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. HP పెట్రోల్ బంక్ వద్ద గ్యాస్ కంపెనీ నుంచి రామన్నపేట ఫ్లైఓవర్ వరకు… అలాగే GDMM కాలేజ్, ఉమా కాలనీ, కండ్రికఆంజనేయస్వామి గుడి మార్గంలో తారురోడ్డు కుంగిపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రోజూ ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. గుంతల్లోకి వాహనాలు జారిపడి బైకులు స్కిడ్ అవ్వడం, ప్రమాదాలు జరగడం,పలువురు గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందడం వంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వర్షాలు పడితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు. నీటితో నిండిన గుంతలు డ్రైవర్లకు కనిపించకపోవడంతో ప్రమాదాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కావున నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండల కృష్ణకుమారి, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యలను వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రోజూ వందలాది వాహనాలు వెళ్తున్న ఈ రహదారి ఎందుకు నిర్లక్ష్యానికి గురైందని వారు ప్రశ్నిస్తున్నారు.ప్రజల ఆరోగ్యం, రక్షణ దృష్ట్యా ఈ రోడ్డును త్వరితగతినపునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో ముస్తాబాద్ మండల కేంద్రంలో వివిధ గ్రామాలలో విజయం సాధించిన ముదిరాజ్ సర్పంచులు ఉప సర్పంచ్లను వార్డ్ నెంబర్లను ముస్తాబాద్ మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు పిట్ల విట్టల్ గారి అధ్యక్షతన ఘనంగా సన్మానిస్తూ అధ్యక్షులు పిట్ల విట్టల్ మాట్లాడుతూ ముదిరాజ్ బిడ్డలు విజయం సాధించడం చాలా గర్వకారణం అని మండల అభివృద్ధితోపాటు సమాజ ఐక్యత కోసం ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని ఆకాంక్షించారు ప్రజా సమస్యల పరిష్కారం గ్రామాల అభివృద్ధి యువత సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో మండల వివిధ గ్రామాలలోని అధ్యక్షులు కమిటీ సభ్యులు ప్రధాన కార్యదర్శి జింక పవన్ ఉపాధ్యక్షులు కంచం నరసింహులు గీస బిక్షపతి వివిధ గ్రామాల కుల బాంధవులు పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో ముస్తాబాద్ మండల 4వ వార్డ్ స్థానంలో విజయం సాధించిన రంజాన్ నరేష్ ని ముదిరాజ్ సగం సభ్యులు ఘనంగా సన్మానించారు సందర్భంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్ల విట్టల్ మాట్లాడుతూ రంజాన్ నరేష్ గెలుపొందడం చాలా సంతోషకరమైన విషయమని ప్రజా సేవలో ముందుండి పనులు చేస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పిట్ల విట్టల్ మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు హిట్ల రాజగోపాల్ మాజీ ప్రెసిడెంట్. పుల్లూరు రవి తదితరులు పాల్గొని సంతోషం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారుచేశారు
కామారెడ్డి,05 జనవరి,( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి గ్రామాభివృద్ధిలో ముందుండే సర్పంచ్–ఉప సర్పంచ్ లకు గౌరవానికి నేడు రామారెడ్డి వేదికగా మారింది.గ్రామ పూసల సంఘం ఆధ్వర్యం లో గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్ లను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పూసల సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి, శుభ్రత, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజల సమస్యల పరిష్కారంలో సర్పంచ్, ఉప సర్పంచ్ చురుకైన పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. ప్రజలతో మమేకమై, ఎప్పుడూ అందుబాటులో ఉండటం వలన వారికి ఈగౌరవం లభించును అని అన్నారు. ఈ కార్యక్రమంలో పూసల సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నేతలకు శాలువాలు, పూలమా లలు వేసి సత్కరించారు. గ్రామాభివృద్ధికి తమ వంతు కృషి మరింతగా కొనసాగిస్తామని ఈ సంద ర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ హామీ ఇచ్చారు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)మనుబోలు మండలం కట్టువపల్లి గ్రామంలో సోమవారం తాసిల్దార్ రమాదేవి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు గ్రామ సభను నిర్వహించి అర్హులైన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీఆర్వో నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామానికి 362 పాసుపుస్తకాలు రాగా, వాటిలో 55 పాసుపుస్తకాల్లో తప్పులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 308 పాసుపుస్తకాలు మాత్రమే పంపిణీ చేశామని, మిగిలిన వాటిలో తప్పులు సరిచేసి త్వరలో అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు పోతా రెడ్డి నందగోపాల్ రెడ్డి, ఎంట్రపల్లి మహేంద్ర, పిడూరు మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి చావా ప్రణీత్ ఎంపికయ్యారు. జనవరి 3, 4, 5 తేదీల్లో శంషాబాద్‌లో జరిగిన ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర మహాసభల్లో ఆయనను రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు చావా ప్రణీత్‌కు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.