Sunday, 3 May 2026

Blog

E-పేపర్

ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి* తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 25 నుంచి మొదలయ్యే ఇంటర్ పబ్లిక్ పరీక్షల వేళ అమలు చేసే ‘ఒక్క నిమిషం ఆలస్యం’ నిబంధనను సవరించింది. ఇకపై పరీక్షలకు ఐదు నిమిషాల ఆలస్యమైనా అనుమతిస్తారని తెలిపింది. ఈ పరీక్షలకు మొత్తం 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి మొదలవుతాయి. హాల్ టికెట్లపై QR కోడ్ తో పరీక్ష కేంద్రాలకు సులభంగా చేరుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.

E-పేపర్

యాచారం మండలంలో గత 4 రోజులుగా యూరియా కోసం రైతులు ఎదురుచూపులు

యాచారం మండలంలో గత 4 రోజులుగా యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు కానీ యూరియా మాత్రం దొరకడం లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పై రైతులు దుమ్ము పోస్తున్నారు.కొద్దిగా ఈ సమస్య పరిష్కారం అయ్యేటాటు చూడండి ఒక్క రైతు ఆవేదన అర్థం చేసుకోగలరు

కామారెడ్డి

ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే…..

కామారెడ్డి, 21 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ప్రజలు ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, ఊరు, మండ లం, జిల్లా, రాష్ట్రం వంటి తప్పులను సరిచేసుకోవా లంటే స్థానిక ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్‌కు వెళ్లాలి. ఈ సమాచారం అప్‌డేట్ చేసుకోవడం ప్రభుత్వ ప్రయోజనాలు, బ్యాంకింగ్, పబ్లిక్ సర్వీసులకు అత్యంత ముఖ్యం. అవసరమైన పత్రాలుపేరు సరిదిద్దడానికి • పాన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవర్ లైసెన్స్, వోటర్ ఐడి లేదా గవర్నమెంట్ గొప్పల డాక్యుమెంట్. • పుట్టిన తేదీకి: బర్త్ సర్టిఫికెట్, పాన్, పాస్‌పోర్ట్, పదవ తరగతి పాస్- ఫేల్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్‌బుక్. • అడ్రస్ (ఊరు, మండలం, జిల్లా, రాష్ట్రం): రేషన్ కార్డు, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఎలక్షన్ కార్డ్, గ్యాస్ బుక్ లేదా భూమి పత్రాలు. • అప్‌డేట్ ప్రక్రియదగ్గరలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి దిద్దుబాటు ఫారం (Update/Correction Form) తీసుకోండి. • సరైన పత్రాల కాపీలు, ఒరిజినల్స్ చూపించి సమర్పించండి; బయోమెట్రిక్స్ (ఫింగర్‌ప్రింట్, ఐరిస్) తనిఖీ చేస్తారు.( ఫీజు ₹50 చెల్లించండి ) • 10-15 రోజుల్లో అప్‌డేట్ అవుతుంది, స్టేటస్ SRN ద్వారా చెక్ చేయవచ్చు. రామారెడ్డి మండలంలో సెంటర్లు రామారెడ్డి మండలంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద, కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యాలయంలో ఆధార్ సెంటర్లు ఉన్నాయి. • దగ్గర సెంటర్ వివరాలు uidai.gov.inలో లేదా 1947కు కాల్ చేసి తెలుసుకోండి. • ముఖ్య సలహాఆన్‌లైన్‌లో పేరు, అడ్రస్ అప్‌డేట్ చేయొచ్చు (myaadhaar.uidai.gov.in) కానీ పుట్టిన తేదీ, ఊరు వంటివి సెంటర్‌లోనే సాధ్యం; తప్పులు ఉంటే త్వరగా సరిచేయండి. ఉచిత అప్‌డేట్ కాలం గడిచినా సెంటర్‌లో ₹50తో సులభం.

ఆంధ్రప్రదేశ్

హందుజా బొగ్గు లారీలను నిలుపుదల చేయాలి..

సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి డిమాండ్ పరవాడ, (పున్నమి ప్రతినిధి) పరవాడ మండల పరిషత్ కార్యాలయం జంక్షన్ లో హిందూజా బొగ్గు లారీలను ఈ మార్గం మీదగా నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గని శెట్టి మాట్లాడుతూ హిందూజా బొగ్గు లారీలు ఈ మార్గం మీదగా ప్రయాణించడం వలన తీవ్రమైన బొగ్గు ఈ రోడ్లపై పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లారీలు నిండు ధూళి రోడ్లపై వేసుకుంటూ లారీలు వెళుతున్నాయని దీనివలన పరవాడ ఎమ్మార్వో ఆఫీస్ జంక్షన్, సినిమా హాల్ జంక్షన్, సబ్ స్టేషన్, లంకెలపాలెం గ్రామం పూర్తిగా ధూళితో కపివేయపడుతుందని ఈ గ్రామాల్లో ప్రజలు ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందని గని శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. అధిక లోడుతో ప్రయాణిస్తున్న లారీలపై ఆర్టీవో అధికారులు దాడులు చేసికేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మార్గంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రోడ్లు పూర్తిగా పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి అన్నారు. హిందూజా కి రైల్వే ద్వారా బొగ్గు తరలించుకోవాలని డిమాండ్ చేశారు. మహారత్న పరిశ్రమగా ఉన్న ఎన్టిపిసి ప్రజల్ని రకంగా కాలుష్యానికి నెట్టు వేయడం అన్యాయం అన్నారు. వెంటనే , ధూళి లారీలపై చర్యలు చేపట్టాలని గని శెట్టి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, సత్యనారాయణ, అప్పల నరసమ్మ, చిన్న, ఫాతిమా బేగం, తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 78 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 78 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఇబ్రహీంపట్నం, జనవరి 20 : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 22 అభివృద్ధి పనులను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై గల కట్ట మైసమ్మ ఆలయం వద్ద నిర్మిస్తున్న ప్రత్యేక పూజలు చేసి అక్కడ నిర్మిస్తున్న ఆలయ షెడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం చెరువు కట్ట సుందరీకరణ 18 కోట్ల రూపాయలతో పనులను, ఇబ్రహీంపట్నం నుండి నాగన్ పల్లి రోడ్డు వరకు నాలుగు లైన్ ల రోడ్డు పనులకు 60 కోట్ల రూపాయలతో నిర్మించే రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గతంలో బిఆరఎస్ ప్రభుత్వ పాలనలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సంవత్సరాల కాలంలోనే 200 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా మార్చడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో గల సబ్ రిజిస్టర్ కార్యాలయం ఇక్కడే ఉంటుందని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రిజిస్టర్ కార్యాలయాలు ప్రారంభిస్తున్న తరుణంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు రిజిస్టర్ కార్యాలయానికి అనుసందంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మైపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ మంకాల కర్ణాకర్, పిఎసిఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈసి శేఖర్ గౌడ్, జడల రవీందర్ రెడ్డి, ముత్యాల రాజశేఖర్ రావు, కప్పరి చందు, జలమోని రవీందర్ ముదిరాజ్, చెనమోని యాదగిరి, పప్పె శ్రీను, ఇందూరి శ్రీనివాస్, శశిధరప్ప, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఉక్కు లో ముగిసిన అధికారుల సంఘం ఎన్నికలు

ఉక్కు లో ముగిసిన అధికారుల సంఘం ఎన్నికలు స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం, జనవరి 21, (పున్నమి ప్రతినిధి). విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మంగళవారం జరిగిన అధికారుల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. మధ్యాహ్నం 12.30 నుంచి 03.30 వరకు మొదటి విడత, తిరిగి సాయంత్రం 05.30 నుండి 08.30 వరకు రెండవ విడత పోలింగ్ నిర్వహించారు. మొత్తం 2350 ఓట్లకు గాను పోస్టల్ బ్యాలెట్ తో కలపి 1588 ఓట్లు పొలయ్యాయి. అనంతరం జరిగిన లెక్కింపు జరిగింది. అధ్యక్షుడు గా యమ్.యమ్.ఎస్.ఎమ్. డిపార్ట్మెంట్ సీనియర్ మేనేజర్ ఎస్. విద్యుత్ కుమార్ వర్మ, జనరల్ సెక్రటరీ గా క్యూఏటిడి డిపార్ట్మెంట్ సీనియర్ మేనేజర్ కె.వి.డి. ప్రసాద్ , వైస్ ప్రెసిడెంట్ గా వాటర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ మేనేజర్ బి.పి. శ్రీకాంత్ కళ్యాణ్ , జాయిన్ సెక్రటరీ గా ఎల్.ఎమ్. ఎమ్. ఎమ్. డిపార్ట్మెంట్ మేనేజర్ ఎమ్.సత్యనారాయణ ఎన్నికయ్యారు.

E-పేపర్

పెండింగ్ చలాన్లు కట్టమని వాహనదారులను బలవంతపెట్టొద్దు చలాన్ల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

పెండింగ్ చలాన్లు కట్టమని వాహనదారులను బలవంతపెట్టొద్దు చలాన్ల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు పెండింగ్ చలాన్లు కట్టాలని బైక్ కీస్ లాక్కొని బలవంత పెట్టొద్దని, స్వచ్ఛందంగా చెల్లిస్తేనే వసూలు చేయాలని, చెల్లించకపోతే నోటీసులు ఇవ్వాలని వ్యాఖ్యానించిన హైకోర్టు

హైదరాబాద్

తెలంగాణలో రాబోయే మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ల నియామకం

తెలంగాణ జనవరి ( పున్నమి ప్రతినిధి) బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారి ఆదేశాల మేరకు, ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు ఈ కింది వారిని నియమిస్తూ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్ సింగ్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. – ఎన్నికల ఇన్‌ఛార్జ్: శ్రీ ఆశిష్ షెలార్ గారు (మహారాష్ట్ర మంత్రి) – ఎన్నికల కో-ఇన్‌ఛార్జ్‌లు: శ్రీ అశోక్ పర్నామి గారు (రాజస్థాన్ రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షులు). శ్రీమతి రేఖ శర్మ గారు (రాజ్యసభ ఎంపీ)

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయం 8 అయినా కనిపించని రోడ్డు

దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామo రోడ్డులో ఉదయం 8 అయిన మంచు కురవటం తగ్గేలేదు ఉదయం పనులకు వెళ్లే కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మంచు కురవటం వలన ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ప్రజలు వాహనాలు మీద వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వేల్లాలని మలుపుల వద్ద లైట్స్, మరియు సిగ్నెల్స్ వేసుకోవాలి ప్రయాణలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి

ఆంధ్రప్రదేశ్

పోలీస్ అభ్యర్థులకు ఇంపాక్ట్ ఫౌండేషన్ ప్రత్యేక శిక్షణ

పున్నమి ప్రతినిధి – ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని రిమ్స్ ఆడిటోరియంలో పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల కోసం ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 700 మంది పోలీసు అభ్యర్థులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్, సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ ట్రైనర్ శ్రీ గంపా నాగేశ్వర రావు గారు హాజరై అభ్యర్థులకు మార్గదర్శనం చేశారు. పోలీసు విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడం, మానసిక స్థైర్యం పెంపొందించుకోవడం, క్రమశిక్షణతో విధులు నిర్వహించడం వంటి అంశాలపై ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పి.టి.సి ప్రిన్సిపల్ శ్రీమతి జి.ఆర్. రాధిక ఐపిఎస్, వైస్ ప్రిన్సిపల్ శ్రీ డి. లక్ష్మణ కుమార్, డి.టి.సి వైస్ ప్రిన్సిపల్ శ్రీ గురునాథ్ బాబు పాల్గొన్నారు. ఇంపాక్ట్ ఫౌండేషన్ ట్రైనర్లు డా. కె.టి.సి పాపారాయుడు, వెంకట్ గార్లు అభ్యర్థులకు శిక్షణ అందించారు. ఈ శిక్షణ పోలీసు అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం, నైతిక విలువలు పెంపొందించిందని నిర్వాహకులు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.