Sunday, 3 May 2026

Blog

కామారెడ్డి

ఆరైవ్ అలైవ్ కార్యక్రమంలో హెల్మెట్ నమూనా ఆవిష్కరణ..

– రోడ్డు భద్రతకు మంత్రి సీతక్క పిలుపు! కామారెడ్డి,20 జనవరి,( పున్నమి ప్రతినిధి ) : రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రాణాలను కాపాడా లనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “ఆరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క (దానసరి అనసూ య) నూతన హెల్మెట్ నమూనాను కామారెడ్డి పట్టణంలో ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి సీతక్క ప్రజలకు స్పష్టం చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారు లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హైదరాబా ద్. ఈ కొత్త హెల్మెట్ భద్రతా ప్రమాణాలకు అనుగు ణంగా ఉండటంతో పాటు తేలికగా, సౌకర్యవంతం గా రూపొందించబడిందని తెలిపారు. యువత నుంచి అన్ని వయస్సు వారు దీనిని నిత్యం వాడే లా అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్య మని చెప్పారు.ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాలను తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుం టోందని, “ఆరైవ్ అలైవ్” ద్వారా ప్రజల్లో భద్రతా స్పృహ పెంచుతున్నామని మంత్రి వెల్లడించారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు సహక రించాలని పిలుపునిచ్చారు. అనంతరం సర్పంచ్ ల సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా సర్పంచులు పని చేయాలి. మంత్రి సీతక్క, కలెక్టర్ సూచనలు! గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ప్రతి సర్పంచ్ పని చేయాలని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఆదేశిం చారు.గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్యా నికి పునాది అని, ప్రజల అవసరాలను గుర్తించి ప్రభు త్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయా లని సూచించారు.త్రాగునీరు, పారిశుధ్యం, రహదా రులు, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయా లకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సీతక్క చెప్పా రు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అర్హులకు చేరవేయడంలో సర్పం చులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ప్రజల తో నిరంతర సమన్వయంతో పారదర్శక పాలన సాగించాలని పిలుపునిచ్చారు.గ్రామాలను రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచిం చారు. గ్రామ పంచాయతీలు మౌలిక సదుపాయా ల కల్పనలో కీలకమని, పరిశుభ్రత, త్రాగునీరు, పచ్చదనం, విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, నాణ్యత, పారదర్శకతతో పని చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న తుర్కయంజాల్ మున్సిపల్ అధికారులు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న తుర్కయంజాల్ మున్సిపల్ అధికారులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న తుర్కయంజాల్ మున్సిపల్ అధికారులకు బ్రాహ్మణపల్లి లోని స్మశాన వాటికలో చెత్త వేస్తూ గత 20 రోజులు నుంచి కుప్పలు తిప్పలుగా పేరుకుపోయిన చెత్తను నిప్పు పెట్టి పొగ తో రహదారి వెంట వచ్చి పోయే వాళ్లకు అధికారులు కు స్వాగతం పలుకుతున్నారు రాష్ట్రంలో చెత్త బహిరంగంగా కాల్చడం నిషేధం అయినా అధికారులు అమలు చేయట్లేదని ప్రజలు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల

కాంగ్రెస్ పార్టీలో చేరిన సింగారం గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియుయువత

ముస్తాబాద్/పున్నమి ప్రతినిధి జనవరి 20 ఈరోజు ముస్తాబాద్ మండలంలోని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కే.కే. మహేందర్ రెడ్డి గారి స్వగృహంలో ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఆ గ్రామానికి చెందిన పలువురు నాయకులు మరియు యువత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరినీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కే.కే. మహేందర్ రెడ్డి గారు సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతోనే తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కొత్తగా చేరిన నాయకులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం, ప్రజల పక్షాన తీసుకుంటున్న నిర్ణయాలే తమను ఆకర్షించాయని వారు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ప్రపంచ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో చోటు దక్కించుకున్న డా. అన్నపూర్ణ వరద రాజులు గారు

భారతదేశానికి గర్వకారణం. ప్రకాశం జిల్లా మూలాలు కలిగి, ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన ఎంఎస్సీ, పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టరల్ ఫెలో పూర్తి చేసి 33 సంవత్సరాలకు పైగా అకాడమిక్, పరిశోధనా సేవలందించారు. 250కి పైగా పరిశోధనా పత్రాలు, 8 పుస్తకాలు, 24 అంతర్జాతీయ, 77 జాతీయ సదస్సుల్లో పాల్గొన్న ఆయన పరిశోధన రంగంలో విశేష గుర్తింపు పొందారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ విడుదల చేసిన టాప్-2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో 2021–2025 వరకు వరుసగా చోటు దక్కించుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం. మూలంగా ప్రకాశం, ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు చెందిన అన్నపూర్ణ వరద రాజులు గారు ఎంఎస్సీ, పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టరల్ ఫెలో చేసి శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో 33 సంవత్సరాలకు పైగా అకాడమిక్ సేవలందించారు. అనేక పరిశోధనా సంస్థల్లో, పరిశోధనా యూనివర్సిటీలలో ఆయన కీలక పాత్రలు నిర్వహించారు. పరిశోధన రంగంలో ఆయన చేసిన కృషికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అనేక అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధన వ్యాసాలు ప్రచురితమై ఆయన ఖ్యాతిని మరింత పెంచాయి. అన్నపూర్ణ వరద రాజులు గారు ఇప్పటి వరకు 250కి పైగా పరిశోధనా పత్రాలు ప్రచురించి, దేశవిదేశాల్లో అనేకమంది విద్యార్థులకు పరిశోధనా మార్గనిర్దేశం చేశారు. అంతేకాకుండా శాస్త్ర సాంకేతిక రంగంలో అనేక కీలక ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ క్రమంలో 8 పుస్తకాలు ప్రచురించగా, వివిధ శాస్త్రీయ సదస్సుల్లో 24 అంతర్జాతీయ, 77 జాతీయ స్థాయి పరిశోధన పత్రాలు సమర్పించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో ఆయన చేసిన సేవలకు దేశ విదేశాల్లో అనేక పురస్కారాలు లభించాయి. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ విడుదల చేసిన టాప్-2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో వరుసగా 5 సంవత్సరాలు (2021–2025) చోటు దక్కించుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సేఫ్టీ అండ్ క్లైమేట్ (FRSC), ఫుడ్ అండ్ ఎన్విరాన్మెంట్ (FCEnv) వంటి ప్రతిష్ఠాత్మక గ్లోబల్ అకాడమిక్ సంస్థల్లో సభ్యత్వం పొందిన ఆయన, శాస్త్ర రంగంలో భారతదేశానికి గౌరవాన్ని మరింత పెంచుతున్నారు.

ఖమ్మం

వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన వాసవి క్లబ్ ఖమ్మం అధ్యక్షులు ఆచంటి కోటేశ్వరరావు.

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం నగరంలోని ట్రంక్ రోడ్డుపై ఉన్న కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వ ఖమ్మం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకములు, అర్చనలు నిర్వహించగా, అనంతరం భక్తులకు ప్రసాద వినియోగం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ చైర్మన్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ గారికి క్లబ్ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రేటర్ ఖమ్మం వాసవి క్లబ్ అధ్యక్షులు శ్రీ ఆచంటి కోటేశ్వరరావు, కోశాధికారి శ్రీ తాటికొండ అరవింద్ కుమార్, గౌరవ సభ్యులు శ్రీ కొంకిమళ్ళ మృత్యుంజయ రావు, సభ్యులు నాగేశ్వరరావు, రాజేందర్ పాల్గొన్నారు. అలాగే వాసవి వనిత క్లబ్ సభ్యులు కూడా సహకరించి కార్యక్రమాన్ని మరింత ఘనంగా విజయవంతం చేశారు.

రాజన్న సిరిసిల్ల

కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డిపేట సర్పంచ్ మరియు ఉప సర్పంచ్

రాజన్న సిరిసిల్ల జిల్లా/పున్నమి ప్రతినిధి /జనవరి 20 గంభరావుపేట్ మండలంలోని మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన సర్పంచ్ మహేష్ యాదవ్ గారు, ఉప సర్పంచ్ బాబు గారు సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. గ్రామ స్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. మల్లారెడ్డిపేట గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం సర్పంచ్ మహేష్ యాదవ్ గారు మాట్లాడుతూ ప్రజల ఆశయాలు, గ్రామ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, గ్రామ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు శ్రమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్న ఎన్టీఆర్ గారు

తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్న ఎన్టీఆర్ గారు. తెలుగుదేశం పార్టీ నాయకుల కర్మాగారం. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. గొల్లపూడిలో ఘనంగా ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా మైలవరం జనవరి తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్న ఎన్టీఆర్ గారు అని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ గారి నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలకు పండ్లు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ మరణం లేని కారణ జన్ముడు అన్న ఎన్టీఆర్ గారు అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ నేతల కర్మాగారం అన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతుకు విద్యుత్, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితరసాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుని సేవలు మనకు ఆదర్శమన్నారు. అన్న ఎన్టీఆర్ గారి ఆశయాలు సాధిస్తామన్నారు. ప్రతిఒక్కరికీ ఎన్టీఆర్ గారు ఆదర్శనీయుడన్నారు. జోహార్ అన్న ఎన్టీఆర్ గారు అంటూ నినదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీల అభ్యున్నతికి, సంక్షేమానికి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ అన్నారు. ఎన్టీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ అన్నగారి ఆశయాల సాధనకు సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా ఎన్టీఆర్ గారి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు నియోజకవర్గంలోని టీడీపీ కుటుంబ సభ్యులతో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ గారి అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులకు గత 20 రోజులు నుంచి కుప్పలు తిప్పలుగా పేరుకుపోయిన చెత్త చదరం ఎమ్మెల్యే రాకతో హడావిడిగా నిప్పు పెట్టి పొగ తో అధికారులుస్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రంలో చెత్త బహిరంగంగా కాల్చడం నిషేధం అయినా అధికారులు అమలు చేయట్లేదని ప్రజలు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు ఎస్ ఐ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన విజయ్

ఆత్మకూరు లోని ఎస్ ఐ జిలాని కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు రిపోర్టర్ పెర్నపాటి విజయ్ మాట్లాడుతూ మీరు అష్ట ఆరోగ్యాలతో,సుఖ సంతోషాలతో మీరు మరెన్నో వేడుకలు చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో మండలం రిపోర్టర్ బీమవరం తిరుపతి ఉన్నారు.

E-పేపర్

మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పున్నమి ప్రతినిధి 9640204826 78 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం. ఎన్నికల్లో సందర్భంగా నియోజక ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా…18 కోట్ల రూపాయలతో HMDA ద్వారా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్ట సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.పట్టణ ప్రధాన కూడలి లో 60 కోట్ల రూపాయలతో HRDCL ద్వారా చేపట్టిన నాలుగు లైన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభివృద్ధికి మారుపేరుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా మిగిలిపోతుందని ఎమ్మెల్యే పలు సందర్భాల్లో చెప్పిన విషయం విధితమే.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.