Wednesday, 29 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు శుభాకాంక్షలు

నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్ శ్రీమతి మేకపాటి శాంతకుమారిని ఈ రోజు రేబాల వీధిలోని కేంద్ర గ్రంథాలయంలో ఆంధ్ర ప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఏర్పడిన గ్రంథాలయ పునర్వికాస వేదిక, నెల్లూరు జిల్లా కన్వీనర్, అంతర్జాతీయకవి డాక్టర్ పెరుగు రామకృష్ణ కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పునర్వికాస వేదిక పిల్లలలో పఠనాశక్తి పెంపొందించే విధంగా పుస్తకాలు తయారు చేసి విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందని, గ్రంథాలయాల బలోపేతానికి తమ వంతు సహకారం అందిస్తున్నామని చెప్పారు. చిల్డ్రన్ పార్క్ లాంటి ప్రాంతాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రచయితలు స్వయంగా ప్రచురించుకున్న పుస్తకాలు కొనుగోలు చేయడం ద్వారా ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. జిల్లా రచయిత లందరి పక్షాన సంస్థ అధినేతకు అభినందనలు తెలిపారు…!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బద్దెవోలు సర్పంచ్ తండ్రి రామిరెడ్డి మృతి… నివాళులర్పించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలం బద్దెవోలు సర్పంచ్ ఉగ్గుముడి శశికుమార్ రెడ్డి తండ్రి ఉగ్గుముడి రామిరెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ సందర్భంగా వారి పార్థివ దేహాన్ని సందర్శించిన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. రామిరెడ్డి సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఖమ్మం

నూతన వధు వరులని ఆశీర్వదించిన బీజేపీ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ

ఖమ్మం ఫిబ్రవరి (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా ఇంచార్జి) ఏసీపీ సాంబరాజు కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యక్రమానికి రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ పాల్గొన్నారు. వారు వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి, దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

మధిర రైల్వే స్టేషన్‌ను సౌత్ కోస్టరైల్వే పరిధిలోకి మార్చే ప్రయత్నం తెలంగాణ ఆదాయం ఆంధ్రకు మళ్లే ప్రమాదం – ప్రజల్లో ఆందోళన:

ఖమ్మం ఫిబ్రవరి (పువ్వాడ నాగేంద్ర కుమార్ , జిల్లా ఇంచార్జి) ఖమ్మం జిల్లాలో ఖమ్మం తరువాత అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా గుర్తింపు పొందిన మధిర రైల్వే స్టేషన్‌ను ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధి నుండి కొత్తగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్ట్ రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలోకి చేర్చే చర్యలు జరుగుతున్నాయనే వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మార్పు అమలైతే మధిర రైల్వే ఆదాయం తెలంగాణకు కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు మళ్లే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ప్రస్తుతం మధిర స్టేషన్ నుండి రోజూ వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, కార్మికులు రైలు ప్రయాణం చేస్తున్నారు. మధిర పరిధిలోని రైల్వే టికెట్ విక్రయాలు, సరుకు రవాణా ఆదాయం తెలంగాణ రాష్ట్ర ఖాతాలోకి వస్తోంది. అయితే స్టేషన్‌ను విజయవాడ డివిజన్‌కు చేర్చితే ఆ ఆదాయం ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైల్వే పరంగా మధిర సెక్షన్ పరిధి దెందుకూరు–మధిర మధ్య నుంచి పందిళ్లపల్లి–ఖమ్మం మధ్య వరకు ఉంటుంది. అయితే కొత్త ప్రతిపాదన ప్రకారం కొండపల్లి నుంచి మోటమర్రి వరకు ఉన్న సుమారు 8 కిలోమీటర్ల భాగాన్ని ఆధారంగా తీసుకొని మొత్తం మధిర స్టేషన్‌ను విజయవాడ డివిజన్ పరిధిలోకి మార్చే యోచన ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం 8 కిలోమీటర్ల పరిమితి ఆధారంగా ఒక కీలక స్టేషన్‌ను ఇతర జోన్‌కు చేర్చడం సరైన నిర్ణయమా? అనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది. ప్రస్తుతం పద్మావతి, కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు ఖమ్మం నుంచి విజయవాడకు వెళ్తూ మధిరలో ఆగుతున్నాయి. అయితే విజయవాడ నుంచి ఖమ్మం దిశగా వచ్చే సమయంలో ఆగకపోవడం ఇప్పటికే ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తోంది. భవిష్యత్తులో మధిర స్టేషన్ పూర్తిగా విజయవాడ డివిజన్ పరిధిలోకి వెళ్తే, రైళ్ల ఆగుదల సంఖ్య మరింత తగ్గే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధిరలో నివసిస్తున్న ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఏకమై ఈ అంశంపై స్పందించాల్సిన అవసరం ఉందని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణ భూభాగంలో ఉన్న స్టేషన్‌ను ఇతర రాష్ట్ర పరిధిలోకి మార్చే నిర్ణయం స్థానిక ఆర్థిక వ్యవస్థపై, ఉద్యోగ అవకాశాలపై, అభివృద్ధిపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఖమ్మం తర్వాత ప్రాధాన్యత కలిగిన రైల్వే స్టేషన్‌గా నిలిచిన మధిర భవిష్యత్తు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆదాయం, రైళ్ల ఆగుదల, ప్రాంతీయ అభివృద్ధి వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. మధిర రైల్వే స్టేషన్‌ను తెలంగాణ పరిధిలోనే కొనసాగించాలన్నది స్థానికుల ఆకాంక్షగా స్పష్టంగా కనిపిస్తోంది.

తిరుపతి

శివునికి అభిషేకం విదేశీయ మహిళలు భజనలు

పున్నమి ప్రతినిధి 21 ఫిబ్రవరి రేణిగుంట మండలం తిరుపతి జిల్లా రేణిగుంట శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞ్యానపీఠంలో శివలింగ ప్రతిష్టతను శుక్రవారం ఘనంగా జరిగింది 32 దేశాల నుంచి 140 మంది విదేశీయ భక్తులు హాజరయ్యారు శివనామ స్మరణల మధ్య రుద్రాభిషేకం మహా చండీ హోమం నిర్వహించారు జర్మనీ గురూజీ పరమహంస విశ్వనాధ స్వామీజీ చేతులు మీదుగా పూజా కార్యక్రమాలు జరిగాయి విదేశీ భక్తులు శివ నామ స్మరణతో మైమరిచిపోయారు Uploaded Video:

తిరుపతి

స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరంటు ర్యాలీ చేపట్టిన విద్యార్థినులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తి పట్టణంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరి సమాజ సేవకులుగా మారాలని కాసా గార్డన్ వద్ద ఉన్న గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలకు చెందిన గైడ్స్ విద్యార్థినులు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ కమీషనర్ టి. రమేష్ బాబు, పాఠశాల గైడ్ కెప్టెన్ కుసుమ కుమారి, యూత్ చైర్మన్ ఎస్ కె అజారుద్దీన్, స్కౌట్ మాస్టర్లు సుబ్రహ్మణ్యం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

వైయస్ జగన్.. హైందవ సమాజ ద్రోహి -డా.యం.ఉమేష్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తి నియోజికవర్గ తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన అతి హేయమైన చర్యలగూర్చి పత్రిక ముఖంగా ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ కల్తీ చేసిన మహాపాపం కప్పి పుచ్చుకోవడానికి వేంకటేశ్వర స్వామి చిత్రాలను అపవిత్రం చేసి మరో మహాపరాధానికి పాల్పడిన జగన్ రెడ్డి, అతని సైకో వైసీపీ శాసనమండలి సభ్యులు హైందవ సమాజ ద్రోహులని ఆరోపణలు చేశారు. శాసన మండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానిస్తూ, స్వామి వారి చిత్రపటాలు విసిరేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, హిందూ దేవతలను అవమానించడమే లక్ష్యంగా వైసీపీ దుష్ట రాజకీయాలు చేస్తున్న జగన్ రెడ్డి, అతని బృందం హిందువులకు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. కల్తీ చేసిన నేరస్తుల పై చర్చ లేకుండా, స్వామి మీదకు చర్చను తీసుకుని వస్తారా ? చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోలతో రావడం అనైతికం అని తెలిసీ.. వైసీపీ సభ్యులు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా, రెచ్చగొట్టి దేవుడిని అవమానించిన వైసీపీ సభ్యులు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. హెరిటేజ్ ఫుడ్స్‌‌ని లక్ష్యంగా చేసుకొని సాక్షి మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై హెరిటేజ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేసిందని కేసును విచారించిన కోర్టు వైసీపీ ప్రచారాన్ని ఫేక్ ప్రచారం అని తేల్చిందన్నారు. దీనికి సంబంధించిన వార్తలు, పోస్టుల లింకులను 24 గంటల్లోగా తొలగించాలని కోర్టు ఆదేశించింది. దీనిని ప్రజల దృష్టి నుండి మరల్చడానికి జగన్ రెడ్డి డైరెక్షన్ లో వైసిపికి చెందిన శాసనమండలి సభ్యులు నీచాతినీచమైన చర్యలకు పాల్పడి,కోట్లాది మంది వెంకన్న భక్తుల మనోభావాలను గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల వెళ్ళినప్పుడు జగన్ రెడ్డి ఎలాగైతే చెప్పులతోనే ఆలయ ప్రాంగణం అంతా తిరిగాడో, అలాగే వైసీపీ నేతలు శాసనమండలిలో చెప్పులు, బూట్లు వేసుకునే వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను పట్టుకున్నారని,ఇంత అపచారం చేసిన వారు తమ తప్పులకు లెంపలు వేసుకొని హిందువులకు క్షమాపణలు కోరాల్సింది పోయి… అడ్డంగా అబద్దాలు చెబుతూ ఛాలెంజ్ లు చేస్తున్న వీళ్ళను వెంకన్న స్వామే తగిన విధంగా శిక్షించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో ‘జీరో లిట్టర్’ లక్ష్యంగా నేడు భారీ పారిశుధ్య డ్రైవ్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తి పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మునిసిపాలిటీ చేపట్టిన ‘జీరో లిట్టర్ గవర్నెన్స్’ కార్యక్రమాన్ని నేడు నిర్వహిస్తునంరు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన భక్తులు భారీగా పాల్గొన్న గిరి ప్రదక్షిణ మార్గంలోని పరిసరాలను పారిశుధ్య సిబ్బంది యుద్ధప్రాతిపదికన శుభ్రం చేయనున్నారు. మునిసిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు నేడు పారిశుధ్య సిబ్బంది, మెప్మా సిబ్బంది అందరూ కలిసి సమన్వయంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. గిరి ప్రదక్షిణ మార్గానికి ఆనుకుని ఉన్న కీలక ప్రాంతాలైన కైలాసగిరి కాలనీ, టైలర్స్ కాలనీ, రాజీవ్‌నగర్,టిడ్కో (TIDCO) హౌసెస్ వంటి ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించి ‘లిటరింగ్’ (చెత్త వేయడం) నివారణపై స్థానికులకు అవగాహన కల్పిస్తూనే, క్షేత్రస్థాయిలో సిబ్బంది శ్రమదానం చేపడతారు. ఇటీవలే ప్రభుత్వం రూ. 10 కోట్ల వ్యయంతో 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని అభివృద్ధి చేసిన నేపథ్యంలో ఆ మార్గం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని మునిసిపాలిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు విడిచివెళ్లిన వ్యర్థాలను వెంటనే తొలగించడం ద్వారా ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పట్టణ ప్రజలు కూడా ఈ ‘జీరో లిట్టర్’ నినాదంలో భాగస్వాములు కావాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా మునిసిపాలిటీకి సహకరించాలని అధికారులు కోరారు.

తిరుపతి

ఎంపీ మద్దిల గురుమూర్తి చొరవతో పెద్ద కన్నలి త్రాగునీటి సమస్య పరిష్కారం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 20: తిరుపతి పార్లమెంటు పరిధిలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం పెద్ద కన్నలి గ్రామంలో దీర్ఘకాల త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందడుగు పడింది. గ్రామస్థులు, నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి సూచనల మేరకు గ్రామస్తుల దాహార్తిని తీర్చేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి, తిరుపతి లోక్‌సభ సభ్యులు మద్దిల గురుమూర్తి ఎంపీ నిధుల నుంచి రూ.7.50 లక్షలు మంజూరు చేశారు. మంజూరైన నిధులతో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే భవన నిర్మాణం పూర్తి కాగా, ప్రస్తుతం వాటర్ ప్లాంట్ యంత్రాంగం అమరిక పనులు చివరి దశలో ఉన్నాయి. రేపటిలోగా అన్ని పనులు పూర్తి చేసి ఆదివారం ప్లాంటును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా త్రాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ గ్రామానికి ఈ వాటర్ ప్లాంట్ వరంగా మారుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను గుర్తించి పరిష్కారానికి కృషి చేసిన బియ్యపు మధుసూదన రెడ్డికి, వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసిన ఎంపీ మద్దిల గురుమూర్తికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

తిరుపతి

ప్రతి రైతు ఈ పంట నమోదు చేయించుకొవాలి-జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు

శ్రీకాళహస్తి ఫిబ్రవరి 20: మండలలోని చల్లపాలెం గ్రామంలో ఈ పంట నమోదు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పంట సాగు చేసిన ప్రతి రైతు తప్పనిసరిగా రైతు సేవా కేంద్రం సిబ్బందిచే నమోదు ఈ పంట, ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రంలో మద్దతు ధరలకు విక్రయించాలంటే తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకొని, ఈ-కెవైసి ను ఈ నెల 25 వ తారీఖులోగా చేయించుకోవాలని ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఎంత ప్రాముఖ్యమో అదేవిధంగా ప్రతి రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంతే ప్రాముఖ్యమైనది. త్వరలో ప్రభుత్వం నుండి రైతులకు కార్డు కూడా అందజేస్తుందని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోనని రైతులు ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులవుతారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరికి ప్రభుత్వ పథకాలు వర్తించవని స్పష్టంగా తెలియజేశారు. ప్రతి రైతు తమ గ్రామానికి చెందిన రైతు సేవా కేంద్రంలో ఉన్న వ్యవసాయ సిబ్బంది వద్దకు తమ ఆధార్ కార్డు, పట్టదారు పాసు పుస్తకము తో పాటు ఆధార్ కార్డు కు అనుసంధానమైన ఫోన్ తీసుకొని వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కు ఈ నెల 28 వ తారీఖు ఆఖరి గడువు అని తెలియజేశారు. ప్రతి రైతు తమ ఫోన్ లో ఏపీ ఏఐఎంఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. రాబోయే రోజులలో వ్యవసాయానికి సంబంధించిన ప్రతి రైతు సోమ భూమి వివరములు, ఈ పంట నమోదు వివరములు, సస్య రక్షణ, వాతావరణ సమాచారం మొదలగు అన్ని విషయాలు ఈ యాప్ నందు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ.రమేష్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సురేంద్ర రెడ్డి రైతు సేవా కేంద్రం సిబ్బంది భాగ్యలక్ష్మి రైతులు పార్థ సారథి రెడ్డి , గోవింద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.