Wednesday, 29 April 2026

Blog

తిరుపతి

ఎంపీ మద్దిల గురుమూర్తి చొరవతో పెద్ద కన్నలి త్రాగునీటి సమస్య పరిష్కారం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 20: తిరుపతి పార్లమెంటు పరిధిలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం పెద్ద కన్నలి గ్రామంలో దీర్ఘకాల త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందడుగు పడింది. గ్రామస్థులు, నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి సూచనల మేరకు గ్రామస్తుల దాహార్తిని తీర్చేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి, తిరుపతి లోక్‌సభ సభ్యులు మద్దిల గురుమూర్తి ఎంపీ నిధుల నుంచి రూ.7.50 లక్షలు మంజూరు చేశారు. మంజూరైన నిధులతో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే భవన నిర్మాణం పూర్తి కాగా, ప్రస్తుతం వాటర్ ప్లాంట్ యంత్రాంగం అమరిక పనులు చివరి దశలో ఉన్నాయి. రేపటిలోగా అన్ని పనులు పూర్తి చేసి ఆదివారం ప్లాంటును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా త్రాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ గ్రామానికి ఈ వాటర్ ప్లాంట్ వరంగా మారుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను గుర్తించి పరిష్కారానికి కృషి చేసిన బియ్యపు మధుసూదన రెడ్డికి, వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసిన ఎంపీ మద్దిల గురుమూర్తికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

తిరుపతి

ప్రతి రైతు ఈ పంట నమోదు చేయించుకొవాలి-జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు

శ్రీకాళహస్తి ఫిబ్రవరి 20: మండలలోని చల్లపాలెం గ్రామంలో ఈ పంట నమోదు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పంట సాగు చేసిన ప్రతి రైతు తప్పనిసరిగా రైతు సేవా కేంద్రం సిబ్బందిచే నమోదు ఈ పంట, ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రంలో మద్దతు ధరలకు విక్రయించాలంటే తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకొని, ఈ-కెవైసి ను ఈ నెల 25 వ తారీఖులోగా చేయించుకోవాలని ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఎంత ప్రాముఖ్యమో అదేవిధంగా ప్రతి రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంతే ప్రాముఖ్యమైనది. త్వరలో ప్రభుత్వం నుండి రైతులకు కార్డు కూడా అందజేస్తుందని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోనని రైతులు ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులవుతారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరికి ప్రభుత్వ పథకాలు వర్తించవని స్పష్టంగా తెలియజేశారు. ప్రతి రైతు తమ గ్రామానికి చెందిన రైతు సేవా కేంద్రంలో ఉన్న వ్యవసాయ సిబ్బంది వద్దకు తమ ఆధార్ కార్డు, పట్టదారు పాసు పుస్తకము తో పాటు ఆధార్ కార్డు కు అనుసంధానమైన ఫోన్ తీసుకొని వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కు ఈ నెల 28 వ తారీఖు ఆఖరి గడువు అని తెలియజేశారు. ప్రతి రైతు తమ ఫోన్ లో ఏపీ ఏఐఎంఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. రాబోయే రోజులలో వ్యవసాయానికి సంబంధించిన ప్రతి రైతు సోమ భూమి వివరములు, ఈ పంట నమోదు వివరములు, సస్య రక్షణ, వాతావరణ సమాచారం మొదలగు అన్ని విషయాలు ఈ యాప్ నందు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ.రమేష్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సురేంద్ర రెడ్డి రైతు సేవా కేంద్రం సిబ్బంది భాగ్యలక్ష్మి రైతులు పార్థ సారథి రెడ్డి , గోవింద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

రంగుల వెల్లువలో శ్రీకాళహస్తీశ్వరుడు.. కనువిందుగా వసంతోత్సవ వేడుకలు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు స్వామి, అమ్మవార్ల ‘వసంతోత్సవం’ అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగింది. ప్రకృతి పరవశించేలా, భక్తుల తన్మయత్వం మధ్య జరిగిన ఈ రంగుల వేడుకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని సంతరించుకున్నాయి. వసంత ఋతువు రాకకు సంకేతంగా, లోక కల్యాణార్థం నిర్వహించిన ఈ వేడుకలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా సుగంధ ద్రవ్యాలు కలిపిన పసుపు, కుంకుమలు, వసంత తీర్థాన్ని స్వామివారిపై చిలకరించి ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులు ఒకరిపై ఒకరు వసంతాలు చల్లుకుంటూ ‘హర హర మహాదేవ’ శంభో శంకర’ స్మరణతో ముక్కంటి క్షేత్రాన్ని మారుమోగించారు. బ్రహ్మోత్సవాల ముగింపు దశలో జరిగే ఈ వసంతోత్సవంలో పాల్గొంటే సకల పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. అందుకే స్థానిక భక్తులతో పాటు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన యాత్రికులు కూడా పెద్ద ఎత్తున ఈ రంగుల కేళిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి అద్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, పాలక మండలి సబ్యులు ఆలయ ఈఓ, అధికారులు పాల్గొన్నారు.

తిరుపతి

ముక్కంటిశునికి ముత్యాల సొబగులు-స్వామి, అమ్మవార్లకు ముత్యాల కవచాలు విరాళం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటుతుండగా, స్వామి, అమ్మవార్ల అలంకరణలో మరో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. హైదరాబాద్‌ వాస్తవ్యులు శ్రీరంగ ఎంటర్ప్రైజెస్, అలంకార సేవా ట్రస్ట్ ప్రతినిధులు ముక్కంటిపై తమ భక్తిని చాటుకున్నారు. శ్రీ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల కోసం ప్రత్యేకంగా చేయించిన ముత్యాల కవచాలను శనివారం నాడు ఆలయ అధికారులకు అందజేశారు. భక్తిభావంతో అపురూప కానుక హైదరాబాద్ వాస్తవ్యులైన దాతలు ఈ అపురూపమైన ముత్యాల కవచాలను ఆలయ కార్యనిర్వహణాధికారికి శాస్త్రోక్తంగా అందజేశారు. అత్యంత ఖరీదైన, నాణ్యమైన ముత్యాలతో నైపుణ్యం కలిగిన కళాకారులచే ఈ కవచాలను రూపొందించారు. ఉత్సవమూర్తులకు ఈ కవచాలను అలంకరించినప్పుడు వారి వైభవం మరింత దేదీప్యమానంగా వెలుగుతుందని దాతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ మాట్లాడుతూ.. లోక కళ్యాణం కోసం జరిగే ఉత్సవాల్లో స్వామివారి అలంకరణకు ఇలాంటి విరాళాలు అందజేయడం అభినందనీయమన్నారు. దాతలకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, వారికి ఆలయ మర్యాదలతో తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. బ్రహ్మోత్సవాల వేళ విదేశీ భక్తుల రాకతో పాటు, ఇలాంటి భారీ విరాళాలు అందడం ఆలయ ప్రాశస్త్యాన్ని చాటుతోందని భక్తులు చర్చించుకుంటున్నారు. ఆలయాదికారులు దాతలకు శ్రీ స్వామి, అమ్మవార్ల ప్రత్యెక దర్సన ఏర్పాట్లు చేయించి తీర్ధ, ప్రసాదాలు అందజేశారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో విదేశీయుల శివనామస్మరణ-ముక్కంటి సేవలో రష్యా, జర్మనీ భక్తులు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తి క్షేత్రం అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ ముక్కంటి దర్శనానికి భక్తులు పోటెత్తుతుండగా శుక్రవారం నాడు విదేశీ భక్తుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రష్యా, జర్మనీ దేశాలకు చెందిన సుమారు 200 మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆధ్యాత్మిక సాగరంలో విదేశీయులు ఆలయానికి చేరుకున్న విదేశీ ప్రతినిధుల బృందం, సంప్రదాయ దుస్తులు ధరించి క్రమశిక్షణతో దర్శనం చేసుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరుని మహిమను, ఆలయ విశిష్టతను తెలుసుకున్న వీరు, స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. అనంతరం జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భారతీయ ఆధ్యాత్మికత, యోగా, శివతత్వంపై ఉన్న ఆసక్తితో తాము ఇక్కడికి వచ్చినట్లు భక్తులు తెలిపారు. ఆలయ శిల్పకళా చాతుర్యాన్ని చూసి వారు అబ్బురపడ్డారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందించి, క్షేత్ర ప్రాశస్త్యాన్ని వివరించారు.

తిరుపతి

కైలాసగిరి ప్రదక్షిణంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల గిరిప్రదక్షిణ కన్నుల పండువగా సాగింది. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించి, అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.

తిరుపతి

శివపార్వతుల గిరి ప్రదక్షిణ సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి రిషిత రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20:శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20:శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత పవిత్రమైన కైలాసగిరి ప్రదక్షిణం (కొండచుట్టు) కార్యక్రమం ఘనంగా జరిగినది. ముందుగా ఆలయం నుండి శ్రీ స్వామి, అమ్మవార్లు బయలుదేరి నాలుగు మాడ వీధుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రదక్షిణ దాదాపు 22 కిలోమీటర్ల మేర సాగి, తిరిగి ఆలయ గాలిగోపురం వద్ద భక్తిభావంతో ముగిసింది. ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషిత రెడ్డి ఈ గిరి ప్రదక్షణలో పాల్గొని నియోజకవర్గ ప్రజలందరి సంక్షేమం కోరుతూ ఆ వాయులింగేశ్వరుని కృపాకటాక్షాలు మన నియోజకవర్గ ప్రజలపై, రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటు మనస్ఫూర్తిగా ప్రార్థించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అశేష భక్తజనం పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

చీకోడులో మల్లన్న సాగర్ కాలువ శుభ్రత పనులు – త్వరలో నీటి సరఫరా కోసం అధికారులతో చర్చలు

ముస్తాబాద్/ ఫిబ్రవరి/ పున్నమి ప్రతినిధి ఈజు చీకోడు గ్రామంలో మల్లన్న సాగర్ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న పూడిక, చెట్లు మరియు చెత్తను JCB సహాయంతో తొలగించడం జరిగింది. కాలువలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నీరు సజావుగా ప్రవహించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే, మల్లన్న సాగర్ నీళ్లు త్వరలోనే గ్రామానికి చేరుకునేలా అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొమ్మన ఆంజనేయులు, ఉపసర్పంచ్ ఆస రంజిత్, 6వ వార్డు మెంబర్ బనక నాగరాజ్ యాదవ్, ఎమ్మార్వో మరియు మండల సిబ్బంది పాల్గొన్నారు.

ఖమ్మం

జైలు నుంచి విడుదలైన పగడాల నాగరాజును పరామర్శించిన కేటీఆర్

ఖమ్మం ఫిబ్రవరి (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి) ఖమ్మం నగర బి ఆర్ ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజును భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు చరవాణి ద్వారా పరామర్శించారు. సుమారు 22 రోజుల పాటు ఖమ్మం జిల్లా జైలులో ఉండి శుక్రవారం విడుదలైన నాగరాజు ఆరోగ్య పరిస్థితి, తాజా పరిస్థితులపై కేటీఆర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల హడావుడి కారణంగా వ్యక్తిగతంగా రావలేకపోయానని, త్వరలోనే ఖమ్మం వచ్చి కలుస్తానని నాగరాజుకు హామీ ఇచ్చినట్లు సమాచారం. నాగరాజు ధైర్యంగా ఉండాలని, పార్టీ కార్యకలాపాల్లో మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలని కేటీఆర్ సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామంతో ఖమ్మం బి ఆర్ ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాగితాలపూరు రైతులకు ఊరట: పైపులైను–చెక్ డ్యాం పనులతో 400 ఎకరాలకు నీరందింపు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాగితాలపూరు, జట్లకొండూరు రైతుల కోసం యుద్ధప్రాతిపదికన పైపులైను, చెక్ డ్యాం పనులను పరిశీలించారు. 400 ఎకరాలకు నీటి కొరత నివారణకు రూ.25 లక్షలతో 10 హెచ్‌పీ, 7.5 హెచ్‌పీ మోటార్ల ద్వారా నీటిని చెరువుకు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొట్టేళ్లకాలువ చెక్ డ్యాం 2,000 ఎకరాలకు వరంగా మారిందన్నారు. తుఫాన్లతో నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీపై విత్తనాలు అందించామని, రైతు ప్రయోజనాలపై రాజీ లేదని స్పష్టం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.