Wednesday, 29 April 2026

Blog

పల్నాడు

*21 నుంచి 24 వరకు వడగండ్ల వానలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ

రుతువుల మార్పిడితో కురిసే అవకాశం హైదరాబాద్‌, ఫిబ్రవరి 20: రాష్ట్రంలో మూడ్రోజులపాటు పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. మారిన వాతావరణ పరిస్థితు ల కారణంగా ఈ నెల 21 నుంచి 24 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కు రిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. 22న ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లా ల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా ఉరుములు, మెరుపులతో గాలివానలు బీభత్సం సృష్టించే అవకాశాలున్నట్టు తె లిపింది. హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని, నె లాఖరు వరకు వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

పల్నాడు

ఇన్‌స్టాలో పరిచయం

*lసోషల్ మీడియా మాయలో వివాహిత..* *ధనవంతుడని నమ్మి వెళ్లి షాక్ తిన్న ఘటన *ఇన్‌స్టాలో పరిచయం.. ఏపీ చేరగా బయటపడ్డ అసలు నిజం* సోషల్ మీడియా పరిచయాలు ఎంతటి ప్రమాదాలకు దారి తీస్తున్నాయో మరోసారి ఈ ఘటన స్పష్టం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయం ఓ వివాహితను తన కుటుంబం నుంచి దూరం చేసి, చివరికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. జార్ఖండ్‌కు చెందిన 30 ఏళ్ల వివాహితకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మొదట చాట్‌గా ప్రారంభమైన ఈ పరిచయం క్రమంగా ఆడియో, వీడియో కాల్స్ వరకు వెళ్లింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తనను ధనవంతుడిగా, అనుభవం కలిగిన వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి మాటలను ఆమె పూర్తిగా నమ్మేసింది. ఆ నమ్మకంతోనే భర్త, ముగ్గురు చిన్నారులను వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఏపీకి చేరుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆ వ్యక్తిని కలిసింది. అయితే అక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. తాను ధనవంతుడినని చెప్పుకున్న వ్యక్తి వాస్తవానికి దినసరి కూలీగా పనిచేస్తున్నాడని తెలిసి ఆమె షాక్‌కు గురైంది. తాను మోసపోయానని గ్రహించిన మహిళ తీవ్ర నిరాశకు లోనైంది. ఇదే సమయంలో ఆమె గల్లంతైన విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఫోన్ సిగ్నల్, సోషల్ మీడియా వివరాల ఆధారంగా ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. పోలీసుల సహకారంతో మహిళను సురక్షితంగా స్వగ్రామానికి తీసుకువచ్చారు. తల్లిదండ్రులు, బంధువులు కలిసి ఆమెకు నచ్చజెప్పడంతో చివరకు తిరిగి తన కుటుంబం వద్దకు చేరింది. ఈ ఘటనలో విశేషం ఏమిటంటే, భార్య తప్పుదారి పట్టినా భర్త పెద్ద మనసుతో ఆమెను తిరిగి అంగీకరించడం. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. టెక్నాలజీ దూరాలను దగ్గర చేస్తుంది. కానీ అదే సమయంలో అపరిచితులతో ఏర్పడే సంబంధాలు ప్రమాదకరంగా మారే అవకాశముంది. అందుకే సోషల్ మీడియా వాడకంలో అప్రమత్తత అవసరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీలోని మోడల్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ, ఎంపికైన వారికి ఉచితంగా విద్య

2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్లోని 164 ఏపీ మోడల్ స్కూళ్లలో ఆరో తరగతి అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 31వ తేదీ వరకు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 12న జరిగే ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారు ఉచితంగా ఆంగ్ల మాధ్యమ బోధన పొందవచ్చు.

జాతీయ అంతర్జాతీయ

ట్రంప్ గాజా శాంతి మండలి తొలి సమావేశానికి హాజరైన భారత్

అమెరికాలో జరిగిన గాజా బోర్డ్ ఆఫ్ పీస్ తొలి సమావేశానికి భారత్ గురువారం అబ్జర్వర్గా హాజరైంది. యూఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్లో జరిగిన ఈ సమావేశంలో అమెరికాలోని భారత రాయబార కార్యాలయ తాత్కాలిక బాధ్యురాలు నమ్గ్యా సి ఖంపా భారతికి ప్రాతినిధ్యం వహించారు. ఈ బోర్డులో శాశ్వత సభ్యదేశంగా చేరాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని భారత్ ఇంకా అంగీకరించలేదు. బోర్డులో శాశ్వత సీటుకు $1 బిలియన్ కట్టాలి.

Featured

మత విద్వేష వ్యాఖ్యలు – యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిలిపివేత

హైదరాబాద్, ఫిబ్రవరి 20: యూట్యూబర్ అన్వేష్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మెటా సంస్థ నిలిపివేసింది. దేశాన్ని దూషించడంతో పాటు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా హిందూ దేవతలపై వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నటి కరాటే కల్యాణి గత డిసెంబర్‌లో హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు సంబంధిత ఖాతాను తొలగించాలని మెటా సంస్థకు లేఖ రాశారు. అనంతరం సుమారు 1.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా డిలీట్ చేసింది.

నారాయణపేట

వీరత్వానికి ప్రతీకగ శివాజీ జయంతి కున్సీ గ్రామంలో ఘనోస్తవ వాతావరణం

కృష్ణ మండలం కున్సీ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి గ్రామ యువత ఐక్యంగా ముందుకు వచ్చి ఘనంగా శోభయాత్రను నిర్వహించారు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో కృష్ణ మండల కేంద్ర బిజెపి నేత అమర దీక్షిత్, బిజెపి మండల అధ్యక్షుడు నల్లె నర్సప్ప కాంగ్రెస్ యువలీడర్ బాడియల్ శరన్ బసవ , సర్పంచ్ మేకలి సురేష్ ఖందొడ్డి నారాయణ గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు నల్లే శివరాజ్ పిట్టల్ ప్రభు ఎల్లమ్మ దేవి దేవాలయం పూజారి శరణప్ప మరియు గ్రామ యువత పాల్గొనడం జరిగింది. అనంతరం శివాజీ మహారాజ్ వేషధారణలో మెరిసిన చిన్నారులకు బహుమతులు అందజేసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు.

తిరుపతి

అశ్వ వాహనంపై ముక్కంటి.. సింహ వాహనంపై అమ్మవారు

దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు రాత్రి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు అశ్వ వాహనంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు సింహ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామి, అమ్మవార్ల ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. వాయువేగంతో అశ్వ వాహన సేవ ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం, అశ్వం (గుర్రం) ఇంద్రియ నిగ్రహానికి, వేగానికి చిహ్నం. లోక రక్షకుడైన పరమశివుడు అశ్వ వాహనంపై విహరిస్తూ, భక్తుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన మార్గంలో నడిపిస్తారని పండితులు పేర్కొన్నారు. అశ్వ వాహనంపై రాజసం ఉట్టిపడేలా అలంకరించబడిన స్వామివారిని చూసి భక్తులు పులకించిపోయారు. అమ్మవారి రౌద్ర-శక్తి రూపం మరోవైపు, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు పరాశక్తికి నిదర్శనమైన సింహ వాహనాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణకు సింహం సంకేతం. అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని చూసి భక్తులు “ఓం నమః శివాయ”, “జ్ఞానప్రసూనాంబాయై నమః” అనే నామస్మరణతో మాడ వీధులను మారుమోగించారు. ఈ వేడుకను తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అధికారులు, పోలీసులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించబడిన మాడ వీధులు కాంతిలీనమై ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబింబించాయి.

తిరుపతి

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు- హిందూ ధర్మ రక్షకుడికి ఘన నివాళి

. శ్రీకాళహస్తి పట్టణంలోని ఛత్రపతి శివాజీ జంక్షన్ వద్ద శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. భారత్ ఆర్గనైజేషన్ ఆఫ్ సోషల్ సర్వీస్ వ్యవస్థాపకులు సిరిపురం సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మరాఠీ సంఘం ప్రతినిధులు, ఆర్.ఎస్.ఎస్ (RSS) సభ్యులు, హిందూ చైతన్య వేదిక నాయకులు మరియు శివాజీ మహారాజ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలుత శివాజీ జంక్షన్ వద్ద శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ‘జై శివాజీ.. జై భవానీ’ అంటూ చేసిన నినాదాలతో పట్టణం హోరెత్తింది. భారతీయ వీరత్వానికి, ధైర్యానికి నిలువెత్తు రూపం ఛత్రపతి శివాజీ మహారాజ్ అని, ఆయన ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా ప్రముఖ వక్తలు మాట్లాడుతూ.. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, పరాయి పాలన నుంచి విముక్తి కోసం శివాజీ చేసిన పోరాటం అద్వితీయమని స్వరాజ్య స్థాపన కోసం ఆయన అనుసరించిన వ్యూహాలు ప్రపంచానికే పాఠాలని కొనియాడారు. అనంతరం హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ, యువత శివాజీ జీవిత చరిత్రను చదివి దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సరస్వతి శిశు మందిర్ ప్రబంధకారిని మంగి రెడ్డి, శ్రీకాళహస్తి ఆర్ఎస్ఎస్ కండ కార్యవాహ సుబ్రహ్మణ్యం రెడ్డి, సురేష్ ఖండకారికారిణి, సుమన్ ఖండ కార్యదర్శి, టీవీ మెకానిక్ ప్రసాద్, కోశాధికారి భారత్ ఆర్గనైజషన్ ఆఫ్ సోషల్ సర్వీస్, ఫ్లెక్సీ కృష్ణ రెడ్డి, పసుపులేటి నవీన్, సాగి సతీష్, మొబైల్ షాప్ మహేష్, ఫైనాన్స్ చంద్ర శేఖర్, మరాఠి రాజ శేఖర్, బాబా టెంపుల్ నేతాజీ, కిరణ్ మని, టైలర్ వేణు, పసుపులేటి గిరి, వివిధ సంఘాల నాయకులు, స్థానిక ప్రముఖులు, శివాజీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మిఠాయిలు పంపిణీ చేసి పండుగ వాతావరణంలో జయంతిని జరుపుకున్నారు.

తిరుపతి

ఏర్పేడు కాశీ విశ్వేశ్వరాలయంలో అన్నదాన కార్యక్రమం

ఏర్పేడు, పున్నమి న్యూస్, ఫిబ్రవరి 19: ఏర్పేడులోని గుంటకట్ట వద్ద వెలసిన శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో గురువారం నాడు కళ్యాణోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఆర్యవైశ్య సంఘం సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణోత్సవం సందర్భంగా సర్పంచుల సంఘం అధ్యక్షుడు నల్లపాలెం శివయ్య, శివ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ ఎన్. ప్రసన్న ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు, స్థానిక భక్తులు , ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

తిరుపతి

బండారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా భాషోత్సవాలు

తొండమనాడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 19: బండారుపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నాడు లాంగ్వేజ్ ఫెస్టివల్స్ ఘనంగా నిర్వహించారు. భాషోత్సవంలో భాగంగా ఆంగ్ల భాష పైన, హిందీ భాష పైన తెలుగు భాష పైన ప్రాముఖ్యతను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ వేలు క్షుణ్ణంగా వివరించడం జరిగినది ప్రతి ఒక్కరూ భాషలపైన పట్టు సాధించే విధముగా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని తెలుగు భాషను తెలుగు రాష్ట్రాలలో, దేశవ్యాప్తంగా హిందీ భాష ను ఎలా ఉపయోగించాలో ఇంగ్లీషు భాషను ఎక్కడ ఎప్పుడు ఉపయోగించాలో వివరించడం జరిగినది. ప్రతి ఒక్కరూ భాష ల పైన పట్టు సాధించాలని కోరారు. ఆంగ్ల ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం విద్యార్థులకు వకృత్వ పోటీలు, వ్యాస రచన పోటీలు ఇంగ్లీష్ భాష పైన నిర్వహించి ప్రధమ, ద్వితీయ,తృతీయ బహుమతులను ప్రధానం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో చిట్టిబాబు, ద్వారకనాథరెడ్డి, సురేష్ బాబు, రాధా కుమారి, వెంకటేశులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనడం జరిగినది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.