Wednesday, 29 April 2026

Blog

E-పేపర్

నీలం శ్వేతా పై వేటు తప్పదా…?* *నీలం స్వేత ఎన్నిక చెల్లదా…?* *BRS పార్టీకి మరో కౌన్సిలర్ దూరం అయినట్టేనా…?*

పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : నీలం శ్వేతా పై వేటు తప్పదా…? నీలం స్వేత ఎన్నిక చెల్లదా…? BRS పార్టీకి మరో కౌన్సిలర్ దూరం అయినట్టేనా…? ఇక చైర్మన్ పీఠం పై BRS ఆశలు వదులోకోవాలసిందేనా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉత్కంట రేపుతున్న వేల నిల స్వేత రూపంలో మరో బాంబ్ పేలింది…. బీసీ రిజర్వేషన్ ఉన్న స్థానంలో oc మహిళా పోటీ చేసిందని అట్టి ఎన్నిక చెల్లదని సదరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆరోపిస్తిన్నారు… నీలం స్వేత పై పిర్యాదు సైతం చేశారు… అదే నిజం అయితే స్వేత అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తే BRS సంఖ్య బలం 13 కి పడిపోతుంది… ఇక నీలం స్వేత అభ్యర్థిత్వం పోతే సెకండ్ వచ్చిన అభ్యర్థికి విజయం లభిస్తుంది దింతో కాంగ్రెస్ సంఖ్యబలం 12 కి చేరుతుంది.. రోజు రోజు కు మారుతున్న రాజకీయ సమీకరణాలలో BRS క్యాంపు లొ ఉండే అభ్యర్థులు ఎంతమంది ఉంటారో తెలియడం లేదు…

అనకాపల్లి

ఏటికొప్పాకలో రాజకీయ శక్తి ప్రదర్శన… ఉచిత గుండె శిబిరంతో ప్రజల్లో నమ్మకం పెంచుకున్న తెలుగుదేశం పార్టీ…!

అనకాపల్లి జిల్లా ఫిబ్రవరి 19 పున్నమి న్యూస్ ప్రతినిధి ( ఆనంద్ ) : ఏటికొప్పాక గ్రామంలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో, స్వరా హాస్పటల్ సౌజన్యంతో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచిత గుండె వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు హాజరై వైద్య సేవలు పొందారు. అనుభవజ్ఞులైన హృదయ వైద్యులు గుండె సంబంధిత సమస్యలపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ECG, ECHO వంటి ఖరీదైన స్కానింగ్ పరీక్షలను ఉచితంగా చేసి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భజంత్రీల లక్ష్మి, మాజీ సర్పంచ్ కాంట్రకోట చిరంజీవి, అన్నం బాబ్జి, నగిరెడ్డి అచ్చయ్య నాయుడు, అన్నం స్వరజీరావు, ఊడి రామకృష్ణ, భజంత్రీల శ్రీను తదితర కూటమి సీనియర్ నాయకులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యంపై ఇలాంటి శిబిరాలు మరింతగా నిర్వహించాలని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.

హెల్త్ టిప్స్

🍅 4. టమాటా జ్యూస్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

టమాటా జ్యూస్ ఆరోగ్యానికి అమృతం వంటిది. ఇందులో లైకోపిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. 🌿 ముఖ్య పోషకాలు: లైకోపిన్ విటమిన్ C పొటాషియం ఫైబర్ 💓 ప్రయోజనాలు: గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది రక్తపోటు తగ్గిస్తుంది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది 🥤 ఎలా తీసుకోవాలి? ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ తాజా టమాటా జ్యూస్ ఉప్పు లేకుండా తీసుకోవడం మంచిది

హెల్త్ టిప్స్

గుండెకు ఆరోగ్యంగా ఉండే స్వీట్ కార్న్

స్వీట్ కార్న్ రుచికరమైనదే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరం. 🌿 ఇందులో ఉన్న పోషకాలు: ఫైబర్ విటమిన్ B కాంప్లెక్స్ మెగ్నీషియం ఫోలేట్ ❤️ ఆరోగ్య ప్రయోజనాలు: చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది శరీరానికి శక్తిని అందిస్తుంది 🌽 ఎలా తీసుకోవాలి? ఉడికించిన కార్న్ కార్న్ సలాడ్ కార్న్ సూప్

హెల్త్ టిప్స్

🍓 2. స్ట్రాబెర్రీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

స్ట్రాబెర్రీలు రుచికరమైన పండ్లు మాత్రమే కాదు, శరీరానికి శక్తినిచ్చే పోషకాల నిలయం. 🌿 పోషకాలు: విటమిన్ C ఫైబర్ యాంటీఆక్సిడెంట్లు పొటాషియం 💖 ప్రయోజనాలు: క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది కిడ్నీ ఆరోగ్యానికి మంచిది చర్మం కాంతివంతంగా మారుతుంది ఎముకల బలాన్ని పెంచుతుంది 🍓 ఎలా తీసుకోవాలి? ఉదయం ఖాళీ కడుపుతో 4–5 స్ట్రాబెర్రీలు స్మూతీగా సలాడ్‌లో కలిపి

హెల్త్ టిప్స్

రక్తపోటును నియంత్రించే ఓట్స్

ఓట్స్ మన ఆరోగ్యానికి అత్యంత మేలుచేసే ధాన్యాలలో ఒకటి. ముఖ్యంగా రక్తపోటు సమస్య ఉన్నవారికి ఇది సహజ ఔషధంలా పనిచేస్తుంది. 🌿 ఓట్స్ లో ఉన్న ముఖ్య పోషకాలు: బీటా గ్లూకాన్ ఫైబర్ మెగ్నీషియం ప్రోటీన్ యాంటీఆక్సిడెంట్లు 💚 ఆరోగ్య ప్రయోజనాలు: రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది రక్తపోటును సహజంగా నియంత్రిస్తుంది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది 🥣 ఎలా తీసుకోవాలి? ఉదయం అల్పాహారంగా ఓట్స్ గంజి ఓట్స్ + పండ్లు + నట్స్ కలిపి ఓట్స్ ఉప్మా లేదా ఓట్స్ దోశ

తూర్పు గోదావరి

ప్రక్కిలంక సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ – వ్యవసాయ విద్యుత్ సరఫరాలో తాత్కాలిక అంతరాయం

తాళ్లపూడి( పున్నమి ప్రతినిధి )ఫిబ్రవరి 19:ప్రక్కిలంక 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో మెయింటెనెన్స్ పనుల నేపథ్యంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యవసాయ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. నారాయణ అప్పారావు ప్రకటించినట్టు తాళ్లపూడి ఎలక్ట్రికల్ ఏఈ జి. శ్రీనివాసరావు తెలిపారు. అయితే రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉదయం 3 గంటల నుండి 8 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ పనుల కారణంగా ప్రక్కిలంక సబ్ స్టేషన్ పరిధిలోని ప్రక్కిలంక, తాడిపూడి, కుకునూరు, వేగేశ్వరపురం, బల్లిపాడు, పోచవరం, రాగోలపల్లి, తుపాకులగూడెం, గజ్జరం, వీరభద్రపురం గ్రామాలకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది. కావున మెయింటెనెన్స్ పనులకు రైతులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

తూర్పు గోదావరి

బస్సు షెల్టర్ల దుర్వినియోగంపై కఠిన చర్యలు – తాళ్లపూడిలో అన్ని షెల్టర్ల శుభ్రతకు ఆర్టీసీ ప్రత్యేక డ్రైవ్

తాళ్లపూడి(పున్నమి ప్రతినిధి )ఫిబ్రవరి 19:తాళ్లపూడి మండలంలో బస్సు షెల్టర్ల దుర్వినియోగంపై వెలువడిన వార్తలకు స్పందించిన కొవ్వూరు ఆర్టీసీ డిపో అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. బుధవారం పంచాయతీ అధికారుల సహకారంతో మండలంలోని అన్ని బస్సు షెల్టర్లను సమగ్రంగా శుభ్రపరిచినట్లు డిపో మేనేజర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి బస్సు షెల్టర్ పరిశుభ్రంగా, అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. షెల్టర్ల వద్ద ఆక్రమణలు లేదా దుర్వినియోగం జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బస్సు షెల్టర్లు పూర్తిగా పంచాయతీ అధికారుల ఆధీనంలో ఉంటాయని స్పష్టం చేస్తూ, సమన్వయంతో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతాయని తెలిపారు. తాళ్లపూడి పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న బస్టాండ్‌లో పల్లె వెలుగు నుంచి సూపర్ లగ్జరీ వరకు అన్ని రకాల బస్సులు ఆగే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రయాణికుల సౌకర్యమే ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు కొనసాగుతాయని డిపో మేనేజర్ నాయక్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ చదలవాడ శేఖర్, పంచాయతీ అధికారులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

తిరుపతిలో భక్తిశ్రద్ధలతో త్రిలోకేశ్వర్ మహాదేవ్, వీర్ తేజాజీ ఆలయ పూజలు– పాల్గొన్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

తిరుపతి 18 ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి తిరుపతిలో సమస్త్ జాట్ సమాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన త్రిలోకేశ్వర్ మహాదేవ్ మరియు వీర్ తేజాజీ ఆలయ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర భారత సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ జాట్ సమాజ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను దివాకర్ రెడ్డి అభినందించారు. తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో భిన్న ప్రాంతాల భక్తులకు సేవలందించడం సతోషదాయకమని తెలిపారు. దైవ చింతన మనిషికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. త్రిలోకేశ్వర్ మహాదేవ్ మరియు వీర్ తేజాజీ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ట్రస్ట్ సభ్యులతో కలిసి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మరియు హోమంలో పాల్గొన్నారు కార్యక్రమ అనంతరం సమస్త్ జాట్ సమాజ్ ట్రస్ట్ ప్రతినిధులు డాలర్స్ దివాకర్ రెడ్డి సాంప్రదాయ పద్ధతిలో శాలువాతో సత్కరించి, మెమెంటో బహుకరించారు ఈ కార్యక్రమంలో జాట్ సమాజ్ ట్రస్టు సభ్యులు,వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పల్నాడు

అడిగొప్పల అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం

తిరునాళ్లకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి..! ఎమ్మెల్యే జూలకంటి.. దుర్గి: మండల పరిధిలోని అడిగొప్పల శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా వేలాదిగా తరలివస్తున్న భక్తుల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం తిరునాళ్లకు సంబంధించిన గోడ ప్రతులను, ఆహ్వాన పత్రికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.., పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వసతి, తాగునీరు వంటి అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఆదిశేషు నాయుడు, ఆలయ ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.