Wednesday, 29 April 2026

Blog

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మున్సిపాలిటీలో తప్పుడు కుల పత్రంతో గెలిచిన నీలం శ్వేతపై కలెక్టర్ కు ఫిర్యాదు

పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ 18 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మున్సిపాలిటీలో తప్పుడు కుల పత్రంతో గెలిచిన నీలం శ్వేతపై కలెక్టర్ కు ఫిర్యాదు.* *నీలం శ్వేతా బాలకిషన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.* *కాంగ్రెస్ పార్టీ 23వ అభ్యర్థి చెనమోని చంద్రకళ యాదగిరి ముదిరాజ్.*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆయుష్ ఆదేశాలతో చెర్లోపల్లిలో ఆరోగ్య శిబిరం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో విజయవాడ ఆయుష్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలతో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించినట్లు మడమనూరు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి జగదీశ్వరి తెలిపారు. శిబిరంలో గ్రామస్థుల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు వంటి సమస్యలకు ఆయుర్వేదంలో శాశ్వత నివారణ ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అలోపతిలో నయం కాని వ్యాధులకు కూడా చికిత్సలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు దేవదానం, ఫార్మసిస్ట్ సుబ్రమణ్యం పాల్గొన్నారు.

తిరుపతి

నూతన తెదేపా కార్యాలయ భూమి పూజ పనులను పరిశీలించిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

పున్నమి ప్రతినిధి 18 ఫిబ్రవరి తిరుపతి తిరుపతి నగర శివార్లలో నూతనంగా నిర్మించ తలపెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యాలయ భూమి పూజ పనులను తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ నూతన కార్యాలయం నిలవబోతోంది. అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, లోకేష్ గారి మార్గదర్శకత్వంలో కార్యకర్తలకు సకల సౌకర్యాలు ఉండేలా ఈ భవనాన్ని తీర్చిదిద్దుతున్నాం. భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలకు, ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఈ కార్యాలయం కేంద్ర బిందువు కానుంది,అత్యాధునిక వసతులతో, అందరికీ అందుబాటులో ఉండేలా ఈ భవనం రూపుదిద్దుకోనుంది. వేదిక ఏర్పాటు, తాగునీరు మరియు ఇతర మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు

తూర్పు గోదావరి

నిలిచిపోయిన రాజమహేంద్రవరం భీములు దొండపూడి బస్సును పునరుద్దరణ.

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంపురం మండలం భీములు గ్రామ ప్రజలు ఆనంద ఉత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు ఎంతోకాలంగా నిలిచిపోయిన భీములు దొండపూడి బస్సును పునర్దించడం జరిగింది. కావున ఇలాంటి చక్కటి అవకాశాన్ని భీములు, గుడ్డుగూడం మరియు కొవ్వూరుపాడు గ్రామ ప్రజలు మరియు విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. రాజమహేంద్రవరం దొండపూడి బస్సు యొక్క టైమింగ్స్ 1. తెల్లవారుజామున 4:00 గంటలకు దొండపూడి లో బయలుదేరి 4:30 గంటలకు భీమొలు గ్రామానికి వచ్చి రాజమహేంద్రవరం 6:00 గంటలకు వెళ్లడం జరుగుతుంది. 2. రాజమహేంద్రవరం లొ 6:00 గంటలకు బయలుదేరి భీమొలు మీదుగా 8:00 కు దొండపూడి వెళ్లడం జరుగుతుంది. 3. తిరిగి మరల దొండపూడి లో ఉదయం 8 గంటలకు బయలుదేరి భీమొలు 8:30 కి వచ్చి రాజమహేంద్రవరం 9 45 కి వెళ్లడం జరుగుతుంది. 4. మరల మధ్యాహ్నం రాజమండ్రిలో 2:00 గంటలకు బయలుదేరి భీమొలు మీదుగా దొండపూడి 4 గంటలకు వెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా భీమొల్లో పునర్నిర్మాణం చేసిన రెండు బస్టాండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ మద్దిపాటి వెంకటరాజు END

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దర్గామిట్ట పాఠశాలలో సామాజిక తనిఖీపై ప్రజా విచారణ

నెల్లూరు, ఫిబ్రవరి 18: విద్యాశాఖ–సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దర్గామిట్ట ఉన్నత పాఠశాలలో సామాజిక తనిఖీ నివేదికపై ప్రజా విచారణ నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డి. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఎంపిక చేసిన 56 పాఠశాలలో తనిఖీలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ గోగుల రమణయ్య పాఠశాల నిధుల వినియోగం, మౌలిక వసతులు, హాజరు, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై సమీక్ష జరిగిందన్నారు. ప్లానింగ్ కోఆర్డినేటర్ ఆర్. మల్లికార్జున, స్టేట్ రిసోర్స్ పర్సన్ సుబ్బారావు పాల్గొని లోపాలను సవరించి పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్

స్కూటర్ ప్రమాదంలో గాయపడ్డ అరవ ఉషకు ఏపీ హంస పరామర్శ – ఆర్థిక సహాయం అందజేత

18.02.2026 నెల్లూరు, స్కూటర్పై నుండి పడి తీవ్రస్థాయిలో ప్రమాదం జరిగి, మినీ బైపాస్, యెనెల్ హాస్పిటల్ నందు అత్యవసర వైద్యం తీసుకుంటున్న 104 సేవల ఉద్యోగుల మాజీ జిల్లా అధ్యక్షురాలు, డీఈవో అర్బన్ హెల్త్ సెంటర్ పడారుపల్లి అరవ ఉషా గారిని ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు పరామర్శించడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సీనియర్ డిఈఓ గా వ్యవహరించి అన్ని విభాగాల్లో సేవలు అందించి ఉన్నతాధికారులు మన్ననలు పొందిన ఉష గారు వారి సోదరుడు బైక్ పై వస్తూ బీపీ లెవెల్స్ పెరిగి తీవ్ర యాక్సిడెంట్ కాబడి కోలుకుంటున్న ఉషా గారిని ఏపీ హంస నాయకత్వం పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు, అత్యవసర వైద్యం కోసం జిల్లా అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉద్యోగుల తరపున తర 25000/- రూ.లు జిల్లా అధ్యక్షులు సాయి తేజ అందించిన సందర్భంగా కష్టకాలంలో ఆదుకున్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు, యాక్సిడెంట్ కారణంగా పలు సర్జరీలు చేసినందున ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఉష గారికి మరి కొంతమంది సహాయపడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పడారుపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చక్రవర్తి ఏపీ హంస గౌరవ సలహాదారులు పరిమళ, జిల్లా పబ్లిసిటీ సెక్రెటరీ మజాహర్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు యస్. సాయి తేజ, జిల్లా మాజీ ఫ్లోరోసిస్ అధికారి డాక్టర్ శ్రీనాథ్, సి ఓ వెంకటయ్య, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

రామచంద్రపురం మండలంలో జరిగే తిరుపతి జిల్లా బిజెపి పార్టీ కార్యశాల సమావేశం జరగనున్నట్లు మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు జనార్దన్ నాయుడు తెలిపారు.

బుధవారం మండలంలోని బిజెపి నాయకులతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి కార్యశాల సమావేశం ఏర్పాట్లు చర్చించారు. రామచంద్రపురం 18 ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి రామచంద్రాపురం మండలం రాయల రాయల కట్ట దిగువన రాయల మండపంలో మండల బిజెపి పార్టీ విస్తృతస్థాయి సమావేశం మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు జనార్దన్ నాయుడు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం మండలంలోని సి రామాపురంలో తిరుపతి జిల్లా కార్యశాల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి తిరుపతి జిల్లాలోని అన్ని మండలాల బిజెపి పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, రాష్ట్ర బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శులు, పలువురు ప్రముఖులు వస్తున్నట్లు తెలిపారు. శనివారం జరిగే సమావేశం మండలంలోని బిజెపి నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసే జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. Uploaded Video:

తిరుపతి

వేడుకగా విజయ గణపతి అభిషేక పూజలు*

స్వయంగా నిర్వహించిన ట్రస్టు చైర్మన్ MRR తిరుపతి రూరల్, పిబ్రవరి 18 పున్నమి ప్రతినిధి తిరుచానూరు నేతాజీ నగర్ లో వెలసి ఉన్న శ్రీవిజయ గణపతి స్వామి ఆలయంలో బుదవారం సందర్భంగా స్వయంగా ప్రత్యేక అభిషేక పూజలు వేడుకగా నిర్వహించడం జరిగింది. నేడు పాల్గుణ మాసం ప్రారంభం సందర్భంగా అర్చకులు మధు స్వామి ఆధ్వర్యంలో MRR ట్రస్టు చైర్మన్ మునిరామ్ రెడ్డి స్వయంగా అభిషేక పూజలు నిర్వహించడం జరిగింది.పసుపు, కుంకుమ పాలు పెరుగు,తేనె,నెయ్యి,పన్నీరు,విభూది,చందన,సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.అనంతరం ఆలయ ధర్మకర్త పుష్పరెడ్డి స్తానిక భక్తులకు దర్శనం, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్,ధర్మకర్త మాట్లాడుతూ తిరుచానూరు నేతాజీ నగర్ లో వెలసి ఉన్న శ్రీ విజయ గణపతి స్వామి వారి సేవలో తరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము.ప్రజలందరికీ ఆ విజయ గణపతి స్వామి అనుగ్రహం ఉండాలని కోరుతూ, మార్చి 4, 5 తేదీన శ్రీ విజయ గణపతి స్వామి వారి కుంభాభిషేక మహోత్సవానికి భక్తులు,స్థానికులు పెద్ద ఎత్తున తరలిరావాలని, స్వామి కృపా కటాక్షం పొందాలని కోరారు.

తిరుపతి

వేడుకగా విజయ గణపతి అభిషేక పూజలు*

స్వయంగా నిర్వహించిన ట్రస్టు చైర్మన్ MRR తిరుపతి రూరల్, పిబ్రవరి 18 పున్నమి ప్రతినిధి తిరుచానూరు నేతాజీ నగర్ లో వెలసి ఉన్న శ్రీవిజయ గణపతి స్వామి ఆలయంలో బుదవారం సందర్భంగా స్వయంగా ప్రత్యేక అభిషేక పూజలు వేడుకగా నిర్వహించడం జరిగింది. నేడు పాల్గుణ మాసం ప్రారంభం సందర్భంగా అర్చకులు మధు స్వామి ఆధ్వర్యంలో MRR ట్రస్టు చైర్మన్ మునిరామ్ రెడ్డి స్వయంగా అభిషేక పూజలు నిర్వహించడం జరిగింది.పసుపు, కుంకుమ పాలు పెరుగు,తేనె,నెయ్యి,పన్నీరు,విభూది,చందన,సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.అనంతరం ఆలయ ధర్మకర్త పుష్పరెడ్డి స్తానిక భక్తులకు దర్శనం, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్,ధర్మకర్త మాట్లాడుతూ తిరుచానూరు నేతాజీ నగర్ లో వెలసి ఉన్న శ్రీ విజయ గణపతి స్వామి వారి సేవలో తరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము.ప్రజలందరికీ ఆ విజయ గణపతి స్వామి అనుగ్రహం ఉండాలని కోరుతూ, మార్చి 4, 5 తేదీన శ్రీ విజయ గణపతి స్వామి వారి కుంభాభిషేక మహోత్సవానికి భక్తులు,స్థానికులు పెద్ద ఎత్తున తరలిరావాలని, స్వామి కృపా కటాక్షం పొందాలని కోరారు.

News

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల…..అర్థశాస్త్ర విభాగం వారి KCP షుగర్ కంపెనీ సందర్శన….

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల అర్థశాస్త్ర విభాగం వారు కేసీపీ షుగర్ కంపెనీని సందర్శించారు….. బీ ఏ(ఎకనామిక్స్) ప్రధమ సంవత్సరం మరియు బీ ఏ(పొలిటికల్ )రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్ధశాస్త్ర విభాగా ధిపతి డి. అరుణ, డా. M సునీత పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ డా. వి. వి. యస్ కుమార్ సార్ విద్యార్థులను అభినందించారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.