Tuesday, 28 April 2026

Blog

తిరుపతి

బసవయ్యపాలెంలో ఉచిత నేత్ర వైద్య శిభిరం

తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 23: తొట్టంబేడు మండలంలలోని బసవయ్యపాలెం గ్రామం ప్రాథమిక పాఠశాలలో శ్రీ భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో 19మంది పేషెంట్లు చూపించుకోవడంతో వీరిలో 10మంది కంటి శుక్లాలు ఉన్నాయని గుర్తించి వారందరికీ శ్రీ భక్తకన్నప్ప కంటి ఆసుపత్రిలో ఉచితముగా కంటి ఆపరేషన్లు చేస్తామని త్రినేత్ర వైద్యాలయ ట్రస్ట్ వారు తెలిపినారు. వైద్య శిభిరంలో పాల్గొన్నా వారందరికీ ఉచితంగా పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది దామోదర్,స్వాతి, గ్రామస్తులు వాణి, రానెమ్మ, కనకమ్మలు ముందుండి ఐ క్యాంపుని విజయవంతం చేశారు.

తిరుపతి

పటాన్ ఫరీద్ పితృవియోగం పట్ల సానుభూతి తెలిపిన మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 23: శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఫరీద్ తండ్రి దివంగత పటాన్ కాలేషా కర్మక్రియ కార్యక్రమం ఆదివారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బియ్యపు మధుసూదన్ రెడ్డి హాజరై, కాలేషా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాషా,గోర, ఫజల్,గఫూర్,జూమ్లేష,జిలాని, బాబు, మున్నా రాయల్,కంట ఉదయ్ కుమార్,శ్రీవారి సురేష్, శివకుమార్ యాదవ్,కంచి గురవయ్య, పెరుమాళ్ చౌదరి, టైలర్ శీను, యోగ, జస్వంత్, నారాయణ, నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు,కార్యకర్తలు, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని ఫరీద్ కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.

తిరుపతి

జాతీయ సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ ని ప్రారంభించిన బొజ్జల బృందమ్మ

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 23: శ్రీకాళహస్తి నియోజిక వర్గ శాసన సబ్యులు, మాజీ మంత్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్మారకార్థం సోమవారం నాడు జాతీయ సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ ను బొజ్జల బృందమ్మ ప్రారంభించారు. బొజ్జల–విక్రమ్ విద్యా సంస్థలు & ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్మారకార్థం “BOJJALA VIKRAM–AISTA 4వ జాతీయ సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్” ఫిబ్రవరి 21 నుండి 27 వరకు దక్షిణ కైలాస్ నగర్‌లోని విక్రమ్ టెన్నిస్ అకాడమీ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుండి సీనియర్ టెన్నిస్ క్రీడాకారులు ఈ టోర్నమెంట్‌లో పాల్గొని పోటీలు రసవత్తరంగా సాగిస్తున్నారు.విక్రమ్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ చంద్రశేఖర్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొజ్జల బృందమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా బృందమ్మ మాట్లాడుతూ.. క్రీడా స్పూర్తి పెంపొందించేందుకు ఇలాంటి జాతీయ స్థాయి పోటీలు ఎంతో అవసరమని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి క్రీడల పట్ల అపారమైన అభిమానం కలిగిన నాయకుడని, యువతను క్రీడల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు ఎప్పుడూ ప్రోత్సహిస్తారని విక్రమ్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందదాయకమని ఆమె ప్రశంసించారు. అనంతరం డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ….భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్లను నిర్వహించి, శ్రీకాళహస్తిని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని బొజ్జల–విక్రమ్–ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సేవలను స్మరించుకుంటూ క్రీడా రంగానికి ప్రేరణగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో విక్రమ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ ముని లక్ష్మి, రామకృష్ణ యాదవ్, రిటైర్డ్ జిల్లా జడ్జి రామకృష్ణ పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

తిరుపతి

సమస్యల పరిష్కారం కోసం దీక్షలుచేపట్టిన దు అంగన్వాడీ కార్యకర్తలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 23: మండల కేంద్రంలోని స్థానిక ఐ.సి.డి.ఎస్ కార్యాలయం ఎదుట సోమవారం ప్రజా సంఘాలైన సి.ఐ.టి.యు, ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు నాయకులు పెనగడం గురవయ్య మాట్లాడుతూ.. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పోషక ఆహారం, శిశువుల ఆరోగ్యం, పిల్లల పోషణ స్థాయిని పెంచి పిల్లల శారీరక మానసిక పెరుగుదలకు బాటలు వేసే అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారని గత వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీలు వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ 42 రోజులు దీక్షలు నిర్వహించిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వారి దీక్ష శిబిరాల వద్దకు వచ్చి మా పార్టీ అధికారంలోకి రాగానే నీ న్యాయమైన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తామని తెలిపారని ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సుమారు 20 నెలలు కాలం గడిచినప్పటికీ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోవడం ఎంతో దుర్మార్గమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కింద ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తకు 26 వేల రూపాయల జీతం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చాలని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేశారు. ఈనెల 25, 26, 27వ తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట రిలే దీక్షలు గురవయ్య పేర్కొన్నారు. . ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు నాయకులు గంధం మణి, రాజా, రేవతి, పుష్ప, సక్కుబాయి, ఐ. ఎఫ్.టి.యు నాయకులు జాకీర్, కల్పన తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీ గుర్రప్పస్వామి ఆలయ భూమిపూజలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీ. వీ.నాయుడు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 23: తొట్టం బేడు మండలం కత్తి వారి కండ్రిగ దళితవాడలో గుర్రప్ప స్వామి ఆలయ నిర్మాణానికి మాజీ శాసనసభ్యులు ఎస్ సి వి నాయుడు భూమి పూజ నిర్వహించారు. కత్తి వారి కండ్రిక గ్రామంలో శ్రీ గుర్రప్ప స్వామి ఆలయాన్ని నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయించి ఆలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు సహకారాన్ని అభ్యర్థించారు. నూతన గురప్ప స్వామి ఆలయ నిర్మాణానికి ఎస్సివి నాయుడు తను వంతు సహాయ సహకారాలు అందించారు. సోమవారం ఆలయ నిర్మాణం భూమి పూజకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ సి వి నాయుడు కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ పద్ధతిలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఎస్ సి వి నాయుడు చేతుల మీదుగా నిర్వహింపజేశారు. పరమేశ్వరుడు వివిధ రూపాల్లో ఉంటాడని గుర్రప్ప స్వామి పరమేశ్వరునీ ప్రతిరూపమని, గ్రామాలు ఆధ్యాత్మిక చింతనతో వర్ధిల్లాలని అప్పుడే ప్రజలు సుఖశాంతులతో ఉంటారని ఎస్ సి వి నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.

తిరుపతి

పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీలుచేపట్టిన టూ టౌన్ సి. ఐ. నాగార్జున రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 23: శ్రీకాళహస్తి పట్టణంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి స్వయంగా పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, నిబంధనల ప్రకారం నిర్వహించబడుతున్నాయా అనే విషయాన్ని ఆయన పరిశీలించారు. కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున, అనవసరంగా గుంపులుగా నిలబడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి అవసరమైన భద్రతా వాతావరణాన్ని కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సిఐ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల పర్యవేక్షణతో పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయి.

తూర్పు గోదావరి

కల్తీబపాల విషాదం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం నగరంలో కల్తీబపాల విషాదం చోటుచేసుకుంది ఈ సంఘటనలో నలుగురు మృతి చెందినట్లు జిల్లా అధికారులు దృవీకరించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎస్పీ నరసింహ కిషోర్ విలేకరుల సమావేశం తో వివరాలు వెల్లడి చేశారు. ప్రాథమిక విచారణలో కల్తీ పాలు కారణమై ఉండవచ్చని తెలిపారు 106 కుటుంబాలకు ఒకే వ్యాపారి పాలు సరఫరా చేసినట్లు గుర్తించారు వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు విశాఖ ల్యాబ్ కు పంపించారు అనుమతులు లేకుండా డైరీ నడుపుతున్నట్లు తేగడంతో డైలీ సీజ్ చేసి, నిందితులపై కేసు నమోదు చేశారు పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుందని కలెక్టర్ కీర్తి చే కూరి తెలియజేశారు. End.

E-పేపర్

అడవి పశువులను తరలించి రైతుల పంటలను కాపాడాలి.. మీరు తరలిస్తారా మమ్ములను తరలించుకోమంటారా… నేడు ప్రజా వాణి లో వినతి పత్రం…

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 23 ఫిబ్రవరి 2026 అడవి పశువులను తరలించి రైతుల పంటలను కాపాడాలి.. మీరు తరలిస్తారా మమ్ములను తరలించుకోమంటారా… నేడు ప్రజా వాణి లో వినతి పత్రం… బండలేమురు గ్రామంలో అడవి పశువులు ఎక్కువై రైతుల పంట పొలాలను నాశనం చేస్తున్నాయని వాటిని ప్రభుత్వ ఇక్కడ నుండి తరలించాలని కోరుతూ నేడు రంగారెడ్డి జిల్లా ప్రజావాణిలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బండలేమూర్ మాజీ సర్పంచ్ పోచమోని కృష్ణ మాట్లాడుతూ గ్రామం పరిసర ప్రాంతంలో పశువుల బెడద ఎక్కువైందని దీని కారణంగా పది సంవత్సరాలుగా రైతులు పంటలను పందించుకునే పరిస్థితి లేకుండా అయిందని అన్నారు. గ్రామంలోని అనేక మంది రైతులు తమ పంట పొలాల్లో పశువుల బెడదతో పంటలు వేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలుగా పంటలు వేసుకోలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాత్రిపూట పశువుల బెడద నుండి పంటలను కాపాడుకోవడానికి రాత్రనకా పగలనకా కాపు కాసిన రక్షణ లేకుండా పోతుంది. 10 సంవత్సరాలుగా 100 పశువుల దాకా ఉన్నాయని వాటి వలన పంటలు వేసుకోలేకపోతున్నాము. తమ పొలాల్లో పంటలు వేయకుండా బీడులుగా మారి ప్రభుత్వము నుంచి వచ్చే రైతు భరోసా పథకం కూడా వర్తించడం లేదని అన్నారు. రైతు భరోసా అందకపోయినా కనీసం పంట పండించుకొని కూటగడుపుకుందామన్న పరిస్థితి లేకుండా పోయింది. అట్టి పశువులను ఇక్కడి నుండి తరలించాలని పలుమార్లు ప్రభుత్వ అధికారులకు విన్నవించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. గత పది సంవత్సరాలుగా పంటలను పశువులతోటి కాపాడుకోలేక పోయాము ఇప్పుడు యాసింగులో కొద్దిపాటి వరి నాట్లను వేసుకోవడం జరిగింది. వేసిన కొద్ది రోజుల్లో నే అట్టి వరిచేల ను వెంటనే పశువులు మేసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఇప్పటికైనా అక్కడి పశువులను ఇక్కడినుండి తరలించి గోషాలకా ఇతర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ప్రభుత్వ అధికారులు తరలించని యెడల రైతులు తరలించుకోవడానికి అనుమతి అయినా ఇస్తే వాటిని మేమే తరలిస్తామని అందుకు పర్మిషన్ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బండలేముర్ మాజీ వార్డ్ మెంబర్ జాపాల శంకర్ పాల్గొన్నారు.

తిరుపతి

తిరుపతి పార్లమెంట్ తెదేపా కార్యాలయం శంకుస్థాపన విజయవంతం

పున్నమి ప్రతినిధి, తిరుపతి తిరుపతి పార్లమెంట్ టీడీపీ ఆధ్వర్యంలోడాలర్స్ దివాకర్ రెడ్డి నాయకత్వంలో తిరుపతి పార్లమెంట్ తెలుగు దేశం పార్టీ స్వంత కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం సోమవారం అవిలాలలో ఘనంగా నిర్వహించబడింది. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి , పార్లమెంట్ కోఆర్డినేటర్ & ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే సుళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్సహా పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహానేత నందమూరి తారక రామారావు ఆత్మగౌరవ స్పూర్తితో స్థాపితమైన తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో అభివృద్ధి రాజకీయాలకు మార్గదర్శక శక్తిగా నిలుస్తోంది. యువనేత నారా లోకేష్ చైతన్యంతో పార్టీ మరింత బలోపేతంఅవుతుందిఅన్నారు.ఇది కేవలం భవనం శంకుస్థాపన కాదు, ఇది ప్రతి కార్యకర్త ఆశయాలకు పునాది, ఇది తిరుపతి పార్లమెంట్ టిడిపి ఆత్మగౌరవానికి శాశ్వత నిలయం అన్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

తిరుపతి

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.*

పరీక్షా కేంద్ర వద్ద డ్రోన్ తో సైతం నిఘా పెట్టిన జిల్లా పోలీసులు.* పున్నమి ప్రతినిధి, చిత్తూరు జిల్లా సోమవారం నుండి మొదలైన ఇంటర్మీడియట్ పరీక్షల నేపద్యంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ ఆదేశాల మేరకు పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షల నేపథ్యంలో ప్రతి పరీక్షా కేంద్రాన్ని అత్యంత సున్నితంగా పరిగణనలోకి తీసుకొని భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. విద్యార్థులు భయాందోళనలకు గురికాకుండా, పూర్తిస్థాయిలో పరీక్షలపై దృష్టి సారించేలా సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించి నిఘా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పరీక్ష ప్రారంభానికి ముందే కేంద్రాల పరిసరాలను పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకునేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద అనవసర గుంపులు చేరకుండా సెక్షన్ 144 అమలు చేయడంతో పాటు, విద్యార్థులు తప్ప ఇతరులకు అనుమతి లేకుండా నియంత్రణలు విధించారు.ఈసారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ నిఘాను కూడా ఏర్పాటు చేశారు. డ్రోన్ ద్వారా పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ప్రాంతాలను పర్యవేక్షిస్తూ, కాపీయింగ్, అనుమానాస్పద కదలికలు లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు ఏవైనా జరిగితే తక్షణమే గుర్తించి చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసులు పరీక్షలు నిర్వహించే అధికారులతో సమన్వయం చేసుకుంటూ, పరీక్షల ముగింపు వరకు ఇదే స్థాయిలో బందోబస్తు కొనసాగుతుందని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.