Tuesday, 28 April 2026

Blog

రాజన్న సిరిసిల్ల

ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ వద్ద అతివేగంగా ఆటోను ఢీకొట్టిన కారు.

ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 25 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నుండి గొల్లపల్లికి వస్తున్న దారిలో హరిదాస్ నగర్ వద్ద అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టగా అందులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి ఆటోను ఢీ కొట్టి తప్పించుకుని వెళ్తున్న కారు ను అడ్డుకున్న గ్రామస్తులు ఆటోలోని వ్యక్తి సిరిసిల్ల నుండి గొల్లపల్లికి వస్తుండగా కామారెడ్డి నుండి సిరిసిల్ల వైపు వెళ్తున్న కారు హరిదాస్ నగర్ వద్ద అధివేగంతో వచ్చి ఆటోను ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడి ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు ఇవ్వడంతో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు.

విశాఖపట్నం

జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్… కలకలం

విశాఖపట్నం ఫిబ్రవరి ( పున్నమి ప్రతినిధి) నగరంలోని విశాఖపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో మంగళవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు ఆవరణలో ఆర్డీఎక్స్ బాంబు అమర్చినట్లు అజ్ఞాత వ్యక్తి ఈ–మెయిల్ ద్వారా హెచ్చరించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీస్ కమిషనర్ కార్యాలయానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కోర్టు ప్రాంగణానికి చేరుకుని భద్రతా చర్యలు చేపట్టాయి. విచారణల నిమిత్తం వచ్చిన న్యాయవాదులు, పిటిషనర్లు, సిబ్బందిని బయటకు పంపించి కోర్టు ఆవరణాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. దాదాపు రెండు గంటలపాటు సాగిన సోదాల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు కనుగొనబడలేదు. బెదిరింపు మెయిల్ తప్పుడు సమాచారం కావచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఖమ్మం

రేపు కేటీఆర్ ఖమ్మం పర్యటన

ఖమ్మం, ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) భారత రాష్ట్ర సమితి కార్యనిర్వహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వెలగుమట్ల భూదాన్ నిర్వాసితులకు మద్దతుగా ఆయన అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యల నేపథ్యంలో 22 రోజుల పాటు జైలు జీవితం గడిపి విడుదలైన బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును కూడా కేటీఆర్ ఈ పర్యటనలో పరామర్శించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముంది. కేటీఆర్ ఖమ్మం పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు తాత మధు, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఖమ్మం

నేడు కేటీఆర్ ఖమ్మం పర్యటన

ఖమ్మం, ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) భారత రాష్ట్ర సమితి కార్యనిర్వహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వెలగుమట్ల భూదాన్ నిర్వాసితులకు మద్దతుగా ఆయన అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యల నేపథ్యంలో 22 రోజుల పాటు జైలు జీవితం గడిపి విడుదలైన బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును కూడా కేటీఆర్ ఈ పర్యటనలో పరామర్శించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముంది. కేటీఆర్ ఖమ్మం పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు తాత మధు, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

విశాఖపట్నం

బేబీ మౌనిక ఆత్మశాంతికి గాజువాకలో కొవ్వొత్తుల నిరసన

విశాఖ గాజువాక (ఫిబ్రవరి పున్నమి ప్రతినిధి) నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.కులవివక్ష నేపథ్యంలో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో రెండు నెలల పసిపాప మృతి చెందడం మానవత్వానికే మచ్చగా నిలిచింది.కుమ్మెర గ్రామానికి చెందిన గణేశ్,ఆయన భార్య మౌనిక తమ రెండు నెలల పసిపాపతో కలిసి జాతరకు హాజరయ్యారు.ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదం కులవివక్ష రూపం దాల్చి,కొంతమంది వ్యక్తులు కుటుంబంపై దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.ఈ దాడిలో పసిపాప తీవ్రంగా గాయపడగా,ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది.ఈ ఘటనపై గాజువాక బీసీ సంఘం అధ్యక్షులు జాగరపు శ్రీను తీవ్రంగా స్పందిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని,పసిబిడ్డ మరణానికి కారణమైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బీసీ సమాజంపై జరుగుతున్న దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని,ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.బేబీ మౌనిక ఆత్మశాంతి కోసం గాజువాక గాంధీ సెంటర్‌లో జాగరపు శ్రీను ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అండిబోయిన అప్పారావు,తోకాడ రాము,బచ్చ త్రిమూర్తులు,జాగరపు హరిత,పూర్ణిమ,సుదమల్ల ఈశ్వరరావు,నవీన్,రాజు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి కులహంకారపు దుశ్చర్యలు జరగడం దురదృష్టకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

అన్నమయ్య

కడపలో ఘనంగా రిషితా రెడ్డి–శశి భూషణ్ రెడ్డి వివాహం

ఈరోజు ఉదయం డిఎస్ఆర్ ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో మంగంపేటకు చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు గుత్తి రెడ్డి హరినాథ్ రెడ్డి గారి అన్న కుమార్తె రిషితా రెడ్డి – శశి భూషణ్ రెడ్డి వివాహం ఘనంగా జరిగింది.వివాహ వేడుకకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

బీసీల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ చేపడతాం: రాధాకృష్ణ గౌడ్

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ తిరుపతి జిల్లాలో నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026 కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా రేణిగుంటలో ఘన సత్కారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ బీసీ కులాల స్థితిగతులపై సమగ్ర సర్వే చేపట్టి సేవా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. యువత, మహిళలకు ప్రాధాన్యతతో కొత్త కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

పల్నాడు

పోలీస్ స్టేషన్లో … సివిల్ పంచాయతీలు

*మార్కాపురం జిల్లా,త్రిపురాంతకం మండలం:* ▪️మ‌న‌స్తాపంతో బీజేపీ కార్య‌క‌ర్త ఆత్మ‌హ‌త్యాయ‌త్నం. ▪️మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం పాత అన్న సముద్రంలో ఘ‌ట‌న. ▪️పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్న బీజేపీ కార్యకర్త పంపనాటి అంకారావు. ▪️సీఐ హసన్ తన స్థలం విషయంలో తమ ప్రత్యర్థి దాసరి అంజయ్య అనే వ్యక్తికి సహకరిస్తూ తమను వేధిస్తున్నారని ఆవేదన. ▪️తనతో పాటు తన తండ్రి, తమ్ముడిని పోలీస్ స్టేషనుకు పిలిచి ఈ వ్యవహారంలో సీఐ వేధిస్తున్నాడని వెల్ల‌డి. ▪️సెల్ఫీ వీడియో తీసుకొని మ‌రీ ఆత్మహత్యాయత్నం చేసిన అంకారావు. *https://youtu.be/qO3jIxXd_ro* Uploaded Video:

ఆంధ్రప్రదేశ్

లింగంపల్లి యువకుడు డా. వెంకటేశ్వర్లుకు డాక్టరేట్ ఘనత

లింగంపల్లి గ్రామానికి చెందిన డా. గార్ల వెంకటేశ్వర్లు న్యూఢిల్లీలోని డి.పి.ఎస్.ఆర్.యులో ఫార్మసీ పరిశోధనలో డాక్టరేట్ పొందారు. శేషాచలం కొండల ఔషధ మొక్కల యాంటీకాన్సర్ లక్షణాలపై ఆయన పరిశోధన చేశారు. విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 8వ స్నాతకోత్సవంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల మీదుగా పట్టా అందుకున్నారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ డా. రవిచంద్రన్, రిజిస్ట్రార్ డా. రామచంద్ర ఖత్రి సహా ప్రముఖులు పాల్గొన్నారు.

తిరుపతి

రెండవ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల రిలే దీక్షలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 24: మండల కేంద్రంలోని స్థానిక ఐ.సి.డి.ఎస్ కార్యాలయం ఎదుట సోమవారం ప్రజా సంఘాలైన సి.ఐ.టి.యు, ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో రెండవ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల రిలే దీక్షలు ఈ సందర్భంగా సి.ఐ.టి.యు నాయకులు పెనగడం గురవయ్య మాట్లాడుతూ….అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల 32 వేల కోట్ల లో ఒక్క రూపాయి కూడా అంగన్వాడీల వేతనాలకు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించక పోవడం ఎంతో బాధాకరమని సిఐటియు జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 20 నెలలు కాలం గడిచినప్పటికీ అంగన్వాడి కార్యకర్తల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతో దురదృష్టకరమని ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనం వారి కుటుంబ పోషణకు ఏ మాత్రం సరిపోవడం లేదని రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలను దృష్టిలో ఉంచుకొని అంగన్వాడి కార్యకర్తల వేతనాలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఎక్కడా కూడా రక్తహీనత ఉండకూడదని, పౌష్టిక ఆహారం అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ప్రతి ఒక్కరికి అందజేస్తున్నామని కానీ పౌష్టికాహారం అందజేసే అంగన్వాడి కార్యకర్తల కుటుంబాల్లో మాత్రం చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ ఎంతో బాధాకరంగా వెల్లదీస్తున్నారని అంగన్వాడీల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంతవరకు సిఐటియు వారికి అండగా ఉండి పోరాటాలు చేస్తూనే ఉంటుందని అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కింద ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తకు 26 వేల రూపాయల జీతం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చాలని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేశారు. ఈనెల 25, 26, 27వ తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట రిలే దీక్షలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు నాయకులు గంధం మణి, రాజా, రేవతి, పుష్ప, సక్కుబాయి, ఐ. ఎఫ్.టి.యు నాయకులు జాకీర్, కల్పన తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.