Monday, 27 April 2026

Blog

రాజన్న సిరిసిల్ల

మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా మణులకు సర్పంచ్ పోతరాజు చంటి ఘన సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని నేడు కేశన్నపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పోతరాజు చంటి గారి అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. రేపు జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా సంఘాల సభ్యులను సర్పంచ్ పోతరాజు చంటి గారు మరియు గ్రామ ప్రముఖులతో కలిసి శాలువాలతో సన్మానించి గౌరవించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పోతరాజు చంటి గారు మాట్లాడుతూ కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ సేవలోనూ మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మహిళల కృషి వల్లే గ్రామ సమాజం ముందుకు సాగుతుందని, మహిళా సాధికారతతో గ్రామాభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ఆయన అన్నారు. అలాగే గ్రామంలోని మహిళా మణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వజ్జపల్లి శ్రీకాంత్, వార్డు సభ్యులు సంజీవరావు, మధు, లక్ష్మీ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సీఏ రాజు మరియు గ్రామ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

ఖమ్మం

వెలుగుమట్ల భూదాన్ బాధితులకు అండగా నిలిచిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం మార్చి (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి ) ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్‌లో ఆశ్రయం పొందుతున్న వెలుగుమట్ల భూదాన్ బాధితులను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం పునరావాస కేంద్రం నుండి బాధితులను వెళ్లగొట్టే ప్రయత్నాలు చేస్తోందని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిరుపేదలు కట్టుకున్న గూడును కూల్చివేసి వారిని రోడ్డున పడేసిన ప్రభుత్వం ఇప్పుడు పునరావాస కేంద్రం నుంచి కూడా వారిని తరిమేయాలని చూస్తోందని మండిపడ్డారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు పునరావాస కేంద్రం నుండి బయటికి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కే.టి. రామారావు ఆదేశాల మేరకు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధితులకు భోజన ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. హెల్త్ చెకప్ క్యాంప్ ద్వారా బాధితులకు అవసరమైన మందులను అందజేశారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి బాధితులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు భారత రాష్ట్ర సమితి పార్టీ పోరాటం కొనసాగుతుందని పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. బాధితుల తరఫున న్యాయస్థానంలో పోరాడేందుకు ప్రత్యేక లీగల్ సెల్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వెలుగుమట్ల భూదాన్ బాధితులకు వారు కోల్పోయిన ప్రదేశంలోనే 100 గజాల స్థలం, ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి పక్కా ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి రావడానికి ముందు అనేక హామీలు ఇచ్చిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిరుపేదల సమస్యలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ప్రభుత్వం బాధితులను విడగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు బలి కావద్దని బాధితులను కోరుతూ, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, ఆర్‌జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

నర్సక్కపేటలో కొత్త హరీష్ వివాహానికి హాజరైన మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు

రాజన్న సిరిసిల్ల జిల్లా / మార్చి/ పున్నమి ప్రతినిధి ఇల్లంత కుంట మండలం నర్సక్కపేట గ్రామానికి చెందిన కొత్త హరీష్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వధూవరులు ఆనందంగా, సుఖసంతోషాలతో జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ఈ వేడుకకు బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాగటి రమేష్, బొల్ల రాంచంద్రారెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వివాహ వేడుకను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వివాహ వేడుక సందర్భంగా కుటుంబ సభ్యులు అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించి సత్కరించారు. గ్రామంలో ఈ వివాహ వేడుక ఆనంద వాతావరణంలో ఘనంగా జరిగింది.

ఖమ్మం

దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆలోచనలే బీజేపీకి అభివృద్ధి కి మూలం – గల్లా సత్యనారాయణ

ఖమ్మం మార్చి (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి ) ఖమ్మం: భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు మూలస్తంభంగా నిలిచిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆలోచనలు ప్రతి కార్యకర్తకు మార్గదర్శకాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు పేర్కొన్నారు. ఖమ్మం రెండవ పట్టణ కమిటీ మరియు కొణిజర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పండిట్ ప్రశిక్షణ శిబిరంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ, దేశం కోసం పార్టీ కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. భారతదేశ అభివృద్ధి కోసం పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చేసిన ఆలోచనలు, సిద్ధాంతాలు నేటికీ దేశానికి దారిదీపంలా మారాయని తెలిపారు. ఆయన ప్రతిపాదించిన “ఏకాత్మ మానవతా వాదం (Integral Humanism)” అనే సిద్ధాంతం భారతీయ సంస్కృతి, సామాజిక సమానత్వం, సమగ్ర అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని చెప్పారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ ఒక గొప్ప తత్వవేత్త, రచయిత మరియు జాతీయవాది. ఆయన భారతీయ జనసంఘ్‌కు ప్రధాన నాయకత్వం వహించి, దేశంలో జాతీయవాద రాజకీయాలకు బలమైన పునాది వేశారు. గ్రామీణ అభివృద్ధి, చివరి వరుసలో ఉన్న పేద ప్రజలకు న్యాయం చేయడం ఆయన ఆలోచనల్లో ముఖ్యమైన అంశమని గల్లా సత్యనారాయణ తెలిపారు. “అంత్యోదయ” అనే భావన ద్వారా సమాజంలో చివరి వ్యక్తి అభివృద్ధి చెందితేనే దేశం నిజంగా అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వసించారని గుర్తు చేశారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జీవితం సాధారణత, నిబద్ధతకు ప్రతీక అని పేర్కొంటూ, ప్రతి బీజేపీ కార్యకర్త ఆయన జీవితం నుండి ప్రేరణ పొందాలని గల్లా సత్యనారాయణ సూచించారు. దేశభక్తి, సేవాభావం, నైతిక విలువలు ఆయన వ్యక్తిత్వానికి మూలాధారమని తెలిపారు. ఇలాంటి శిక్షణ శిబిరాలు కార్యకర్తల్లో సిద్ధాంతపరమైన అవగాహన పెంచి పార్టీ బలోపేతానికి దోహదపడతాయని ఆయన అన్నారు. దేశ అభివృద్ధి లక్ష్యంగా తీసుకుని ప్రతి కార్యకర్త ప్రజల మధ్య పనిచేస్తూ పార్టీని మరింత బలపర్చాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాలకి చెందిన బీజేపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మండల, పోలింగ్ బూత్ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .

ఖమ్మం

ఖమ్మం రెండవ పట్టణ బీజేపీ శిక్షణ శిబిరం విజయవంతం

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం నగరంలో ఖమ్మం టూ టౌన్ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం శనివారం విజయవంతంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ సూచన మేరకు ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమం ఎన్‌ఎస్‌పి క్యాంపులోని రామాలయం ఫంక్షన్ హాల్‌లో టూ టౌన్ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసు దేవరావు ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. వారు పార్టీ సిద్ధాంతాలు, సంఘటిత శక్తి, కార్యకర్తల పాత్ర, ప్రజా సమస్యలపై పోరాటం వంటి పలు అంశాలపై కార్యకర్తలకు వివరణాత్మకంగా మార్గనిర్దేశం చేశారు. శిక్షణ శిబిరంలో మండదపు సుబ్బారావు, రుద్రగాని మాధవ, శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి శ్రీలత, శ్రీమతి ఉపేందరమ్మ, నాగరాజు, రవి రాదోడ్, మట్ట దుర్గప్రసాద్, దాసరి వీరభద్రం (రిటైర్డ్ సి.ఐ), వేల్పుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా సాగడంతో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఖమ్మం

ఖమ్మం రెండవ పట్టణ బీజేపీ శిక్షణ శిబిరం విజయవంతం

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం నగరంలో ఖమ్మం టూ టౌన్ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం శనివారం విజయవంతంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ సూచన మేరకు ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమం ఎన్‌ఎస్‌పి క్యాంపులోని రామాలయం ఫంక్షన్ హాల్‌లో టూ టౌన్ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసు దేవరావు ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. వారు పార్టీ సిద్ధాంతాలు, సంఘటిత శక్తి, కార్యకర్తల పాత్ర, ప్రజా సమస్యలపై పోరాటం వంటి పలు అంశాలపై కార్యకర్తలకు వివరణాత్మకంగా మార్గనిర్దేశం చేశారు. శిక్షణ శిబిరంలో మండదపు సుబ్బారావు, రుద్రగాని మాధవ, శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి శ్రీలత, శ్రీమతి ఉపేందరమ్మ, నాగరాజు, రవి రాదోడ్, మట్ట దుర్గప్రసాద్, దాసరి వీరభద్రం (రిటైర్డ్ సి.ఐ), వేల్పుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా సాగడంతో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జర్నలిస్టుల భద్రతకు సుప్రీంకోర్టు బలమైన భరోసా

దేశంలో వర్కింగ్ జర్నలిస్టులు, పాత్రికేయులను బెదిరించడం, దూషించడం లేదా దాడి చేయడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గురువారం జరిగిన ఒక కేసు విచారణ సందర్భంగా, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి రూ.50,000 వరకు జరిమానాతో పాటు ఐదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తీర్పు జర్నలిస్టులకు రక్షణ కల్పించే దిశగా కీలకంగా మారిందని పలు జర్నలిస్టు సంఘాల నాయకులు, సీనియర్ పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో పాత్రికేయులు భయాందోళనల లేకుండా నిజమైన సమాచారాన్ని ప్రజలకు అందించగలరని తెలిపారు. అలాగే రాజకీయ నాయకులు లేదా ఇతరుల నుంచి ఒత్తిడి తగ్గి మీడియా స్వేచ్ఛ మరింత బలపడుతుందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

రాజన్న సిరిసిల్ల

TG మోడల్ స్కూల్‌లలో 6–10 తరగతుల ప్రవేశాలకు దరఖాస్తు గడువు మార్చి 10 వరకు పొడిగింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా/ మార్చి /పున్నమి ప్రతినిధి 2026–27 విద్యా సంవత్సరానికి తెలంగాణ మోడల్ స్కూల్‌లలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును మార్చి 10వ తేదీ వరకు పొడిగించినట్లు నామాపూర్ TG మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కె. కొండల్ రెడ్డి తెలిపారు. ప్రవేశాలకు ఆసక్తి ఉన్న విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ మోడల్ స్కూల్‌లలో నాణ్యమైన విద్యతో పాటు మంచి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అర్హత ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం సంబంధిత మోడల్ స్కూల్‌ను సంప్రదించాలని సూచించారు.

రాజన్న సిరిసిల్ల

నామాపూర్ మోడల్ స్కూల్‌లో టెన్త్ విద్యార్థులకు గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా /మార్చి/ పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ మోడల్ స్కూల్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే.టి.రామారావు (కేటీఆర్) గారి తరఫున “గిఫ్ట్ ఎ స్మైల్” కార్యక్రమం ద్వారా ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కేటీఆర్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మవిశ్వాసంతో, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నామాపూర్ శాఖ గ్రామ అధ్యక్షులు తాడేపు అనిల్, ఉపాధ్యక్షులు ఆకారం బాలచంద్రు, ముచిప్పలపల్లి సర్పంచ్ మాచేటి లక్ష్మణ్, మాజీ సర్పంచ్ తాడేపు ఎల్లం, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కోమటి రాజమల్లు తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

కాకినాడ

ఎర్రవరం గ్రామంలో వివాహ వేడుకలో కూటమి నాయకుడు భార్లపూడి క్రాంతి పాల్గొనడం… నాయకులు, కార్యకర్తల సందడి..!

కాకినాడ జిల్లా, మార్చి 7 – పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్): ప్రత్తిపాడు నియోజకవర్గం, ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో బసా ఎర్రబాబు గారి కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కూటమి నాయకుడు భార్లపూడి క్రాంతి ముఖ్య అతిథిగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను మరింత ఘనంగా నిర్వహించారు. భార్లపూడి క్రాంతి మాట్లాడుతూ నూతన దంపతులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.