Monday, 27 April 2026

Blog

అన్నమయ్య

మహిళల రక్షణే పోలీసుల ప్రథమ ప్రాధాన్యత!

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో మహిళా గౌరవాన్ని చాటిచెప్పేలా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఎస్. వినోద్ కుమార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా సిబ్బందికి మరియు మహిళా పోలీసులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. -మహిళా శక్తికి వందనం: ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. సమాజ రక్షణలో మహిళా పోలీసులు పురుషులతో సమానంగా అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు, రక్షణ కవచాల గురించి వివరించారు. అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనలో మరియు శాంతిభద్రతల పరిరక్షణలో మహిళా సిబ్బంది పోషిస్తున్న పాత్ర వెలకట్టలేనిదని ఆయన పేర్కొన్నారు. -ఉత్సాహంగా వేడుకలు: పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మహిళా సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. విధి నిర్వహణలో మహిళలకు ఎల్లప్పుడూ గౌరవం మరియు సహకారం ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

పోతుగల్ గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్

ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రజలకు” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోతుగల్‌లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ పెద్దగారి యాదమ్మ, కార్యక్రమ నిర్వాహకుడు హపర్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు తడి, పొడి చెత్తను వేరు చేయడం గురించి వివరించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ శుభ్రతపై ప్రత్యేకంగా సూచనలు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ వాహనాలకు అందించాల్సిన చెత్తను వేరు వేరు చేయాలని గ్రామస్తులకు తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు అందరూ కలిసి పనిచేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సూచించారు.

రాజన్న సిరిసిల్ల

తిమ్మాపూర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు – నూతన విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న తోట ఆగన్న

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో అంబేద్కర్ మాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ బోనాలు మరియు నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న గారు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొని, గ్రామ అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, గ్రామ సర్పంచ్ అందె సుభాష్, మాజీ ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుంబాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామస్థులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాలను జరుపుకున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మహిళాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది – సోమిరెడ్డి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చ్ (పున్నమి ప్రతినిధి).మనుబోలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మహిళల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. పొదుపు మహిళలకు రుణ పరిమితి రూ.5 లక్షలకు పెంచామని, స్త్రీశక్తి పథకంతో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు, కుట్టు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, 8,9 తరగతి విద్యార్థినులకు త్వరలో సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

రాజన్న సిరిసిల్ల

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లేబర్ అడ్డా వద్ద శ్రమజీవి మహిళలకు ఘన సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా /మార్చి/ పున్నమి ప్రతినిధి ఈరోజు (08-03-2026) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట లేబర్ అడ్డా వద్ద బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రమజీవి మహిళలను శాలువాలతో సత్కరించారు. బంక లలిత, రాంబాయి, నరసవ్వ, లత తదితర మహిళలకు ఈ సందర్భంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి, గౌరవ అధ్యక్షుడు మిట్టపల్లి రాజమల్లు, ప్రధాన కార్యదర్శి ఎగమాటి ఎల్లారెడ్డి, జిల్లా నాయకులు ము.సం. రమేష్, ఈశంపల్లి రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లేబర్ అడ్డా వద్ద మహిళా కార్మికులకు మూత్రశాల, మంచినీటి వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే లేబర్ కార్డుల సమస్యలు, బ్రోకర్ల దందాలు నివారించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13-03-2026న ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికుల ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: లేబర్ అడ్డా వద్ద శ్రమజీవి మహిళలకు ఘన సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా /మార్చి/ పున్నమి ప్రతినిధి ఈరోజు (08-03-2026) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట లేబర్ అడ్డా వద్ద బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రమజీవి మహిళలను శాలువాలతో సత్కరించారు. బంక లలిత, రాంబాయి, నరసవ్వ, లత తదితర మహిళలకు ఈ సందర్భంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి, గౌరవ అధ్యక్షుడు మిట్టపల్లి రాజమల్లు, ప్రధాన కార్యదర్శి ఎగమాటి ఎల్లారెడ్డి, జిల్లా నాయకులు ము.సం. రమేష్, ఈశంపల్లి రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లేబర్ అడ్డా వద్ద మహిళా కార్మికులకు మూత్రశాల, మంచినీటి వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే లేబర్ కార్డుల సమస్యలు, బ్రోకర్ల దందాలు నివారించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13-03-2026న ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికుల ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

ట్రాక్టర్ ప్రమాదం… బురదలో చిక్కుకున్న బాధితుడిని రక్షించిన 108 ఈఎంటి ప్రశాంత్

రాజన్న సిరిసిల్ల జిల్లా/ మార్చి /పున్నమి ప్రతినిధి. ముస్తాబాద్ మండలం లోని పోతుగల్ గ్రామంలో ఇటుకలు ఖాళీ చేసి తిరిగి వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనలో బురదలో చిక్కుకున్న బాధితుడిని 108 అంబులెన్స్ సిబ్బంది ధైర్యంగా కాపాడారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న 108 సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రశాంత్ ఎలాంటి ప్రమాదాన్ని లెక్కచేయకుండా బాధితుడిని బయటకు తీసి ప్రాణాపాయం నుంచి రక్షించారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రశాంత్ చూపిన ధైర్యసాహసం పట్ల స్థానికులు అభినందనలు తెలిపారు

ఖమ్మం

వెలుగు మట్ల వివాదం లో మరో కొత్త కోణం. బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం చేసిన పోలీస్ లు

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) వెలుగుమట్లలో సర్వే నంబర్లు 147, 148, 149 లో ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా ఇస్తామని చెప్పి, ఫోన్ ద్వారా రూ. 45,000/- తీసుకుని మోసం చేశారని ఆమె ఆరోపించారు. మా సంస్థ ద్వారా భూమి కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం పట్టా ఇస్తుంది. జిల్లా కలెక్టర్ మీ పేరుతో ఒక ప్లాట్ ఇస్తారు. ప్రతి ప్లాట్ 100 గజాలు ఉంటుంది. ప్లాట్లు లేని వారికి ప్రభుత్వం పంపిణీ చేయడానికి ఇవి ఇస్తోంది. అటువంటి ప్లాట్లను ఇవ్వడానికి ఏర్పాటైన కమిటీలో నేను కూడా సభ్యుడిని. మీకు కూడా అటువంటి ప్లాట్ కావాలంటే కొంత డబ్బు చెల్లించాలి” అని నమ్మబలికారు. ఆ మాటలను నమ్మి నేను ఫోన్ ద్వారా రూ. 45,000/- చెల్లించాను అని కిష్టారం గ్రామం, సత్తుపల్లి మండలానికి చెందిన గుడిమల్ల స్పందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిచారు.

తిరుపతి

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మహాశక్తి రూపమే మహిళ, భవిష్యత్ తరాలకు మార్గదర్శి మహిళ పున్నమి ప్రతినిధి . రామచంద్రపురం మండలం కాయం హరినాథ్ రెడ్డి, మహిళ లేనిదే మనుగడలేదు : డాక్టర్ తేజస్విని, మహాశక్తి రూపమే మహిళ అని మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ కాయం హరినాధ రెడ్డి అన్నారు. శనివారం రామచంద్రాపురం మండలం కుప్పం బాదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కరించుకుని సేవా దృక్పథంలో పనిచేస్తున్న మహిళలను సాలవలతో సత్కరించి, చీరలు, స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశక్తి రూపమే మహిళ అని, మహిళలు సంతోషంగా ఉంటే ఆ గృహము, గ్రామము, రాష్ట్రం దేశం, సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో మహిళ ప్రధమ ప్రాముఖ్యమన్నారు. దేవతలు పురాతన కాలం నుంచి మహిళలు సంతోషంగా ఉన్నచోట దేవతలు నడి ఆడుతారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ తేజస్విని మాట్లాడుతూ మహిళలతోనే మనుగడ సాధ్యమన్నారు. మహిళలు లేనిదే మానవాళి మనుగడ శూన్యం, మహిళ అవ్వగా, తల్లిగా, భార్యగా, కూతురుగా , ప్రతి ఒక్కరి జీవితంలో కొలువై ఉంటుందని అన్నారు. అనంతరం ఖాయం హరినాథ్ రెడ్డి డాక్టర్లను దుశాలవతో సత్కరించి, పాఠశాలలో వంటలు చేసే మహిళలకు, ఆరోగ్య కేంద్రంలో సేవలు చేసే మహిళలకు చీరలు పంపిణీ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పూర్ణిమ, వైద్య సిబ్బంది మహిళలు తదితరులు పాల్గొన్నారు

సాహితీ

బహుళ కళల మహిళ (కవిత) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

ప్రతి సంవత్సరం మార్చి 8 వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. 20వ శతాబ్దం ప్రారంభంలో యూరప్ మరియు ఉత్తర అమెరికాలో జరిగిన కార్మిక ఉద్యమాల నుండి మహిళా దినోత్సవం ఉద్భవించింది. మొదటి మహిళా దినోత్సవం 1911లో జరుపుకోగా 1975లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా గుర్తించింది. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలను గౌరవిస్తూ, లింగ సమానత్వం కోసం ఈ రోజును నిర్ణయించడం జరిగింది. “హక్కులు, న్యాయం, కార్యాచరణ అందరి మహిళలు మరియు బాలికల కోసం” అనేది ఐక్యరాజ్యసమితి 2026వ సంవత్సర థీమ్. లింగ వివక్షను అంతం చేయడం, మహిళల హక్కులయిన విద్య, ఓటు హక్కు, సమాన వేతనం పట్ల అవగాహన కల్పించడం మరియు సమాన అవకాశాలను కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ సందర్భంగా మహిళాశక్తిపై పాఠకుల కోసం … ఈ కవిత అమ్మాయి నుండి అమ్మ వరకు చెల్లి నుండి అక్క వరకు అమ్మ నుండి అవ్వ వరకు భార్య నుండి బామ్మ వరకు సరిగమల నుండి ఘుమఘుమల వరకు సంగీతం నుండి ఆహారామృతం వరకు చోదకం నుండి భోదకం వరకు రాజీయం నుండి జయం వరకు ప్రతిపక్షం నుండి అంతరిక్షం వరకు శిక్షణ నుండి శాంతి భద్రతల పరిరక్షణ వరకు ఇంటి పని నుండి ఆ పని ఈ పని అని.. పని ఏదైనా సంభవమని తలచి తలచి వలచి వంశవృక్ష రక్షణలో నిత్య వసంత ఆమని మది మదిని మురిపించేమణి రూపాంతర పరిమళ మాలిక అమ్మకు అమ్మయ్యే జీవన గమన దీపిక ఆప్యాయతలు పంచే సంసార సారిక అనుబంధ విలువలకు దివ్యౌషధ మూలిక తరతరాల సుసంపన్న మాతృక మహిళ జీవిత మధుర జ్ఞాపిక బాలిక నుండి బాంధవ్య ఏలిక దాక విధి క్రీడలో అనుసరణీయ భాగ్య రేఖ స్మరణీయ కమనీయ కాలచక్ర కథానాయిక బహుళ కళల మహిళగ విశ్వాంబిక *మ* – మనిషి పుట్టుటకు మనుగడకు మూలం *హి* – హితోక్తుల భావజాలానికి బలం *ళ* – కళాత్మక రూపాలను తీర్చిదిద్దే కలం అసలు సృష్టికే మూలం కుటుంబ పుష్టికి ఆనంద భరితం గృహిణిగా చేయూత పరిపూర్ణ చరితం అవనిలో ధ్వనించే నిత్య జీవనగీతం.. మహిళ

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.