Monday, 27 April 2026

Blog

తిరుపతి

ఆరోగ్యానికి మించిన సంపద మరొకటిలేదూ.. డివైఎస్పి నరసింహమూర్తి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 08: శ్రీకాళహస్తి పట్నంలోని పానగల్ లో జుమ్లేషా పీర్ దర్గా ఆవరణలో మహిళా దినోత్సవం, రంజన్ మాసం సందర్భంగా తిరుపతి డిఎన్ఆర్ మల్టీస్పెషాలిటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీకాళహస్తి డిఎస్పి నరసింహమూర్తి విచ్చేశారు. శ్రీకాళహస్తి డిఎస్పి మాట్లాడుతూ….. ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తు ఆరోగ్యమే మహా భాగ్యం అని పెద్దలు చెప్పిన మాటను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని మనిషి జీవితంలో ధనం, ఆస్తులు ఎంత ఉన్నా ఆరోగ్యం లేకపోతే వాటికి విలువ ఉండదని అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు. సమయానికి ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, పరిశుభ్రత పాటించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని సాధించవచ్చన్నారు. తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ మెడికల్ క్యాంపులో కార్యక్రమ స్పాన్సర్ వి నాగేశ్వరరావు, డిఎన్ఆర్ హాస్పిటల్ డాక్టర్ జెనీఫర్ జనరల్ మెడిసిన్, హాస్పిటల్ పిఆర్వోలు శివశంకర్, సాయి మోహన్ రెడ్డి, యుగంధర్ బాబు, సిస్టర్లు స్వప్న, జయశ్రీ, మౌనిక, ఫార్మసిస్ట్ వెంకటేష్ మరియు దర్గా నిర్వాహకులు సయ్యద్ అహ్మద్, బాబా ఫరీద్, జమ్రుద్దీన్ , మహమ్మద్ అన్సర్, మహిళలు, పట్టణ ప్రజలు అధికంగా పాల్గొన్నారు.

అన్నమయ్య

నైతిక విలువలు – నిజాయితీ, ధర్మం నిత్యం పెంపొందించుకోవాలి

విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే నైతిక విలువలు, నిజాయితీ మరియు ధర్మాన్ని ఎల్లప్పుడూ పాటించాలని ఉపాధ్యాయులు పసుపుల రాజశేఖర్ సూచించారు. తిరుపతి జిల్లా చిట్వేల్ శివాలయంలో ఆదివారం ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఈ విషయాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సత్యం మరియు ధర్మానికి ప్రతీకగా నిలిచిన రాజు హరిశ్చంద్రుడి కథను విద్యార్థులకు వివరించారు. ఎన్ని కష్టాలు వచ్చినా రాజు హరిశ్చంద్రుడు తన మాటను తప్పకుండా, ధర్మాన్ని విడువకుండా నిలబడ్డాడని తెలిపారు. తన రాజ్యాన్ని, సంపదను, కుటుంబాన్ని కూడా కోల్పోయినా సత్యాన్ని వదల్లేదని చెప్పారు. చివరకు అతని నిజాయితీ మరియు ధర్మం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని వివరించారు.విద్యార్థులు కూడా హరిశ్చంద్రుడిలా నిజాయితీగా, ధర్మబద్ధంగా జీవించాలనే సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. నైతిక విలువలు, క్రమశిక్షణ, పరస్పర గౌరవం వంటి లక్షణాలు ప్రతి విద్యార్థి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సాయిరాం, వెంకట శివ, సునీల్, విద్యార్థులు పాల్గొన్నారు.

అన్నమయ్య

విజయవాడలో వైభవంగా తుంగా ఆకాష్-శ్రీజిత వివాహ రిసెప్షన్!

విజయవాడ నగరంలో ఆదివారం జరిగిన తుంగా ఆకాష్ మరియు శ్రీజిత ల వివాహ రిసెప్షన్ వేడుక రాజకీయ, సామాజిక ప్రముఖుల కలయికతో అత్యంత వైభవంగా జరిగింది. కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ రాజకీయ మరియు సాగునీటి రంగ విశ్లేషకులు శ్రీ తుంగా లక్ష్మీనారాయణ కుమారుడు ఆకాష్ వివాహ రిసెప్షన్ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ శ్రీ కేకే చౌదరి తన కుటుంబ సమేతంగా హాజరయ్యారు. వరుడు ఆకాష్ (చైర్మన్ గారి చిన్న మామయ్య కుమారుడు) మరియు వధువు శ్రీజితలను కేకే చౌదరి దంపతులు ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సందడి చేశారు.ఈ రిసెప్షన్ వేడుకలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని నవ దంపతులను దీవించారు. వారిలో ముఖ్యంగా:ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు.కమ్యూనిస్టు పార్టీ జాతీయ మరియు రాష్ట్ర స్థాయి కీలక నాయకులు. ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు మరియు మేధావులు.వధూవరుల కుటుంబ సభ్యులు అతిథులకు ఘన స్వాగతం పలికారు. ఈ వేడుక విభిన్న రాజకీయ సిద్ధాంతాల నేతలు మరియు సామాజిక విశ్లేషకుల కలయికకు వేదికగా నిలిచింది.

అన్నమయ్య

గంజాయిపై ‘వజ్ర ప్రహర్’.. వత్తులూరులో పోలీసుల మెరుపు తనిఖీలు!

తిరుపతి జిల్లాలో గంజాయిని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఉత్తర్వుల మేరకు, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాస్ రావు ఆదేశాల ప్రకారం.. “వజ్ర ప్రహర్” కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఓబులవారిపల్లి మండలం వత్తులూరు వడ్డిపల్లి గ్రామంలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.రైల్వే కోడూరు రూరల్ సీఐ శ్రీ శ్రీనివాసులు, అర్బన్ సీఐ శ్రీ చంద్రశేఖర్ పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఓబులవారిపల్లి ఎస్సై పి. మహేష్, చిట్వేల్ ఎస్సై ఎస్. వినోద్, రైల్వే కోడూరు ఎస్సై ప్రసాద్ రెడ్డి మరియు రూరల్ సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ మరియు వినియోగాన్ని అరికట్టడమే ధ్యేయంగా గ్రామంలోని అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు మరియు గృహాలను పోలీసులు సమగ్రంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ.. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు యువత బంగారు భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో నేరాల పెరుగుదలకు ఇవే ప్రధాన కారణమవుతున్నాయని, వీటిని అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారని స్పష్టం చేశారు. గంజాయి విక్రయించినా, నిల్వ ఉంచినా చట్టపరంగా కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.తనిఖీల అనంతరం గ్రామస్తులతో సమావేశమైన పోలీసులు.. మహిళలపై నేరాలు, బాల్య వివాహాల నిరోధం, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు మరియు దొంగతనాల నివారణపై అవగాహన కల్పించారు. ఎక్కడైనా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

అన్నమయ్య

సి.కందులవారిపల్లిలో వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మండల పరిధిలోని సి.కందులవారిపల్లి స్వర్ణ గ్రామంలో మహిళా శక్తిని గౌరవిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వేదికగా జరిగిన ఈ వేడుకల్లో సమాజ సేవలో నిరంతరం శ్రమిస్తున్న క్షేత్రస్థాయి మహిళా సిబ్బందిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిట్వేల్ మండల టీడీపీ అధ్యక్షులు **కాకర్ల నాగార్జున, సీనియర్ నాయకులు బాలు రామాంజనేయులు మాట్లాడుతూ.. కుటుంబంతో పాటు సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమని కొనియాడారు. గ్రామంలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వెలుగు వివోఏలు మరియు స్వర్ణ గ్రామం సిబ్బంది చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని వారు పేర్కొన్నారు. అనంతరం వారందరినీ శాలువాలతో సత్కరించి, గౌరవపూర్వక జ్ఞాపికలను అందజేశారు.సర్పంచ్ శ్రీమతి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో పంచాయతీ డిప్యూటీ ఎంపీడీవో, జిఎస్‌డబ్ల్యూ డిప్యూటీ ఎంపీడీవోలు పాల్గొని మహిళా సాధికారత గురించి వివరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మహిళా సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లు రమణయ్య గారు, హరికృష్ణ గారు, గ్రామ సచివాలయ సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు మరియు గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ సేవలను గుర్తించి సత్కరించినందుకు మహిళా సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

అన్నమయ్య

మహిళా దినోత్సవం ఆటపాటల కోసం కాదు.. పోరాటాల ప్రతీక!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది కేవలం ఉత్సవాలకు, ఆటపాటలకు పరిమితం కావాల్సిన రోజు కాదని, అది మహిళల సమాన హక్కుల కోసం సాగిన చారిత్రాత్మక పోరాటాలకు ప్రతీక అని భారత విప్లవ మార్క్సిస్ట్ పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ దాసరి జయచంద్ర పేర్కొన్నారు. ఆదివారం రైల్వే కోడూరులో ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జయచంద్ర మాట్లాడుతూ.. మహిళా దినోత్సవ పోరాట స్ఫూర్తిని పాలకవర్గాలు వక్రీకరిస్తూ కేవలం రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలహీనులుగా ఉంచే విధానాలను అమలు చేస్తూ వారి అభ్యుదయ ఆలోచనలను నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. మహిళల అసలు సమస్యలైన భద్రత, ఉపాధి, సమాన వేతనంపై ప్రభుత్వాలకు స్పష్టమైన కార్యాచరణ లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళలపై హింసాత్మక ఘటనలు, అత్యాచారాలు పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, పైగా అధికార ప్రజాప్రతినిధులే తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేయడం అత్యంత సిగ్గుచేటని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్-6 హామీల్లో భాగమైన ‘ఆడబిడ్డ నిధి’ పథకాన్ని ఇప్పటికీ అమలు చేయకపోవడం ద్వారా ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన మాట తప్పిందని జయచంద్ర విమర్శించారు. మహిళల స్వాభిమానం కోసం కేవలం హామీలు కాకుండా స్పష్టమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. మహిళల గౌరవం, విముక్తి కోసం సాగుతున్న ప్రతి ఉద్యమానికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఏఐడీడబ్ల్యూఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు భాగ్యమ్మ, సౌజన్య, కోశాధికారి సుజాత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంచాయతీ మహిళా కార్మికులు, ప్రైవేట్ టీచర్స్ యూనియన్ నాయకురాలు మరియు మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అన్నమయ్య

మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది మహిళా దినోత్సవ వేడుకల్లో ముక్కా వరలక్ష్మి

రైల్వే కోడూరు పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్, కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు విద్య, ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం, సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల కృషి, త్యాగాలను గుర్తు చేసే ప్రత్యేక దినమని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు స్వర్గీయ నందమూరి తారక రామారావు పునాది వేసిన నాయకుడని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు.డ్వాక్రా మహిళల రుణ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఎస్సీ–ఎస్టీ మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. “తల్లికి వందనం” పథకం ద్వారా 67 లక్షల మంది తల్లులకు రూ.10 వేల కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు. మహిళల భద్రత, ఆరోగ్యం, విద్యకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా ముక్కా వరలక్ష్మిని శాలువా కప్పి, మొమెంటో అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో, రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి, మహిళలు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

అన్నమయ్య

మహిళల రక్షణే పోలీసుల ప్రథమ ప్రాధాన్యత!

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం చిట్వేల్ పోలీస్ స్టేషన్‌లో మహిళా గౌరవాన్ని చాటిచెప్పేలా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఎస్. వినోద్ కుమార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా సిబ్బందికి మరియు మహిళా పోలీసులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. -మహిళా శక్తికి వందనం: ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. సమాజ రక్షణలో మహిళా పోలీసులు పురుషులతో సమానంగా అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు, రక్షణ కవచాల గురించి వివరించారు. అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనలో మరియు శాంతిభద్రతల పరిరక్షణలో మహిళా సిబ్బంది పోషిస్తున్న పాత్ర వెలకట్టలేనిదని ఆయన పేర్కొన్నారు. -ఉత్సాహంగా వేడుకలు: పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మహిళా సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. విధి నిర్వహణలో మహిళలకు ఎల్లప్పుడూ గౌరవం మరియు సహకారం ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

పోతుగల్ గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్

ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రజలకు” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోతుగల్‌లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ పెద్దగారి యాదమ్మ, కార్యక్రమ నిర్వాహకుడు హపర్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు తడి, పొడి చెత్తను వేరు చేయడం గురించి వివరించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ శుభ్రతపై ప్రత్యేకంగా సూచనలు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ వాహనాలకు అందించాల్సిన చెత్తను వేరు వేరు చేయాలని గ్రామస్తులకు తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు అందరూ కలిసి పనిచేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సూచించారు.

రాజన్న సిరిసిల్ల

తిమ్మాపూర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు – నూతన విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న తోట ఆగన్న

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో అంబేద్కర్ మాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ బోనాలు మరియు నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న గారు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొని, గ్రామ అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, గ్రామ సర్పంచ్ అందె సుభాష్, మాజీ ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుంబాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామస్థులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాలను జరుపుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.