Monday, 27 April 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తిలో విజయవంతంగా ఆపరేషన్ వజ్రప్రహార్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 07: ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీస్ సబ్ డివిజన్లు DGP హరీష్ కుమార్ గుప్తా ఆదేశలతో IGP ఈగల్ చీఫ్ ఆకే రవి కృష్ణ పర్యవేక్షణలో, తిరుపతి జిల్లా SP సుబ్బారాయుడు ఆద్వర్యములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోని పోలీసు సబ్ డివిజన్‌లలో శనివారం నాడు మెగా కార్డన్ &సెర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించబడింది. ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా శ్రీకాళహస్తి డివిజన్ లోని చల్లపాలెం BC కాలనీ నందు కూడా మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు పోలీసు శాఖ వారు చేపట్టారు. ఈ మెగా కార్డ్ అండ్ సర్చ్ ఆపరేషన్‌ను, శ్రీకాళహస్తి సబ్ డివిజన్‌లో డిఎస్పీ నరసింహ మూర్తి, శ్రీకాళహస్తి రూరల్ ఇబ్రహీం, శ్రీకాళహస్తి II టౌన్ నాగరాజు, B.N కండ్రిగ తిమ్మయ్య, సి.ఐ.లు, శ్రీకాళహస్తి సబ్ డివిజన్‌లోని 8 మంది SI లు, 55 మంది పోలీసు సిబ్బందితో కలిసి పోలీసు అధికారులు, సిబ్బంది, స్పెషల్ టీమ్‌లు కలిసి గుర్తించిన హాట్‌స్పాట్ ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా మాదకద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్లు అనుమానం ఉన్న ప్రాంతాలు, అద్దె ఇళ్లు, ఇతర అనుమానాస్పద ప్రదేశాలలో పాత గంజాయి, నార్కోటిక్ కేసులలో ఉన్నటువంటి ముద్దాయిలను పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ప్రజల వివరాలు, వాహనాల వివరాలు, అనుమానాస్పద వ్యక్తులపై పరిశీలన చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 300 మంది వ్యక్తులను, 235 వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 33 వాహనాలను గుర్తించి 29 బైక్ లు, 4 ఆటలను సీజ్ చేశామని ఇద్దరు సస్పెక్ట్ షీట్లు ఉన్న వ్యక్తులను స్పాట్ లో పిలిపించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారిని సత్ప్రవర్తనతో మెలగాలని సూచించి ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించి గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ EAGLE టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు ప్రజలతో కలిసి “ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రతిజ్ఞ” నిర్వహించి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేశారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని పూర్తిగా అరికట్టే దిశగా “ఆపరేషన్ వజ్రప్రహార్” కింద ఇలాంటి ప్రత్యేక చర్యలు నిరంతరం కొనసాగుతాయని ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పొలుసు అధికారులు పేర్కొన్నారు.

తిరుపతి

అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ లో ప్రతిభని చాటిన శ్రీకాళహస్తి మహిళ

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 07: శ్రీకాళహస్తి డిగ్రీ మహిళా కళాశాలలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థిని మల్లాపు స్వర్ణలత మలేషియాలోని కౌలాలంపూర్ లో పిబ్రవరి నెల 27 నుండి మార్చి 04 వరకు నిర్వహించబడిన అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ టెస్ట్ సీరియస్ లో భారతదేశం తరుపున బి.బి.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో పురుషుల, మహిళల జట్లు పాల్గొనడంతో మహిళా జట్టులో శ్రీకాళహస్తి డిగ్రీ మహిళా కళాశాలలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థిని మల్లాపు స్వర్ణలత ప్రాతినిధ్యం వహించారు. టెస్ట్ సిరీస్ లో స్వర్ణలత తన ప్రతిభను చాటి జట్టు గెలుపునకు కృషి చేసింది. టెస్ట్ సిరీస్ లో భారతదేశపు జట్టు ప్రథమ స్థానం పొంది గోల్డ్ మెడల్ సాధించింది. ఇంతటి విజియాన్ని కైవసం చేసుకున్న బ్యాడ్మింటన్ క్రీడా కారిణిని స్వర్ణలతను శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజశేఖర్, పిడి నరసింహారావు, సీనియర్ ప్లేయర్ ప్రభాకర్, కోచ్ క్రాంతి కుమార్, లు సత్కారచి అభినందనలు తెలిపారు. అనంతరం చిత్తూరు జిల్లా బాల్ బాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ, రాష్ట్ర బాల్ బాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయినా పసుపులేటి బాలాజి చిత్తూరు జిల్లా బాల్ బాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ C. వెంకటస్వామి హర్షం వెక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

తిరుపతి

మహిళలు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలవాలి- టూ టౌన్ ఎస్ఐ జ్యోతి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 07: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ శ్రీకాళహస్తి శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిదిగా టూ టౌన్ ఎస్ఐ జ్యోతి విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులనుద్దేశించి జ్యోతి మాట్లాడుతూ….అన్ని రంగాల్లోనూ మహిళలు అగ్రస్థానంలోకి రావాలని అసాంఘిక శక్తుల పట్ల విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చట్టాలు, హక్కులపై అవగాహన కలిగిన మహిళలు చైతన్యవంతులవుతారని తద్వారా సాధికారత సాకారమవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నరసింహా రావు, ఎస్ఎఫ్ఐ నేతలు చుట్టు గురవయ్య, తులసి, నాగ, సుకుమార్, ఐద్వానేతలు రాధమ్మ, రేవతి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పు అవుతుంది- న్యాయమూర్తి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 07: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన పోలీసు అధికారుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ… మార్చి 14న జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ధనం ఆదా అవుతాయని తెలిపారు. లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పు అవుతుందని, దానికి అప్పీల్ చేసే అవకాశం ఉండదని పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్‌లో వివిధ రకాల సివిల్ కేసులతో పాటు రాజీకి లోబడే క్రిమినల్ కేసులను కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే కోర్టులో పెండింగ్‌లో లేని ప్రీ-లిటిగేషన్ కేసులను కూడా రాజీ ద్వారా పరిష్కరించవచ్చని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా పోలీసులు, న్యాయవాదులు కలిసి ఎక్కువ సంఖ్యలో కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం అయ్యేలా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి, జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ, శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, అలాగే శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తిరుపతి

ఏం పేడు ఆరోగ్య కేంద్రంలో అంగన్వాడి సిబ్బందికి వైద్య పరీక్షలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 07: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఏం పేడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో అంగన్వాడి కేంద్రం టీచర్లకు, సహాయకులకు డాక్టర్లు సుధీర్, రంజితలు అంగన్వాడీ సిబ్బందికి రక్త పరీక్షలు, బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ గ్రేడ్ వన్ సూపర్వైజర్లు హరిత ప్రియాంక పాల్గొని అంగన్వాడి సిబ్బందికి సమతుల్య ఆహారం వ్యాయామం ఒత్తిడిని తగ్గించుకోవలని సూచిస్తూ… మహిళలు ఆరోగ్యం కుటుంబా ఆరోగ్యానికి పునాది అని అశ్రద్ధ చేయకుండా తరచుగా ఆరోగ్య పరిక్షలు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు హెల్త్ కార్డులు మంజూరు చేయుచున్న దృష్ట్యా ఈ వైద్య పరీక్షలు నిర్వహించారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆసియా బేగం, సూపర్వైజర్లు మల్లీశ్వరి, మంజుల ఆదిలక్ష్మి, ప్రగతి స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, అంగన్వాడీ సిబ్బంది, వైద్య సహాయకులు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

తిరుపతి

వాయులీనగేశ్వరుని దర్శించుకున్న పలాస ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 07: శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం శనివారం నాడు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తన కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసారు. వీరికి స్తానికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలయ ఎపిఆర్వొ రవి,తెదేపా నాయకుడు రమణ, ఈశ్వర్.వి పరిటాల స్వాగతం పలికి పాతాళ వినాయకుడు, స్వామి అమ్మవార్ల అంతరాలయ దర్శన ఏర్పాట్లు చేయించి దర్శనానంతరం శ్రీ ‌మృత్యంజయ లింగం వద్ద శ్రీ స్వామి, అమ్మవారి చిత్రం పఠం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

అదుపుతప్పిన ట్రాక్టర్ పంట పొలాల్లోకి దూసుకెళ్లి ఒకరి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా/ మార్చి/ పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండలం లోని పోతుగల్ గ్రామంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటుకలు ఖాళీ చేసి తిరిగి వస్తున్న ట్రాక్టర్ పోతుగల్ గ్రామంలోని రాముల వారి గుడి వెనుక భాగంలో అకస్మాత్తుగా అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ట్రాక్టర్‌లో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. ప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన నందు కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బురదలో చిక్కుకున్న వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విద్యార్థులకు ప్రోత్సాహంగా పరీక్ష కిట్లు పంపిణీ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చ్ పున్నమి ప్రతినిధి .మనుబోలుమండలంలోని ఈవీఎస్ఆర్ జెడ్పీపీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షల దృష్ట్యా అవసరమైన పరీక్ష కిట్లను అందజేశారు. కొండూరు సత్రానికి చెందిన పసుపులేటి శ్రీనివాసులు, దత్తులూరి చెన్నకేశవులు, పసుపులేటి దశరథ కుమార్, ముప్పునేని అఖిల్ చౌదరి కలిసి విద్యార్థులను కలసి ఈ కిట్లను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల ఉపాధ్యాయులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ప్రోత్సాహాన్ని కలిగించింది.

రాజన్న సిరిసిల్ల

మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా మణులకు సర్పంచ్ పోతరాజు చంటి ఘన సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని నేడు కేశన్నపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పోతరాజు చంటి గారి అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. రేపు జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా సంఘాల సభ్యులను సర్పంచ్ పోతరాజు చంటి గారు మరియు గ్రామ ప్రముఖులతో కలిసి శాలువాలతో సన్మానించి గౌరవించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పోతరాజు చంటి గారు మాట్లాడుతూ కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ సేవలోనూ మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మహిళల కృషి వల్లే గ్రామ సమాజం ముందుకు సాగుతుందని, మహిళా సాధికారతతో గ్రామాభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ఆయన అన్నారు. అలాగే గ్రామంలోని మహిళా మణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వజ్జపల్లి శ్రీకాంత్, వార్డు సభ్యులు సంజీవరావు, మధు, లక్ష్మీ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సీఏ రాజు మరియు గ్రామ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

ఖమ్మం

వెలుగుమట్ల భూదాన్ బాధితులకు అండగా నిలిచిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం మార్చి (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి ) ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్‌లో ఆశ్రయం పొందుతున్న వెలుగుమట్ల భూదాన్ బాధితులను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం పునరావాస కేంద్రం నుండి బాధితులను వెళ్లగొట్టే ప్రయత్నాలు చేస్తోందని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిరుపేదలు కట్టుకున్న గూడును కూల్చివేసి వారిని రోడ్డున పడేసిన ప్రభుత్వం ఇప్పుడు పునరావాస కేంద్రం నుంచి కూడా వారిని తరిమేయాలని చూస్తోందని మండిపడ్డారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు పునరావాస కేంద్రం నుండి బయటికి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కే.టి. రామారావు ఆదేశాల మేరకు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధితులకు భోజన ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. హెల్త్ చెకప్ క్యాంప్ ద్వారా బాధితులకు అవసరమైన మందులను అందజేశారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి బాధితులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు భారత రాష్ట్ర సమితి పార్టీ పోరాటం కొనసాగుతుందని పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. బాధితుల తరఫున న్యాయస్థానంలో పోరాడేందుకు ప్రత్యేక లీగల్ సెల్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వెలుగుమట్ల భూదాన్ బాధితులకు వారు కోల్పోయిన ప్రదేశంలోనే 100 గజాల స్థలం, ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి పక్కా ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి రావడానికి ముందు అనేక హామీలు ఇచ్చిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిరుపేదల సమస్యలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ప్రభుత్వం బాధితులను విడగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు బలి కావద్దని బాధితులను కోరుతూ, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, ఆర్‌జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.