Monday, 27 April 2026

Blog

కడప

కడప జిల్లా : ప్రొద్దుటూరులో మరో విద్యార్థి దుర్మరణం

కడప జిల్లా : ప్రొద్దుటూరులో మరో విద్యార్థి దుర్మరణం… నడింపల్లి పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థికి ఫిట్స్ వచ్చిన విషయం తల్లిదండ్రులకు చెప్పి వారు వచ్చేంతవరకు పాఠశాలలోనే విద్యార్థిని ఉంచడంతో మృతి పాఠశాల హెడ్ మాస్టర్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం పట్ల తల్లిదండ్రుల ఆందోళ… తల్లిదండ్రులు వచ్చి విద్యార్థి ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తీసుకురావడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యుల వెల్లడి…

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆపరేషన్ చిన్నారి తల్లి గురించి విశ్రుతంగా అవగాహన కల్పిస్తున్న నెల్లూరు పోలీసులు

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పిల్లల భద్రతపై అవగాహన పెంచేందుకు పోలీసులు “ఆపరేషన్ చిన్నారి తల్లి” కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సూచనలతో శక్తి బృందాలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. “సురక్షిత బాల్యం – స్థిరమైన అభివృద్ధి” అనే నినాదంతో పిల్లలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టడం, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం లక్ష్యం. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా, ఫోక్సో చట్టం, మాదకద్రవ్యాల నిషేధం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, అత్యవసర సహాయం కోసం 100, 112, 1098, 1930 హెల్ప్‌లైన్ నంబర్లను తెలియజేస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సర్పంచ్ కొండెపోగు దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో శానిటేషన్ శుభ్రత

వరికుంటపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని NH565 రోడ్డు పక్కన ఉన్న కాంప్లెక్స్ మరియు షాపుల ముందు గ్రామ పంచాయతీ సర్పంచ్ కొండెపోగు దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బంది ద్వారా బ్లీచింగ్ చల్లించడం జరిగింది. దోమల నివారణ మరియు శుభ్రత కోసం గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గ్రామ ప్రజలు ఎక్కడైనా శానిటేషన్ సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే గ్రామ పంచాయతీ సర్పంచ్ లేదా పంచాయతీ డెవలప్మెంట్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాత్రి పూట రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం

జిల్లా వ్యాప్తంగా రాత్రి పూట జరుగుతున్న ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల, IPS గారి ఆదేశాల మేరకు పోలీసులు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలో డ్రైవర్లలో నిద్ర మత్తు వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. టోల్ ప్లాజాలు, ప్రధాన జంక్షన్లు వద్ద పోలీసులు వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి అప్రమత్తం చేస్తున్నారు. డ్రైవర్లు నిద్రగా అనిపిస్తే వాహనాన్ని పక్కన ఆపి విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బైక్ ను ఢీ కొన్న ఆటో సర్వేయర్, వీ ఆర్ ఎ కు గాయాలు

దుత్తలూరు మండలం రాచవారిపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌ను ఆటో ఢీకొనడంతో ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు గాయపడ్డారు. దుత్తలూరు రెవెన్యూ కార్యాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న మోహన్ రెడ్డి, వీఆర్‌ఏ మురళి సర్వే పనుల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా వారిని ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతున్నట్లు సమాచారం.

వరంగల్

వరంగల్ జేపియన్ రోడ్ లో ఎలక్ట్రికల్ షాప్ లో అగ్ని ప్రమాదం

వరంగల్ జేపీఎన్ రోడ్ లో ఎలక్ట్రానిక్స్ దుకాణంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగినది షాపులోని ఎలక్ట్రిక్ వస్తువులు ఫర్నిచర్ మొత్తం అగ్నికి ఆహుతఅయ్యాయి, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రయత్నిస్తున్నారు ఈ ప్రమాదం కారణంగా జేపీ న్ రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అయినది

తూర్పు గోదావరి

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మహిళకు మానవత సహాయం

తాళ్లపూడి, (పున్నమి ప్రతినిధి ), మార్చి 6: వేగేశ్వరపురం గ్రామానికి చెందిన డయాలసిస్ పేషెంట్ కంకిపాటి సుహాసినికి వైద్య చికిత్స మరియు మందుల ఖర్చుల కోసం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ – తాళ్లపూడి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. సంస్థ తరపున రూ.6,000లు మరియు జిల్లా ఉపాధ్యక్షులు వాసిబోయిన చంద్రయ్య వ్యక్తిగతంగా రూ.1,000లు అందజేయడంతో మొత్తం రూ.7,000ల సహాయం అందించామని సంస్థ అధ్యక్షులు వెలుగుబంటి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్నవారి కన్నీటిని తుడవడం మానవత సంస్థ ప్రధాన లక్ష్యమని అన్నారు. ముఖ్యంగా విద్య మరియు వైద్య సేవల కోసం సంస్థ ఎక్కువగా సహాయం అందిస్తున్నదని పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు వాసిబోయిన చంద్రయ్య మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారు మానవత సంస్థను ఆశ్రయిస్తే సాధ్యమైనంత సహాయం అందిస్తామని తెలిపారు. సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి ఆశయాల మేరకు మానవులకు సేవ చేయడం సంస్థ ముఖ్య ఉద్దేశమని చెప్పారు.

E-పేపర్

తెలంగాణ రాష్ట్ర ప్రదేష్ కమిటీ మహిళా అధ్యక్షురాలుగా స్వర్ణ

_తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా వరంగల్ పూర్వ మేయర్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ పూర్వ_ _అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ-రాజేశ్వర్ రావు ను_ _నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి,లోకసభ సభ్యులు కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ_ _చేశారు.ఈ నియామకం ఉన్నఫళంగా అమల్లోకి_ _వస్తాయని ఉత్తర్వుల్లో కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు._ _శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ-రాజేశ్వర్ రావు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు._

తిరుపతి

ఆదర్శ పాఠశాలను ఆకస్మిక తనిఖీచేసిన ఎంఈఓ ప్రేమలత

ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 06: ఏర్పేడు మండలం మడిబాక గ్రామపంచాయతీ పరిధిలోని రాజుల కండ్రిగ ఆదర్శ పాఠశాలను ఎంఈఓ డి. ప్రేమలత శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు విభాగాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి వంటగది శుభ్రత, ఆహార నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించి తరగతి గదులను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. కొంతమంది విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి విద్యా స్థాయిని అంచనా వేశారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రతను పరిశీలించిన ఎంఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల సరస్వతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తిరుపతి

ఎమ్మెల్యే బొజ్జల చొరవతో సమూల మార్పు దిశగా రాజీవ్ నగర్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 06: నిన్నటి వరకు సమస్యలకు నిలయంగా ఉన్న రాజీవ్ నగర్, నేడు అభివృద్ధికి చిరునామాగా మారుతోంది. శ్రీకాళహస్తి పట్టణానికి అత్యంత చేరువలో ఉన్న ఈ ప్రాంతం, శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆధునిక హంగులను అద్దుకుంటోంది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎదురైన భూ సమస్యలను పరిష్కరిస్తూనే, మౌలిక సదుపాయాల కల్పనలో ఎమ్మెల్యే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. రాజీవ్ నగర్ కాలనీలో ప్రయాణం నరకప్రాయంగా ఉన్న తరుణంలో, ఎమ్మెల్యే అంతర్గత సి.సి. రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఇప్పటికే పలు వీధుల్లో సి.సి. రోడ్ల పనులు పూర్తి కావడంతో కాలనీ వాసులకు రవాణా కష్టాలు తీరాయి. వర్షాకాలంలో బురదమయంగా మారే దారుల స్థానంలో పక్కా రోడ్లు రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ నగర్ ప్రాంతంలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయం ఇప్పుడు ఒక సుందరమైన పట్టణంలా కనిపిస్తోంది. అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే ఈ గృహాలను అందజేసేందుకు ఎమ్మెల్యే ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్, తాగునీరు, మురుగునీటి పారుదల వంటి మౌలిక వసతులతో ఈ భవనాలు ముస్తాబవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఒకే స్థలానికి బహుళ రిజిస్ట్రేషన్లు జరగడం వల్ల ఏర్పడిన గందరగోళాన్ని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే గట్టిగా కృషి చేస్తున్నారు. అర్హులైన పేదలకు న్యాయం చేయడమే లక్ష్యంగా అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాజీవ్ నగర్ అభివృద్ధి కేవలం రోడ్లకే పరిమితం కాకుండా, మరిన్ని అభివృద్ధి పనులతో ఈ ప్రాంతాన్ని మోడల్ కాలనీగా మార్చనున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు వెల్లడించారు. భవిష్యత్తులో పార్కులు, కమ్యూనిటీ హాల్స్, మెరుగైన వీధి దీపాల ఏర్పాటుతో రాజీవ్ నగర్ ముఖచిత్రం పూర్తిగా మారనుంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.