Monday, 27 April 2026

Blog

E-పేపర్

తెలంగాణ రాష్ట్ర ప్రదేష్ కమిటీ మహిళా అధ్యక్షురాలుగా స్వర్ణ

_తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా వరంగల్ పూర్వ మేయర్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ పూర్వ_ _అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ-రాజేశ్వర్ రావు ను_ _నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి,లోకసభ సభ్యులు కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ_ _చేశారు.ఈ నియామకం ఉన్నఫళంగా అమల్లోకి_ _వస్తాయని ఉత్తర్వుల్లో కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు._ _శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ-రాజేశ్వర్ రావు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు._

తిరుపతి

ఆదర్శ పాఠశాలను ఆకస్మిక తనిఖీచేసిన ఎంఈఓ ప్రేమలత

ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 06: ఏర్పేడు మండలం మడిబాక గ్రామపంచాయతీ పరిధిలోని రాజుల కండ్రిగ ఆదర్శ పాఠశాలను ఎంఈఓ డి. ప్రేమలత శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు విభాగాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి వంటగది శుభ్రత, ఆహార నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించి తరగతి గదులను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. కొంతమంది విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి విద్యా స్థాయిని అంచనా వేశారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రతను పరిశీలించిన ఎంఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల సరస్వతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తిరుపతి

ఎమ్మెల్యే బొజ్జల చొరవతో సమూల మార్పు దిశగా రాజీవ్ నగర్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 06: నిన్నటి వరకు సమస్యలకు నిలయంగా ఉన్న రాజీవ్ నగర్, నేడు అభివృద్ధికి చిరునామాగా మారుతోంది. శ్రీకాళహస్తి పట్టణానికి అత్యంత చేరువలో ఉన్న ఈ ప్రాంతం, శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆధునిక హంగులను అద్దుకుంటోంది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎదురైన భూ సమస్యలను పరిష్కరిస్తూనే, మౌలిక సదుపాయాల కల్పనలో ఎమ్మెల్యే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. రాజీవ్ నగర్ కాలనీలో ప్రయాణం నరకప్రాయంగా ఉన్న తరుణంలో, ఎమ్మెల్యే అంతర్గత సి.సి. రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఇప్పటికే పలు వీధుల్లో సి.సి. రోడ్ల పనులు పూర్తి కావడంతో కాలనీ వాసులకు రవాణా కష్టాలు తీరాయి. వర్షాకాలంలో బురదమయంగా మారే దారుల స్థానంలో పక్కా రోడ్లు రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ నగర్ ప్రాంతంలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయం ఇప్పుడు ఒక సుందరమైన పట్టణంలా కనిపిస్తోంది. అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే ఈ గృహాలను అందజేసేందుకు ఎమ్మెల్యే ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్, తాగునీరు, మురుగునీటి పారుదల వంటి మౌలిక వసతులతో ఈ భవనాలు ముస్తాబవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఒకే స్థలానికి బహుళ రిజిస్ట్రేషన్లు జరగడం వల్ల ఏర్పడిన గందరగోళాన్ని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే గట్టిగా కృషి చేస్తున్నారు. అర్హులైన పేదలకు న్యాయం చేయడమే లక్ష్యంగా అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాజీవ్ నగర్ అభివృద్ధి కేవలం రోడ్లకే పరిమితం కాకుండా, మరిన్ని అభివృద్ధి పనులతో ఈ ప్రాంతాన్ని మోడల్ కాలనీగా మార్చనున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు వెల్లడించారు. భవిష్యత్తులో పార్కులు, కమ్యూనిటీ హాల్స్, మెరుగైన వీధి దీపాల ఏర్పాటుతో రాజీవ్ నగర్ ముఖచిత్రం పూర్తిగా మారనుంది.

తిరుపతి

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కొట్టే సాయి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 06: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ఆర్. టి. సి. బస్టాండ్ కూడలి వద్ద శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యమి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్టే సాయి ప్రసాద్ పరిసర ప్రాంతాల్లోని దుకాణాలను సందర్శిస్తూ ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ లక్ష్యాలు మరియు క్రియాశీలక సభ్యత్వం యొక్క ప్రాముఖ్యతను వివరించి ఆసక్తి చూపిన ప్రజలతో జనసేన సభ్యత్వ నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కుమార్, జయప్రకాష్, మహేష్, గరికపాటి చంద్ర, జానీ భాషా, చిరంజీవి తదితరులు, జనసైనికులు పాల్గొన్నారు.

తిరుపతి

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలుతప్పవు.. సీఐ తిమ్మయ్య

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 06: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక పెళ్లి మండపం వద్ద సీఐ తిమ్మయ్య ఆధ్వర్యంలో ఎస్సై రవికుమార్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమో చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఆర్.సి, పొల్యూషన్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నపిల్లలు ద్విచక్ర నడుపుతున్న వారికి అవగాహన కల్పించినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మునస్వామి నాయుడు, పి. సి. లు వెంకటేష్ రెడ్డి, హేమనాథ్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఎమ్మెల్యే బొజ్జల సతీమణిచే అంగన్వాడీ భవనం ప్రారంభం

ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 06: ఏర్పేడు మండలం కాట్రకాయలగుంట గ్రామంలో కోకా కోలా కంపెనీ సి ఎస్ ఆర్ నిధుల సహకారంతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ స్కూల్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు మెరుగైన విద్యా సదుపాయాలు అందించడం ఎంతో అవసరమని, అంగన్వాడీ కేంద్రాలు పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని తెలిపారు. కోకా కోలా సంస్థ సి ఎస్ ఆర్ కార్యక్రమాల ద్వారా గ్రామ అభివృద్ధికి తోడ్పడటం అభినందనీయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్పేడు టీడీపీ పార్టీ అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు, నైనూరు పున్నారావు, ఏర్పేడు పాక్స్ ఛైర్మన్ మహేష్ రెడ్డి, సి ఎస్ ఆర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ షైక్ ఖలీల్ బాషా, పి ఎసి ఆఫీసర్ నిటేష్ ( హెచ్ సి సి బి), సిడిపిఓ కృష్ణవేణి, సూపర్‌వైజర్ రత్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

రహదారి పై ఖాళీ బిందెలతో మహిళలు దర్న

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 06: శ్రీకాళహస్తి పట్టణాని విఎం పల్లి కి వెళ్లే ప్రధాన రహదారి పైన మహిళలు బయటాయించి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో వాహనాలకు రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న టూటౌన్ సిఐ నాగరాజు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ధర్నాను విరమించాలని మీ సమస్యలను ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని వారితో మంతనాలు జరిపిన బాధితులు అంగీకరించకపోవడంతో సమాచారం అందుకున్న టిడిపి పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు ఒకటవ వార్డుకు చేరుకుని విఎం పల్లె వాసుల సమస్యలను పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ తో చరవాణి ద్వారా మాట్లాడి తాగునీరుని కాలనీవాసులు అందించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బహుజన మహిళ ఫోర్స్ (BMF) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు మరియు రాష్ట్ర మహిళా విభాగ కన్వీనర్ పుష్పాంజలి గారు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.

బహుజన మహిళ ఫోర్స్ (BMF) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు మరియు రాష్ట్ర మహిళా విభాగ కన్వీనర్ పుష్పాంజలి గారు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు మాట్లాడుతూ బహుజన సోదరీమణులు, అక్కాచెల్లెమ్మల జీవితాల్లో సంతోషం, ఆర్థిక స్థిరత్వం మరియు సామాజిక భద్రత రావాలంటే బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా విభాగ కన్వీనర్ పుష్పాంజలి గారు మాట్లాడుతూ మహిళల సాధికారత నిజంగా సఫలం కావాలంటే మహిళలు ఐక్యంగా ముందుకు వచ్చి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళల శక్తి సమాజంలో మార్పు తీసుకురాగలదని ఆమె పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బహుజన మహిళ ఫోర్స్ (BMF) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమo

బహుజన మహిళ ఫోర్స్ (BMF) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు మరియు రాష్ట్ర మహిళా విభాగ కన్వీనర్ పుష్పాంజలి గారు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ బహుజన సోదరీమణులు, అక్కాచెల్లెమ్మల జీవితాల్లో సంతోషం, ఆర్థిక అభివృద్ధి మరియు సామాజిక భద్రత రావాలంటే బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమాన హక్కులు, అవకాశాలు కల్పించేందుకు పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్ర మహిళా విభాగ కన్వీనర్ పుష్పాంజలి గారు మాట్లాడుతూ మహిళల సాధికారత నిజంగా సఫలం కావాలంటే మహిళలు ఐక్యంగా ముందుకు వచ్చి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళల శక్తితోనే సమాజంలో మార్పు సాధ్యమని ఆమె పేర్కొన్నారు.

అనకాపల్లి

ప్రజల భద్రతే లక్ష్యం – ఎలమంచిలి రూరల్ పోలీసుల కఠిన వాహన తనిఖీలు..!

అనకాపల్లి జిల్లా, మార్చి 6, పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్) : ఎలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్ర ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది స్థానికంగా రోడ్లపై ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం, డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఇతర వాహన పత్రాలు లేకపోవడం వంటి అంశాలపై తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నియమాలు ప్రజల భద్రత కోసం ఎంతో అవసరమని ఎస్సై ఉపేంద్ర తెలిపారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి, అన్ని పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. నియమాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యమని పోలీసులు పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.