Monday, 27 April 2026

Blog

రాజన్న సిరిసిల్ల

టెన్త్ విద్యార్థులకు కేటీఆర్ కానుక – “గిఫ్ట్ ఏ స్మైల్”లో ప్యాడ్లు, పెన్నుల పంపిణీ

ముస్తాబాద్/ మార్చి /పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమం ద్వారా ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. మండలంలోని కస్తూర్బా, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జెడ్పీ హైస్కూల్‌లలో చదువుతున్న మొత్తం 486 మంది టెన్త్ విద్యార్థులకు ఈ సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సర్వర్ పాషా, శీలం స్వామి, గూడూరి భరత్, ఎండీ నవాజ్, కోడే శ్రీనివాస్, నల్ల నర్సయ్య, వంగూరి దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

ఖమ్మం

తెలంగాణలోని ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలిచ్చింది.

*తెలంగాణలోని ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలిచ్చింది. పున్నమి మార్చి6/2026 (ప్రతినిధి ఖమ్మం) ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించాలని ఆదేశించింది. ట్యాక్స్ వసూలు చేసే బాధ్యత డీఈవోలకు అప్పగించింది..!!* ట్యాక్స్ వసూలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. *ట్యాక్స్ వసూలులో నిర్లక్ష్యంగా ఉంటే అధికారులపై చర్యలు తీసుకుంటామని* తెలిపింది..ఇప్పటికే రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దందాకు చెక్ పెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. *ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచే ఆనవాయితీకి బ్రేక్ వేస్తూ.. శాస్త్రీయంగా ఫీజులను నిర్ణయించే ప్రక్రియను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు వేగవంతం చేశారు.* రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11 వేల ప్రైవేటు స్కూళ్లలో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు, గత మూడేండ్ల ఆదాయ, వ్యయాల వివరాలను సేకరించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. *ప్రతి రెండేండ్లకోసారి 8 శాతం మాత్రమే ఫీజు పెంచుకునేలా ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది.* దీనికి సంబంధించిన విధివిధానాలపై కసరత్తు ముమ్మరమైంది. *ఎంఈఓలు, డీఈఓల ఆధారంగా ఏ స్కూళ్లో ఎంత ఫీజు ఉంది? ఏఏ క్లాసులకు ఎంతెంత తీసుకుంటున్నారు?* అనే వివరాలను సేకరిస్తోంది. ప్రైవేటు స్కూళ్లలో దేని ఆధారంగా బేస్ ఫీజులను నిర్ణయించాలనే దానిపై అధికారులు కసరత్తు చేశారు. *త్వరలో పబ్లిక్ లోకి ఫీజుల డ్రాఫ్ట్* ఫీజుల డ్రాఫ్ట్ ను పారదర్శకంగా వెబ్‌సైట్‌లో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పేరెంట్స్, స్టూడెంట్లు, విద్యావేత్తలు, ప్రజల అభిప్రాయాలను, సూచనలు సేకరించనున్నారు. ఆ తర్వాతే దాన్ని ఫైనల్ చేయాలని సర్కారు డిసైడ్ అయింది. డీఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజుల వివరాలనూ ఏ స్కూల్ ఎంత వసూలు చేయబోతోందనే డేటాను వెబ్ సైట్ టో పెట్టనున్నారు. Ok

రాజన్న సిరిసిల్ల

పదవ తరగతి విద్యార్థులకు “గిఫ్ట్ ఏ స్మైల్”లో భాగంగా ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నుల పంపిణీ

ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమంలో భాగంగా గౌరవ మాజీ మంత్రివర్యులు, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి. భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించి సమాజానికి సేవ చేయాలి అని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపు అనిల్ కుమార్, తాడేపు సురేష్, ఆకారం బాలచంద్రం, గున్నాల రాజు, నిమ్మ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

వెలుగు మట్ల భూదాన్ భూముల మీద ప్రత్యేక కధనం

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) కలెక్టర్ గారూ.. ఆ రికార్డులు ఏమయ్యాయి? వెలుగుమట్ల భూదాన్ భూములపై మాయాజాలం – సమాధానం ఎవరు చెప్పాలి ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల ప్రాంతంలో ఇటీవల జరిగిన ఇండ్ల కూల్చివేతలు తీవ్ర వివాదానికి దారితీశాయి. గత నెల 24వ తేదీ నుంచి అధికారులు నిరుపేదల ఇండ్లను కూల్చివేయడంతో ఈ వ్యవహారం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. అధికారులు ఆ భూములు ప్రభుత్వ రెవెన్యూ భూములని పేర్కొంటుండగా, స్థానికులు మాత్రం అవి భూదాన్ భూములని చెబుతూ అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. భూదాన్ యజ్ఞం నుంచి ప్రారంభమైన కథ దేశవ్యాప్తంగా భూమిలేని పేదలకు భూమి పంచేందుకు మహనీయుడు ఆచార్య వినోబా భావే ఇచ్చిన పిలుపు మేరకు 1954లో కల్వల రాజారావు కుటుంబం తమ సొంతమైన 62 ఎకరాల 16 గుంటల భూమిని భూదాన్ యజ్ఞానికి దానం చేసినట్లు చెబుతున్నారు. ఈ భూమి పేదలకు పంపిణీ కావాల్సి ఉన్నప్పటికీ, దాదాపు 72 సంవత్సరాలు గడిచినా పూర్తి స్థాయిలో పంపిణీ జరగలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వివరాలు తెలంగాణ కాసర పహానీ రికార్డుల ప్రకారం 1984–85 వరకు వెలుగుమట్లలోని – సర్వే నం.147లో 20.66 ఎకరాలు – సర్వే నం.148లో 22.94 ఎకరాలు – సర్వే నం.149లో 18.56 ఎకరాలు మొత్తం ఈ భూములు భూదాన్ యజ్ఞ బోర్డు పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు పేర్కొంటున్నాయి. అయితే 1984 తర్వాత ఈ భూముల పరిస్థితి ఏమైందన్నది ఇప్పటికీ స్పష్టత రాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. 31.7 ఎకరాల భూమి ఏమైంది? ప్రభుత్వ లెక్కల ప్రకారం వెలుగుమట్లలో సుమారు 31.7 ఎకరాల భూమి రూ.250 కోట్ల విలువైనదిగా పేర్కొంటున్నారు. అయితే మిగిలిన సుమారు 31 ఎకరాల భూమి ఏమైందన్న ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా మారింది. ఈ భూములపై పేర్లు మార్పులు జరిగాయా? రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం భూములు కాజేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లెక్కల్లో మరో గందరగోళం ఇంకొకవైపు “ప్రొహిబిటెడ్ ల్యాండ్స్” పేరుతో వెలుగుమట్లలో భూదాన్ భూములు 25.4 ఎకరాలే ఉన్నాయని మరో లెక్క వెలుగులోకి రావడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. ఈ లెక్క ప్రకారం మిగిలిన 5.6 ఎకరాలు ఎక్కడికి పోయాయి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిరుపేదల ఇండ్ల కూల్చివేతపై ఆగ్రహం అధికారులు భూమి ప్రభుత్వానికి చెందినదని చెబుతూ నిరుపేదల ఇండ్లను కూల్చివేయడం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “రెక్కాడితే గానీ డొక్కాడని పేదల్ని రోడ్డు మీదకు నెట్టేయడం సరైందా?” అని వారు ప్రశ్నిస్తున్నారు. బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ ఈ వ్యవహారంపై జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, జిల్లా అధికారులు ప్రజల ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వెలుగుమట్ల భూదాన్ భూముల అసలు స్థితిగతులపై ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాలని కూడా కోరుతున్నారు. సమాధానం ఎవరు చెబుతారు? భూదాన్ పేరుతో ఉన్న భూముల రికార్డులు ఎలా మారాయి? మిగిలిన ఎకరాలు ఎక్కడికి వెళ్లాయి? పేదల ఇండ్ల కూల్చివేత ఎందుకు జరిగింది? అనే ప్రశ్నలకు ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు. వెలుగుమట్ల భూముల కథ ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పెద్ద చర్చగా మారింది. ఈ వివాదానికి తుది పరిష్కారం ఎప్పుడు వస్తుందో చూడాలి.

ఖమ్మం అర్బన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆచంటి కోటేశ్వరరావుకు ఘన సన్మానం

ఖమ్మం: మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఖమ్మం అర్బన్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన ఆచంటి కోటేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం పెద్దలు ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పులిపాటి ఎడ్యుకేషనల్ సొసైటీ అధినేత పులిపాటి ప్రసాద్, ప్రముఖ న్యాయవాది నోముల వెంకటేశ్వర్లు, డోకూపర్తి రవీందర్, కొంకిమళ్ల మృత్యుంజయతో పాటు పలువురు ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆచంటి కోటేశ్వరరావు బీజేపీ ఖమ్మం అర్బన్ ప్రధాన కార్యదర్శిగా నియమితులవడం ఆర్యవైశ్య సమాజానికి గర్వకారణమని తెలిపారు. సమాజ అభివృద్ధి, ప్రజా సేవలో ఆయన మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.

ఖమ్మం

తమ్మినేనిపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: సీపీఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ రావు

ఖమ్మం మార్చి (జిల్లా ఇంచార్జి ) సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మవద్దని సీపీఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ రావు విజ్ఞప్తి చేశారు. గత మూడు రోజులుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మరియు కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో తమ్మినేని వీరభద్రంపై తీవ్రంగా అసత్య కథనాలు ప్రచారం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పార్టీ తరఫున ఆయనపై ఎలాంటి చర్చా లేదా చర్యలు జరగలేదని స్పష్టం చేశారు. తమ్మినేని వీరభద్రం పార్టీ కార్యాలయ నిర్మాణం, ఛానల్ ప్రారంభం వంటి అంశాలపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని తెలిపారు. ఆయనపై సస్పెన్షన్ లేదా బహిష్కరణ చర్యలు తీసుకున్నట్లు వస్తున్న వార్తలు కూడా పూర్తిగా అవాస్తవమని ఖండించారు. పార్టీ కార్యాలయం హైటెక్ కార్యాలయం కాదని, అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. “బోడెపూడి విజ్ఞాన కేంద్రం” పేరుతో పేదలకు వైద్య సౌకర్యాలు అందిస్తూ ప్రతి నెలా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే మహిళలకు టైలరింగ్ శిక్షణ వంటి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నామని తెలిపారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా పార్టీకి నష్టం కలిగించే విధంగా ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు పోటీపడి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ రకమైన గోబెల్స్ ప్రచారాలను పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, దళితులు, గిరిజనులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న పార్టీ సీపీఎం అని తెలిపారు. అలాంటి పార్టీపై దుష్ప్రచారం చేయడం దురుద్దేశపూర్వకమని పేర్కొన్నారు. ముఖ్యంగా తమ్మినేని వీరభద్రంపై పార్టీలో ఎలాంటి వ్యతిరేక చర్చా లేదా చర్యలు జరగలేదని మరోసారి స్పష్టం చేశారు.

తిరుపతి

కమలాకర్ రెడ్డికి నివాళులు అర్పించిన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి*

పున్నమి ప్రతినిధి తిరుపతి రూరల్ తిరుపతి రూరల్ మండలం చిగురువాడ గ్రామ పంచాయతీ పాపిరెడ్డిపురంకు చెందిన బండి కమలాకర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆ ఇంటి వద్దకు చేరుకుని మృతుని పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుమారుడు బాలు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే గ్రామంలో కనిపించిన పెద్దలు అందరినీ ఆప్యాయం పలుకరించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నివాళులు అర్పించిన వారిలో వైఎస్ఆర్సీపీ గ్రామ పంచాయతీ అధ్యక్షులు ముచ్చేలి ధరణీకుమార్రెడ్డితో పాటు గ్రామస్తులు వున్నారు.

తిరుపతి

*అంగరంగ వైభవంగా శ్రీవిజయగణపతి స్వామి వారి కుంభాభిషేక మహోత్సవం*

పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రముఖులు,హిందూ సంఘాల ప్రతినిధులు స్థానికులు* తిరుపతి రూరల్,మార్చి 5 పున్నమి ప్రతినిధి. శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి కొలువైన తిరుచానూరులో నేతాజీ నగర్ లో MRR ట్రస్టు ఆధ్వర్యంలో వెలసి ఉన్న శ్రీవిజయ గణపతి స్వామి వారి కుంభాభిషేక మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధు స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు,హోమాలతో కుంభాభిషేక మహోత్సవం కన్నుల పండువగా జరిపించారు.నేతాజీ నగర్ వాసులు,హిందూ సంఘాల ప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు పాల్గొనగా వారికి ట్రస్టు చైర్మన్ మునిరామ్ రెడ్డి, ఆలయ ధర్మకర్త పుష్పరెడ్డి వచ్చిన అతిధుల అందరికీ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు,ప్రత్యేక తయారుచేసిన ప్రసాదాలు, పంపిణీ చేశారు.అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా MRR ట్రస్టు చైర్మన్ మునిరామ్ రెడ్డి, ఆలయ ధర్మకర్త పుష్పరెడ్డి మాట్లాడుతూ శ్రీ విజయ గణపతి స్వామి వారి కుంభాభిషేక మహోత్సవం దిగ్విజయం జరిగింది.ఈ కుంభాభిషేక మహోత్సవానికి అన్ని రకాలుగా సహకరించిన, స్వామి కైంకర్యానికి వివిధ రూపాలుగా సమర్పించిన స్థానికులు,మిత్రులు,భక్తులు,ప్రజలకు ప్రతీ ఒక్కరికీ ఆ విజయ గణపతి స్వామి ఆశీస్సులు,అనుగ్రహం అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.అదే విధంగా స్వామి వారి సేవ చేసుకునే భాగ్యం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలుపుతూ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

తిరుపతి

గుడిమల్లంలో ఆర్.ఓ. వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ

ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 05, ఏర్పేడు మండలం గుడిమల్లంలో వెలసిన శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం తాగునీటి కోసం శుద్ధ జల యంత్రం ఏర్పాటు చేయడానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. పెంచలకోనలోని శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం అధినేతలు విజయ్ భరత్, విజయ్ గోకుల్, విజయ్ సౌమ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానానికి వచ్చే భక్తుల కోరిక మేరకు శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉండేలా ఈ శుద్ధ జల యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఆశ్రమ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.