Monday, 27 April 2026

Blog

తిరుపతి

పాపానాయుడు పేట పీహెచ్‌సీలో అంగన్వాడీలకు ఆరోగ్య పరీక్షలు

ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 05, ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఐసీడీఎస్ శాఖ పీడీ వసంతా భాయ్ సమక్షంలో రేణిగుంట ప్రాజెక్ట్ ఏర్పేడు–3 సెక్టార్‌కు చెందిన అంగన్వాడీ కార్యకర్తలకు పాపానాయుడు పేట పీహెచ్‌సీలో హెల్త్ చెకప్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా పాపానాయుడు పేట అంగన్వాడీ కేంద్రాన్ని అధికారులు సందర్శించి అక్కడి కార్యకలాపాలను పరిశీలించారు. అంగన్వాడీ కార్యకర్తలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో పీడీ వసంతా భాయ్, నోడల్ ఆఫీసర్ వాసంతి, సీడీపీఓ కే. కృష్ణవేణి, సూపర్వైజర్ కే. అనిత వాణి, సీహెచ్ఓ రాజేశ్వరి, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎం సిబ్బంది, పీహెచ్‌సీ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

పంగురు జెడ్పీ హై స్కూల్‌కు గిరిధర్ రెడ్డి రూ.3.50 లక్షల విరాళం

ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 05, ఏర్పేడు మండలంలోని పొంగూరు జిల్లా పరిషత్ హై స్కూల్‌కు శ్రీ పార్వతీ సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త గంగలపూడి గిరిధర్ రెడ్డి తన సొంత నిధులతో రూ.3,50,000 ఖర్చు చేసి సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టాపనతో పాటు రేకుల షెడ్డుతో కూడిన శాశ్వత స్టేజ్‌ను నిర్మించి ఈ సేవా కార్యక్రమాన్ని తన తల్లిదండ్రులు కీర్తిశేషులు గంగలపూడి పుల్లారెడ్డి, సుందరమ్మ గార్ల జ్ఞాపకార్థంగా ప్రభుత్వ పాఠశాలకు అంకితం చేశారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ…. పాఠశాల సందర్శనార్ధం విచ్చేసిన గంగలపూడి గిరిధర్ రెడ్డికి పాఠశాలకు వేదిక యొక్క అవసరాన్ని వివరించగా వెంటనే స్పందించిన శ్రీ పార్వతీ సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త స్టేజ్ నిర్మాణం తన సొంత నిధులతో చేస్తానని ముందుకొచ్చారని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సదుపాయాల కల్పనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుని సుమారు రూ.3.50 లక్షల వ్యయంతో రేకుల షెడ్డుతో కూడిన పక్కా స్టేజ్ నిర్మాణాన్ని పూర్తి చేసి, పాఠశాల ప్రాంగణంలో సరస్వతి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించారని ఆయన తెలిపారు. అనంతరం స్టేజ్‌ను విద్యార్థులకు అంకితం చేసీనా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ….ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సరైన ప్రోత్సాహం ఇస్తే వారు జాతీయ స్థాయిలో రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం అవుతారని వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ….ఇంతకుముందు ఎండలోనే కార్యక్రమాలు నిర్వహించాల్సి వచ్చేదని, ఇప్పుడు కొత్త స్టేజ్‌తో ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమాలు సౌకర్యంగా నిర్వహించుకోగలమని తెలిపారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ప్రభుత్వ పాఠశాలకు ఈ సదుపాయాలను అంకితం చేసిన శ్రీ పార్వతీ సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త గంగలపూడి గిరిధర్ రెడ్డి సేవా భావం అందరికీ ఆదర్శంగా నిలిచింది.

తిరుపతి

బ్రహ్మోత్సవాల్లో భారత్ స్కౌట్స్ సేవలు అభినందనీయం- చైర్మన్ కొట్టే సాయి

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 05, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఫిబ్రవరి 15 నుండి 23వ తేదీ వరకు నిర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆశేషంగా తరలివచ్చిన భక్తులకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అందించిన సేవలు ప్రశంసనీయమని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ తెలిపారు. దేవస్థానం పరిపాలన భవనంలోని చైర్మన్ కార్యాలయంలో గురువారం నాడు స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. గత 31 సంవత్సరాలుగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలందించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరిగే అన్ని ఉత్సవాలకు స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను వినియోగించుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రోవర్ జిల్లా కార్యాలయ కమిషనర్ టి. రమేష్ బాబు, స్కౌట్ మాస్టర్లు ఎస్.కె. అజారుద్దీన్, సుబ్రహ్మణ్యం, వెంకటేష్, గైడ్ కెప్టెన్ జ్యోతి, స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వరాలయ ఈ.ఓ.గా బాధ్యతలు చేపట్టిన బి.కే. వెంకటేశులు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 05,శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నూతన కార్యనిర్వాహణాధికారిగా గురువారం నాడు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి.కే. వెంకటేశులు బాధ్యతలు స్వీకరించారు. వెంకటేశులు తన కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి చేరుకుని శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గురు దక్షిణామూర్తి సన్నిధిలో బి.కే. వెంకటేశులు దేవస్థానం ఈవోగా అధికారికంగా భాద్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, బోర్డు సభ్యులు నాగరాజు, రాఘవయ్య, డీఈఓ ఎన్.ఆర్. కృష్ణారెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏఈఓ హేమామాలిని, ఏఈఓ లోకేష్ బాబు, పర్యవేక్షకులు నాగభూషణం, రవి, ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకర్ గురుకుల్, పురోహితులు అర్ధగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఏకగ్రీవంగా పంచాయితీ అభివృద్ధి సంఘాధికారుల ఎన్నిక

తొట్టంబేడు, పున్నమి న్యూస్, మార్చి 05, తొట్టంబేడు మండలం నందు పంచాయితీ అభివృద్ధి అధికారుల సంఘం ఎన్నిక ప్రక్రియలో నాయకులు ఏకగ్రీవంగా ఎన్నికకావడం జరిగినది. తొట్టంబేడు మండల పంచాయితీ అభివృద్ధి అధికారుల సంఘం అధ్యక్షునిగా ఎన్ భాస్కర్, ఉపాధ్యక్షురాలుగా కే.శాంతి, శివకృష్ణ, జనరల్ సెక్రెటరీగా కే. రంజిత, బి.వాసు, ట్రెజరర్ గా.. హరిబాబు, సారధి ఎన్నికైనారు వీరికి పలువురు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ.. తమ తమ సచివాల ద్వారా తాము ఇప్పటికే ప్రజలకు సేవలు అందిస్తున్నామని తమ యూనియన్ ద్వారా గ్రామీణ ప్రజలకు మరింత సేవలు అందించి వారికి ప్రభుత్వం తరఫున వస్తున్న సంక్షేమ పథకాలు అందించడంలో యూనియన్ ముందు ఉంటుందని పంచాయతీ సెక్రెటరీలకు, ఉద్యోగస్తులకు ఎటువంటి సమస్యలు వచ్చిన ఆ సమస్యలు పరిష్కరించేందుకు తమ సంఘం ద్వారా కార్యాచరణ చేపట్టి సమస్యను పరిష్కరించే దిశగా తాము ముందుంటామని వారు తెలియజేశారు.

తిరుపతి

శ్రీకాళహస్తి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఇబ్రహీం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 05, శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ కు నూతన సిఐగా ఇబ్రహీం గురువారం నాడు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన సిఐ మాట్లాడుతూ శాంతి భద్రతల పట్ల మండల ప్రజలు సహకరించాలన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చున్నారు. గతంలో రూరల్ సిఐగా పనిచేస్తున్న నాగరాజు శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. టూ టౌన్ స్టేషన్లో పనిచేస్తున్న నాగార్జున్ రెడ్డి వి ఆర్ కు వెళ్లినట్లు సమాచారం.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాకాణి ని మర్యాదపూర్వకంగా కలిసిన వీరి చలపతి”

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా నియమితులైన సందర్భంగా వీరి చలపతి గారు మాజీ మంత్రివర్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ పూజితమ్మ గారిని కూడా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అంకెనపల్లి నరసింహారెడ్డి, నెల్లూరు లోని అఖిల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా ఖలీల్ అన్న గారిని వైఎస్ఆర్సిపి పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీ, నెల్లూరు జిల్లా చెందిన అంకెనపల్లి నరసింహారెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రానున్న కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చించారు. ఖలీల్ అన్న గారి నాయకత్వంలో పార్టీ మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేస్తామని నరసింహారెడ్డి గారు తెలిపారు. పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తే విజయాలు సాధ్యమవుతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఖమ్మం

వెలుగుమట్ల బాధితుల పక్షాన బీజేపీ పోరాటం కొనసాగుతుంది మంత్రి పొంగులేటి నోటిని అదుపులో ఉంచుకోవాలి – దేవకీ వాసుదేవరావు

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెలుగుమట్లలో నివసిస్తున్న పేద ప్రజలను ఫిబ్రవరి 24 నుండి రోడ్డుపైకి నెట్టివేసి వారితో మూడు ముక్కుల ఆట ఆడుతున్నట్లుగా జిల్లా కు చెందిన ముగ్గురు మంత్రులు వ్యవహరిస్తున్నారని దేవకీ వాసుదేవరావు ఆరోపించారు. రెక్కాడితే గాని డొక్క నిండని పేదల జీవితాలతో ఇలా ఆడుకోవడం దుర్మార్గమని అన్నారు. వెలుగుమట్ల బాధితులకు మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ అండగా నిలుస్తోందని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నోటి కి వచ్చినట్టు మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన నోటి ని అదుపులో ఉంచుకోవాలని సూచించారు. “ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లు కూల్చడమేనా? ప్రజా పాలన అంటే ప్రజలను రోడ్డున పడేయడమేనా?” అని ఆయన ప్రశ్నించారు. పార్టీలు మారి అధికార పదవులు పొందిన నాయకులు ప్రజల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. 31.7 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి దాని విలువ రూ.250 కోట్లు అని గొప్పలు చెప్పుకుంటున్న జిల్లా కలెక్టర్‌కు అది నిజంగా ప్రభుత్వ భూమా లేదా భూదాన్ భూమా అనే విషయం కూడా తెలియదా అని ప్రశ్నించారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ వారి పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని దేవకీ వాసుదేవరావు తెలిపారు. సమావేశం లో జిల్లా సీనియర్ నాయకులు మండధపు సుబ్బారావు, గుత్త వెంకటేశ్వర్లు, వంకదాని రామకృష్ణ లతో పాటు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి

ముస్తాబాద్ /మార్చి /పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ని రాంరెడ్డిపల్లె గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద సంపంగి మమత–శ్రీనివాస్ దంపతులు నిర్మించుకున్న కొత్త ఇంటికి ఈరోజు గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి హాజరై గృహప్రవేశంలో పాల్గొని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సొంత ఇల్లు కలగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.