Monday, 27 April 2026

Blog

ఖమ్మం

వెలుగుమట్ల బాధితులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత

ఖమ్మం:మార్చి [పున్నమి ప్రతినిధి] వెలుగుమట్ల ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలో బాధితులను పరామర్శించేందుకు కల్వకుంట్ల కవిత సోమవారం ఖమ్మంలోని అంబేద్కర్ భవన్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలతో ఆమె ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. జరిగిన ఘటన పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు తగిన సహాయం అందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమె శ్రద్ధగా విని, వారికి ధైర్యం చెప్పారు. సమస్యల పరిష్కారానికి తగిన విధంగా పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, బాధిత కుటుంబాలు పాల్గొన్నాయి

ఖమ్మం

వెలుగుమట్ల బాధితులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత

ఖమ్మం:మార్చి [పున్నమి ప్రతినిధి] వెలుగుమట్ల ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలో బాధితులను పరామర్శించేందుకు కల్వకుంట్ల కవిత సోమవారం ఖమ్మంలోని అంబేద్కర్ భవన్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలతో ఆమె ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. జరిగిన ఘటన పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు తగిన సహాయం అందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమె శ్రద్ధగా విని, వారికి ధైర్యం చెప్పారు. సమస్యల పరిష్కారానికి తగిన విధంగా పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, బాధిత కుటుంబాలు పాల్గొన్నాయి Ok

కడప

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు పంపిణీ చేశారు.

*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తుంది – ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారు* *ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన 25 వ విడత 59 మంది లబ్ధిదారులకు 53.00 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు* *ప్రజల సంక్షేమం,రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది…ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం “ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్” దిశగా దృఢంగా ముందుకు సాగుతోంది… పేదల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అండగా నిలుస్తూ,అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందేలా చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి.* *ఈ కార్యక్రమంలో TDP పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ గారు,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొండయ్య గారు,కౌన్సిలర్ కమాల్ బాషా గారు,మాజీ కౌన్సిలర్ వద్ది బాలుడు గారు,బచ్చల ప్రతాప్ గారు తదితరులు పాల్గొన్నారు.*

ఖమ్మం

ఖమ్మం రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో దందా…? బోర్డుపై ఒక రేటు – వసూలు మరో రేటు.

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం రైల్వే స్టేషన్‌లోని పార్కింగ్ స్టాండ్‌లో వినియోగదారుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండో నెంబర్ ప్లాట్‌ఫారం వైపు ఉన్న పార్కింగ్ స్థలంలో రేట్ల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. పార్కింగ్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డు ప్రకారం జీఎస్టీతో కలిపి మొదటి రెండు గంటలకు ₹15, తరువాత ప్రతి గంటకు ₹10 చొప్పున వసూలు చేయాలని స్పష్టంగా పేర్కొనబడింది. ఈ లెక్కన ఒక వాహనం 24 గంటలు పార్క్ చేస్తే సుమారు ₹240 మాత్రమే కావాలి. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని వినియోగదారులు చెబుతున్నారు. ఒక వినియోగదారుడు కేవలం 12 గంటల పాటు తన బైక్‌ను పార్కింగ్‌లో ఉంచగా, అతనిపై ₹125 చార్జ్ చేసినట్లు సమాచారం. బోర్డు ప్రకారం లెక్కిస్తే అంత మొత్తం రావడం లేదని ప్రశ్నించగా, పార్కింగ్ కాంట్రాక్టర్ దౌర్జన్యంగా ప్రవర్తించినట్లు బాధితుడు తెలిపాడు. ఇంకా మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, పార్కింగ్ బోర్డు మీద “GSTతో కలిపి రేట్లు” అని స్పష్టంగా వ్రాసి ఉన్నప్పటికీ, వినియోగదారులకు ఇచ్చిన బిల్లుపై మాత్రం ఎక్కడా GST నెంబర్ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో అసలు వాస్తవంగా జీఎస్టీ ప్రభుత్వానికి చెల్లిస్తున్నారా? లేక బోర్డుపై పేరు చెప్పి వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లు చేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రయాణికులు మరియు స్థానికులు ఈ వ్యవహారంపై రైల్వే అధికారులు, సంబంధిత శాఖలు విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలని, పార్కింగ్‌లో జరుగుతున్న అన్యాయ వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

విజయ డెయిరీ పేరుతో గుజరాత్ కల్తీ నెయ్యి? తెలంగాణ మార్కెట్లో సంచలనం మేఘన ఫుడ్స్ ద్వారా గుజరాత్ నెయ్యి సరఫరా – NDDB నివేదికలో వెజిటేబుల్ ఆయిల్ కలిసినట్టు వెల్లడి: టీఎస్ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఆరోపణ

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి) విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి తెలంగాణ మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయంటూ తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రైవేట్ వ్యక్తులు విజయ బ్రాండ్‌ను దుర్వినియోగం చేస్తూ గుజరాత్ నుంచి నెయ్యిని తీసుకువచ్చి తెలంగాణలో విక్రయిస్తున్నారని ఆయన వెల్లడించారు. మేఘన ఫుడ్స్ అనే సంస్థకు విజయ డెయిరీ ఫ్రాంచైజీ ఇవ్వగా, ఆ సంస్థ గుజరాత్‌లోని కన్హాన్ డెయిరీ నుంచి నెయ్యి సేకరించి తెలంగాణలో అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్ కలిసినట్లు నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) నివేదికలో తేలిందని పేర్కొన్నారు. హైదరాబాద్ మార్కెట్లో విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో నెలకు 100 టన్నులకు పైగా నెయ్యి విక్రయాలు జరుగుతున్నాయని అంచనా ఉందన్నారు. తెలంగాణలో విజయ డెయిరీకి ఉన్న విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేట్ యూనియన్లు తక్కువ నాణ్యత గల పాలను విక్రయిస్తున్నాయని మండిపడ్డారు. ఏపీకి చెందిన డెయిరీ సంస్థలు ఈ విధంగా వ్యాపారం నిర్వహించడం వల్ల తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ పాడి రైతులకు రావాల్సిన ఆదాయం దెబ్బతింటోందని ఆయన అన్నారు. ప్రస్తుతం APDDCFకు లీటర్ పాలు అమ్మకాలపై కేవలం రూ.1 మాత్రమే రాయల్టీగా వస్తోందని, దీనివల్ల రైతులు మరియు సహకార సంఘాలకు పెద్దగా లాభం లేకపోతుందని వివరించారు. డెయిరీ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ బ్రాండ్లను ప్రైవేట్ వ్యక్తులు వినియోగించుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఏపీ డెయిరీకి పలుమార్లు లేఖలు రాసినా స్పందన రాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.

E-పేపర్

చిరుధాన్యాలు పై రైతుల అవగాహన సదస్సు హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్లొ

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి కొవ్వూరు సబ్ డివిజన్ నుంచి 5 మండలంలో ఉన్నటువంటి 40 మంది రైతులను NFSM పథకం క్రింద అవగాహన సదస్సు మరియు శిక్షణ కార్యక్రమానికి హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్కు తీసుకోవడం జరిగింది. దీనిలో DR J.STANLAY CEO OF ( ICAR ) INDIAN INSTITUTE OF MILLETS RESEARCH, SCIENTIST SRINIVAS. ADA కొవ్వూరు SRINIVAS, AO కొవ్వూరు GANGADHAR. MPEO కొవ్వూరు నవీన్రెండు రోజులు కార్యక్రమంలో ట్రైనింగ్లొ పాల్గొన్నారు. చిరుధాన్యాల పండించే విధానం మరియు మార్కెటింగ్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సీఈఓ తెలియజేశారు. END…..

ఖమ్మం

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త హత్య.. కారుతో ఢీకొట్టించి చంపించిన భార్య

ఖమ్మం, మార్చి ( పున్నమి జిల్లా ఇంచార్జి ) ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను పథకం ప్రకారం కారుతో ఢీకొట్టించి హత్య చేయించిన ఘటన ఖమ్మం పట్టణంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన చాగంటి రవి, ప్రశాంతి దంపతులు 20 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవి ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. భర్త త్వరలోనే మృతి చెందుతాడని భావించిన ప్రశాంతి గత జూలై నెలలో అతని పేరుపై రూ.66 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లు సమాచారం. అయితే తొమ్మిది నెలలు గడిచినా రవి మరణించకపోవడంతో ఇన్సూరెన్స్ డబ్బులు పొందేందుకు ప్రశాంతి పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 2వ తేదీన రవికి మద్యం తాగించి మత్తులో ఉండగా, తన బావమరిది శ్రీనివాస్ సాయంతో కారుతో ఢీకొట్టించి హత్య చేయించినట్లు విచారణలో బయటపడింది. రవి మరణంపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ప్రశాంతిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఖమ్మం

ఫుడ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ లోపం..? పాత ఆహారంతో కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం.

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అలాగే ఖమ్మం నగరంలో టిఫిన్ సెంటర్లు నుంచి పెద్ద పెద్ద హోటళ్ల వరకు వినియోగదారుల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పలు హోటళ్లు, బిర్యానీ పాయింట్లు రోజులు తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను కస్టమర్లకు అందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి ఫుడ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ లోపమే కారణమని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం అనేక బిర్యానీ పాయింట్లలో రోజు ల తరబడి నిల్వ ఉంచిన గ్రేవీ, పెరుగు చట్నీ వంటి పదార్థాలను మళ్లీ వేడి చేసి వినియోగదారులకు అందిస్తున్నట్లు సమాచారం. అలాగే కొన్ని టిఫిన్ సెంటర్లలో సాంబార్, చట్నీలు మాత్రమే కాకుండా పిండితో తయారయ్యే కొన్ని ఆహార పదార్థాలను కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంచి వాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి పాత ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, జీర్ణ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది హోటల్ యజమానులు తనిఖీలను తప్పించుకోవడానికి మామూలు ఇచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్లను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కారణంగా తనిఖీలు సక్రమంగా జరగడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికైనా అప్రమత్తం కావాలని ప్రజలు కోరుతున్నారు. నగరంలోని టిఫిన్ సెంటర్లు, బిర్యానీ పాయింట్లు, హోటళ్లపై అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించి నాణ్యతలేని ఆహారాన్ని విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారినది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.