Monday, 27 April 2026

Blog

తిరుపతి

శ్రీ చైతన్య స్కూల్‌లో మహిళా దినోత్సవ సందడి.. ఆకట్టుకున్న ఆత్మరక్షణ ప్రదర్శనలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 09: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫేమస్ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ ప్రసన్న ముఖ్యఅతిథిగా విచ్చేశారు. మహిళా దినోత్సవ సందర్భంగా పాఠశాల ఆవరణ అంతా అందంగా అలంకరించి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు మహిళల గొప్పతనాన్ని చాటి చెప్పే నృత్యాలు, పాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. విచ్చేసినటువంటి మహిళలతో ఆటపాటలే కాకుండా, మహిళలకు ఆత్మ రక్షణకు ఉపయోగపడే కరాటే సెల్ఫ్ డిఫెన్స్ ను కూడా వారిచే చేయించారు. పాఠశాల ప్రిన్సిపల్ ఎ. రూపాదేవి మాట్లాడుతూ.. మహిళలకు కావలసినటువంటి హక్కులు, సమన్యాయం, మహిళా సాధికారత గురించి అద్భుతమైన ప్రసంగాన్ని అందించారు. ఎ.జి.ఎం సురేష్ మాట్లాడుతూ.. మహిళలు కుటుంబము, సమాజంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారని తెలిపి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీన్ త్రివేణి, ఇన్చార్జులు కల్పన, వాసంతి, ఎ. ఒ. సురేష్, కరాటే మాస్టర్ సుబ్రహ్మణ్యం మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తిరుపతి

అద్భుత విజయం.. గర్వకారణం: ప్రపంచ కప్ గెలిచిన భారత్‌కు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అభినందనలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 09: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సతీమణి బొజ్జల ఆయన సతీమణి రిషిత రెడ్డిలు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ మెన్స్ టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా నేషనల్ క్రికెట్ టీం, న్యూజీలాండ్ నేషనల్ క్రికెట్ టీం మధ్య సాగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడం జరిగినది. మ్యాచ్ విశేషాలను పత్రిక ముఖ్యంగా పంచుకుంటూ.. ఉత్కంఠమైన మ్యాచ్ వీక్షించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మ్యాచ్ సందర్భంగా స్టేడియం అంతా “ఇండియా… ఇండియా…” నినాదాలతో మారుమోగిందని అభిమానుల ఉత్సాహం, దేశభక్తి భావం అక్కడి వాతావరణాన్ని మరింత ఉల్లాసంగా మార్చాయని మిత్రులతో కలిసి టీమ్ ఇండియాకు మద్దతు తెలుపుతూ మ్యాచ్‌ను వీక్షించడం ఎంతో గర్వంగా అనిపించిందని వారు పేర్కొన్నారు. క్రీడాకారుల పోరాట పటిమ అద్భుతమని, ప్రపంచం గర్వించేలా ఆడి మూడవసారి ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమ్ ఇండియాకు ఎమ్మెల్యే దంపతులు తమ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

తిరుపతి

మహాబలిపురంలోభాజాపా నేత దయాకర్ రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్- హాజరైన పీవీఎన్ మాధవ్, కోలా ఆనంద్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 09: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి 46వ పుట్టినరోజు వేడుకలను మహాబలిపురం బీచ్ సమీపంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్‌లో ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సమక్షంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్, కోలా ఆనంద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయలసీమ జోన్ ఇంచార్జి నాగోతు రమేష్ నాయుడు కలిసి సన్నారెడ్డి దయాకర్ రెడ్డికి శాలువా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ….దయాకర్ రెడ్డి పార్టీ కోసం అలుపెరుగని పోరాట యోధుడిగా అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. పలువురు నాయకులు దయాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, సీనియర్ నాయకులు కోలా గోవర్ధన్, వినోద్ బాలాజీ, మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

అభివృద్ధి చెందాలంటే ఐక్యమత్యంగా వుండాలి-విశ్వబ్రాహ్మణ సంఘం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 09: శ్రీకాళహస్తి పట్టణంలో విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం ధర్మరాజుల స్వామి ఆలయం సమీపంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో చంద్ర ఆచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి విశ్వబ్రాహ్మణ సంఘానికి చెందిన సభ్యులు, పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశంలో సమాజ అభివృద్ధి, ఐక్యత, యువతకు విద్యా ప్రోత్సాహం, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. సమాజం అభివృద్ధి చెందాలంటే అందరూ ఐక్యంగా పనిచేయాలని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

తిరుపతి

ఈ నెల 21, 22న రైతు సంఘ మహా సభలు జయప్రదం చేయండి- హేమలత

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 09: శ్రీకాళహస్తి వేదికగా ఈ నెల 21, 22 తేదీల్లో జరగబోయే ఏపీ రైతు సంఘం జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హేమలత పిలుపునిచ్చారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్ లో సోమవారం రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. హేమలత మాట్లాడుతూ..జిల్లాలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోందని వరి అధికంగా పండే తూర్పు మండలాల్లో గిట్టుబాటు ధర లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని దళారీలే ధరలు నిర్ణయిస్తున్నారని వాపోయారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని ఉన్నా అవి మిల్లర్లకు దళారీగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాల కారణంగా సూళ్ళూరు పేట మండలంలో 350 ఎకరాల్లో రైతులు పంట నష్టపోతే ప్రభుత్వం కనీసం పరిహారం అందించలేదని ఆవేదన వ్యక్తపరిచారు. ఇంకా పరిష్కారం కాని రైతాంగ సమస్యలు ఎన్నో ఉన్నాయనీ, వాటిన్నంటినీ మహ సభల్లో చర్చించి ఉద్యమ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. మాజీ జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య, రంగయ్య, మణి తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

చదువుతో పాటు ‘నైపుణ్యం’.. చిట్వేల్ విద్యార్థుల వృత్తి విద్య శిక్షణ పూర్తి!

నేటి పోటీ ప్రపంచంలో కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, చేతివృత్తుల్లో నైపుణ్యం కూడా అవసరమని చిట్వేల్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిరూపించింది. పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థుల కోసం గత పది రోజులుగా నిర్వహించిన వృత్తి విద్య ఇంటర్న్‌షిప్ కార్యక్రమం సోమవారంతో విజయవంతంగా ముగిసింది. -ప్రాక్టికల్ నైపుణ్యాలపై అవగాహన: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులకు ఐటీ (IT), ఫుడ్ ప్రాసెసింగ్, మరియు ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ప్రయోగాత్మక అవగాహన కల్పించారు. నిత్య జీవితంలో ఉపయోగపడే ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మతులు, ఆహార పదార్థాల తయారీ మరియు కంప్యూటర్ పరిజ్ఞానంపై విద్యార్థులు ఉత్సాహంగా శిక్షణ పొందారు. శిక్షణ ముగిసిన సందర్భంగా పాల్గొన్న విద్యార్థులందరికీ పాఠశాల తరపున సర్టిఫికెట్లు మరియు టీ-షర్టులను అందజేశారు. -ఉపాధికి పునాది: ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గ రాజు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. పదవ తరగతి తర్వాత విద్యార్థులు తమకు నచ్చిన వృత్తిని ఎంచుకోవడానికి ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. వృత్తి విద్య ఉపాధ్యాయులు చిన్నబాబు, రఫీ మరియు నాగమణి విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూ, ప్రాక్టికల్స్‌లో వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలను ప్రదర్శిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

అన్నమయ్య

గెలుపు గుర్రాలు ‘క్లస్టర్ ఇంచార్జీలే’.. మంగళగిరిలో కేకే చౌదరి దిశానిర్దేశం

తెలుగుదేశం పార్టీని గ్రామ మరియు వార్డు స్థాయిల్లో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శిక్షణా తరగతులు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సోమవారం నాడు నూతనంగా ఎంపికైన మూడవ బ్యాచ్ క్లస్టర్ ఇంచార్జీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ శ్రీ కేకే చౌదరి గారు “క్లస్టర్ ఇంచార్జ్ విధులు & విధానాలు” అనే అంశంపై సుదీర్ఘంగా శిక్షణ ఇచ్చారు. -ప్రజలతో అనుసంధానమే ముఖ్యం: ఈ సందర్భంగా కేకే చౌదరి మాట్లాడుతూ.. క్లస్టర్ ఇంచార్జీలు కేవలం పార్టీ బాధ్యులు మాత్రమే కాదని, ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య ఒక బలమైన వారధి అని స్పష్టం చేశారు. “ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలు ప్రతి లబ్ధిదారునికి సకాలంలో అందుతున్నాయో లేదో పర్యవేక్షించాల్సిన బాధ్యత మీపై ఉంది” అని ఆయన దిశానిర్దేశం చేశారు. -సాంకేతికతతో పక్కా వ్యూహాలు: ఈ శిక్షణా తరగతుల్లో భాగంగా క్లస్టర్ ఇంచార్జీలు క్షేత్రస్థాయిలో ఓటర్లతో ఎలా మమేకం కావాలి, బూత్ స్థాయి కమిటీలను ఎలా సమన్వయం చేసుకోవాలి మరియు సాంకేతికతను (యాప్స్) ఎలా ఉపయోగించాలి అనే అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. -ఉత్సాహంగా పాల్గొన్న కేడర్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన మూడవ బ్యాచ్ ఇంచార్జీలు ఈ శిక్షణలో చురుగ్గా పాల్గొన్నారు. తమ క్లస్టర్ పరిధిలో పార్టీని నంబర్ వన్ స్థానంలో నిలబెడతామని ఇంచార్జీలు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర స్థాయి ప్రతినిధులు, శిక్షణా విభాగం సభ్యులు మరియు ఇతర నేతలు పాల్గొన్నారు.

నారాయణపేట

కున్సి గ్రామానికి కొత్త బోర్_నీటి సమస్య పరిష్కారానికి ముందడుగు

క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో గ్రామ భగీరథ నీళ్లు సరిగ్గా అందుబాటులో లేకపోవడంతో గ్రామంలో ప్రజలకు తాగునీటి సమస్య ఉండకూడదని సర్పంచ్ మ్యాకలి సురేష్ బృందం కొత్త బోర్ పాయింట్ ను ఏర్పాటు చేయడం జరిగింది అత్యవసర సమయంలో నీటి ట్యాంకు సరఫరా చేయడానికి గ్రామంలో కొత్త బోరు వేయడం జరిగింది ఈ బోర్ కోసం గ్రామానికి చెందిన ప్రభు గౌడ విశ్వనాథ్ గౌడ వారు భూమిని దానం చేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు యువతలు వర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మ్యాకలి సురేష్ ఉప సర్పంచ్ ఉప్పరి రాము బిజెపి మండల అధ్యక్షుడు నల్లే నరసప్ప ప్రభు గౌడ విశ్వనాథ్ గౌడ నల్లే శ్రీనివాసులు పూజారి శరణప్ప రామ్ చందర్ మాస్టర్ ఈడిగి జనార్ధన్ , కావలి మాణికప్ప రెడ్డి గౌడ నాగప్ప మ్యాకలి శివప్ప జట్ల కీరప్ప ఈడిగి కీరప్ప బుర్ర గంగప్ప తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

సెవెన్ హిల్స్ ఫార్మసీకళాశాల విద్యార్థులకు ఉద్యోగాలు

పున్నమి ప్రతినిధి , రామచంద్రపురం రామచంద్రపురం మండలం వెంకట్రామాపురం సమీపంలోని సెవెన్ హిల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రాంగణంలో సోమవారం నాడు కెరీర్ గైడెన్స్, ప్లేస్మెంట్ మరియు ట్రైనింగ్ సెల్ ఆధ్వర్యంలో అపోలో ఫార్కసీస్ లిమిటెడ్ సంస్థ క్యాంపన్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించింది. ఈ నిమామక ప్రక్రియలో బి. ఫార్మసి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా మొత్తం 11 మంది విద్యార్థులు ఆపాలో ఫార్మసీన్ సంస్థలో ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ యిం . నిరంజన్ బాబు. తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపకులు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు తమ వృత్తి జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అపోలో ఫార్మసిస్ సంస్థ తరుపున వాసు, ప్రతాప్ నాయిక్, కిరట్, తేజశ్రీ పాల్గొన్నారు.

ఖమ్మం

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర గుడి లో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవలే వివాహం చేసుకున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య – సాక్షి దంపతులకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని శ్రీవారిని ప్రార్థించారు. వారి దాంపత్య జీవితం ఆనందంగా, విజయవంతంగా కొనసాగాలని కోరుకున్నారు. అలాగే శ్రీవారి దివ్య ఆశీస్సులు తెలుగు రాష్ట్రాల ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రార్థించారు. కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం తనకు ఎంతో పవిత్రమైన అనుభూతిని కలిగించిందని భట్టి విక్రమార్క తెలిపారు. అదేవిధంగా త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆర్థిక, సామాజిక రంగాల్లో మరింత పురోగతి సాధించి, విజన్–2047 లక్ష్యంతో ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు వెల్లడించారు .

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.