Monday, 27 April 2026

Blog

E-పేపర్

అమీర్పేట్ 107 సర్వేనెంబర్ పై కలెక్టర్ నజర్ వడ్డే మోని దాసు అభ్యర్థనకు పాజిటివ్ స్పందన

అమీర్పేట్ 107 సర్వేనెంబర్ పై కలెక్టర్ నజర్ వడ్డే మోని దాసు అభ్యర్థనకు పాజిటివ్ స్పందన తక్షణ చర్యలకు ఆర్డీవోకు మరియు జిల్లా సర్వే డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ కు ఆదేశం పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా, మార్చి 10:: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలో ఉన్న అమీర్పేట గ్రామంలో గల సర్వేనెంబర్ 107 పై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ విషయంలో బాధితుడు మాణిక్యమ్మ గూడెంకు చెందిన వడ్డేమోని దాసుకు న్యాయం చేయమని కందుకూర్ ఆర్డీవో ను ఆదేశించడం జరిగింది. మంగళవారం ఈనెల కొట్టు మహేశ్వరం మండల రెవెన్యూ ఆఫీసర్ కార్యాలయంలో కలెక్టర్ నారాయణ రెడ్డి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అమీర్పేట సర్వే నెంబర్ 107 కు సంబంధించి ఆరా తీశారు. తక్షణ చర్యలకు సంబంధించి ఆర్డీవోను ఆదేశించడం జరిగింది.రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం 107 సర్వేనెంబర్ లో తన భూమిలోకి ఇతరులు తాను దళితుడిని అనే నిర్లక్ష్యంతో దౌర్జన్యంగా ప్రవేశించి పోలీసుల సహకారంతో అక్కడ రిసార్టుకు రోడ్డు వేశారని దాసు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మహేశ్వరం మండల సర్వేయర్ 107 సర్వేనెంబర్ కు హద్దులు కూడా నిర్ణయించారని, అయితే వాటిని తొలగించి మరి తన భూమిలో రోడ్డు వేశారని కూడా ఆయన కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో సానుకూలంగా స్పందించిన కలెక్టర్ నారాయణరెడ్డి తక్షణమే తగిన చర్యలు తీసుకొని దళితుడు అయిన బాధితుడికి న్యాయం చేయాలని చేయాలని కందుకూరు ఆర్డీవోను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కోర్టు ఉత్తర్వులు మేరకు నడుచుకోవాలని వాటికి హద్దులు కూడా నిర్ణయించాలని కూడా ఆర్డిఓ దృష్టికి చేస్తూ, ఈ సందర్భంగా పూర్తి న్యాయం చేయడంలో కందుకూరు ఆర్డీవో మరియు రంగారెడ్డి జిల్లా సర్వే ఆఫీసర్ తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సందర్భంగా ఆదేశించారు. తో వడ్డే మోని దాసు ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. దళితుల చట్టాలు అమలులో ఉన్నప్పటికీ తనకు తన కుటుంబానికి బంధువులకు జరుగుతున్న అన్యాయాలపై దళితుల చట్టాల ఉల్లంఘన పై కలెక్టర్కు వివరించడం జరిగింది. దీంతో ఎలాంటి అన్యాయం జరగనివ్వబోనని చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం అమీర్పేట గ్రామంలోని సర్వే నెంబర్ 107 లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే కందుకూర్ నుంచి వచ్చి హద్దులు నిర్ణయించడం జరిగింది. Uploaded Video:

రంగారెడ్డి

*శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన 52వ వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న దేప భాస్కర్ రెడ్డి * –రామభక్తుడైన హనుమంతుడు మనందరికీ కష్టాలను తీర్చుతాడు *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) : మార్చ్ 10 : మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణ పురం డివిజన్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం *శ్రీ శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన 52వ వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 52వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా జరగడం చాలా సంతోషకరం. 52 ఏళ్లుగా ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుండటం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అని తెలిపారు.ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామభక్తుడైన హనుమంతుడు మనందరికీ కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.ఉత్సవాలను ఇంత క్రమశిక్షణతో, అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ చైర్మన్ తలాటి రమేష్ నేత కి, ఈఓ కి మరియు ప్రతి ఒక్క కార్యకర్తకు అభినందనలు తెలిపారు. రాజకీయ పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ దైవ సేవ, ప్రజా సేవ నిరంతరం కొనసాగాలి. హనుమంతుడి సేవలో నా పూర్వజన్మ సుకృతం. అని తెలిపారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి రామకృష్ణ పురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు పున్న గణేష్ నేత ఏఎంసీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు ఆలయ కమిటీ చైర్మన్ తలాటి రమేష్ నేత ఖిల్లా మైసమ్మ దేవాలయం చైర్మన్ సురేష్ ఈఓ ఉమారాణి రాష్ట్ర బీసీ నాయకులు గట్ల రవీంద్ర మరియు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి లింగస్వామి గౌడ్,బొడ్డుపల్లి మహేందర్, యాదవ రెడ్డి,అల్లేటి కిరణ్, రామకృష్ణ గౌడ్, భూపాల్ రెడ్డి, జగన్నాథం, రామారావు ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ కమిటీ సభ్యులు విజయలక్ష్మి శ్రీమన్నారాయణ, వెంకటేశ్వర్లు,సాయి, శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు

తూర్పు గోదావరి

యువ ప్రెస్ టీం వార్తలకు స్పందించిన అధికారులు

తాళ్లపూడి (పున్నమి ప్రతినిధి )మార్చి 10:: కొవ్వూరు మరియు తాళ్లపూడి ఇసుక ర్యాంపుల నుండి వచ్చే ఇసుక లారీల వలన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాళ్లపూడి యువ ప్రెస్ టీంలో వచ్చిన వార్తలకు స్పందించిన కొవ్వూరు ఆర్డీవో ఎన్ రాజా రమేష్ మరియు మండల తాసిల్దార్ లక్ష్మీ లావణ్య. మంగళ వారం తాళ్లపూడి రెవెన్యూ కార్యాలయానికి విచ్చేసిన ఆయన యువర్ ప్రెస్ టీం సభ్యులతో మాట్లాడుతూ వాహనదారులను ఇబ్బంది పెడుతూ లారీలపై ఓవర్ లోడ్ ఇసుక రవాణా జరిపితే ఇసుక ర్యాంపు యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఇసుక రవాణా చేసే ప్రతి లారీ కు టార్పాలిన్ పూర్తిగా కట్టుకోవాలని, అలాగే ఓవర్ లోడు వేసిన లారీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రెండు మూడు రోజుల్లో ర్యాంపులు పరిశీలించడం జరుగుతుందని ఇసుక రవాణా విషయంలో అవకతవకలు గుర్తించినట్లయితే చర్యలు తప్పవని అన్నారు. కొవ్వూరు ఆర్డీవో గా బాధ్యతలు తీసుకున్న అనంతరం తాళ్లపూడి మండల రెవెన్యూ కార్యాలయం మంగళవారం సందర్శించినట్లు ఆయన తెలిపారు.

అనకాపల్లి

నాటు తుపాకీ బలి తీసుకున్న బాల్యం ఏటికొప్పాకలో విషాదం – 13 ఏళ్ల బాలుడు కౌశిక్ మృతి

అనకాపల్లి జిల్లా, మార్చి 9 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ ): అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల విద్యార్థి ఆడారి కౌశిక్ నాటు తుపాకీ కాల్పుతో మృతి చెందాడు. స్థానిక సమాచారం ప్రకారం, కౌశిక్ తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని కాలువ వద్దకు వెళ్లాడు. ఈ సమయంలో వేటకు ఉపయోగించే నాటు తుపాకీ పిల్లల చేతికి చిక్కింది. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో బుల్లెట్ కౌశిక్ ఛాతిలో తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం బాలుడి మృతదేహాన్ని ఒకచోట నుంచి మరోచోటికి తరలించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట కాలువ సమీపంలో కనిపించిన మృతదేహం తర్వాత పొదల్లో గుర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా బొప్ప నరసయ్య ఏకగ్రీవ ఎన్నిక

ముస్తాబాద్ మార్చి పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా గూడెం గ్రామానికి చెందిన బొప్ప నరసయ్య గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ప్రధాన కార్యదర్శిగా తోట ధర్మేందర్ ఉపాధ్యక్షులుగా కుక్కల దేవేందర్ మెంగని శ్రీనివాస్ కోశాధికారిగా ఆది లక్ష్మణ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇట్టి సమావేశంలో మాజీ మండల అధ్యక్షులు మెంగని రాజుగారు అన్ని గ్రామాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి మెంగని మనోహర్ రాష్ట్ర నాయకులు శీలం స్వామి జిలేల్లా మల్లేశం మాజీ mptc బొప్ప శ్రీధర్ చెక్కపల్లి రాజు బండి ఎల్లం కొండాపూర్ శ్రీనివాస్ బండి రాములు మొర్రెపల్లి సర్పంచ్ మెంగని శ్రీనివాస్ శీలం సుధాకర్ వరాల లక్ష్మీనారాయణ బొప్ప శంకర్ వరుస సత్యం దబ్బేడా రాములు వరి లక్ష్మణ బొప్ప విష్ణు తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

దేశ మొదటి మహిళ ఉపాధ్యాయురాలు మరియు మహిళా విద్యకు మార్గదర్శి సావిత్రిబాయి ఫూలేకు నివాళులు

ముస్తాబాద్/ మార్చి/పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు గీస భక్షపతి ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా గీస భక్షపతి మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సామాజిక సంస్కర్త అని అన్నారు. ఆమె 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నాయగావ్‌లో జన్మించారని తెలిపారు. 9 ఏళ్ల వయస్సులో జ్యోతిరావు ఫూలేతో వివాహం జరిగి, భర్త ప్రోత్సాహంతో విద్యను అభ్యసించారని చెప్పారు. 1848లో పూణేలో బాలికల కోసం దేశంలోనే మొదటి పాఠశాలను ప్రారంభించి మహిళల విద్య, సమానత్వం కోసం ఆమె జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. అలాగే వితంతు పునర్వివాహాలు, అంటరానితనం నిర్మూలన కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. 1897 మార్చి 10న ప్లేగు బాధితులకు సేవ చేస్తూ ఆమె మరణించడం ఆమె త్యాగానికి నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఘనంగా నిర్వహించారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విద్య కోసం ముందడుగు.. మనుబోలులో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి ( పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి నియోజకవర్గంలో విద్యార్థినుల కోసం సైకిళ్ల పంపిణీ కార్యక్రమం సందడిగా కొనసాగుతోంది. రెండో రోజు మనుబోలు జిల్లా పరిషత్ హైస్కూలులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీ ఆక్వా అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి కలిసి 8, 9 తరగతుల విద్యార్థినులకు 257 హీరో సైకిళ్లను అందజేశారు. SEIL కంపెనీ సీఎస్ఆర్ నిధులతో మొత్తం 1841 సైకిళ్లు అందించగా, యువగళం స్పూర్తితో 3132 సైకిళ్ల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సోమిరెడ్డి తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

మహిళా దినోత్సవం సందర్భంగా గ్రంథాలయంలో ఘన కార్యక్రమం

విశాఖపట్నం, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయం, విశాఖపట్నంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వన్నెం రెడ్డి సతీష్ కుమార్, కార్యదర్శి బుర్రి కుమార్ రాజు పాల్గొన్నారు. సామాజిక కార్యకర్త కె. రమప్రభ, ఉపాధ్యాయురాలు సంధ్యారాణి మహిళల సమస్యలపై ప్రసంగించారు. 50 సంవత్సరాలుగా గ్రంథాలయానికి వస్తున్న చిట్టి నారాయణమ్మను సన్మానించారు.

తిరుపతి

మాతృశ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవ వేడుకలు

ముఖ్యఅతిథిగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పున్నమి ప్రతినిధి, 10 మార్చి 2026 తిరుపతి శ్రీ మాతృశ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, అంకితభావం అలవరుచుకోవాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలరని అన్నారు. సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువులకే అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమన్నారు.* కేవలం చదువుకే పరిమితం కాకుండా, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని, ఇది వారి మానసిక వికాసానికి తోడ్పడుతుందని సూచించారు.* విద్యా రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని వివరిస్తూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ కేంద్రం లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహా చూపుడు వేలును విరగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు..

*జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ కేంద్రం లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహా చూపుడు వేలును విరగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు* జోగులాంబ గద్వాల్. ఐజ మర్చి 10(పున్నమి ప్రతినిధి) జోగులాంబ గద్వాల జిల్లా. ఐజ మున్సిపాలిటీ కేంద్రం లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్ర హాము చూపుడు వేలును గుర్తు తెలియని వ్యక్తులు ఈరోజు రాత్రి సమయంలో ధ్వంసం చేయడం జరిగింది… గతంలో కూడా పలుమార్లు ఇలాగే జరిగింది దళిత జాతి బిడ్డలు దాన్ని తిరిగి సరిచేసినాను మరలా దీన్ని ధ్వంసం చేయడం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా. అనే అనుమానం కలుగుతుంది దయచేసి దీన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి చేసారు దళిత సంఘాలు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.