Monday, 27 April 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వరాలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో ఈవో భేటీ

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 10: శ్రీకాళహస్తీశ్వరాలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన చర్యలపై శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ నూతన ఈవో వెంకటేశ్వర రావు సుదీర్ఘంగా చర్చించారు. మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో ఈవో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయానికి సంబంధించిన పలు కీలక అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యటించే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా క్యూ లైన్ల నిర్వహణ, తాగునీరు, పారిశుధ్యం, వసతి గదుల ఆధునీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈవోకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. ఆలయ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఆలయ పరిసరాలను తీర్చిదిద్దాలని ఈ భేటీలో నిర్ణయించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సూచనల మేరకు రాహు-కేతు పూజలకు వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేస్తామని, ఆలయ ప్రగతికి ఎమ్మెల్యే పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో దేవస్థాన అధికారులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

తిరుపతి

మల్లిగుంట వద్ద అదుపుతప్పిన టాటా ఏసీ.. టైరు పగలడంతోనే ప్రమాదం.

తొట్టంబేడు పున్నమి న్యూస్, మార్చి 10: తొట్టంబేడు మండలం ఎన్ హెచ్–7 జాతీయ రహదారి మల్లిగుంట రోడ్డు వద్ద టమోటా లోడ్‌తో అతివేగంగా వెళుతున్న టాటా ఏసీ వ్యాన్ టైరు పగలడంతో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. వాహనంలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఘటనతో కొంతసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు వెంటనే స్పందించి వాహనాన్ని పక్కకు జరిపి ట్రాఫిక్‌ను సవ్యంగా సాగేటట్లు చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చిన్నా జనసేన కుమారుడిని పరామర్శించిన చదలవాడ హరీష్ దంపతులు

– నెల్లూరు జిల్లా ప్రభుత్వ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త చిన్నా జనసేన కుమారుడిని ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు చదలవాడ హరీష్ కుమార్, ఆయన సతీమణి ఈరోజు పరామర్శించారు. చిన్నా జనసేన రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన కుమారుడు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. జనసేన కార్యకర్తలకు ఎటువంటి అవసరం వచ్చినా తాము అండగా నిలుస్తామని తెలిపారు. జనసైనికులకు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చదలవాడ హరీష్ కుమార్ స్పష్టం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిర్రావారిపాలెంలో కోదండరామస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపనకు విచ్చేసిన ఎమ్మెల్యే

కలిగిరి మండలం జిర్రావారిపాలెం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ కోదండ రామస్వామి స్వామివారి నూతన ఆలయ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చారణల మధ్య నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దేవాదాయ శాఖ సహకారంతో రూ.1 కోటి నిధులు మంజూరు చేశారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆ గ్రామ ప్రజలు, భక్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆపరేషన్ వజ్ర ప్రహార్: డ్రగ్స్‌పై కఠిన చర్యలు అవగాహనలో నెల్లూరు పోలీసులు

డ్రగ్స్ వద్దు బ్రో”… యువతకు అవగాహన కల్పిస్తున్న నెల్లూరు పోలీసులు నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం **“ఆపరేషన్ వజ్ర ప్రహార్”**లో భాగంగా జిల్లాను డ్రగ్ ఫ్రీగా మార్చడమే లక్ష్యంగా నెల్లూరు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల, IPS ఆదేశాలు మేరకు అడిషనల్ ఎస్‌పి (అడ్మిన్) సౌజన్య సూచనలతో స్కూల్స్, కళాశాలల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 988 ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసి, రైల్వే, ఎక్సైజ్, డ్రగ్స్ విభాగాలతో సమన్వయంగా “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో అవగాహన కల్పిస్తున్నారు. అదనంగా 24 డ్రోన్లతో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారిని రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించి, జిల్లాలోని రెండు డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్ అందిస్తున్నారు. గంజాయి వంటి డ్రగ్స్ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై కలిగే దుష్పరిణామాలు, నేరచరిత్రపై పడే ప్రభావాల గురించి విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్ అక్రమ రవాణాతో పాటు వినియోగం కూడా నేరమేనని, వాడిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా, వినియోగించినా డయల్ 112 లేదా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గత ప్రభుత్వ రీ-సర్వే తప్పు లకు ఇక చెక్….. .. ఎమ్ ఎల్ ఎ కాకర్ల

గత ప్రభుత్వ రీ సర్వే అవకతవకలకు ఇక చెక్ పడిందని కలిగిరి మండలం పరికోట గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు . ముఖ్య అతిథిగా హాజరై రైతులకు రాజముద్రతో ముద్రించబడిన పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ రైతులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలని పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంలో రీ సర్వే పేరుతో అనేక అవకతవకలు చోటు చేసుకుని, రైతులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని అన్నారు. భూసర్వే ప్రక్రియలో స్పష్టత లేకపోవడం వల్ల చాలా మంది రైతులు తమ భూముల విషయంలో అయోమయానికి గురయ్యారని తెలిపారు.అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దే చర్యలు వేగంగా చేపట్టినట్లు ఆయన చెప్పారు. రైతులకు పూర్తి పారదర్శకతతో, రాజముద్రతో పాటు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ క్యూఆర్ కోడ్‌తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా రైతుల భూముల వివరాలు స్పష్టంగా నమోదు అవుతాయని, ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవస్థ నడుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, అన్నదాతల అభివృద్ధి కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయనున్నామని సురేష్ హామీ ఇచ్చారు.

రంగారెడ్డి

* ప్రజల సమస్యల పరిష్కరించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..సామిడి గోపాల్ రెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 10 : మహేశ్వరం నియోజకవర్గం ప్రశాంతి హిల్స్ డివిజన్ 58 ప్రశాంత్ నగర్. 34 వ వార్దు మరియు -ఎం కె నగర్ 13వ వార్డులలో ఉన్న సమస్యలను స్థానికుల నుండి అడిగి తెలుసు కున్న టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ దశబ్ద కాలంగా సమస్యల వలయంలో చిక్కుకున్న లేనినగర్ ప్రజలు సమస్యలు ఒకటి ఒకటిగా తిరుస్తూ సమస్యలు లేని లెనిన్ నగర్ని తీర్చి దిద్దడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యంమని ఎ సమస్య ఉన్న నాకు ఫోన్ చేసి చెప్పండి తక్షణమే సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న అన్నారు ఈ కార్యక్రమం లో కో-ఆప్షన్ సభ్యుడు జాటవత్ రవి నాయక్,ఎస్ సి సెల్ అధ్యక్షులు స్వాగత్ శ్రీనివాస్, గట్టు వీరన్న కాంటెస్టెడ్ కార్పొరేట్సర్స్ టీక్లోల్ల కృష్ణ, పన్నాల సురేష్, లక్ష్మణా చారి, గడివేముల కృష్ణ, గుడ్డేటి నరసింహ, మైత్రి ఆనంద్, రెడ్డపోల్ అశ్విని, సంపంగి బాలస్వామి,పారిశుధ్య విభాగం దాసరి జీవన్ కుమార్, వాటర్ లైన్ మ్యాన్ కంబలపల్లి భాస్కర్ మరియు స్థానికులు పాల్గొన్నారు

E-పేపర్

గ్యాస్ కొరతపై కీలక వ్యాఖ్యలు

గ్యాస్ కొరతపై కీలక వ్యాఖ్యలు పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 10 మార్చి 2026 కమర్షియల్ గ్యాస్ నిలిపివేయడంతో తమ వ్యాపారానికి గండి పడిందని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి తెలిపారు. ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాలు చూపించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్ల బంద్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ లో తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో LPG గ్యాస్ దిగుమతులు తగ్గిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ కొరత తో హోటల్ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయన్నారు.

E-పేపర్

అమీర్పేట్ 107 సర్వేనెంబర్ పై కలెక్టర్ నజర్ వడ్డే మోని దాసు అభ్యర్థనకు పాజిటివ్ స్పందన

అమీర్పేట్ 107 సర్వేనెంబర్ పై కలెక్టర్ నజర్ వడ్డే మోని దాసు అభ్యర్థనకు పాజిటివ్ స్పందన తక్షణ చర్యలకు ఆర్డీవోకు మరియు జిల్లా సర్వే డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ కు ఆదేశం పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా, మార్చి 10:: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలో ఉన్న అమీర్పేట గ్రామంలో గల సర్వేనెంబర్ 107 పై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ విషయంలో బాధితుడు మాణిక్యమ్మ గూడెంకు చెందిన వడ్డేమోని దాసుకు న్యాయం చేయమని కందుకూర్ ఆర్డీవో ను ఆదేశించడం జరిగింది. మంగళవారం ఈనెల కొట్టు మహేశ్వరం మండల రెవెన్యూ ఆఫీసర్ కార్యాలయంలో కలెక్టర్ నారాయణ రెడ్డి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అమీర్పేట సర్వే నెంబర్ 107 కు సంబంధించి ఆరా తీశారు. తక్షణ చర్యలకు సంబంధించి ఆర్డీవోను ఆదేశించడం జరిగింది.రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం 107 సర్వేనెంబర్ లో తన భూమిలోకి ఇతరులు తాను దళితుడిని అనే నిర్లక్ష్యంతో దౌర్జన్యంగా ప్రవేశించి పోలీసుల సహకారంతో అక్కడ రిసార్టుకు రోడ్డు వేశారని దాసు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మహేశ్వరం మండల సర్వేయర్ 107 సర్వేనెంబర్ కు హద్దులు కూడా నిర్ణయించారని, అయితే వాటిని తొలగించి మరి తన భూమిలో రోడ్డు వేశారని కూడా ఆయన కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో సానుకూలంగా స్పందించిన కలెక్టర్ నారాయణరెడ్డి తక్షణమే తగిన చర్యలు తీసుకొని దళితుడు అయిన బాధితుడికి న్యాయం చేయాలని చేయాలని కందుకూరు ఆర్డీవోను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కోర్టు ఉత్తర్వులు మేరకు నడుచుకోవాలని వాటికి హద్దులు కూడా నిర్ణయించాలని కూడా ఆర్డిఓ దృష్టికి చేస్తూ, ఈ సందర్భంగా పూర్తి న్యాయం చేయడంలో కందుకూరు ఆర్డీవో మరియు రంగారెడ్డి జిల్లా సర్వే ఆఫీసర్ తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సందర్భంగా ఆదేశించారు. తో వడ్డే మోని దాసు ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. దళితుల చట్టాలు అమలులో ఉన్నప్పటికీ తనకు తన కుటుంబానికి బంధువులకు జరుగుతున్న అన్యాయాలపై దళితుల చట్టాల ఉల్లంఘన పై కలెక్టర్కు వివరించడం జరిగింది. దీంతో ఎలాంటి అన్యాయం జరగనివ్వబోనని చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం అమీర్పేట గ్రామంలోని సర్వే నెంబర్ 107 లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే కందుకూర్ నుంచి వచ్చి హద్దులు నిర్ణయించడం జరిగింది. Uploaded Video:

రంగారెడ్డి

*శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన 52వ వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న దేప భాస్కర్ రెడ్డి * –రామభక్తుడైన హనుమంతుడు మనందరికీ కష్టాలను తీర్చుతాడు *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) : మార్చ్ 10 : మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణ పురం డివిజన్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం *శ్రీ శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన 52వ వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 52వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా జరగడం చాలా సంతోషకరం. 52 ఏళ్లుగా ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుండటం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అని తెలిపారు.ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామభక్తుడైన హనుమంతుడు మనందరికీ కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.ఉత్సవాలను ఇంత క్రమశిక్షణతో, అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ చైర్మన్ తలాటి రమేష్ నేత కి, ఈఓ కి మరియు ప్రతి ఒక్క కార్యకర్తకు అభినందనలు తెలిపారు. రాజకీయ పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ దైవ సేవ, ప్రజా సేవ నిరంతరం కొనసాగాలి. హనుమంతుడి సేవలో నా పూర్వజన్మ సుకృతం. అని తెలిపారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి రామకృష్ణ పురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు పున్న గణేష్ నేత ఏఎంసీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు ఆలయ కమిటీ చైర్మన్ తలాటి రమేష్ నేత ఖిల్లా మైసమ్మ దేవాలయం చైర్మన్ సురేష్ ఈఓ ఉమారాణి రాష్ట్ర బీసీ నాయకులు గట్ల రవీంద్ర మరియు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి లింగస్వామి గౌడ్,బొడ్డుపల్లి మహేందర్, యాదవ రెడ్డి,అల్లేటి కిరణ్, రామకృష్ణ గౌడ్, భూపాల్ రెడ్డి, జగన్నాథం, రామారావు ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ కమిటీ సభ్యులు విజయలక్ష్మి శ్రీమన్నారాయణ, వెంకటేశ్వర్లు,సాయి, శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.