Monday, 27 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పరికోటలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

పరికోటలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కలిగిరి మండలం పరికోట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో ముద్రించబడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రీ-సర్వే పేరుతో జరిగిన అవకతవకల వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం భూ వివరాలను పారదర్శకంగా నమోదు చేస్తోందని చెప్పారు. రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్‌తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ద్వారా రైతుల భూమి వివరాలు స్పష్టంగా నమోదవుతాయని పేర్కొన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతుల అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జలదంకి మండలంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి పర్యటన

జలదంకి మండలంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి పర్యటన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి బుధవారం జలదంకి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు కావలిలో జడ్పిటిసి సభ్యురాలు మేదరమెట్ల శివలీలమ్మ నివాసంలో కలుసుకుంటారు. అనంతరం 9 గంటలకు జలదంకిలో వైఎస్సార్‌సీపీ నాయకురాలు తిప్పారెడ్డి ఇందిరమ్మను ఆరోగ్య పరంగా పరామర్శిస్తారు. తర్వాత 9:40 గంటలకు కోదండరామపురంలో బోడి మల్ల కృష్ణారెడ్డి నివాసంలో వివాహ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. 10:45 గంటలకు సోమవారపాడులో వైఎస్సార్‌సీపీ నాయకుడు చంద్రారెడ్డిని పరామర్శిస్తారు. 11:30 గంటలకు బ్రాహ్మణకాకలో ద్రోణాదుల రవీందర్ రెడ్డి తల్లి మరణించడంతో వారి కుటుంబాన్ని సంతాపం తెలియజేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు తిమ్మసముద్రంలో కేశవరం పంచాయతీ సర్పంచ్ రావి ప్రసాద్ నాయుడు సోదరుడు రమేష్ నాయుడు కుమారుడి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1:40 గంటలకు చోడవరం పంచాయతీలో ఉపసర్పంచ్ యలవల మధుసూదన్ యాదవ్ సోదరుడు యలవల దామోదర్ యాదవ్ విద్యుత్ ఘాతంతో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మహిళల భద్రత కోసం “శక్తి యాప్”పై విస్తృత అవగాహన – నెల్లూరు పోలీసులు

మహిళల భద్రత కోసం “శక్తి యాప్”పై విస్తృత అవగాహన – నెల్లూరు పోలీసులు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని “శక్తి యాప్” అవసరంపై పోలీసులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్‌పీ డా. అజిత వేజెండ్ల, IPS ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్‌పీ (అడ్మిన్) సూచనలతో శక్తి బృందాలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దుకాణాలు తదితర ప్రదేశాలలో ప్రజలకు, మహిళలకు, విద్యార్థినిలకు శక్తి యాప్ వినియోగంపై వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం రూపొందించిన ఈ యాప్‌ను ప్రతి మహిళ తప్పనిసరిగా మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. విపత్కర పరిస్థితుల్లో శక్తి యాప్ ద్వారా సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయం అందిస్తారని తెలిపారు. అలాగే బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా, ఫోక్సో చట్టం, మాదకద్రవ్యాల నిషేధం వంటి అంశాలపై కూడా అవగాహన కల్పిస్తూ డయల్ 100, 112, 1098, 1930 వంటి అత్యవసర నంబర్ల గురించి ప్రజలకు తెలియజేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అంబేద్కర్ కాలనీలో కోదండరామ స్వామి ఆలయం మంజూరు మంత్రి అనఁ రామనారాయణ రెడ్డి కీ సన్మానo

ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామంలోని అంబేద్కర్ కాలనీ వాసులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అంబేద్కర్ కాలనీలో శ్రీ కోదండ రామస్వామి ఆలయం మంజూరు చేయించినందుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి గారికి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం ఆత్మకూరు మండల టీడీపీ అధ్యక్షులు సుంకర పెంచల చౌదరి, మండల యూనిట్ ఇంచార్జి కొండ్రెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ టంగుటూరు పెంచలయ్య, ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంత్రి గారి సహకారంతో గ్రామంలో ఆధ్యాత్మిక అభివృద్ధి జరుగుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

తిరుపతి

పేటలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం క్రింద లేగ దూడల పంపిణి

ఏర్పేడు పున్నమి న్యూస్, మార్చి 10: ఏర్పేడు మండలంలోని పాపానాయుడు పేటలో పశువైద్య కేంద్రం పరిధిలోని రావిళ్ళవారి గ్రామా పంచాయితీలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం క్రింద లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం న్వాహించినట్లు డాక్టర్ క్రిష్ణ మోహన్ రెడ్డి తేలిపారు. ఈ కార్యక్రమంలో ఒక సంవత్రరం లోపు వయసు కలిగిన సుమారు 50 పెయ్య నూడలు ప్రదర్శనలి పాల్గొనగా, పశు వైద్యులు అనిలకుమార్. ఎ. సునీత సుబ్బారావు, తిరుపతి వారు మూడు మేలు రకం దూడలు ఎంపిక చేసి, పాడి రైతులకు బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు గణేష్ నాయుడు పాల్గొని రైతులందరికి బహుమతులతో పాటు పశువుల ఆరోగ్యం మెరుగు పరుచుకోవడానికి మందులు, పౌష్టికాహారం ఉచితంగా అందజేయడం జరిగినది.

తిరుపతి

శ్రీకాళహస్తిలో శృంగేరి పీఠాధిపతుల ఆధ్యాత్మిక సందడి-ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యేబొజ్జల

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 10: శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక చైతన్యంతో పులకించింది. శృంగేరి శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ, ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామీజీల రాకతో ఆలయ పరిసరాలు వేదమంత్రోచ్ఛారణలతో మారుమోగాయి. శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన ఉభయ పీఠాధిపతులకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు కోలా ఆనంద్, ఆలయ పాలకమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న పీఠాధిపతులకు అధికారులు, నేతలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ గర్భాలయంలో స్వామి, అమ్మవార్లకు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పీఠాధిపతులు పాల్గొన్నారు. పీఠాధిపతుల పర్యటన దృష్ట్యా దేవస్థానం తరపున అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, కోలా ఆనంద్, సాయి ప్రసాద్‌లు పీఠాధిపతులను దర్శించుకుని, వారి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. శృంగేరి జగద్గురువుల పాదస్పర్శతో శ్రీకాళహస్తి క్షేత్రం పునీతమైందని, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వారి ఆశీస్సులు కోరినట్లు తెలిపారు. కోలా ఆనంద్ మాట్లాడుతూ పీఠాధిపతుల రాక క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక శోభను తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తిరుపతి

సావిత్రిబాయి పూలే జీవితం నేటి మహిళలకి ఆదర్శం-జనసైనికులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 10: శ్రీకాళహస్తి నియోజికవర్గ జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం భారతీయ సంఘ సంస్కర్త, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. సావిత్రిబాయి ఫూలే బ్రిటిష్ వారితో మానవ హక్కుల కోసం, మహిళా విద్యాభివృద్ధి కోసం, అంటరానితనం మీద, ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి, మహిళలు విద్య నేర్చుకోవాలని 1848 సంవత్సరంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించిన టువంటి గొప్ప ధైర్యశాలి సావిత్రిబాయి ఫూలే, తన భర్త జ్యోతిరావు పూలే, మనదేశంలో దాదాపు 52 పాఠశాలలను నిర్మించి , విద్యాభివృద్ధికి కృషిచేసి గొప్ప చరిత్ర కలిగినటువంటి సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా సావిత్రిబాయి పూలే యొక్క ధైర్య సాహసాలు గుండెల నిండా నింపుకొని అన్ని రంగాలలోనూ మహిళలు ముందు ఉండే విధంగా ఉండాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, డాక్టర్ నక్క ప్రసాద్,మనీ , ఆరీఫ్,ముని చంద్ర, చందు, పసల ఎలిషా, జానకిరామ్, వీర మహిళలు పేట శారద, నారాయణ గాయత్రి,తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

సావిత్రిబాయి పూలేకి ఘన నివాళులర్పించిన తెదేపా నాయకులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 10: శ్రీకాళహస్తి పట్టణంలోని 18వ వార్డు పరిధిలోని పూసల వీధి కూడలి వద్ద సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన సహధర్మచారిణి క్రాంతిజ్యోతి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా సోమవారం నాడు తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. ఎం. ఉమేష్ రావు ఆధ్వర్యంలో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ…. మహిళా హక్కుల సాధనకు విద్యే సరైన ఆయుధమని, అణచివేతకు గురైన మహిళా శక్తిని ఆధునిక విద్య ద్వారానే విముక్తి చేయాలని సామాజిక ఉద్యమం చేసిన సావిత్రిబాయి పూలే ఒక సామాజిక విప్లవ జ్యోతి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా. జి. దశరథాచా,వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే దంపతులు చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. మహిళలను సామాజిక రుగ్మతల నుండి విముక్తి చేయడం, లింగ వివక్షను ఎదుర్కొనేలా చైతన్య పరచడం, పితృస్వామ్య వ్యవస్థ నిర్మూలన చేసి మహిళా సాధికారత సాధించడమే లక్ష్యంగా సావిత్రిబాయి పూలే 1852లో సేవా మండల్ అనే సంస్థను స్థాపించి మహిళా హక్కుల కోసం పోరాటం సాగించారని అగ్రవర్ణ దురహంకారపు కులవ్యవస్థ కారణంగా అన్యాయానికి గురైన బాలికల పరిస్థితిని మార్చేందుకు పూలే దంపతులు ‘సత్యశోధక్ సమాజ్’ను ప్రారంభించి బాల్య వివాహాల నిర్మూలన, సతీసహగమనానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు వితంతువుల పునర్వివాహాలకు బలమైన సామాజిక ఉద్యమాన్ని నడిపారన్నారు. మహారాష్ట్రలో కరువు, ప్లేగు వ్యాధి తీవ్రంగా వ్యాపించిన సమయంలో ప్రజలకు అండగా నిలిచి విరాళాలు సేకరించి వైద్య శిబిరాలు నిర్వహించారని, ప్లేగు బారిన పడిన వేలాది చిన్నారులకు సేవలందించిన పూలే దంపతులు నిజమైన సామాజిక సేవకులని కొనియాడారు. ప్లేగు వ్యాధి బాధితులకు సేవలందిస్తూ అదే వ్యాధి బారిన పడి సావిత్రిబాయి పూలే మరణించడం అత్యంత విచారకరమని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యుడు ఎం. సుబ్బయ్య, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్ షేక్ మహబూబ్ బాషా, టీఎన్‌టీయూసీ తిరుపతి పార్లమెంటు నాయకులు వెంకటరమణ, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి, సయ్యద్ చాంద్ బాషా, గాజుల భగత్, సోంపల్లి మురళీ నాయుడు, హరి, సయ్యద్ అహ్మద్, సులేమాన్, మహమ్మద్ రఫీ, ఆనంద్, నూర్ మొహమ్మద్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

బి.వి.పురం హైస్కూల్ నందు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 10: శ్రీకాళహస్తి రూరల్ మండలం బి.వి.పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిధిలోని ఈశ్వరయ్య కాలనీ మోడల్ ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు సన్మానించి తమ గౌరవాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బి.వి.పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత గౌడ్ మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సత్కరించడం తమకు ఎంతో ఆనందదాయకమని తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపి మోహన్, షకీరా, శేఖర్, వెంకట్, ఈశ్వరయ్య కాలనీ మోడల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తిరుపతి

నల్లగంగమ్మ తల్లికి ముక్కంటి సారె అందజేసిన దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 10: శ్రీకాళహస్తి పట్టణంలోని బహుదూర్‌పేటలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ నల్లగంగమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరఫున దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ నల్లగంగమ్మ తల్లికి ముక్కంటి సారే సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రతి సంవత్సరం నల్ల గంగమ్మ తల్లి జాతరలో ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయమని అమ్మవారికి సారే సమర్పించడం తనకు ఆనందంగా ఉందని భవిష్యత్తులో కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధితో పాటు అనుబంధ ఆలయాలు, పరిసర ప్రాంతాల ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగంగమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ కంటా రమేష్, ఆలయ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.