Monday, 27 April 2026

Blog

E-పేపర్

మరలా పులి కలకలం

✍️✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి ప్రత్తిపాడు మండలం ఖర్జూరపాలెం, వేపకుండా పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్టు బుధవారం అధికారులు ధ్రువీకరించారు అత్యధిక సాంకేతిక పరికరాలతో పులి కదలికపై నిరంతరం కొనసాగిస్తున్నట్టు పులిరాంతంలోనే సురక్షితంగా ఉందని వెల్లడించారు పశువులకు జంతువులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు END…..

E-పేపర్

మరలా పులి కలకలం

✍️✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి ప్రత్తిపాడు మండలం ఖర్జూరపాలెం, వేపకుండా పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్టు బుధవారం అధికారులు ధ్రువీకరించారు అత్యధిక సాంకేతిక పరికరాలతో పులి కదలికపై నిరంతరం కొనసాగిస్తున్నట్టు పులిరాంతంలోనే సురక్షితంగా ఉందని వెల్లడించారు పశువులకు జంతువులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు END…..

రాజన్న సిరిసిల్ల

ఎద్దుగుట్ట మల్లన్న–ఎల్లమ్మ స్వామివారిని దర్శించిన తోట ఆగన్న, చక్రపాణి

రాజన్న సిరిసిల్ల జిల్లా/ మార్చి/ పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూర్ గ్రామంలో నిర్వహించిన ఎద్దుగుట్ట మల్లన్న–ఎల్లమ్మ స్వామివారి కల్యాణ మహోత్సవంలో పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు భక్తితో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న, మున్సిపల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి పాల్గొన్నారు. అలాగే కౌన్సిలర్లు గుండ్లపల్లి పూర్ణచందర్, భాగ్యలక్ష్మి సత్యనారాయణ, కళ్యాణి అశోక్ రావు, ధర్నాం అరుణ, ఎలుక వెంకన్నతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దిడ్డి శ్రీనివాస్ మరియు ఇతర పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. భక్తులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రాంత ప్రజల సుఖసంతోషాలు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామస్థులు నాయకులకు స్వాగతం పలికారు.

రాజన్న సిరిసిల్ల

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి మార్చి 13న కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన

CWFI, CITU రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మార్చి 13న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టనున్నట్లు CWFI రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను కార్మికుల సంక్షేమానికే వినియోగించాలని, CSC హెల్త్ సెంటర్ పేరుతో జరుగుతున్న కార్యక్రమాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు పెన్షన్, భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల నిర్మాణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మార్చి 13న ఉదయం 10 గంటలకు జరిగే ఆందోళన కార్యక్రమానికి కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని గీస బిక్షపతి తో పాటు గుర్జాల శ్రీధర్ సంఘం దేవయ్య కొడం రమణ మరియు విమలక్క పద్మ మరియు జిల్లా కార్మిక నాయకులు పిలుపునిచ్చారు.

E-పేపర్

బయట తినే టిఫిన్ ప్రియులకు షాక్… దోశ, పూరి, వడలకు కొన్ని రోజులు కష్టమే*

*బయట తినే టిఫిన్ ప్రియులకు షాక్… దోశ, పూరి, వడలకు కొన్ని రోజులు కష్టమే* పున్నమి న్యూస్ ప్రతినిధి 11 మార్చ్ 2026 ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో వంట గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు హోటళ్లు, పీజీ హాస్టళ్లు, మెస్‌లు తమ మెనూలో మార్పులు చేస్తున్నారు. గ్యాస్ కొరతతో పాటు ధరలు పెరగడం కారణంగా ఎక్కువ సమయం పట్టే మరియు ఎక్కువ నూనె అవసరమయ్యే దోశ, పూరి, వడ, చపాతీ, టీ, కాఫీ వంటి టిఫిన్ ఐటెంలను తాత్కాలికంగా నిలిపివేయాలని హైదరాబాద్ ఐటీ కారిడార్ హోటళ్ల అసోసియేషన్ ప్రకటించింది. దీంతో బయట టిఫిన్ తినే వారికి కొంత ఇబ్బంది కలగనుంది. ప్రస్తుతం పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొన్ని హోటళ్లు మెనూను కుదించి అన్నం, సాంబార్, పప్పు, రసం వంటి త్వరగా తయారయ్యే వంటకాలను మాత్రమే వడ్డిస్తున్నాయి. ఇదే పరిస్థితి పీజీ హాస్టళ్లు, మెస్‌లలో కూడా కనిపిస్తోంది. గ్యాస్ సరఫరా సమస్య మరో రెండు మూడు రోజులు కొనసాగితే కొన్నిచోట్ల హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయాల్సి వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రవాణా ఛార్జీలు మరియు ముడి సరుకుల ధరలు పెరగడంతో కొన్ని హోటళ్లు టిఫిన్ ధరలను కూడా పెంచాయి. దోశ, పూరి, వడలపై కనీసం రూ.15 వరకు, ఇడ్లీ, ఉప్మా వంటి వాటిపై రూ.10 వరకు ధరలు పెరిగినట్లు సమాచారం. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వస్తే మళ్లీ మెనూ కూడా యథావిధిగా కొనసాగుతుందని హోటల్ నిర్వాహకులు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విద్యాభివృద్ధి కోసం సరస్వతి పూజ నిర్వహించిన విద్యానికేతన్

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి ( పున్నమి ప్రతినిధి) మనుబోలు ప్రాంతంలోని శ్రీ విద్యానికేతన్ కోచింగ్ సెంటర్‌లో బుధవారం సరస్వతి పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ కామాక్షితాయి బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సాయి కుమార్ శర్మ కలశ ప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులకు ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి కావేటి భార్గవ్ పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు. చింటూ ధ్యాన స్మృతి వనం వ్యవస్థాపకులు వల్లం రమేష్ పెన్నులు, పెన్సిల్లు, మిఠాయిలను విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ కరస్పాండెంట్ జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

చింతకాని మండలానికి ప్రత్యేక అంబులెన్స్ ఇవ్వాలి – బీజేపీ చింత కానీ మండల అధ్యక్షులు కొండా గోపి

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి): చింతకాని ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. చింతకాని మండల బీజేపీ అధ్యక్షుడు కొండా గోపి నేతృత్వంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా గోపి మాట్లాడుతూ పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా సమస్యపై స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక అంబులెన్స్ లేకపోవడంతో మండల ప్రజలు అత్యవసర వైద్య సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వంత నియోజకవర్గంలోనే చింతకాని మండలానికి ప్రత్యేక అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చింతకాని మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి గోదా మంగయ్య, ఇమ్మడి సత్యనారాయణ, కోరిపల్లి శ్రీను, సిద్ధార్థ బక్క సత్యమూర్తి, సత్తెనపల్లి గోపి, గోపాల్ కృష్ణ, వేముల ఎల్లయ్య, దొడ్డా రామకృష్ణ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సేవా సంక్షేమ అవార్డులతో గుర్తింపు పొందిన బోమ్మీల బాల చెన్నయ్య సత్కారం

నెల్లూరులో ఈరోజు పేదల పెన్నిధిగా పేరుగాంచిన, బలగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న గొప్ప నాయకుడు గౌరవనీయులు శ్రీ బోమ్మీల బాల చెన్నయ్య గారిని ఆయన నివాసంలో ఘనంగా సన్మానించడం జరిగింది. నెల్లూరు నుండి ఢిల్లీ వరకు వివిధ సేవా కార్యక్రమాల ద్వారా దాదాపు 52 సేవా సంక్షేమ అవార్డులు అందుకున్న ఆయన సామాజిక సేవకు నిదర్శనం. ఈ సందర్భంగా శాలువా కప్పి పూలమాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న కృషి అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని పాల్గొన్నవారు పేర్కొన్నారు. ఇలాంటి సేవా భావంతో మరెన్నో కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పోతిరెడ్డి పాలెంలో విషాద కుటుంబాలను పరామర్శించిన చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

కోవూరు మండలంలోని పోతిరెడ్డి పాలెం గ్రామంలో ఇటీవల మరణించిన కుటుంబాలను తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి పరామర్శించారు. కోవూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి యద్దలపూడి నాగరాజు కుమారుడు మరణించగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే గ్రామ మాజీ సర్పంచ్ మాచవరపు పుల్లయ్య కుమారుడు మరణించగా, వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇంటూరి విజయ్, ఇందుపూరు మురళి కృష్ణ రెడ్డి, గొర్రిపాటి నరసింహ, కే గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

వెలుగుమట్ల భూదాన్ బాధితులకు సొంతగూడు – బీజేపీ పోరాటానికి దిగివచ్చిన ప్రభుత్వం 311 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు – ఇది బీజేపీ విజయం: జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి): పేదల పక్షాన భారతీయ జనతా పార్టీ చేపట్టిన నిరంతర పోరాటం ఫలించి, ఖమ్మం నగర పరిధిలోని వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఎట్టకేలకు న్యాయం జరిగినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ చర్యలతో ఇళ్లు కోల్పోయి వీధినపడ్డ బాధితులకు అదే స్థలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం బీజేపీ పోరాట విజయమని ఆయన పేర్కొన్నారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ భారీ పోలీసు బలగాల మధ్య కూల్చివేయడంతో వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఈ ఘటనపై బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలిచారు. ఇళ్లు కోల్పోయి ఖమ్మంలోని అంబేద్కర్ భవన్‌లో ఆశ్రయం పొందుతున్న కుటుంబాలకు ఆహార వసతి కల్పిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సమస్యను రాష్ట్ర మరియు జాతీయ స్థాయికి తీసుకెళ్లిన బీజేపీ నాయకత్వం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ ఈటల రాజేందర్ తదితరులను వెలుగుమట్లకు తీసుకువచ్చి బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. అదేవిధంగా జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లకు ఫిర్యాదు చేయడంతో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ స్వయంగా వచ్చి పరిస్థితులను పరిశీలించారు. అధికారుల వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. బీజేపీ శ్రేణులు బాధితులతో కలిసి నిర్వహించిన ఆందోళనలు, ధర్నాలు ప్రభుత్వంలో చలనం తెచ్చాయి. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి వెలుగుమట్లలో ఇళ్లు కూల్చిన చోటే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం మొత్తం 311 మంది నిరుపేదలకు 75 గజాల చొప్పున సుమారు ఐదు ఎకరాల భూమిని కేటాయించనున్నారు. అయితే వెలుగుమట్లలో మొత్తం 62 ఎకరాల భూదాన్ భూమి ఉండగా, అందులో సుమారు 30 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని బీజేపీ నేతలు తెలిపారు. ఆ భూములను కూడా వెలికితీసి పేదలకు దక్కేలా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పేదల హక్కుల కోసం బీజేపీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ విజయం మరోసారి నిరూపించిందని నాయకులు పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.