Monday, 27 April 2026

Blog

తిరుపతి

శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో కాంతివంతమైన ఎమ్మెల్యే గృహం

శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా పూజ్యశ్రీ శృంగేరి జగద్గురువులు బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్వగ్రామమైన ఊరందూరును సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎమ్మెల్యే నూతన నివాసానికి జగద్గురువులు విచ్చేసి తమ పాదస్పర్శతో ఆ గృహాన్ని పవిత్రం చేశారు. జగద్గురువుల రాకతో ఎమ్మెల్యే గృహం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు జగద్గురువుల ఆశీస్సులు పొందే భాగ్యం పొందారు. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి జగద్గురువులకు ఘన స్వాగతం పలికి, భక్తిశ్రద్ధలతో ఆతిథ్యం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ…శాంతి, ధర్మానికి ప్రతిరూపమైన శృంగేరి జగద్గురువులు తమ నివాసానికి విచ్చేసి పాదస్పర్శ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తమ కుటుంబ సభ్యులు, బంధువులను ఆశీర్వదించడం జీవితంలో మరచిపోలేని అనుభూతిగా భావిస్తున్నానని పేర్కొన్నారు. జగద్గురువుల ఆశీస్సులతో తమ గృహం ఆధ్యాత్మిక కాంతితో వెలిగిపోయిందని, వారి దివ్య కరుణ తమ కుటుంబంతో పాటు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పుణ్యసందర్భం తమకు ఎంతో ప్రత్యేకమైందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. జగద్గురువుల సందర్శనతో ఊరందూరు గ్రామంలో భక్తి, ఆధ్యాత్మికత నిండిన వాతావరణం నెలకొంది. గ్రామస్థులు కూడా ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జగద్గురువుల ఆశీస్సులు పొందారు.

తిరుపతి

132 సంవత్సరాల తరువాత తెలుగులోకి ‘శ్రీకాళహస్తి స్థల పురాణం’… జగద్గురువులచే ఆవిష్కరణ

శ్రీకాళహస్తి (పున్నమి న్యూస్), మార్చి 11: దక్షిణ ఆమ్నాయ శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి పూజ్యశ్రీ విదుశేఖర భారతీ తీర్థ స్వామీజీ బుధవారం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానాన్ని సందర్శించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా విచ్చేసిన జగద్గురువులు శ్రీకాళహస్తి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య “శ్రీకాళహస్తి స్థల పురాణం” గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ గ్రంథం విశిష్టతను వివరించిన ప్రముఖులు మాట్లాడుతూ.. 1893 సంవత్సరంలో వెంకటగిరి సంస్థానాధీశులైన శ్రీశ్రీశ్రీ వెలుగోటి రాజా ముద్దుకృష్ణ యాచేంద్ర భూపాల వారి ఆధ్వర్యంలో ప్రచురితమైన సంస్కృత గ్రంథాన్ని బ్రహ్మశ్రీ చెట్లూరు వెంకటసుబ్రమణ్యం శాస్త్రి పరిష్కరించినట్లు తెలిపారు. దాదాపు 132 సంవత్సరాల తరువాత ఈ మహాగ్రంథాన్ని సంపూర్ణంగా తెలుగులోకి అనువదించి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారని శివపురాణాంతర్గతంగా ఉన్న శివరహస్య సంగ్రహం ఆధారంగా రూపొందిన ఈ శ్రీకాళహస్తి స్థల పురాణంలో మొత్తం 90 అధ్యాయాలు, 9,430 శ్లోకాలు ఉన్నాయి. ఐదు సంపుటాలుగా విస్తరించిన ఈ గ్రంథం సుమారు 1,700 పేజీలతో వెలువడింది. వేదవ్యాస మహర్షి రచించిన ఈ పురాణాన్ని డాక్టర్ పాలకోడేటి జగన్నాథరావు తెలుగులో వ్యాఖ్యాన సమేతంగా ఆంధ్రీకరించారు. ప్రఖ్యాత కవి ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంతో పోలిస్తే ఇది విస్తృతమైన, భిన్నమైన మహాగ్రంథమని పండితులు తెలిపారు. ఈ గ్రంథం సంపాదకత్వాన్ని మాజీ కార్యనిర్వహణాధికారి, డిప్యూటీ కలెక్టర్‌గా సేవలందించిన కె.ఎస్. రామారావు నిర్వహించారు. ఇంద్రకీలాద్రి దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానంతో అనుబంధం కలిగిన ఆయన సంపాదకత్వంలో రెండు సంపుటాలుగా ఈ గ్రంథం వెలువడిందని ఈ గ్రంథాన్ని వెలుగులోకి తీసుకురావడంలో శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన గురజాల నాగారాజ జెట్టి ప్రత్యేక కృషి చేశారు. శృంగేరి జగద్గురువుల చేతుల మీదుగా ఈ గ్రంథం ఆవిష్కరణ జరగడం క్షేత్ర చరిత్రలో ఒక విశిష్ట ఘట్టంగా భక్తులు, పండితులు అభిప్రాయపడ్డారు.

తిరుపతి

రాష్ట్రాభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్న జగన్– టిడిపి నేత డా. ఉమేష్ రావు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 11: విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్‌ను అడ్డుకునేందుకు కోర్టుల్లో పిల్ వేయించడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్‌లా మారారని టిడిపి బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. ఎం. ఉమేష్ రావు ఆరోపించారు. రూ.15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు రాష్ట్ర యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని తిరుపతి వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి ద్వారా హైకోర్టులో పిల్ దాఖలు చేయించడం రాష్ట్ర భవిష్యత్తుపై దెబ్బ కొట్టడమేనని విమర్శించారు. గూగుల్ విశాఖకు వస్తుందనే వార్త వచ్చినప్పుడు మొదట దాన్ని “గోదాం”గా విమర్శించిన వైసీపీ నేతలు, తర్వాత దానిని తామే తీసుకొచ్చామని చెప్పారన్నారు. ఇప్పుడు అదే ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. తన పాలనలో పరిశ్రమలు రాష్ట్రం విడిచిపోవడానికి కారణమైన జగన్ రెడ్డి, ఇప్పుడు గూగుల్ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్లను కూడా భయపెట్టేలా వ్యవహరిస్తున్నారని ఉమేష్ రావు విమర్శించారు. గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వస్తే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి వేగవంతమై, యువతకు ఉజ్వల భవిష్యత్తు దక్కుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, బీమాల భాస్కర్ ముదిరాజ్, డి.వి. నారాయణ, వజ్రం కిషోర్, కోట చంద్రశేఖర్, మణి, రమేష్, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ట్రాన్స్ఫార్మర్ వైర్ దొంగతనాలపై పోలీసుల దాడి–265 కిలోల రాగి వైర్ స్వాధీనం, ఒకరు అరెస్ట్

ఎర్పేడు పున్నమి న్యూస్, మార్చి 11: ఎర్పేడు మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల వరుసగా జరుగుతున్న ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ వైర్ దొంగతనాల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 265 కిలోల రాగి (కాపర్) వైర్ స్వాధీనం చేసుకున్నారు. ఎర్పేడు పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి పర్యవేక్షణలో, సబ్‌ఇన్‌స్పెక్టర్ రవి ప్రకాష్ నాయకత్వంలో పోలీసు బృందం బుధవారం ఏర్పేడు మండలంలోని వికృతమాల గ్రామ పరిధిలోని నీల్లద్రి అపార్ట్‌మెంట్ సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం అరెస్టయిన నిందితుడు తుమ్మమరు యుగాంధర్ వయస్సు (25) సం మునగలపాలెం అరుంధతి వాడకు చెందినవాడిగా గుర్తించారు. అతని వద్ద నుంచి మొత్తం 265 కిలోల రాగి వైర్ స్వాధీనం చేసుకున్నారు. యుగాంధర్‌పై ఇప్పటికే మొత్తం 9 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు పరశురామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా బయటపడిన వివరాల ప్రకారం, యుగాంధర్, పరశురామ్ కలిసి ఏర్పేడు మండలంతో పాటు పరిసర గ్రామాల్లోని ట్రాన్స్ఫార్మర్లను పగలకొట్టి అందులోని కాపర్ వైర్‌ను దొంగిలించి విక్రయించేవారని తెలిసింది. ఆ డబ్బుతో తమ చెడు అలవాట్లు, వ్యసనాలను తీర్చుకునేవారని పోలీసులు తెలిపారు. ఈ దొంగతనాల వల్ల ఏర్పేడు మండలంలోని సుమారు 40 గ్రామాలకు చెందిన 42 మంది రైతుల పొలాలకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దాంతో రైతులు వేసిన పంటలకు సకాలంలో నీరు అందక తీవ్ర నష్టాన్ని చవిచూసినట్లు వెల్లడైంది. ఈ ఘటనల నేపథ్యంలో వైర్ దొంగతనాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ సుబ్బబరాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ రవి మనోహరాచారి పర్యవేక్షణలో, రేణిగుంట ఎస్‌డీపీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ బృందం పనిచేస్తోంది. ఈ ఆపరేషన్‌లో ఏర్పేడు సీఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ రవి ప్రకాష్‌తో పాటు పోలీస్ కానిస్టేబుళ్లు మునిరెడ్డి, అరుణ్ కుమార్ పాల్గొన్నారు. అరెస్టయిన నిందితుడిని పోలీసులు విచారిస్తూ, పరారీలో ఉన్న మరో నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

తిరుపతి

ఈద్గా కోసం ప్రత్యేక స్థలం కావాలని ఎమ్మెల్యేకి ముస్లిం కమిటీ వినతి

ఎర్పేడు పున్నమి న్యూస్, మార్చి 11: శ్రీకాళహస్తి నియోజిక వర్గ శాసన సబ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని ముస్లిం మసీదు కమిటీ సభ్యులు ఎర్పేడు ప్రాంతంలో ఈద్గా కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలని కోరుతూ ముస్లిం సోదరులు బుధవారం నాడు బొజ్జల సుధీర్ రెడ్డిని ఆయన స్వగృహంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ముస్లిం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకి తమ సమస్యను వివరిస్తూ ప్రస్తుతం ఏర్పేడు చెరువు కలుజు వద్ద ఉన్న ప్రదేశాన్ని ముస్లిం సోదరులు ఈద్గా, స్మశానంగా ఉపయోగిస్తున్నారని అయితే ఆ ప్రాంతంలో చెరువు కట్టపై ఒకవైపు మలయాళ స్వామి విగ్రహం, మరోవైపు చర్చి నిర్మాణం ఉండటంతో మత ప్రార్థనలు నిర్వహించేందుకు సరిపడ స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వారితో ప్రస్తుతానికి ఉన్న ప్రదేశాన్నిస్మశానంగాఉపయోగించుకోవాలని త్వరలోని తాను తహసీల్దార్‌తో మాట్లాడి ముస్లిం సోదరులకు మరో అనువైన ప్రదేశంలో స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటానని కొత్తగా కేటాయించే స్థలంలో ఈద్గా నిర్మించుకుని భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేలా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని మలయాళ స్వామి విగ్రహం ఏర్పాటు చేసిన ప్రదేశం నుంచి మరింత ఆక్రమణలు జరగకుండా చూసుకుంటానని మలయాళ స్వామి పేరుతో ఎవరైనా స్థలం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ముస్లిం మత పెద్దలు, కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బొజ్జల వేంకట సుధీర్ రెడ్డి ను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో ఆధ్యాత్మిక పరవశం-శృంగేరి జగద్గురువులకు ఘనస్వాగతం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 11: శ్రీకాళహస్తిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దక్షిణ ఆమ్నాయ శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి పూజ్యశ్రీ విధుశేఖర భారతీ తీర్థ స్వామి వారు క్షేత్ర పర్యటనలో భాగంగా బుధవారం నాడు శ్రీకాళహస్తికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జగద్గురువులకు ఆలయ మర్యాదలతో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం పూజ్య స్వామీజీతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, మంత్రి ఆనం తదితరులు శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జగద్గురువులతో కలిసి పరమేశ్వరుడిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. స్వామీజీ పాదస్పర్శతో ఈ క్షేత్రం మరింత పునీతమైందని, వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. దర్శనానంతరం శృంగేరి పీఠం ఉత్తరాధికారి విదుశేఖర భారతీ తీర్థ స్వామి వారి నుంచి ఎమ్మెల్యే, మంత్రి, ఇతర ప్రముఖులు ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆ పరమశివుడి అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని మనసారా వేడుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ ఈఓ వెంకటేశ్వర్లు, ఆర్డిఓ భాను ప్రకాష్, భాజపా నాయకులు కోలా ఆనంద్, ఆలయ పాలకమండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, బోర్డు సభ్యులు, కూటమి నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జగద్గురువుల రాకను పురస్కరించుకుని ఆలయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

తిరుపతి

పదవ తగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీచేసిన ప్రగతి స్వచ్చంద సంస్థ

ఏర్పేడు పున్నమి న్యూస్, మార్చి 11: ఏర్పేడు మండలలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రగతి, క్రై సంస్థ , ఏర్పాటుచేసిన స్టెమ్ సెంటర్ సందర్శన నిరవహించారు. విద్యార్థులతో ప్రగతి సంస్థ డైరెక్టర్ కె వి రమణ ముఖాముఖి మాట్లాడుతూ.. స్టేమ్ సెంటర్ యొక్క ఉపయోగాలను అడిగి తెలుసుకుంటూ, స్టెమ్ సెంటర్ ఎలా ఉపయోగపడుతుందని అడుగుతూ పరీక్షల సమయం కనుక బాగా చదువుకొని, పరీక్షలు బాగా రాయలని, ప్రశాంతంగా అరగంట ముందు పరీక్ష కేంద్రాన్ని చేరుకోవాలని పిల్లలందరికి శుభాకాంక్షలు తెలుపుతూ పరీక్షల పరికరాలను ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సిబ్బందితో కలిసి, విద్యార్థులకు అందించడంతో ప్రగతి సంస్థ ఏర్పేడు మండల కోఆర్డినేటర్ శిరీష మాట్లాడుతూ….ప్రగతి సంస్థ ఏర్పేడు జడ్పీహెచ్ఎస్ కి స్టెమ్ సెంటర్ ఇవ్వడం పేద విద్యార్థులందరికీ కూడా,ఇది మరింత ఉపయోగపడి విద్యార్థుల యొక్క మెరుగైన జ్ఞాన సంపదకు ఎంతో ఉపయోగపడుతుందని తద్వారా ఇంటర్ విద్యార్థులు సాంకేతికపరమైనటువంటి గ్రూపులలో ఉత్తీర్ణత సాధిస్తున్నారని ప్రగతి సంస్థ డైరెక్టర్ రమణకి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముని లక్ష్మీ మాట్లాడుతూ.. సైన్స్ విద్యార్థుల శాతం పెరగడానికి కారణం ప్రధానంగా స్టెమ్ సెంటర్ అని పాఠశాలలో విద్యార్థులకు బోధించడానికి డైరెక్ట్ గా స్టెమ్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా విద్యార్థులకు బోధిస్తున్నామని ఇంతటి సహకారం అందించినటువంటి ప్రగతి స్టెమ్ సంస్థకు సన్ టీవీ వారికి ధన్యవాదములు తెలుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ప్రగతి సిబ్బంది, పిల్లలు పాల్గొనడం జరిగింది.

తిరుపతి

పరీక్షల్లో సాధించే ఉత్తమ ఫలితాలే ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి.. కలవగుంట భరత్

తొట్టంబేడు పున్నమి న్యూస్, మార్చి 11: పదవ తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రముఖ సంఘ సేవకులు కలవగుంట భరత్ రెడ్డి ఆకాంక్షించారు. తొట్టంబేడు మండలం చిట్టత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నాడు పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. రగ్బీ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపుతున్న పదో తరగతి చదువుతున్ దయాసాగర్ అనే విద్యార్థిని ప్రోత్సహిస్తూ తనవంతు ఆర్థిక సాయం చేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలవగుంట భరత్ రెడ్డి మాట్లాడుతూ.. పదవ తరగతి అనేది విద్యార్థుల భవిష్యత్తుకు తొలి మెట్టు అని, ఈ పరీక్షల్లో సాధించే ఫలితాలే ఉన్నత శిఖరాలకు దారి చూపుతాయని పేర్కొన్నారు. “ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో, పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయం” అని విద్యార్థులను ఉత్సాహపరిచారు. రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైన దయాసాగర్ వంటి క్రీడాకారులను ప్రోత్సహించడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపూరు సుబ్రహ్మణ్యం, తెలుగు ఉపాధ్యాయురాలు లోకనాయకి, బేబీ త్రిషికా రెడ్డి,గురునాథం, వాసు, నాగరాజు, దానా, వెంకటేష్, మోతీష్, శ్యామ్, గోపి, రవి, రాము, లోకేష్, మురళి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

191 మంది బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇవ్వనున్న ఆరోగ్య శాఖ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) సర్వైకల్ క్యాన్సర్ నివారణకు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందిస్తున్నట్లు ప్రభుత్వ వైద్యాధికారిణి డాక్టర్ గేయ పూజిత తెలిపారు. బుధవారం మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 14 సంవత్సరాలు పూర్తై 15వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోని బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. మండలంలో 191 మందిని గుర్తించి అందరికీ వ్యాక్సిన్ అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి, టిడిపి నాయకులు రాయపాటి కిరణ్, వినీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు

త్రిమూర్తుల కళ్యానోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ

పున్నమి ప్రతినిధి ,వెదురుకుప్ప మండలం వెదురు కుప్పం మండలం బ్రాహ్మణ పల్లె సమీ పంలోని శ్రీ స్వయంభు సిద్దేశ్వర స్వామి ఆలయంలో ఏప్రిల్ ఒకటో తేది త్రిమూర్తుల కళ్యానోత్సవం జరగనున్న సందర్బంగా పోస్టర్ల ను ఆవిష్కరిస్తున్న ఏక వీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి, మాజీ సర్పంచ్ చాణక్య ప్రతాప్. తదుపరి గ్రామస్తులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.