Monday, 27 April 2026

Blog

తిరుపతి

నేడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిచే దివ్యాంగులకు ఉచిత సహాయక పరికరాల పంపిణీ

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 11: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులు, వయోవృద్ధులకు చేయూతనందించేందుకు ఉచిత సహాయక పరికరాల పంపిణీ శిబిరం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ వీల్‌చైర్లు, బ్యాటరీ ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, చేతికర్రలు, కృత్రిమ అవయవాలు తదితర పరికరాలను అర్హులైన వారికి ఉచితంగా అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిబిరం నేడు ఉదయం 9 గంటల నుండి ప్రారంభమవుతుందని వెల్లడించారు. దివ్యాంగులు సులభంగా పాల్గొనేలా రెండు కేంద్రాల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్‌పీబీఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఒక కేంద్రం, అలాగే ఏర్పేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరో కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అర్హులైన దివ్యాంగులు, వయోవృద్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని శిబిరానికి హాజరై ఉచిత సహాయక పరికరాలను పొందాలని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు వారి రోజువారీ కార్యకలాపాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఆయన తెలిపారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో వైఎస్సార్‌సీపీ వేడుకలు- వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 11: శ్రీకాళహస్తి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోనికి అడుగుపెడుతున్న శుభ సందర్బంగా…. శ్రీకాళహస్తి పట్టణం వైయస్సార్ సర్కిల్ వద్ద శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి వైయస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి వైయస్సార్ విగ్రహానికి, వైయస్ జగన్ రెడ్డి కటౌట్ కు పాలాభిషేకం నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులుమాట్లాడుతూ….కలియుగంలో మరే ఇతర రాజకీయ నాయకుడూ ఎదుర్కోనన్ని కష్టాలను, దాడులను వైయస్ జగన్ తట్టుకొని నిలబడ్డారని, గత 30 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం 5 ఏళ్లలో అందులోనూ 2 ఏళ్లు కరోనా ఉన్నప్పటికీ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేసి చూపించారని అభివృద్ధి అంటే కేవలం రోడ్లు మాత్రమే కాదని, పాఠశాలలు, ఆసుపత్రుల ఆధునీకరణ, పేదరికాన్ని నిర్మూలించడం, నిరుద్యోగ యువతకు సచివాలయాలు ద్వారా ఉద్యోగకల్పన కూడా అని వివరించారు. జగన్ శబరిమల మెట్లు ఎక్కినట్లుగా రాజకీయాల్లో ఒక్కో అడుగు వేస్తూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18వ ఆవిర్భావం తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారన్నరు. వైయస్ జగన్ ఎప్పుడూ తన తండ్రి ఆశయాలను, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చూస్తారని, ఆయనకు అధికారం కంటే ప్రజలకు ఇచ్చిన హామీలే ముఖ్యమని రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఆయన రాజీ పడకుండా పని చేస్తారని, ఆయన మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాష, కొత్త పాటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తరాజీ సర్వణ కుమార్,బుల్లెట్ జయశ్యం రాయల్,మున్నా రాయల్, పంతులు,కంట ఉదయ్ కుమార్, శ్రీవారి సురేష్, పటాన్ ఫరీద్, గోర,పజిల్,గఫూర్, మధు రెడ్డి, పసల కృష్ణయ్య, మెహబూబ్ భాష,ఆరిఫ్, కాసరం బాలాజీ, ముని కృష్ణారెడ్డి, చింతా రాజేంద్ర, టైలర్ శ్రీను, సునీత సింగ్, షర్మిల ఠాగూర్, తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

మహిళల అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర బృందం ప్రశంసలు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 11: శ్రీకాళహస్తి మండలంలోని బొక్కిసం పాలెం గ్రామం కేంద్ర మహిళ స్నేహపూర్వక పంచాయతీగా ఎంపికలో ఉంది. అందులో భాగంగా గురువారం నాడు కేంద్రం నుండి ప్రత్యేక బృందం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జిల్లా అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు పంచాయతీని సందర్శించి మహిళలు చేస్తున్న అభివృద్ధిని పరిశీలించారు. అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో న్యూట్రిషన్ ఫుడ్ స్టాల్స్, ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కూరగాయల స్టాల్స్ ఏర్పాటు చేశారు. కేంద్రం నుండి వచ్చిన అధికారులను సర్పంచ్ రేఖ దుశ్యాలువాలతో సన్మానించారు. ఈ సందర్బంగా కేంద్ర బృందం మాట్లాడుతూ…పంచాయతీని మహిళలు చాలా అభివృద్ధి చేస్తున్నారని త్వరలోనే పంచాయతీ అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కె. సుబ్రహ్మణ్యం, ముని రెడ్డి, మహిళా సంఘాలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తిరుపతి

కేసుల వేగవంత పరిష్కారానికి లోక్ అదాలత్ – ప్రజలకు జడ్జి శ్రీనివాస్ నాయక్ పిలుపు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ఈ నెల 14వ తేదీ శనివారం శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్టు ఆవరణలో నిర్వహించనున్నట్లు 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజీమార్గంలో తమ కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని లోక్ అదాలత్ ద్వారా కేసులు రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం వల్ల సమయం, ధనం రెండూ ఆదా అవుతాయని లోక్ అదాలత్‌లో ఇచ్చే తీర్పు అంతిమ తీర్పుగా పరిగణించబడుతుందని, దానికి ఎటువంటి అప్పీలు ఉండదని తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో వివిధ రకాల సివిల్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని, రాజీకి లోబడే క్రిమినల్ కేసులను కూడా చర్చల ద్వారా ముగించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. అలాగే కోర్టులో పెండింగ్‌లో లేని ఫ్రీ లిటిగేషన్ కేసులను కూడా లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవచ్చని చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ కేసులను త్వరగా ముగించుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా వివిధ శాఖల ఉన్నతాధికారులు సహకరించి ఎక్కువ కేసులు లోక్ అదాలత్‌లో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జడ్జి శ్రీనివాస్ నాయక్ పిలుపునిచ్చారు.

తిరుపతి

మాతమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట వేడుకలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఆహ్వానం

తొట్టంబేడు, పున్నమి, న్యూస్, మార్చి 11: తొట్టంబేడు మండలం రామచంద్రపురం గ్రామదేవత మాతమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలకు విచ్చేయాలని శ్రీకాళహస్తి నియోజిక వర్గ శాసనసభ్యులు బోజ్జల సుధీర్ రెడ్డిని గ్రామస్తులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేసి కార్యక్రమానికి విచ్చేయాలని కోరుతూ… రామచంద్రపురం గ్రామంలో నిర్వహించనున్న మాతమ్మ తల్లి దేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మహోత్సవాలకు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారని ఎమ్మెల్యేకు వివరించారు. గ్రామస్తులు అందించిన ఆహ్వానాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆనందంగా స్వీకరించి కార్యక్రమానికి తప్పకుండా విచ్చేసి తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో జరిగే సంప్రదాయ ధార్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతను బలోపేతం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కుట్టుముల్ల చంద్రతో పాటు గ్రామ పెద్దలు, యువకులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ కార్యక్రమంలో సరోజనమ్మ, మందా మస్తాన్, మందా వెంకటసుబ్బయ్య, మందా శ్యామలమ్మ, మల్లారపు మురళి, రమణయ్య, గిరి తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.

తిరుపతి

గిరి ప్రదక్షిణ మార్గంలో సూచిక బోర్డులు ఏర్పాటు, అసాంఘిక చర్యలకు కఠిన చర్యలు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 11: ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన పరిసర ప్రాంతాల్లో భక్తుల భద్రత, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా గిరి ప్రదక్షిణ మార్గంలో దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానము వారు శ్రీకాళహస్తి కైలాసగిరి గిరి ప్రదక్షిణ మార్గమంతా సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ మార్గం మొత్తం సీసీ కెమెరాలు మరియు డ్రోన్ పర్యవేక్షణలో ఉందని బోర్డుల ద్వారా భక్తులకు తెలియజేశారు. దేవస్థానం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గిరి ప్రదక్షిణ మార్గంలో రోడ్డుకి ఇరువైపులా మరియు అటవీ ప్రాంతంలో మద్యం సేవించడం, చెత్త వేయడం, అడవికి నిప్పు పెట్టడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం పూర్తిగా నిషేధం అని స్పష్టం చేశారు. భక్తులు మరియు స్థానిక ప్రజలు ఈ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రదక్షిణ మార్గంలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసేందుకు ఈ సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. ప్రకృతి సంపదను కాపాడటం, అటవీ ప్రాంతాన్ని రక్షించడం, భక్తులకు సురక్షిత వాతావరణం కల్పించడం ఈ చర్యల ప్రధాన లక్ష్యమని నిబంధనలను ఉల్లంఘించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి హెచ్చరించారు. గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు భక్తి భావంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తిరుపతి

ప్రత్యేక అవసరాల పిల్లలకు భోజన ప్లేట్లు, గ్లాసులు పంపిణీచేసిన నత్తం హరిబాబు

తొట్టంబేడు, మార్చి 11, పున్నమి న్యూస్: తొట్టంబేడు మండలంలోని బసవయ్యపాలెం గ్రామంలో ఉన్న భవిత కేంద్రంలో నత్తం హరిబాబు జన్మదిన వేడుకలు సాదాసీదాగా కానీ సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం (ఏపీజేఎఫ్) తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న నత్తం హరిబాబు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు భోజన ప్లేట్లు, గ్లాసులను వితరణగా అందజేశారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టి వారి ఆనందంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల అభివృద్ధిలో సమాజం మొత్తం భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. అలాంటి పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించి, వారి ప్రతిభను వెలికితీసేందుకు ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి ఒక్కరి సహకారంతో ఈ పిల్లలు కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలరని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలు ఎంతో మంది విద్యార్థుల జీవితాలను మెరుగుపరుస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా విద్యార్థులకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత లభిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు కలగుంట భరత్ రెడ్డి, దామా ధనశేఖర్, కాకి హరిబాబు, కోట చంద్రశేఖర్, గంధం చంద్రశేఖర్, షేక్ బాబ్జాన్, షేక్ జుమ్ లేషా, మునిశేఖర్, వెంకటేష్, గంధం మునిచంద్ర, రమేష్, రాజా పాల్గొన్నారు. అలాగే ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు ఎం. చైతన్య, నాగరాజు, ఎం. మోహన్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు పి. సుమలత, అంగన్వాడీ కార్యకర్త రేవతి తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తిరుపతి

స్త్రీల పురోగాభి వృద్ధికి జెండర్ సమానత్వం అవసరం

ఏపీఎం గురుమూర్తి పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం రామచంద్రపురం మండలం నందు గురువారం మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో జెండర్ కార్యక్రమాలకు గురించి వివోఏలకు మరియు ఎమ్మెస్ ఈసీమెంబర్లకు, జెండర్ కమిటీలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎం మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబము కుటుంబ స్థాయి నుంచే ఆడ మగ సమానమనే ఆలోచన ధోరణి రావాలని, మరియు మహిళా చట్టాల గురించి తెలియజేశారు మహిళలు వేధింపులకు గురికాకుండా ఉండేవిధంగా జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు సంఘాలలో జెండర్ పాయింట్ పర్సన్ కి తమ యొక్క యొక్క సమస్యల్ని తెలుపవచ్చు అన్నారు అదేవిధంగా వివో మరియు ms శాక్ కమిటీ లకు మహిళా సమస్యలను తెలుపవచ్చన్నారు మండల సమైక్యలో జెండర్ రిసోర్సె సెంటర్ సేవలను వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక రామచంద్రపురం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భక్తవత్సలం మాట్లాడుతూ సైబర్ క్రైమ్ గురించి పూర్తిస్థాయిలో మహిళలకు అవగాహన కల్పించడం జరిగింది . ఈ కార్యక్రమంలో వివోఏలు మరియు ఎమ్మెస్ ఈసీ మెంబర్లు ఈనారీలు మరియు సీసీలు సుధాకర్, పార్వతమ్మ, అరుణ, ఎమ్మెస్ అకౌంటెంట్ స్వర్ణలత ఎమ్మెస్ అధ్యక్షరాలు మరియు కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.

E-పేపర్

కొట్రా గ్రామ శివారులో శ్రీశైలం హైవే పక్కన ఒక చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య

కొట్రా గ్రామ శివారులో శ్రీశైలం హైవే పక్కన ఒక చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు తేదీ 08-03-2026 రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో, ఎరకుల ఎరకుల బాలకృష్ణ తండ్రి బాలరాజు (వయస్సు 28 సంవత్సరాలు) నివాసం జనచైతన్య కాలనీ, తుర్కాయాంజల్ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నం. TG-07-R-6502 ను అతివేగంగా మరియు అజాగ్రత్తగా నడిపి తుర్కాయాంజల్ వద్ద బావర్చి హోటల్ సమీపంలో ఒక మోటార్ సైకిల్‌ను ఢీకొట్టిన ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న మనోజ్ మరియు మంజునాథ్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.ఈ విషయమై 09-03-2026 తేదీన ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌లో ఎస్‌.ఐ శ్రీ. సైదయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తదుపరి 10-03-2026 తేదీన నిందితుడు ఎరకుల బాలకృష్ణ పోలీస్ స్టేషన్‌కు హాజరైనపుడు కేసుకు సంబంధించిన నోటీసు ఇవ్వబడింది. అనంతరం తాను మద్యం మత్తులో ప్రమాదం కలిగించానని భావించి తీవ్ర మనస్తాపానికి గురైన ఎరకుల బాలకృష్ణ తేదీ 11-03-2026 తేదీన మధ్యాహ్నం సమయంలో “నేను చనిపోతున్నాను” అని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లి, ఫోన్ కాల్స్ కు స్పందించలేదు. దీంతో అతని భార్య ఎరకుల శ్రావణి 100 కాల్ ద్వారా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే రోజు సాయంత్రం సుమారు 5.30 గంటలకు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఎస్‌.ఐ శ్రీ. సైదయ్య దర్యాప్తు చేపట్టారు. తదుపరి విచారణలో, తేదీ: 12-03-2026 ఉదయం 8-30 గంటలకు ఎరకుల బాలరాజు కొట్రా గ్రామ శివారులో శ్రీశైలం హైవే పక్కన ఒక చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని తండ్రి బాలరాజు ద్వారా సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి. రవికుమార్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి, అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రాధమిక సమాచారం మేరకు మద్యం మత్తులో ప్రమాదం కలిగించానని భావించి, తీవ్ర మనస్తాపానికి గురైన మృతుడు ఎరకుల బాలకృష్ణ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియుచున్నది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం తెలియజేయబడును.

E-పేపర్

వెలుగుమట్ల భూ బాధితులకు అండగా కల్వకుంట్ల కవిత నిరాహార దీక్ష*

*వెలుగుమట్ల భూ బాధితులకు అండగా కల్వకుంట్ల కవిత నిరాహార దీక్ష* -దీక్షకు సంఘీభావం తెలిపిన మల్లోజు శ్రీనివాస చారి ఇబ్రహీంపట్నం మార్చ్ 12 ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్లలో భూదాన్ భూ బాధితులకు మద్దతుగా అంబేడ్కర్ భవన్ వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరాహార దీక్షకు రంగారెడ్డి జిల్లా,యాచారం మండలం,మాల్ గ్రామానికి చెందిన మల్లోజు శ్రీనివాస చారి సంఘీభావం తెలిపారు.డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి సోమవారం రాత్రి ఆమె దీక్ష ప్రారంభించిన విషయం విదితమే.ప్రభుత్వ చర్యల వల్ల సుమారు 600 ఇళ్లు బుల్డోజర్లతో కూల్చివేయబడగా దాదాపు 2 వేల మంది ఒక్కరాత్రిలోనే నిరాశ్రయులయ్యారని ఈ సందర్బంగా శ్రీనివాస చారి తెలిపారు.బాధితుల్లో అధికంగా సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలే ఉన్నాయని పేర్కొన్నారు.ఈ నిరాహార దీక్షలో అమరవీరుల ఆశయ సమితి రాష్ట్ర అధ్యక్షులు కొర్ర సాయి రామ్,తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి అజయ్,రవి కుమార్,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.