Monday, 27 April 2026

Blog

తిరుపతి

సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాలలో AI, 3D ప్రింటింగ్ నూతన ఆవిష్కరణలపై జాతీయ సదస్సు

పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం రామచంద్రపురం మండలం వెంకట్రామాపురం సమీపంలోని సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాలలో శుక్రవారం నాడు ఫార్మసీ రంగంలో ఆధునిక సాంకేతికతల పై అవగాహన పెంపొందించేందుకు ” నియంత్రణ సంసిద్ధత కోసం AI, 3D ప్రింటింగ్ మరియు నాణ్యత హామిని ఏకీకృతం చేయడం” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును ఘనంగా ప్రారంభించారు. ఈ సరస్సును ఫారసీ కళాశాల అనాలసిస్ 2 కెమిస్ట్రీ విభాగం మరియు IQAC, IIC మరియు RED సెల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సు మొదటి రోజున జార్ఖండ్ ఉషా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరామ్ నాగరాజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఔషధ పరిశోధనలో ఆధునిక విధానాలపై ప్రసంగించారు. అనంతరం వ్యక్తిగతీకరించిన ఔషధ రూపాల తయారీలో 30 ప్రింటింగ్ వినియోగం పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ కళాశాలల నుండి వచ్చిన విద్యార్థులు తమ పరిశోధనలపై మౌఖిక మరియు ఈ- పోస్టర్ ప్రదర్శనలు ఇచ్చారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ యిం. నీరంజన్ బాబు మాట్లాడుతూ ఫార్మసీ రంగంతో జరుగుతున్న సాంకేతిక పురోగతలను విద్యార్థులు, పరిశోధకులు మరియు పరిశ్రమల నిపుణుల పంచుకునేందుకు. ఈ సరస్సు వేదికగా సిలుస్తుందని తెలిపారు. వివిధ ఫార్మసి కళాశాలల నుండి విద్యార్థుల, పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు..

రాజన్న సిరిసిల్ల

మోహినికుంట రైతులకు సాగునీరు విడుదల చేయాలని వినతి

ముస్తాబాద్ /మార్చి/ పున్నమి ప్రతినిధి మోహినికుంట గ్రామ రైతుల పంట పొలాలకు సాగునీరు అందించాలని కోరుతూ ఈరోజు సిద్దిపేటలోని S C E E ని రైతులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, మోహినికుంట సర్పంచ్ బిల్లం మురళి రైతులతో కలిసి పాల్గొన్నారు. మోహినికుంట గ్రామానికి కందుల చెరువు, రాజక్కపేట కొత్త చెరువు ద్వారా మల్లన్నసాగర్ నీటిని విడుదల చేసి ప్రవాహం కొనసాగించాలని కోరారు. దీంతో మోహినికుంట–ముస్తాబాద్ పరివాహక ప్రాంతాల్లోని రైతులకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని వివరించారు. రైతుల సమస్యను పరిశీలించిన SC EE రెండు రోజుల్లో నీరు విడుదల అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మోహినికుంట గ్రామానికి చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

రైతుల పంట పొలాలకు సాగనీరు వెంటనే అందించాలని సిద్ధిపేట E E SC గారిని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది

ముస్తాబాద్ మార్చి 13 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహిని కుంట గ్రామ రైతులకు వరి పంటకు సాగునీరు అందించాలని. మోహిని కుంట కందుల చెరువు నుండి రాజకపేట కొత్తచెరువు నుండి మోనికొండ దాకా మల్లన్న సాగర్ నీటిని విడుదల చేసి ప్రవాహం కొనసాగించాలని కోరారు. చిల్లాపూర్ కందుల చెరువు నుండి రాజపేట కొత్తచెరువు నుండి మోహిని కుంట ముస్తాబాద్ పరివాహక ప్రాంతాల్లోని రైతుల సుభిక్షంగా ఉండాలని. భూగర్భ జలాలు పెరగడానికి వెంటనే నీటిని విడుదల చేయాలని మనవి చేయగా. SC E E గారు వెంటనే స్పందించి సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించి నీటిని విడుదలయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు మాజీ రైతుబంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు. మొయిలకుంట సర్పంచ్ బిల్లం మురళి. రైతులు కే శ్రీనివాసరావు. పల్లటి మల్లేష్. వేణుగోపాల్ రావు. దుబ్బాక బాబు. రాజం రాజేశం యాదవ్. శ్రీనివాస్. అశోక్. కారట్ల రమేష్ రెడ్డి. పల్నాటి రాజు. శేఖర్. సుక్రుద్దీన్. గువ్వల రవి. మల్లేశం. బండారి బాలయ్య. రాజు. శీలం నర్సింలు. మోతే కిషన్. డి దేవయ్య. నాగరాజు. సురేష్ పి శ్రీకాంత్. మల్లయ్య. జై బాలయ్య. ఏం భూమయ్య. అంజి . బి సత్తయ్య .మల్లయ్య. జె రవి. మోహిని కుంట రైతులు పాల్గొన్నారు

ఖమ్మం

శ్రీ రక్ష ఆరోగ్య సురక్ష యాత్రలో పాల్గొనండి ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం : ప్రముఖ వైద్యులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి) ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడం, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా ఖమ్మంలోని శ్రీ రక్ష హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న **“శ్రీ రక్ష ఆరోగ్య సురక్ష యాత్ర”**లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జిల్లాలోని బోనకల్లు మండల కేంద్రం బోనకల్లు గ్రామంలో నిర్వహించనున్న ఈ యాత్ర ప్రజలకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడమే కాకుండా, ఉచిత వైద్య సేవలు అందించే ప్రత్యేక కార్యక్రమంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది చిన్నచిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ పెద్ద వ్యాధులకు గురవుతున్నారని, అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు పరీక్షలు చాలా అవసరమని డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ యాత్రలో భాగంగా ప్రజలకు పలు రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రక్తపోటు, షుగర్, గుండె సంబంధిత సమస్యలు, సాధారణ వైద్య పరీక్షలు తదితర ఆరోగ్య పరీక్షలను వైద్య నిపుణుల బృందం ద్వారా నిర్వహిస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో శ్రీ రక్ష హాస్పిటల్ తరచూ ఆరోగ్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. ప్రస్తుతం జీవన విధానంలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లు మరియు ఒత్తిడి కారణంగా అనేక రకాల వ్యాధులు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. అందువల్ల ప్రతి వ్యక్తి తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం అవసరమని సూచించారు. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభంగా చేయవచ్చని, అందుకే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు శ్రీ రక్ష హాస్పిటల్ ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలు చేపడుతుందని డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని అన్నారు. కాబట్టి బోనకల్లు మండలం పరిధిలోని ప్రజలతో పాటు సమీప గ్రామాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఉచిత ఆరోగ్య పరీక్షలను చేయించుకోవాలని, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాలని డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు మరింత విస్తరించడంతో పాటు ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం పెరుగుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

E-పేపర్

అస్తమించిన ఎర్ర సూర్యుడు ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (బాపు) ఇక లేరు

*అస్తమించిన ఎర్ర సూర్యుడు* *ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (బాపు) ఇక లేరు. పున్నమి న్యూస్ ప్రతినిధి 13 మార్చ్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (బాపు) ఇక లేరు. *రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడు, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన నికార్సైన కమ్యూనిస్టు ఉద్యమ నేత కొండిగారి రాములు మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.* *జోహార్లు కామ్రేడ్ కొండిగారి రాములు జోహార్! జోహార్ !

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జనసేన కార్యాలయంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం

నెల్లూరు జనసేన కార్యాలయంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నెల్లూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ అలియా గారు ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై పార్టీ పోరాటం గురించి వివరించారు. పార్టీని బలోపేతం చేయడానికి యువత, అభిమానులు పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర నాయకులు హైమావతి గారు, శనివరపు అజయ్‌బాబు గారు, వంగళ్ళు శ్రీనివాస్ గారు, #చిన్నా_జనసేన తదితరులు పాల్గొన్నారు. నాయకులు కలిసి కార్యకర్తలకు సభ్యత్వ నమోదు ప్రాముఖ్యతను వివరించి, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సభ్యత్వం నమోదు చేసుకున్నారు. నాయకులు అందరికి ధన్యవాదాలు తెలియజేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చిన్నా జనసేన తనయుడిని పరామర్శించిన కొట్టె వెంకటేశ్వర్లు, స్వర్ణలత

ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ కార్యక్రమ కమిటీ రాష్ట్ర కార్యదర్శి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ కొట్టే వెంకటేశ్వర్లు గారు మరియు శ్రీమతి కొట్టే స్వర్ణలత అమ్మ గారు, అనారోగ్యంతో ఉన్న చిన్నా జనసేన తనయుడిని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పరామర్శిస్తూ ధైర్యం చెప్పారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అవసరమైన సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు కూడా హాజరై కుటుంబానికి ధైర్యం చెప్పారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ తన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఊటుకూరులో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ – కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి: భోగినేని కాశీరావు

ఊటుకూరులో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ – కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి: భోగినేని కాశీరావు ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీ హై స్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకులు శ్రీ గవ్వల వెంకయ్య గారి ఆధ్వర్యంలో, “నా సేన కోసం నా వంతు” కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యులు శ్రీ భోగినేని కాశీరావు గారి అధ్యక్షతన విద్యార్థులకు అవసరమైన పరీక్ష సామాగ్రిని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భోగినేని కాశీరావు మాట్లాడుతూ, జీవితంలో పదవ తరగతి ఎంతో కీలకమైన దశ అని పేర్కొన్నారు. సమాజంలో గౌరవం పొందడానికి మరియు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడానికి విద్య ఎంతో ముఖ్యమని అన్నారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుంటే తమ కుటుంబంతో పాటు సమాజానికి కూడా సేవ చేయగలమని విద్యార్థులకు సూచించారు. మన దేశంలో ఎంతో మంది మహనీయులు పేదరికంలో జన్మించినప్పటికీ ఉన్నత విద్యతో దేశ అభివృద్ధికి సేవలందించారని గుర్తుచేశారు. అదే విధంగా విద్యార్థులు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి భవిష్యత్తుకు పునాది వేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మాల్యాద్రి గారు, ఉపాధ్యాయులు, జనసేన నాయకులు భోగినేని కాశీరావు, గవ్వల వెంకయ్య, నీలిరత్నయ్య, రామమూర్తి, వెలుగోటి సురేష్, బ్యాంక్ మేనేజర్ రవి గారు మరియు జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఊటుకూరు హై స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీ పరిధిలోని హై స్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు జనసేన నాయకులు భోగినేని కాశీరావు. జనసేన నాయకులు శ్రీ గవ్వల వెంకయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమ కమిటీ సభ్యులు శ్రీ భోగినేని కాశీరావు అధ్యక్షతన విద్యార్థులకు అవసరమైన పరీక్ష సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మరియు భోగినేని కాశీరావు మాట్లాడుతూ, జీవితంలో పదవ తరగతి ఎంతో కీలకమైన ఘట్టమని తెలిపారు. సమాజంలో గౌరవం పొందాలంటే, కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలంటే విద్య ఎంతో అవసరమని పేర్కొన్నారు. పేదరికంలో పుట్టినా ఉన్నత విద్యతో దేశానికి సేవ చేసిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. భవిష్యత్తుకు పునాది వేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మాల్యాద్రి, ఉపాధ్యాయులు, జనసేన నాయకులు భోగినేని కాశీరావు, గవ్వల వెంకయ్య, నీలిరత్నయ్య, రామమూర్తి, వెలుగోటి సురేష్, బ్యాంక్ మేనేజర్ రవి మరియు జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం

ప్రియతమ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు వింజమూరు మండలం కాటేపల్లి, తమీదపాడు గ్రామాలలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి హర్షద్వానాల మధ్య వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సంక్షేమం కోసం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. గ్రామస్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలు ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.