Monday, 27 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనారోగ్యంతో ఉన్న నాగేంద్రమ్మకు అండగా రామవరప్పాడు టీడీపీ నాయకుల ఆర్థిక సహాయం

జలదంకి మండలం రామవరప్పాడు ఎస్టీ కాలనీలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న యాకసిరి నాగేంద్రమ్మ కుటుంబానికి రామవరప్పాడు టీడీపీ నాయకులు అండగా నిలిచారు. విషయం తెలిసిన వెంటనే గ్రామానికి చేరుకున్న నాయకులు నాగేంద్రమ్మను పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్పారు. టీడీపీ సీనియర్ నాయకులు కంచర్ల రామచంద్రయ్య, వర్ధినేని మురళి నాయుడు నాగేంద్రమ్మ ఇంటికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ యువనాయకుడు వర్ధినేని వెంకట వినయ్ కుమార్ చౌదరి తన సొంత నిధుల నుండి రూ.10,000 ఆర్థిక సహాయం అందించి తక్షణ సహకారం అందించారు. ప్రజల కష్టాల్లో ముందుండటం తమ బాధ్యత అని వారు తెలిపారు. అలాగే నాగేంద్రమ్మ కుటుంబానికి వర్తించే అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులతో మరియు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బాబు ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందిస్తామని నాయకులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో, యువనేత నారా లోకేష్ మార్గదర్శకత్వంలో ప్రజాసేవను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ధినేని హరిబాబు, సెట్టిపల్లి ప్రసాద్, మిరియం సురేష్, రామవరప్పాడు గ్రామ టీడీపీ కమిటీ ఉపాధ్యక్షుడు మాకినేని ప్రసాద్, ఎస్టీ కాలనీ 8వ వార్డు సభ్యురాలు తిరువీధుల కవిత భర్త తిరువీధుల శ్రీనివాసులు, నీలం పెద్ద మాలకొండయ్య తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

తిరుపతి

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వలక్ష్యం-ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, మార్చి 13, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గ శాసనసభ సబ్యులు బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి, ఆర్. ది. ఓ. భాను ప్రకాష్ ల అద్వారంలో అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకంలో భాగంగా అన్నదాత సుభవ మూడవ విడత నిధులను నమూనా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి మాట్లాడుతూ…. కూటమి ప్రభుత్వంలో రైతన్నలకు సంక్షేమ పథకాలు తమకు ఉపయోగ దాయకంగా ప్రభుత్వ అందించడంతో రైతన్నలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే నేడు ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తుందని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు బ్యాంకు ఖాతాలో వేయడంతో రైతులు ఈ పర్యాయం గ్రామాల్లో ఉగాది పండుగ వాతావరణం ముందుగానే కనిపిస్తుందన్నారు. అనంతరం రైతులు మాట్లాడతూ.. ఈ సంవత్సరం ఉగాది పండుగని ఆనందంగా నిర్వహించుకుని, పుష్కలంగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తామనీ వారు హర్షం వ్యక్తం చేశారు.

తిరుపతి

టిటిడి బోర్డు సబ్యునికి శుభాకాంక్షలు తెలిపిన తెదేపా నాయకులు కోట చంద్రశేఖర్

శ్రీకాళహస్తి, మార్చి 13, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్ తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు వైద్యం శాంతారాం పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి అర్ధనారీశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆధ్వర్యంలో నిర్వహించి టిటిది బోర్డు సబ్యులు శాంతారాంను తిరుమల పద్మావతి అతిధి గృహంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి చిత్రపటం,తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సాధికార సమితి నాయకులు వినుకొండ ధనంజయ, వినుకొండ ఆనంద్,డి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా ముచ్చువోలు జెడ్పీ పాఠశాల వార్షికోత్సవం

శ్రీకాళహస్తి, మార్చి 13, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి మండలం ముచ్చువోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవం, 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిరంజీవి మాట్లాడుతూ…. పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తీర్ణతలో అధిక శాతం సాధించాలని పదో తరగతి జీవితంలో తొలి మెట్టు, ఒక ముఖ్యమైన మైలురాయని పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని పాఠశాలలో ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు మంచి జ్ఞానం సంపాదించి పరీక్షలకు సిద్ధమయ్యారని ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యంగా పరీక్షలు రాసి తమ ప్రతిభను చాటాలని, సమాజంలో ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు డాక్టర్ సుబ్రహ్మణ్యం శర్మ, నరసింహులు, నాగరాజు, నిర్మల కుమారి, చంద్ర, పాఠశాల కమిటీ చైర్మన్, సభ్యులు, ప్రగతి స్వచ్ఛంద సంస్థ శ్రీకాళహస్తి మండల కన్వీనర్ చంద్రశేఖర్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు పాదపూజ చేసి ఆశీర్వాదం పొందారు. విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారు.

తిరుపతి

బి.యన్. కండ్రిగ మండలంలో రైతన్నలకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల

బి.యన్. కండ్రిగ మండలంలో రైతన్నలకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల శ్రీకాళహస్తి, మార్చి 13, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గంలోని బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకంలో భాగంగా అన్నదాత సుఖీభవ మూడవ విడత క్రింద ఒక రైతుకు రూ.6 వేలు జమ చేయడం జరుగు సుభసందర్భంగా కాటూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో అధ్యక్షులు భాస్కర్ యాదవ్, మండల, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ నాయకులూ మాట్లాడుతూ…ఇది మంచి ప్రభుత్వం, రైతు పక్షపాతి. ప్రభుత్వం రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ మొదటి విడత, రెండవ విడత నిధులు విడుదల చేయడం జరిగిందని మూడవ విడత నిధులు విడుదల ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రులు ద్వారా రైతుల భ్యాంకు ఖాతాల ద్వారా విడుదల జరుగుతున్నారు. అన్నదాత సుభవ మూడవ బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో 4714 మంది రైతులకు మొదటి విదలు 2-7ఖ కోట్లు, రెండవ విడత 2.74 కోట్లు, మూడవ విడత 274 కోట్లు మొత్తం : 8.22 కోట్లు నియోజిక్ వర్గంలో : 29653 మంది రైతులకు 17.2182 కోట్లు 17.21828200 రాష్ట్రంలో : 4685838 మంది రైతులు 2675.97 కోట్లు. చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని టి.డి.పి. నాయకులు సుందరయ్య, మణి, రమేష్ బాబు, మునిరాజ, రామూర్తి కార్యకర్తలు, రైతులు పాల్గొన్నరు.

తిరుపతి

విద్యార్థులకు రాత సామాగ్రి బహుకరించిన గురుమిత్ర ఫౌండేషన్

తొట్టంబేడు, మార్చి 13, పున్నమి న్యూస్: తొట్టంబేడు మండలంలోని గుండెలి గుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు రాయడానికి అవసరమైన రాత సామాగ్రిని, తొమ్మిదవ తరగతి విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులో భాగంగా వారికి గురుమిత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు చెంచయ్య స్టడీ మెటీరియల్ను అందజేశారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు చెంచయ్య మాట్లాడుతూ….2013 వ సంవత్సరం నుండి గురుమిత్ర ఫౌండేషన్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం మా బాధ్యతగా స్వీకరించామని సమాజంలో చదువు ఒక్కటే పేదరికాన్ని రూపుమాపుతుందని, అందుకోసం నిరంతరం కృషి చేయాల్సి ఉంటుందని, క్రమశిక్షణతో చదివి ఉన్నతమైన విలువలతో ఎదిగి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరును, గుర్తింపును విద్యార్థులు తీసుకురావాలని ఆయన విద్యార్దులకు సూచించారు. గురుమిత్ర ఫౌండేషన్ బాధ్యతగా సామాజిక స్పృహతో విద్యార్థులకు పేద ప్రజలకు భవిష్యత్తు కోసం చెంచయ్య చేస్తున్న కృషిని పాఠశాల హెచ్.ఎం. విద్యార్థుల తల్లిదండ్రులు కొనియారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ముని తిరుమలయ్య, ఉపాధ్యాయులు మూర్తి, రమాదేవి, భాస్కరయ్య మునీశ్వర్ రెడ్డి , శ్రీకర్ రెడ్డి ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐని సత్కరించిన ప్రజా సంఘాల నాయకులు

శ్రీకాళహస్తి, మార్చి 13, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలో టూ టౌన్ సిఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజుని ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి దుశ్యాలవాతో ఘనంగా సత్కరించారు. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చూపుతున్న కృషిని ప్రశంసిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. పోలీసు శాఖ ప్రజలతో స్నేహపూర్వకంగా పనిచేయడం వల్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి జనామాల గురవయ్య, జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు పులి శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి మునిచందు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షురాలు చారులత, అలాగే పలువురు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.

తిరుపతి

ఏర్పేడులో దివ్యాంగులకు ఉచిత సహాయక పరికరాల శిబిరం

ఏర్పేడు, మార్చి 13, పున్నమి న్యూస్: ఏర్పేడు మండలంలోని జెడ్‌పీ హై స్కూల్‌ నందు దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రభుత్వం ద్వారా ఉచిత సహాయక పరికరాలు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పేడు టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరానికి దివ్యాంగులు, వయోవృద్ధులు పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వం అందిస్తున్న పరికరాల కోసం నమోదు చేసుకోగా సంబంధిత అధికారులు దివ్యాంగుల అవసరాలను పరిశీలించి వారికి తగిన పరికరాలను అందజేయడానికి చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు, ఉమ్మడి గ్రంథాలయ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి, నైనూరు పున్నారావు, ఏర్పేడు ప్యాక్స్ చైర్మన్ మహేష్ రెడ్డి, ఏర్పేడు ఎంపీడీఓ సౌభాగ్యమ్మ, వైద్యులు, జీపీ రాజశేఖర్ నాయుడు, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు, శివప్రియ, ఏర్పేడు పీహెచ్‌సీ సిబ్బంది, ఏర్పేడు, రేణిగుంట మండలాల సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

పదవ తరగతి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు- భరత్ రెడ్డి

తొట్టంబేడు, మార్చి 13, పున్నమి న్యూస్: పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి చదివి, ఉన్నత ఫలితాలతో పాఠశాలకు, తాము పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని కలవగుంట భరత్ రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం మండల పరిధిలోని బోనుపల్లి, లింగమనాయుడుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు కలవగుంట భరత్ రెడ్డి యువసేన సభ్యుల ద్వారా ఉచితంగా పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చరవాణి ద్వారా భరత్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడుతూ.…విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పదో తరగతి తొలిమెట్టు వంటిదని, ఏకాగ్రతతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు చిన్న ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈ సామాగ్రిని అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులందరికీ ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, యువసేన సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తిరుపతి

వృద్దాశ్రమానికి వాటర్ ప్యూరిఫై విరాళం

శ్రీకాళహస్తి, మార్చి 13, పున్నమి న్యూస్: పట్టణంలో ల్యాబ్ టెక్నిషియన్స్ డే సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కలిసి బంగారమ్మ ఆలయ సమీపాన వున్న వృద్దాశ్రమములో అన్నదాన కార్యక్రమo నిర్వహించి ఆశ్రమంలో అవసరమైన వాటర్ ప్యూరిఫైను విరాళంగా అందించరు. ఆశ్రమములో గల వృద్దులందరికి బీపీ, సుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హబీబ్, వేణు, షకీల్, హెరిష్ మొదలైన వారు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.