Monday, 27 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం

ప్రియతమ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు వింజమూరు మండలం కాటేపల్లి, తమీదపాడు గ్రామాలలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి హర్షద్వానాల మధ్య వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సంక్షేమం కోసం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. గ్రామస్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలు ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

అన్నమయ్య

శాలివాహన నియోజకవర్గ అధ్యక్షుడిగా అందే వెంకటేష్ ఎన్నిక!

– రైల్వే కోడూరులో ఘనంగా పదవీ బాధ్యతల స్వీకారం – కుల బాంధవుల ఐక్యతే లక్ష్యంగా పనిచేస్తా: నూతన అధ్యక్షుడు – పలువురు ప్రముఖుల అభినందనలు రైల్వే కోడూరు, మార్చి 13: ఎల్లో సింగం ప్రతినిధి రైల్వే కోడూరు నియోజకవర్గ శాలివాహన సంఘం నూతన అధ్యక్షుడిగా అందే వెంకటేష్ ఎన్నికయ్యారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన సంఘం సర్వసభ్య సమావేశంలో కుల బాంధవులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సంఘం బలోపేతానికి, సామాజిక అభివృద్ధికి వెంకటేష్ అందిస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారు. ఘనంగా సన్మానం: అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం అందే వెంకటేష్ గారిని సంఘం నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నియోజకవర్గ శాలివాహన సోదరులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న శాలివాహన కులస్థుల సమస్యలను పరిష్కరించడమే కాకుండా, వారి ఆర్థిక, సామాజిక ఉన్నతికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఐక్యమత్యమే బలం: “మండల స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు సంఘాన్ని పటిష్టం చేస్తాం. ప్రభుత్వ పరంగా అందే సంక్షేమ పథకాలు ప్రతి పేద శాలివాహన కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటాం” అని వెంకటేష్ పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించేలా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని వివరించారు. శుభాకాంక్షల వెల్లువ: అందే వెంకటేష్ ఎన్నిక పట్ల నియోజకవర్గంలోని శాలివాహన సంఘం నేతలు, వివిధ పార్టీల నాయకులు మరియు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శాలివాహన సంఘం జిల్లా, మండల నేతలు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

E-పేపర్

హయత్‌నగర్ పుడమి స్కూల్‌లో అన్యువల్ డే పేరుతో పిల్లలతో పనులు చేయిస్తున్న ప్రిన్సిపల్‌పై విమర్శలు

హయత్‌నగర్ పుడమి స్కూల్‌లో అన్యువల్ డే పేరుతో పిల్లలతో పనులు చేయిస్తున్న ప్రిన్సిపల్‌పై విమర్శలు రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ డివిజన్ పున్నమి న్యూస్ ప్రతినిధి 12 మార్చి 2026 హయత్‌నగర్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో అన్యువల్ డే కార్యక్రమం పేరుతో చిన్న పిల్లల చేత గిన్నెలు మోయిస్తూ పనులు చేయిస్తున్న ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో చదువుకునే చిన్నారుల చేత భోజన గిన్నెలు మోయించడం, పనులు చేయించడం సరైంది కాదని వారు అంటున్నారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ఉండాల్సిన పాఠశాలలో ఈ విధంగా పనులు చేయించడం తగదని స్థానికులు విమర్శిస్తున్నారు. సంబంధిత అధికారాలు ఈ ఘటనపై దృష్టి సారించి, నిజానిజాలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రాజన్న సిరిసిల్ల

కలెక్టర్ కార్యాలయం నందు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా భవనిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు గీస బిక్షపతి

సిరిసిల్ల మార్చి 13 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిఐటియు రాష్ట్ర పిలుపుమేరకు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు అందరూ ఒక తాటిపై ఉండి సి ఎస్ టి అనే పేరుతో ఇళ్లల్లోకి వచ్చి రక్త పరీక్షలు చేస్తూ వారి జీవితంలో మన్నుపోస్తూ వారికి వచ్చే క్లైములను రాకుండా అడ్డుగా నిలబడుతూ. ఏ ఎల్ వో గారు. డీసీఎల్ గారు. ఈరోజు మార్చి 13 రోజున కలెక్టర్ కార్యాలయం నందు ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున. కార్మికులారా ఒకసారి ఆలోచించండి. ఎవరి ఒక్కరి సొత్తు కాదు మన అందరిదీ. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వెల్ఫేర్ బోర్డులో డబ్బులను ప్రైవేట్ పరం చేశారు కాబట్టి. అవి కార్మికులకే చెందే విధంగా ఉండాలని. నరేంద్ర మోడీ గారిని మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారికి విన్నవించేటిది ఏమిటనగా ఆ డబ్బులు ప్రతి ఒక్క కార్మికుడికి అందేలా మీరు చొరవ తీసుకుంటారని. కార్మిక శాఖ మంత్రి గారు మా జీవితాలకు వెలుగు నింపే విధంగా తీర్చి దిద్దుతానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను మీరు నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము రాబోయే రోజుల్లో ఇల్లు లేని ప్రతి కార్మికునికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందివాలని కార్మిక శాఖ మంత్రి గారిని వేడుకుంటున్నాము. ప్రతి ఒక్క కార్మికులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని పేరుపేరునా అందరిని కోరుకుంటున్నాను.

ఆంధ్రప్రదేశ్

నిమ్మకాయల ధరలు పతనం – రైతుల్లో ఆందోళన

నెల్లూరు జిల్లా మార్కెట్లలో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. మార్కెట్‌లో సరఫరా పెరగడం, అంతర్జాతీయ పరిస్థితులు మరియు యుద్ధ ప్రభావం వంటి కారణాలతో ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఒకప్పుడు 20 కిలోల నిమ్మకాయల బస్తా రూ.110 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.80–రూ.85 మధ్యే విక్రయించాల్సి వస్తోంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం

హత్య కేసు లో నిండుతుడికి జీవిత ఖైదు. 10000 జరిమానా.

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) మధిర సీఐ తెలిపిన వివరాల ప్రకారం, సత్తుపల్లి 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బొరిపాధర్ గ్రామానికి చెందిన శిభ భిషోయ్ (29)కు హత్య కేసులో జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం, 2025 జూన్ 8వ తేదీ రాత్రి డెందుకూరు మెగా రోడ్డు నిర్మాణ కంపెనీలో పనిచేస్తున్న శిభ భిషోయ్ వ్యక్తిగత విభేదాల కారణంగా సుమంత్ కుమార్ పాండే అనే వ్యక్తిపై ఇనుప రాడ్‌తో నిద్రలో ఉండగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై భద్రతా సూపర్వైజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి పై విధంగా తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌కు సహకరించిన మధిర రూరల్ పోలీసు అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం బైక్ ర్యాలీ జండా ఆవిష్కరణకు పిలుపు.

T.Ravinder ఖమ్మం మార్చి12/2026 (పున్నమి ప్రతినిధి) ఖమ్మం జిల్లాలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం – బైక్ ర్యాలీ, జెండా ఆవిష్కరణకు పిలుపు. ఖమ్మం జిల్లాలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 14న జరగనున్న ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీతో పాటు పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. జనసేన పార్టీ వ్యవ స్థాపకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఖమ్మం జిల్లాలో ఉత్సాహంగా జరపాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ మిర్యాల రామకృష్ణ మాట్లాడుతూ, జిల్లా నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై బైక్ ర్యాలీ మరియు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పాల్గొని ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి

పెద్దకన్నలి జడ్‌పి హైస్కూల్‌లో ఉద్రిక్తత – ఉపాధ్యాయుడికి మద్దతుగా విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన

తొట్టంబేడు, పున్నమి, న్యూస్, మార్చి 11: తొట్టంబేడు మండలం పెద్దకన్నలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిపై జరిగిన దాడి ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం పాఠశాల ఎదుట నిరసన చేపట్టారు. పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటకృష్ణ మంగళవారం సాయంత్రం 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సమయంలో తెలుగు ఉపాధ్యాయురాలు మహాలక్ష్మి కుమారుడు చైతన్య తనపై దాడి చేశాడని ఆరోపిస్తూ శ్రీకాళహస్తి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లిని అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ తనపై దాడికి పాల్పడ్డాడని ఆయన పోలీసులకు తెలిపారు. ఇదే ఘటనపై తెలుగు ఉపాధ్యాయురాలు మహాలక్ష్మి కూడా పోలీసులను ఆశ్రయిస్తూ, వెంకటకృష్ణ తనను కులం పేరుతో దూషించడమే కాకుండా వేధింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. తన కుమారుడు ఎలాంటి దాడి చేయలేదని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో పాఠశాలలో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం నాడు పాఠశాల ఎదుటకు చేరుకుని ఫిజిక్స్ ఉపాధ్యాయుడు వెంకటకృష్ణకు మద్దతుగా నిరసన చేపట్టారు. సౌమ్యుడు, వినయశీలి అయిన ఉపాధ్యాయుడిపై దాడి జరగడం అమానుషమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. “తెలుగు టీచర్ వద్దు – ఫిజిక్స్ టీచర్ ముద్దు” అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడు వెంకటకృష్ణకు తగిన న్యాయం జరగకపోతే ఉన్నతాధికారుల కార్యాలయాల ఎదుట కూడా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

తిరుపతి

తిరుపతి విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్‌కు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్వాగతం

శ్రీకాళహస్తి నియోజిక వర్గ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా గురువారం నాడు తిరుపతి విమానాశ్రయానికి విచ్చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు సాదరంగా స్వాగతం పలికారు. విమానాశ్రయంలో మంత్రి లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌తో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ప్రాంతంలో విద్యా రంగ అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక వసతుల మెరుగుదల వంటి విషయాలను మంత్రికి వివరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం విద్యా మరియు పారిశ్రామిక రంగాల్లో ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా లోకేష్ చూపుతున్న దూరదృష్టి, నాయకత్వం అందరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రి నారా లోకేష్‌ను కలుసుకుని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో గంజాయి సరఫరా గ్యాంగ్ బండారం బయటపెట్టిన పోలీసులు

శ్రీకాళహస్తి పున్నమి (క్రైం) న్యూస్, మార్చి 11: శ్రీకాళహస్తి పట్టణంలో గంజాయి రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి గురువారం నాడు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వెల్లడించారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజుకు అందిన గోప్య సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారని చెప్పారు. అందిన సమాచారం మేరకు ఎం.జి.ఎం హాస్పిటల్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా, అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కోటంబేడి రాజు (20), దుర్గాప్రసాద్ (20), వర్షిత్ (20)గా గుర్తించారు. వారి వద్ద ఉన్న సంచుల్లో రెండు కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసుల విచారణలో కోటంబేడి రాజు ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ప్రాంతం నుంచి గంజాయిని తీసుకువచ్చి దుర్గాప్రసాద్, వర్షిత్‌లకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైనట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, నిందితులపై గతంలో వెంకటగిరి, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మరియు శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్లలో దొంగతనం, గంజాయి కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని డీఎస్పీ నరసింహమూర్తి విజ్ఞప్తి చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.